Gunde Ninda Gudi Gantalu Today Episode: అన్న కోసం బాలు తంటాలు.. మీనా డబ్బుతో.. మారని రోహిణి బుద్ధి.. మనోజ్ జీవితం చీకటి
Gunde Ninda Gudi Gantalu July 8th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జులై 8 ఎపిసోడ్ కూడా చాలా ఎమోషనల్ గా సాగింది. అన్న కోసం బాలు తంటాలు పడటం, చివరికి మీనా డబ్బుతో సర్జరీ చేయించడం, అయినా రోహిణి బుద్ధి మారకపోవడంలాంటి సీన్లు చూడొచ్చు.
Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం మనోజ్ సర్జరీ, అందుకు అవసరమైన డబ్బు కోసం బాలు పడే తంటాల చుట్టూ తిరిగింది. అయితే బాలు ఇంత చేసినా రోహిణి బుద్ధి మారకపోవడమే ఈ ఎపిసోడ్ లో అసలు హైలైట్. అన్నను చూసి బాలు బాగా ఎమోషనల్ అవుతాడు.

బాలు చెంప పగలగొట్టిన ప్రభావతి
మనోజ్ కళ్లలో గాజు పెంకలు తీసేశామని డాక్టర్ చెప్పే సీన్ తో సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ మొదలైంది. అది విని బాలు శపించిన విషయం గుర్తు చేసుకుంటుంది ప్రభావతి. వెంటనే అతని చెంప పగలగొడుతుంది. మనోజ్ కళ్లకు ఏమైనా జరిగితే నీ ముఖం జీవితంలో మళ్లీ చూడను అని అంటుంది. దీంతో బాలు కూడా ఫీలవుతాడు.
మనోజ్ కోసం నష్ట పరిహారం చెల్లించిన బాలు
అటు మనోజ్ ను హాస్పిటల్ కు తీసుకొచ్చిన వాళ్లు కూడా అక్కడ గొడవ పెట్టుకుంటారు. ఏం జరిగిందని బాలు అడుగుతాడు. మీ అన్న ఎవరినో తరుముతూ వెళ్లాడని, తమకు చాలా నష్టం జరగడంతోపాటు హాస్పిటల్ బిల్లు కూడా కలిపి రూ.30 వేలు అయ్యాయని వాళ్లు అంటారు. దీంతో ఆ డబ్బు బాలు అప్పటికప్పుడు ఇచ్చేసి.. దీనిని ఇక్కడితో వదిలేయండి.. పోలీసు కేసుల వరకు వెళ్లొద్దని చెబుతాడు. నువ్వు దేవుడివి అని అంటూ వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మనోజ్‌కు మరో మేజర్ సర్జరీ
ఇటు మనోజ్ కు సర్జరీ చేసినా టెస్టుల్లో ఇంకా గాజు ముక్కలు కళ్లలో ఉన్నాయని తేలుతుంది. దీంతో మరో మేజర్ సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పడంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు. వెంటనే సర్జరీ చేయాలని, డబ్బు ఏర్పాటు చేసుకోండని చెప్పి వెళ్లిపోతాడు. అది విని ప్రభావతి మరింత ఏడుస్తుంది.
బిల్లు చూసి బాలు, మీనా షాక్..
బిల్లు ఎంతైందో బాలు, మీనా వెళ్లి అడుగుతారు. రూ.లక్షా 70 వేలు అయిందని తెలుసుకొని షాక్ తింటారు. ముందు బిల్లు కడితేనే సర్జరీ మొదలు పెడతారని, వెంటనే కట్టాలని హాస్పిటల్ వాళ్లు చెబుతారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని బాలు, మీనా టెన్షన్ పడతారు.
రోహిణి కూడా తన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని చెప్పడంతో తాను చూసుకుంటానని, కంగారు పడొద్దని బాలు ధైర్యం చెబుతాడు. అటు రవి, శృతి కూడా బిల్లు చూసి షాక్ తింటారు. తన తండ్రిని అడుగుతానని శృతి అంటే బాలు వద్దని వారిస్తాడు. సత్యంకి కూడా ధైర్యం చెప్పి డబ్బు కోసం బాలు వెళ్తాడు.
డబ్బు కోసం బాలు, మీనా తంటాలు
మొదట మీనా తన దగ్గర ఉన్న రూ.60 వేలు ఇస్తానని అంటుంది. అయినా సరిపోవు కదా.. ముందు బయట ఎవరి దగ్గరైనా అడిగి చూద్దాం.. లేకపోతే అవి అడ్వాన్సుగా కడదామంటూ బాలు, మీనా తమ ఫ్రెండ్స్ దగ్గర డబ్బుల కోసం ప్రయత్నిస్తుంటారు. కానీ ఎక్కడా వాళ్లు అప్పు పుట్టదు.
