...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: రవి, శృతి గొడవ.. బాలు, మీనా పెద్దరికం.. రోహిణి చేతికి చిక్కిన విల్లా విజయ్..

Gunde Ninda Gudi Gantalu Serial July 29 Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 29 ఎపిసోడ్ లో శోభన విషయంలో రవి, శృతి గొడవ పడతారు. బాలు, మీనా పెద్దరికంతో ఆ ఇద్దరూ మళ్లీ కలిసిపోగా.. ఇటు విల్లా విజయ్ విషయంలో మనోజ్, రోహిణి మళ్లీ గొడవ పడతారు.

Published on: Jul 29, 2026, 07:06:54 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో రవి, శృతి గొడవ పడి మళ్లీ కలిసిపోవడం, అటు మనోజ్, రోహిణి తెగ ప్రేమ కురిపించుకొని తర్వాత గొడవ పడటం చూడొచ్చు. విల్లా విజయ్ చేతికి చిక్కినట్లే చిక్కి మళ్లీ తప్పించుకుంటాడు.

రవి, శృతి గొడవ

Gunde Ninda Gudi Gantalu Today Episode: రవి, శృతి గొడవ.. బాలు, మీనా పెద్దరికం.. రోహిణి చేతికి చిక్కిన విల్లా విజయ్..
Gunde Ninda Gudi Gantalu Today Episode: రవి, శృతి గొడవ.. బాలు, మీనా పెద్దరికం.. రోహిణి చేతికి చిక్కిన విల్లా విజయ్..

శోభన చేసిన పనికి ఆవేశంగా ఇంటికి వచ్చిన రవి.. శృతితో గొడవ పడే సీన్ తో సీరియల్ బుధవారం (జులై 29) ఎపిసోడ్ మొదలైంది. మీ అమ్మ ఇంత పని చేసింది.. నీకు తెలియకుండానే చేసిందా.. నీతూ నన్న తీవ్రంగా అవమానించింది.. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా.. ఎందుకు మీ అమ్మ మళ్లీ మళ్లీ ఇలా చేస్తోంది అంటూ శృతిపై రవి మండి పడతాడు.

ఆమె చేసిన పనికి తనను ఎందుకు తిడుతున్నావని శృతి అడిగినా పట్టించుకోడు. ఆ ఇల్లు అని వేరు చేసి మాట్లాడటంతో శృతికి కూడా కోపం వస్తుంది. ఇద్దరూ మాటా మాటా అనుకుంటారు.

సర్ది చెప్పిన బాలు, మీనా

రవి ఆవేశంగా రూమ్ లో నుంచి వెళ్లిపోవడం చూసి బాలు, మీనా కంగారు పడతారు. అసలు ఏమైందో తెలుసుకొని ఇద్దరినీ కలపాలని నిర్ణయించుకుంటారు. శృతి దగ్గరికి మీనా.. రవి దగ్గరికి బాలు వెళ్తారు. వాళ్లు జరిగిన విషయం చెబుతారు. తాము కూడా ఇదే జరిగి ఉంటుందని అనుకున్నామని అంటారు.

అప్పటికే రోహిణిపై మనోజ్ ప్రేమ కురిపిస్తుంటాడు. ఇది మీ నాన్న ముద్ద, ఇది నా ముద్ద, ఇది నీ ముద్ద అంటూ గోరు ముద్దలు తినిపిస్తుంటాడు. తన పేరుని టాటూగా రోహిణి వేసుకోవడంతో మనోజ్ కు ప్రేమ పొంగిపోతుంది. నేను తింటానులే అని రోహిణి అన్నా కూడా టాటూ వేసుకున్నావ్.. నొప్పి పుడుతుంది వద్దంటాడు.

అప్పుడే బాలు, మీనా అక్కడికి వస్తారు. అది చూసి మనోజ్ ను ఏడిపిస్తాడు బాలు. మీ ఆవిడ అరచేతిపై పచ్చబొట్టు పొడిపించుకోలేదురా.. ఆమె తినగలదు అని అంటాడు. అయినా ఇంట్లో ఇద్దరు గొడవ పడుతుంటే పెద్దవాడిగా వాళ్లకు సర్ది చెప్పాల్సింది పోయి ఇలా నీ భార్యకు తినిపిస్తూ కూర్చొంటావా అని తిడతాడు. అప్పుడే రవి, శృతి కూడా వస్తారు.

రోహిణిపై బాలు, మీనా, రవి, శృతి మాటల బాణాలు

ఇక పుట్టింటి విషయంలో రవి, శృతి మధ్య గొడవ జరగడంతో టాపిక్ దానివైపు వెళ్తుంది. అయినా రోహిణి చూడండి.. పుట్టింటి నుంచి పైసా తీసుకురాలేదు.. అత్తయ్య ఎప్పుడు మలేషియా గురించి అడిగినా.. ఒక్కసారి కూడా వాళ్ల నాన్నను తీసుకురాలేదు.. మన డబ్బునే వాళ్ల నాన్న ఇచ్చినట్లుగా చెప్పి బిజినెస్ పెట్టించింది.. నా నగలన్నీ వాళ్ల ఆయన మింగేస్తే.. ఆ డబ్బు ఇస్తానని అందరి ముందూ మాట ఇచ్చి ఎగ్గొట్టేసింది అని మీనా దెప్పి పొడుస్తుంది.

