Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌పై బాలు విశ్వరూపం.. టిఫిన్ కోసం చిల్లర పంచాయితీ.. ఇంట్లో రచ్చ రచ్చ

Gunde Ninda Gudi Gantalu Serial July 23rd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 23 ఎపిసోడ్ లో మరోసారి మనోజ్ తన చిల్లర బుద్ధి చూపడంతో బాలు విశ్వరూపం చూపిస్తాడు. మీనా, రవి, శృతి కూడా అతనికి మంచి గడ్డి పెడతారు.

Published on: Jul 23, 2026, 07:11:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మనోజ్ తన బర్త్ డే నాడే మరో రచ్చ చేస్తాడు. ఇంటికి వచ్చిన బాలు ఫ్రెండ్ రాజేష్ దంపతులను తినకుండా పోయేలా చేయడంతో బాలు విశ్వరూపం చూపిస్తాడు. ఇది కాస్తా ఇంట్లో పెద్ద రచ్చకు తెరలేపుతుంది.

Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌పై బాలు విశ్వరూపం.. టిఫిన్ కోసం చిల్లర బుద్ధి.. ఇంట్లో రచ్చ రచ్చ
Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌పై బాలు విశ్వరూపం.. టిఫిన్ కోసం చిల్లర బుద్ధి.. ఇంట్లో రచ్చ రచ్చ

మీనాకు అండగా సింగరాజు.. ఎంత డబ్బయినా ఇస్తానంటూ..

చింతామణి మాజీ భర్త అయిన సింగరాజు దగ్గరే అప్పు చేసిన మీనా తిరిగి అతనికి డబ్బు ఇచ్చే సీన్ తో సీరియల్ గురువారం (జులై 23) ఎపిసోడ్ మొదలైంది. మీనాకు జరిగిన మోసం గురించి తెలుసుకున్న సింగరాజు.. నీకు అండగా ఉంటానని, భవిష్యత్తులో ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా ఎంత డబ్బయినా ఇస్తానని మాట ఇస్తాడు. దీంతో మీనా అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన మాజీ భార్య ఫొటోను చూసి సింగరాజు ఆవేశపడతాడు.

ఇదో గుణపాఠం అన్న బాలు, మీనా

అదే రోజు రాత్రి బాలు, మీనా ఆ మోసం గురించి మాట్లాడుకుంటారు. పెద్ద గండం నుంచి గట్టెక్కామని బాలు అంటాడు. తనకు చదువు రాకపోవడం వల్లే జరిగిందని మీనా అంటుంది. బిజినెస్ లో ఇలాంటివి జరుగుతుంటాయని, వీటిని గుణపాఠంగా భావించి భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తాడు. మీరు సమయానికి తెలివిగా ఆలోచించి ఆ డబ్బు వచ్చేలా చేశారని మీనా అంటుంది.

మనోజ్ బర్త్‌డే.. రోహిణి స్పెషల్ విషెస్

మరుసటి రోజు ఉదయమే మనోజ్ బర్త్ డే కావడం రోహిణి అతనికి కొత్త డ్రెస్ తీసుకొచ్చి ఓ గులాబీని దానిపై ఉంచుతుంది. ఇదేంటని మనోజ్ చూస్తుండగా.. రోహిణి వచ్చి హ్యాపీ బర్త్ డే మనోజ్ అంటూ అతనికి ముద్దు పెట్టి హగ్ చేసుకుంటుంది. అప్పుడే నువ్వేదో దాస్తున్నావ్ అనగానే రోహిణి షాక్ తింటుంది. లోలోపల భయపడుతుంది.

నాకోసం గిఫ్ట్ ఏదో తెచ్చి ఉంటావ్ కదా అని మనోజ్ అనడంతో ఓ అదా అనుకుంటుంది. బర్త్ డే రోజు మనోజ్ ముఖంలో ఈ నవ్వు చూడటానికైనా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాల్సిందే అనుకొని.. తెచ్చాను.. తర్వాత ఇస్తానని అంటుంది. రోహిణి తెచ్చిన డ్రెస్ వేసుకొని మనోజ్ రెడీ అవుతాడు.