బాలుకి డ్రైవర్ల తోచినంత సాయం
బాలు చివరికి రాజేష్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెబుతాడు. అది విని అక్కడే ఉన్న డ్రైవర్లందరూ తమకు తోచిన సాయం చేస్తారు. వాళ్లు ఇచ్చినవి చిన్న మొత్తమే అయినా బాలు కృతజ్ఞతతో వాళ్లకు చేతులెత్తి మొక్కుతాడు. ఇవి సరిపోవని ఇంకా చాలా మొత్తం కావాలని అంటాడు.
మీనా గొలుసు కోసం వేసిన చిట్టీ డబ్బులు తీసిన బాలు
అదే సమయంలో తన చిట్టీ డబ్బులు గుర్తుకు వచ్చి ఫోన్ చేసి అడుగుతాడు. మొత్తం ఇవ్వడం కుదరదని, కొంత కట్ చేసుకొని ఇస్తానంటారు. బాలు సరే అంటాడు. కానీ ఆ డబ్బు మీనా నగల కోసం దాస్తున్నవి కదరా.. ఏం జరిగినా అవి తీయనన్నావు కదా అని రాజేష్ అంటాడు.
అవును కానీ.. ఇప్పుడు మరో దారి లేదు అని బాలు అంటాడు. అలా కూడా లక్షా 20 వేలే వస్తాయి కదా.. మరి మిగిలిన డబ్బు ఎలా అని రాజేష్ అంటే.. మీనా దగ్గర కొంత ఉన్నాయని బాలు చెబుతాడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా.. మీ అన్న కోసం ఇంత చేస్తున్నావని రాజేష్ అంటాడు.
తల్లికి ఫోన్ చేసి డబ్బు అడిగిన రోహిణి
ఇటు హాస్పిటల్లో రోహిణి కంగారు పడుతుంటే విద్య వస్తుంది. ఆమెను కూడా రోహిణి డబ్బు అడుగుతుంది. తన దగ్గర లేవని ఆమె చెప్పడంతో తల్లికి ఫోన్ చేసి అడుగుతుంది. తమకు ఎవరు అప్పు ఇస్తారని ఆమె అనడంతో కోపంగా తిట్టి ఫోన్ పెట్టేస్తుంది రోహిణి.
బిల్లు మొత్తం కట్టేసిన బాలు.. రోహిణి వక్రబుద్ధి
అప్పుడే బాలు వచ్చి మొత్తం బిల్లు కట్టేస్తుంటాడు. అది చూసిన విద్య.. ఇక కంగారు లేదు.. బాలు బిల్లు కట్టేశాడని రోహిణికి చెబుతుంది. అది విని దేవుడికి దండం పెడుతుంది రోహిణి. ఇప్పుడు నీ దేవుడు బాలుయే అని విద్య అంటుంది.
అదంతా తర్వాత చూద్దామంటూ అత్త ప్రభావతి దగ్గరికి వెళ్తుంది. డబ్బు సర్దుబాటు అయిందా అని ఆమె అడిగితే.. బిల్లు బాలు కట్టాడని చెప్పకుండా తాను ఉన్నాను కదా చూసుకుంటానంటూ తన బుద్ధి చూపిస్తుంది రోహిణి. నీకు పుట్టగతలు ఉండవే అని విద్య కూడా తిడుతుంది.
మనోజ్‌ను చూసి బాలు ఎమోషనల్
అప్పుడే డాక్టర్ వచ్చి బిల్లు కట్టారా అని అడిగితే కట్టామంటూ బాలు వచ్చి బిల్లు ఇస్తాడు. అది చూసి ప్రభావతి, సత్యం ఎమోషనల్ అవుతారు. అటు సర్జరీ కోసం బయటకు తీసుకొచ్చిన మనోజ్ ను చూసి బాలు కూడా ఎమోషనల్ అవుతాడు. నువ్వు బాగుండాలనే నేను తిట్టాను కానీ.. నీకేమైనా జరగాలని నేను కోరుకోను.. ఇక నుంచి నిన్ను మనోజ్ అనే పిలుస్తాను.. ధైర్యంగా ఉండని బాలు అంటాడు. అటు ప్రభావతి, రవి, సత్యం కూడా మనోజ్ కు ధైర్యం చెబుతారు.
చీకటి అంటూ భయపడిన మనోజ్
సర్జరీ పూర్తవుతుంది. గంట తర్వాత మనోజ్ కు స్పృహ వస్తుంది. అందరూ వెళ్లగానే నాన్నా చీకటి అంటూ మనోజ్ భయపడతుంటాడు. ఏం కాలేదు నాన్నా.. కట్లు తీయగానే ఆ చీకటి పోతుంది అంటూ సత్యం ధైర్యం చెబుతాడు. నా కళ్లు పోతే జీవితాంతం కళ్లు లేనోడా అంటూ బాలు తిడతాడని మనోజ్ అంటాడు.
అది విన్న బాలు.. నేను మరీ అంత బండ మనిషి కాదురా.. నీ రక్తం పంచుకొని పుట్టిన వాడినే అని అంటాడు. మీనా కూడా మనోజ్ కు ధైర్యం చెబుతుంది. దీంతో మీనా తొలిసారి తనతో బాగా మాట్లాడిందని, తనపై జాలి చూపిస్తోందా అని మనోజ్ అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


