గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: చింటుని స్కూలుకు తీసుకెళ్లిన మనోజ్.. రోహిణికి దడ.. రోడ్డుపై బాలు, అరుణ్ గొడవ
Gunde Ninda Gudi Gantalu July 1st Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 1 ఎపిసోడ్ లో రోహిణికి ఒకేసారి మూడు వైపుల నుంచి గండాలు ముంచుకొస్తాయి. అటు బాలు, అరుణ్ మరోసారి రోడ్డుపైనే గొడవ పడతారు. ఇటు డైటింగ్ ప్రభావతి దొంగచాటుగా చికెన్ తింటుంది.
Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మాలో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో చింటు విషయంలో రోహిణికి మరో గండం పొంచి ఉంది. పేరెంట్స్ మీటింగ్ కు వెళ్లాల్సిన రోహిణికి ఓవైపు సత్యం, మరోవైపు బాలు, మీనా.. ఇంకోవైపు మనోజ్ నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

ప్రభావతిని రెచ్చగొట్టిన చింతామణి..
సీరియల్ బుధవారం (జులై 1) ఎపిసోడ్ ప్రభావతిని చింతామణి రెచ్చగొట్టే సీన్ తో మొదలువుతుంది. ఛాలెంజ్ లు వద్దు.. ముందు మీ కోడళ్లను కంట్రోల్లో పెట్టుకొని ఆ తర్వాత బరువు తగ్గే ప్లాన్ చేయండి.. రెండూ చేసినా సరే అని అంటుంది. దీంతో ప్రభావతి మూడు నెలల్లో బరువు తగ్గి చూపిస్తాను అంటూ శపథం చేసి వెళ్తుంది. బయటకు వెళ్లగానే మనోజ్ కు ఫోన్ చేసి ఓ డైటీషియన్ ను చూడమని చెబుతుంది.
పేరెంట్స్ మీటింగ్ రూపంలో రోహిణికి గండం
అటు స్కూల్లో రేపు పేరెంట్స్ మీటింగ్ ఉందని, కచ్చితంగా నువ్వు రావాల్సిందే అని రోహిణికి ఫోన్ చేసి చెబుతుంది తల్లి సుగుణ. తనకు కుదరదని, నువ్వే మేనేజ్ చేయాలని రోహిణి అంటుంది. అయితే స్కూల్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని, కనీసం వీడియో కాల్ లో అయినా కనిపించాలని అంటున్నారని చెబుతుంది.
దీంతో అక్కడ తన మామయ్య, బాలు ఉంటారు.. నేను వస్తే దొరికిపోతాను.. ఎలా రావాలని తల్లిపై గట్టిగా అరుస్తుంది రోహిణి. మరో దారి లేదని, ఏదో ఒకటి చేయాలని అనడంతో రోహిణి కోపంగా సరే అంటుంది.
మీనాకు బాలు డ్రైవింగ్ పాఠాలు
ఇటు మీనాకు బాలు డ్రైవింగ్ పాఠాలు చెబుతుంటాడు. భర్త చెప్పినట్లు మీనా చాలా త్వరగా కారు నేర్పడం నేర్చుకుంటుంది. డ్రైవింగ్ లోనే భార్యాభర్తల సరసాలు కూడా సాగుతుంటాయి. ఇలాగే త్వరగా నేర్చుకుంటే లేడీస్ కు నువ్వే కారు నేర్పించవచ్చు అని దారిలో కలిసిన మీనా ఫ్రెండ్స్ అంటారు. వాళ్లనూ కారులో ఎక్కించుకొని మీనా తిప్పుతుంది. ఆమె డ్రైవింగ్ చూసి బాలుకి పోటీ వస్తోందని అనడంతో.. మీనా కంగారు పడి గతంలో ఇలా అనే పెద్ద గొడవ అయిందని, ఇది ఇంతటితో ఆపేయాలని అంటుంది.
అరుణ్‌తో మళ్లీ గొడవ పడిన బాలు
మీనాను దించేసిన తర్వాత బాలు బయటకు వెళ్తాడు. అక్కడే అరుణ్ ఉంటాడు. పూలు, కూరగాయల అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆకుకూరలు ఉన్నాయా అని బాలు అడుగుతాడు. అతడు లేవని చెప్పడంతో ఆకుకూరలు తింటే జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది కదా.. ఎవరు ఏం చేసినా అంత త్వరగా మరచిపోరు కదా అంటూ అరుణ్ ని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు బాలు.
