గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సత్యం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన బాలు - చెక్కు రాసిన మీనా - రోహిణి అడ్డుపుల్ల

Gunde Ninda Gudi Gantalu June 24th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 24 ఎపిసోడ్ లో బాలు, మీనా కలిసి సత్యం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభిస్తారు. అది చూసి రోహిణి అడ్డుపుల్ల వేయగా.. ప్రభావతి, మనోజ్ కుళ్లుకుంటారు.

Published on: Jun 24, 2026, 07:21:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో బాలు, మీనా జీవితంలో మరో మెట్టుపైకి ఎదుగుతారు. అది చూసి ఇంట్లో ఉన్న ప్రభావతి, మనోజ్, రోహిణి కుళ్లుకుంటారు. వాళ్లకు మీనా తనదైన స్టైల్లో బుద్ధి చెబుతుంది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సత్యం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన బాలు.. చెక్కు రాసిన మీనా.. రోహిణి అడ్డుపుల్ల
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: సత్యం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన బాలు.. చెక్కు రాసిన మీనా.. రోహిణి అడ్డుపుల్ల

మనోజ్‌ను కాపాడిన రోహిణి.. అప్పు తెచ్చి జీఎస్టీ కట్టి..

మనోజ్ షో రూమ్ కు సీల్ వేస్తామంటూ అధికారులు వచ్చే సీన్ తో గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జూన్ 24) ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. మూడు గంటల టైమ్ అయిపోయిందని, ఇక సీల్ వేస్తామని అంటారు. పది నిమిషాలు టైమ్ ఇవ్వమని మనోజ్ ప్రాధేయపడినా వినరు.

అప్పుడే రోహిణి వస్తుంది. డబ్బు సర్దుబాటు అయిందని, అకౌంట్లో ఉన్నాయని చెప్పడంతో మనోజ్ చెక్కు రాసి ఆ అధికారులకు ఇస్తాడు. మళ్లీ ఇది రిపీట్ కాద్దని వార్నింగ్ ఇచ్చి వాళ్లు వెళ్లిపోతారు. రోహిణికి మనోజ్ థ్యాంక్స్ చెబుతాడు. అయితే అప్పు చేసి తెచ్చానని అనడంతో షాక్ తింటాడు. ఇంట్లో వాళ్లకు ఈ విషయం తెలియకుండా చూడాలని మనోజ్ తో రోహిణి అంటుంది.

చింటు, సుగుణ గురించి మీనాకు చెప్పిన బాలు.. తిట్టిన మీనా

ఇటు ఇంటికి వచ్చిన బాలు తాను స్కూల్లో చింటు, సుగుణను చూసినట్లు మీనాకు చెబుతాడు. అది పైనుంచి రోహిణి వింటుంది. వెళ్లి కలుద్దామని కూడా బాలు అంటాడు. అది విని రోహిణి మరింత షాక్ తింటుంది. నా బతుకును ఫుట్‌బాల్ చేసేశారు.. బాగా తన్నండి అని మనసులో అనుకుంటుంది. ఇటు మీనా కూడా బాలుని తిడుతుంది. వాళ్లు ఎంత తిట్టినా, అసహ్యించుకున్నా సిగ్గూ, శరం లేని జీవితాలు మనవి.. ఇంకా వాళ్లపై మానవత్వం చూపించండి అని అంటుంది.

బాలు డ్రైవింగ్ స్కూల్‌కు లైన్ క్లియర్.. రోహిణి అడ్డుపుల్ల

అప్పుడే సత్యం ఇంటికి వస్తాడు. ఆ వెంటనే ప్రభావతి, రవి, శృతి కూడా రావడంతో ఆ టాపిక్ పక్కన పెట్టేస్తారు. మీకు ఏదో పోస్ట్ వచ్చిందని బాలుకి మీనా ఓ లెటర్ ఇస్తుంది. అది చూసి తన డ్రైవింగ్ స్కూలుకు లైన్ క్లియర్ అయిందని బాలు ఎగిరి గంతేస్తాడు. ఇంట్లోనే ఆ స్కూల్ పెడుతున్నట్లు చెప్పడంతో ప్రభావతి మండిపడుతుంది.