బర్త్‌డే రోజు కూడా మనోజ్‌ను తిట్టిన బాలు

కిందికి రాగానే బాలు అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతాడు. రవి, శృతి కూడా విషెస్ చెబుతారు. అయితే అప్పుడే మీనా లోనికి వెళ్తుంది. దీంతో బాలుతో మనోజ్ మరోసారి నోరు జారుతాడు. మీ ఆమె నాకు విషెస్ చెప్పదా.. నాలుగు డబ్బులు రాగానే ఇలా చేస్తుందా అని అంటాడు. ఇంతలో మీనా కిచెన్ నుంచి స్వీటు పట్టుకొని వచ్చి రోహిణికి ఇస్తుంది.

దీంతో బాలు, రవి, శృతి కలిసి మనోజ్ ను తిడతారు. తాను అతడు ఏమన్నాడో విన్నానని మీనా అంటుంది. అయినా సరే నువ్వు ఏమీ అనలేదంటే నీకు శాంతి బహుమతి ఇవ్వాలని శృతి అంటుంది. ఇంతలో సత్యం, ప్రభావతి కూడా వచ్చి మనోజ్ కు విషెస్ చెబుతారు. నీకోసం అన్నీ నీ ఇష్టమైనవే చేయమని మీనాకు చెప్పానని ప్రభావతి అంటుంది. ఏమే.. అన్నీ చేశావా అంటూ మీనాను గద్దిస్తుంది. మనోజ్ కు ఇష్టమైన పెసరట్టు చేశానని మీనా అంటుంది.

మనోజ్ కోసం స్పెషల్ కేక్.. మళ్లీ ఇరికించిన బాలు

అప్పటికే మనోజ్ కోసం రవి ఆర్డర్ ఇచ్చిన కేకు వస్తుంది. అది చూసి ఇంత చిన్న కేకా.. స్టెప్ బై స్టెప్ కేకు వస్తోంది కదా ఈ మధ్య అని మనోజ్ అనడంతో బాలు మరోసారి క్లాస్ పీకుతాడు. నీ బతుక్కి ఎప్పుడూ చిన్నవాడైనా వాడికి కేక్ తీసుకురాలేదు.. ప్రతీసారి వాడే తీసుకొస్తాడని అంటాడు. కేక్ కట్ చేసిన తర్వాత మనోజ్ ను బాలు ఇరికిస్తాడు.

మొదటి ముక్క ఎవరికి పెడతావ్.. పార్లరమ్మకా, అమ్మకా అనడంతో మనోజ్ ఇరుకునపడతాడు. మీ ఇద్దరే కలిసి నాకు కేకు పెట్టండని మనోజ్ తప్పించుకుంటాడు. నువ్వు కూడా బతక నేర్చావ్ అని బాలు అంటాడు. కేకు ఫ్రిజ్ లో పెట్టు సాయంత్రం తింటానని అంటాడు. దీంతో బాలు కావాలని కేకంతా పాడు చేస్తాడు. తెచ్చినోడికి కూడా కేకు పెట్టకుండా మొత్తం నువ్వే తింటానంటావా అంటూ మళ్లీ తిడతాడు. టిఫిన్ రెడీ చేసి పెట్టమంటూ మీనాకు ఆర్డర్ వేసి మనోజ్, రోహిణి వెళ్లిపోతారు.

బాలు ఇంటికి రాజేష్.. రోహిణి, మనోజ్ గొడవ

ఆ తర్వాత బాలు ఇంటికి రాజేష్, అతని భార్య వస్తారు. తమ తల్లిదండ్రులు వారణాసి వెళ్లారని, ప్రసాదం ఇవ్వడానికి వచ్చామంటారు. తొలిసారి ఇద్దరూ కలిసి వచ్చారు.. తిని వెళ్లాల్సిందే అని బాలు, మీనా ఒత్తిడి తేవడంతో వాళ్లు సరే అంటారు. వాళ్లు తింటూ ఉండగా రోహిణి వచ్చి టిఫిన్ రెడీ అయిందా.. మనోజ్ వెయిట్ చేస్తున్నాడు.. షోరూమ్ కు వెళ్లాలని అంటుంది.