దీంతో ఇద్దరూ మరోసారి రోడ్డుపైనే గొడవకు దిగుతారు. బాలు కాలర్ పట్టుకుంటాడు అరుణ్. బాలు అతన్ని వెనక్కి నెట్టడంతో అరుణ్ షర్ట్ చిరుగుతుంది. కావాలని చేయలేదని, అయినా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పి బాలు వెళ్లిపోతాడు. అరుణ్ మాత్రం అవమాన భారంతో రగిలిపోతాడు.
సత్యానికి ప్రభావతి డైటింగ్ పాఠాలు
ఇంట్లో టిఫిన్ కు బాలు, సత్యం రెడీ కాగానే ప్రభావతి వస్తుంది. సత్యం వడలు, చికెన్ తినడానికి రెడీ కావడంతో ప్రభావతి డైటింగ్ పాఠాలు మొదలుపెడుతుంది. వడలు తింటే బరువు పెరుగుతారని, ఒకటే తినాలని అంటుంది. బాలు మాత్రం ప్రభావతిని తనదైన స్టైల్లో డైటావతి అంటూ ఆట పట్టిస్తాడు.
రోహిణి కూడా అదే అనడంతో ఆమె ప్లేటులోని వడలు కూడా బాలు తీసుకుంటాడు. ప్రభావతి మాత్రం మీరు తింటే తినండి.. నేను మాత్రం అందరూ తిన్నాక బ్లాక్ టీ మాత్రమే తాగుతాను అని చెప్పి వెళ్లిపోతుంది.
డైటింగ్ పక్కన పెట్టి.. ప్రభావతి దొంగచాటుగా తిని..
అందరూ తిని వెళ్లిపోయిన తర్వాత మెల్లగా పిల్లిలా కిచెన్ లోకి దూరుతుంది ప్రభావతి. వడలు, చికెన్ వాసన చూసి ఆపుకోలేకపోతుంది. ప్లేటులో పెట్టుకొని గబగబా తింటుంటే మనోజ్ వస్తాడు. ఎందుకీ డైటింగ్ కష్టాలు అని అతడు అడుగుతాడు. నిన్ను ఎన్నిసార్లు నేను కాపాడాను.. ఈ విషయం నువ్వు కూడా ఎవరికీ చెప్పకు అంటూ మరికాస్త చికెన్ వేసుకొని కడుపు నిండా తింటుంది ప్రభావతి. తర్వాత బయటకు వెళ్లి కూర్చొంటుంది. బాలుకు అప్పటికే డౌట్ వచ్చి మరోసారి ఆమెను ఆటపట్టిస్తాడు. దొంగచాటుగా తింటే అరగదని, వాంతులు, విరేచనాలు అవుతాయని అంటాడు.
చింటుని స్కూలుకు తీసుకెళ్లిన మనోజ్
ఆ తర్వాత సత్యం తాను స్కూలు వెళ్తానని అనడంతో రోహిణి షాక్ తింటుంది. అయితే నేనే నిన్ను డ్రాప్ చేస్తాను.. మీనా నువ్వు కూడా చింటుని చూడాలన్నావు కదా.. వెళ్దాం పదా అని బాలు అనడంతో రోహిణి మరింత కంగారు పడుతుంది. వీళ్లంతా వెళ్తే నేనెలా స్కూలుకు వెళ్లాలి అనుకుంటుంది.
అటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటారు సుగుణ, చింటు. రోడ్డుకు అవతలివైపు ఆటో కనిపించడంతో చింటు పరుగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంతలో మనోజ్ కారుకు అడ్డంగా వస్తాడు. అతడు సడెన్ బ్రేక్ వేసి వచ్చి చూస్తే చింటు ఉంటాడు. అతన్ని చూసి కంగారు పడతాడు. మనోజ్ ను చూసి సుగుణ షాక్ తింటుంది. తమను స్కూల్లో డ్రాప్ చేస్తారా అని చింటు అడుగుతాడు. సరే అని మనోజ్ అంటాడు. సుగుణ వద్దని వారిస్తున్నా వాళ్లను కారులో ఎక్కించుకుంటాడు మనోజ్. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