అటు రోహిణి కూడా పైనుంచి పరుగెత్తుకుంటూ వచ్చి.. అలా చేస్తే ఇంటి ట్యాక్స్, కరెంట్ బిల్లు పెరుగుతుంది.. దీనిని కమర్షియల్ ప్రాపర్టీగా చేస్తారు అని అంటుంది. దీంతో మీనా అందుకుంటుంది. మీరు బాగుపడరు.. మమ్మల్ని బాగుపడనీయరా.. అన్నింటినీ అడ్డుపుల్ల వేస్తావెందుకు అని రోహిణికి, ప్రభావతికి కలిపి క్లాస్ పీకుతుంది. దీంతో వాళ్లిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

రవి రెస్టారెంట్‌లో శృతి జాబ్

ఆ తర్వాత శృతి కూడా రవి రెస్టారెంట్ లో జాబ్ చేస్తున్న విషయం చెబుతుంది. రవిని బాగా మిస్ అవుతున్నానని, అందుకే సాయంత్రం రెండు గంటలు అక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నట్లు చెబుతుంది. ఇటు మీనాను కూడా నీ పార్ట్‌నర్ ను చేసుకో అని రవి అంటే.. ఇప్పటికే ఆమె నా డ్రైవింగ్ స్కూల్లో పార్ట్‌నర్ అని బాలు అంటాడు.

అలా అయితే ఇంట్లోనూ మూడు జంటలూ పని చేస్తున్నాయన్న మాట అని రవి అంటాడు. ఏం లాభం.. ఇంత చేసినా అదే డైనింగ్ టేబుల్, సోఫాలు, మీనా మెడలో పసుపు తాడు అని చెప్పి శృతి వెళ్లిపోవడంతో మీనా, బాలు షాక్ తింటారు.

సుందరికి పెళ్లి చూపులని చెప్పిన కామాక్షి

అందరూ భోజనం చేసిన తర్వాత ఇంటికి సుందరి, కామాక్షి వస్తారు. బాలుతో సుందరి సరసాలు ఆడుతుంటే మీనా కుళ్లుకొని అడ్డు పడుతుంది. బాలుని గిల్లుతుంది. సుందరి జాబ్ చేస్తుందా అని బాలు అడిగితే.. ఆ అవసరం లేదు.. ఆమెను చూడటానికి ఎల్లుండి అబ్బాయి వాళ్లు వస్తున్నారు.. మంచి సంబంధం అని కామాక్షి చెబుతుంది. రంగా ఆ సమయానికి ఉండటం లేదని, మీరే వచ్చి పెద్దలుగా నిలబడాలని సత్యం, ప్రభావతిలను కామాక్షి కోరుతుంది. అయితే అప్పటికే ఓ అబ్బాయిని ప్రేమించిన సుందరి.. పెళ్లి చూపులు అనగానే షాక్ తింటుంది. కానీ అందరి ముందూ ఏమీ చెప్పలేక కామ్ గా ఉంటుంటి.

సత్యం డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించిన బాలు, మీనా

ఇటు మరుసటి రోజే బాలు, మీనా కలిసి సత్యం డ్రైవింగ్ స్కూలు ప్రారంభిస్తారు. తన పేరు పెట్టడం చూసి సత్యం ఎమోషనల్ అవుతాడు. ప్రొప్రైటర్లుగా బాలు, మీనా పేర్లు ఉంటాయి. ప్రభావతి మాత్రం కుళ్లుకుంటుంది. మనోజ్, రోహిణి కూడా మొహాలు అదోలా పెడతారు.

తన రెండు కార్లతోపాటు రాజేష్ కారుతోనూ డ్రైవింగ్ నేర్పిస్తామని, డ్రైవింగ్ నేర్పే సమయం, ఫీజు వివరాలన్నీ పాంప్లెట్ లో ప్రింట్ చేసినట్లు బాలు చెబుతాడు. ఉదయం మూడు గంటల పాటు డ్రైవింగ్ నేర్పిస్తామని, తర్వాత బాలు ట్రిప్పుకు వెళ్తాడని రాజేష్ చెబుతాడు. తర్వాత సత్యం, ప్రభావతి కార్లకు హారతి ఇస్తారు. అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగుతారు.

చెక్కు రాసిన మీనా

లోనికి వెళ్లిన తర్వాత మీనా అందరికీ స్వీట్లు పంచుతుంది. మనోజ్ మాత్రం తీసుకోడు. అది ఏ షాపులో నుంచి తీసుకొచ్చారో అని విసుక్కుంటాడు. దీంతో మీనా, బాలు అతనికి తగిన బుద్ధి చెబుతారు. తాను కూడా డ్రైవింగ్ స్కూల్లో కారు నేర్చుకుంటానని మీనా అంటుంది. ఎందుకూ.. కారులో వెళ్లి పూలు అమ్ముతావా అని ప్రభావతి వెటకారంగా మాట్లాడితే సత్యం మాత్రం తప్పేముంది అంటూ సమర్థిస్తాడు.

ఆ తర్వాత డ్రైవింగ్ కు ఫీజు ఇవ్వాలని బాలు అనడంతో మీనా వెళ్లి చెక్కు బుక్కు తీసుకొస్తుంది. తనకు అకౌంట్ ఉందని, చెక్కు ఇస్తానని చెప్పడంతో ప్రభావతి షాక్ తింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More