5 నిమిషాలు ఆగమను.. వాళ్లు తినగానే పెడతాను అని మీనా చెబుతుంది. దీంతో అదే విషయం మనోజ్ కు రోహిణి చెబుతుంది. ఆమాత్రం కూడా అర్థం చేసుకోకుండా మనోజ్ గట్టిగట్టిగా అరుస్తుంటాడు. ఎవరెవరో వస్తే వాళ్ల కోసం నేను వేచి చూడాలా.. అయినా ఇదేమైనా సత్రమా.. అనాథాశ్రమమా అంటూ అరుస్తాడు. కాసేపైన తర్వాత ఇక ఆగలేనంటూ మరోసారి గొడవ పడతాడు.

మనోజ్‌కు క్లాస్ పీకిన బాలు.. మధ్యలోనే వెళ్లిపోయిన రాజేష్

దీంతో బాలు పైకి వెళ్తాడు. వాళ్లు తింటున్నారు.. కాస్త మెల్లగా మాట్లాడు.. వింటే బాధపడతారు అని మనోజ్ ను రిక్వెస్ట్ చేస్తాడు. అయినా సరే మనోజ్ తన నోటి దురుసు చూపిస్తాడు. నేను నీలాగా చిన్న పని చేయను.. పెద్ద బిజినెస్ మ్యాన్‌ని.. అక్కడ క్లైంట్స్ వెయిట్ చేస్తున్నారు.. నాతో కేక్ కట్ చేయిస్తా అన్నారు.. ఎవరి కోసమో నేను ఎందుకు ఆగాలి అని నానా రభస చేస్తాడు.

గట్టిగట్టిగా అరవడంతో ఆ మాటలు పదేపదే రాజేష్, అతని భార్యకు వినిపిస్తుంటాయి. దీంతో వాళ్లు సగంలోనే ప్లేట్ లో చేతులు కడిగి లేస్తారు. ఫర్వాలేదమ్మా.. మరోసారి వచ్చినప్పుడు ప్రశాంతంగా తింటాంలే అని రాజేష్ వెళ్లిపోతాడు. అది చూసి మీనా, రవి, శృతి షాక్ తింటారు. మీ అన్నకు కనీసం కామన్ సెన్స్ లేదా అని రవితో శృతి అంటుంది.

సంస్కారం లేదా అంటూ మనోజ్‌ను తిట్టిన బాలు, మీనా, రవి, శృతి

బాలు కిందికి వచ్చి చూస్తే అప్పటికే రాజేష్ వాళ్లు వెళ్లిపోయారని మీనా చెప్పడంతో అతని ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. మనోజ్ కూడా కిందికి వచ్చి.. వెళ్లిపోయారా.. దరిద్రం పోయిందని అంటాడు. అది విన్న బాలు, మీనా, రవి, శృతి అతనికి క్లాస్ పీకుతారు. ఇంత చదువు చదివావు కనీసం సంస్కారం లేదా అని శృతి అంటుంది.

అయినా వాడు ఆఫ్టరాల్ డ్రైవర్ గాడే కదా అని మనోజ్ మరోసారి తన చిల్లర బుద్ధి చూపిస్తాడు. దీంతో అందరూ రెచ్చిపోతారు. మనోజ్ తో కలిపి రోహిణిని కూడా తిడతారు. మీ ఇద్దరి సంసారాన్ని అనవసరంగా కలిపాం.. కనీసం సంస్కారం మీకు లేదు.. కళ్లు పోతాయని నానా అగచాట్లు పడి డబ్బు తెచ్చాం.. మీ బుద్ది చూపించుకున్నారని అంటారు.

ఆ తర్వాత బాలు తన విశ్వరూపం చూపిస్తాడు. ఆఫ్టరాల్ డ్రైవర్ అంటావా.. అసలు మనిషివేనా నువ్వు.. నీకోసం కూడా టిఫిన్ రెడీగానే ఉంది కదా.. దా వచ్చి తిను అంటూ కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్తాడు. బలవంతంగా పెసరట్టు మొత్తం అతని నోట్లో కుక్కుతూ తినురా తిను అని అంటాడు. అది చూసి రోహిణి కంగారు పడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More