పుట్టింటి నుంచి ఒక్క పైసా తీసుకురాకుండా మన డబ్బునే వాడితో మింగిస్తూ ఎలా నాటకమాడుతోందా అర్థమైందా అని రవి అంటాడు. మనోజ్ కళ్లు పోయినప్పుడు కూడా ఒక్క పైసా తీయకుండా తన కళ్లు ఇస్తానని తప్పుడు వాగ్దానాలు చేసిందనీ చెబుతాడు. అప్పుడు కూడా పోలీస్ కేసు కాకుండా రూ.30 వేలు ఇచ్చి తాను సెటిల్ చేస్తే.. ఆ డబ్బు నేను మింగినట్లు చెప్పిందని బాలు అంటాడు. దీంతో మనోజ్, రోహిణి ముఖాలు మాడిపోతాయి.

ఒకరిపై మరొకరు అలిగిన రవి, శృతి

ఆ తర్వాత రవి, శృతి మీరు కూడా కూర్చొని ఒకరికొకరు తినిపించుకోండని బాలు అంటాడు. కానీ ఆ ఇద్దరూ మళ్లీ మాటామాటా అనుకొని తినకుండానే వెళ్లిపోతారు. రూమ్ లోకి వెళ్లి ఆకలికి ఓర్చుకోలేకపోతారు. కడుపు మాడటానికి కారణం కూడా నువ్వంటే నువ్వంటూ నిందించుకుంటారు. తర్వాత మెల్లగా శృతికి కిందికి వస్తుంది. అప్పటికే వాళ్లిద్దరూ తినకుండా పడుకున్నారని, ఆకలికి తట్టుకోలేరని బాలు, మీనా మాట్లాడుకుంటారు. శృతి రావడం గమనించి మీనాను పడుకోమని బాలు చెబుతాడు. అంతకుముందే మిగిలిపోయిన ఫుడ్ ను దాచేయమని కూడా చెప్పడంతో మీనా అలాగే చేస్తుంది.

రవి, శృతిని కలిపిన బాలు ప్లాన్

శృతి వచ్చి మీనాను లేపమని బాలుని అడుగుతుంది. ఆమె చాలా అలిసిపోయింది లేపడం కుదరదు.. అయినా తినమని బతిమాలినప్పుడు వెళ్లిపోయారు కదా.. మా ఆవిడ పొద్దున 5 గంటలకే లేవాలి అని శృతిని కావాలని తిట్టి పంపిస్తాడు బాలు. దీంతో చేసేది లేక కిచెన్ లోకి వెళ్తుంది శృతి. బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడానికి ప్రయత్నించినా ఆమెకు రాదు.

మెల్లగా రవి కూడా కిచెన్ లోకి వెళ్లడంతో బాలు, మీనా లేచి చూస్తారు. శృతికి బ్రెడ్ ఆమ్లెట్ వేయడమే కాదు.. ఆమెకు సారీ చెప్పి తినిపిస్తాడు. శృతి కూడా అతనికి తినిపిస్తుంది. మళ్లీ ఇద్దరూ కలిసిపోవడంతో బాలు, మీనా వస్తారు. ఇప్పుడు అర్థమైందా తాను ఎందుకు మీనాను లేపలేదో అని బాలు అంటాడు.

విల్లా విజయ్‌ను పట్టుకున్న రోహిణి.. మళ్లీ పారిపోయిన విజయ్

మరోవైపు విద్యతో కలిసి రోహిణి ఓ రెస్టారెంట్ కు వెళ్తుంది. మనోజ్ తన టాటూ చూసి మురిసిపోతున్నాడని, ఇక పూర్తిగా తన వశం చేసుకొని గతం గురించి మెల్లగా చెబుతానని రోహిణి అంటుంది. అయినా ఆ విల్లా విజయ్ గాడు మోసం చేయకపోయి ఉంటే ఇప్పటికే మరో ఇంటికి వెళ్లిపోయేవాళ్లమని రోహిణి అంటుంది.

వాడు దొరికితే వదలను అని శపథం చేస్తుంది. అప్పుడే విల్లా విజయ్ అదే రెస్టారెంట్ కు వస్తాడు. అతన్ని చూసి రోహిణి నిలదీస్తుంది. కాలర్ పట్టుకొని తన డబ్బు ఎక్కడ అని అడుగుతుంది. అసలు మీరెవరు అంటూ అతడు బుకాయిస్తాడు. విద్యను పోలీసులకు ఫోన్ చేయమని చెప్పడంతో విల్లా విజయ్ ఆమెను తోసేసి పారిపోతాడు. రోహిణి అతని వెంట పడినా అతడు దొరకడు.

రోహిణి, మనోజ్ మళ్లీ గొడవ

అదే విషయం ఇంటికి వచ్చి మనోజ్ కు చెబుతుంది రోహిణి. వాడిని అలా ఎలా వదిలేస్తావ్.. గట్టిగా పట్టుకోవాల్సింది.. రోడ్డుపై ఎవరి సాయమైనా కోరాల్సింది అని రోహిణిని నిందిస్తాడు మనోజ్. రెండుసార్లు దొరికినట్లే దొరికి పారిపోయాడు అని అంటాడు. మరి అదే మాట తాను కూడా అంటే ఎలా ఉంటుంది.. నువ్వు కూడా అతన్ని పట్టుకోలేకపోయావు కదా.. వాడు చాలా వేగంగా పరిగెత్తాడు.. పట్టుకోలేకపోయానని చెప్పిన వినవేంటి అని రోహిణి నిలదీస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe