గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: అరుణ్ సస్పెండ్.. బాలుకి క్లాస్ పీకిన మీనా.. సుమతి ప్రేమలో ట్రాఫిక్ కానిస్టేబుల్..

Gunde Ninda Gudi Gantalu June 30th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 30 ఎపిసోడ్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ ను సస్పెండ్ చేస్తారు. దీంతో అతడు బాలుపై ఆవేశంతో రగిలిపోతాడు. అటు ఇదే విషయంలో బాలుకి మీనా క్లాస్ పీకుతుంది.

Published on: Jun 30, 2026, 07:22:33 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. బాలు వల్ల అరుణ్ సస్పెండ్ అవడం, అదే అరుణ్ ప్రేమలో సుమతి పడటం, అరుణ్ వల్లే బాలుకి మీనా క్లాస్ పీకడంలాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: అరుణ్ సస్పెండ్.. బాలుకి క్లాస్ పీకిన మీనా.. సుమతి ప్రేమలో ట్రాఫిక్ కానిస్టేబుల్..
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: అరుణ్ సస్పెండ్.. బాలుకి క్లాస్ పీకిన మీనా.. సుమతి ప్రేమలో ట్రాఫిక్ కానిస్టేబుల్..

మటన్ కొట్టు అనగానే బాలులో డౌట్

సుందరి పెళ్లి గురించి సత్యం ఇంట్లో అందరూ మాట్లాడుకునే సీన్ తో గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (జూన్ 30) ఎపిసోడ్ ప్రారంభమైంది. అబ్బాయి మేనమామనట.. మటన్ కొట్టు ఉందంటా అని రంగా చెప్పగానే బాలులో అనుమానం మొదలవుతుంది.

మా పార్లరమ్మకు మేక మామ ఉన్నట్లు అబ్బాయికి కూడా మటన్ కొట్టు మామ ఉన్నాడైతే అని అంటాడు. అమ్మాయి వైపు నువ్వు, అబ్బాయి వైపు ఆయనే పెళ్లి పనులు చూసుకుంటారని రంగా చెబుతాడు.

పోలీస్ స్టేషన్‌కు మనోజ్.. ఆడుకున్న పోలీసులు

ఆ తర్వాత మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. కాలు మీద కాలేసుకొని తన కేసు సంగతి ఏమైందని అడుగుతాడు. పోలీసులు అతన్ని చూసి మరోసారి ఆడుకుంటారు. వెధవ, వెధవన్నర వెధవ అంటూ హేళన చేస్తారు.

మనోజ్ ఆవేశంతో బయటకు వస్తుంటే అక్కడున్న ఓ కానిస్టేబుల్ అతన్ని లాగిపెట్టి కొడతాడు. తాను ఆరోజు లేనని, నువ్వు మావాడి చెవిలో చెప్పిన మాట తెలిసి ఇప్పుడు కొట్టానని అంటాడు.

బాలుపై ఆవేశంతో రగిలిపోయిన అరుణ్

మనోజ్ వెళ్లిపోగానే అరుణ్ స్టేషన్ కు వస్తాడు. అతన్ని చూసి ఎంత పని చేశావంటూ అందరూ అంటారు. ఎస్సై రాగానే అరుణ్ చేసిన పనిని ఫోన్ లో చూపిస్తాడు. హెల్మెట్ లేకుండా ఫోన్ మాట్లాడుతూ వెళ్లి, నో పార్కింగ్ దగ్గర బైక్ ఆపడం అంతా అందులో ఉంటుంది. ఆ తర్వాత బాలు కూడా మాట్లాడుతూ ఇలా పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తాడు.

తన తల్లికి ఎమర్జెన్సీ కావడంతో అలా వెళ్లానని, కావాలని చేయలేదని అరుణ్ చెప్పినా వినడు. ఆ వీడియో వైరల్ కావడంతో నిన్ను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశామని ఎస్సై చెబుతాడు. దీంతో అరుణ్ షాక్ తింటాడు. దీనికి కారణమైన బాలుపై ఆవేశంతో రగిలిపోతాడు. అతడు పగబట్టి ఇలా చేశాడని చెప్పినా.. తన చేతుల్లో ఏమీ లేదని ఎస్సై అంటాడు.

మీనాతో మాట్లాడిన విద్య.. చూసిన రోహిణి

ఇటు విద్య రోడ్డుపై నిల్చొని ఉండగా మీనా వస్తుంది. తన వెంట పడుతున్న వాడి ఫోన్ తీసుకున్నా అందులో ఏమీ లేదని, ఇంకా ఏం చేయాలో చెప్పాలని మీనాను సలహా అడుగుతుంది విద్య. ఇద్దరికీ ఇష్టమైన పది విషయాలను పేపర్ పై రాయాలని, ఆ తర్వాత ఒకరివి మరొకరు చూడాలని మీనా ఐడియా ఇస్తుంది.

ఇవన్నీ చాటుగా వింటుంది రోహిణి. మీనా వెళ్లిపోయిన తర్వాత విద్య దగ్గరికి వచ్చి అంతలా ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగినా విద్య చెప్పదు. ఇద్దరిలో నీకు ఎవరు ఎక్కువ అని రోహిణి అడిగితే.. నువ్వు ఫ్రెండ్, మీనా నాకు అడ్వైజర్ అని విద్య అంటుంది.

అరుణ్ ఇంటికి సుమతి.. బాలు గురించి చెప్పిన అరుణ్

మరోవైపు అరుణ్ ఇంటికి సుమతి వెళ్తుంది. వాళ్ల అమ్మకు మందులు తీసుకెళ్తుంది. ఆమెను చూడగానే అరుణ్ తల్లి సంతోషిస్తుంది. అరుణ్ ఈరోజు ఎందుకో బాధలో ఉన్నాడని, తినలేదని ఆమె చెబుతుంది. తర్వాత అరుణ్ బయటకు వస్తాడు. జరిగిన విషయం చెబుతాడు. ఓ రౌడీ వెధవ ఇలా చేశాడని అంటాడు.

సరే దీనివల్ల మంచి కూడా జరిగింది.. ఈ మూడు రోజులు మీ అమ్మతో గడపండి.. హాయిగా ఉండండి అని సుమతి చెబుతుంది. అదీ నిజమే అని అరుణ్ అంటాడు. తర్వాత సుమతి వెళ్లిపోతుంది. ఆమెను అతడు ప్రేమగా చూస్తుంటాడు.

బాలుకి క్లాస్ పీకిన మీనా

ఇటు ఇంటికి ఎంతో సంతోషంగా వస్తాడు బాలు. అరుణ్ పై పగ తీర్చుకున్నానని మీనాతో చెబుతాడు. అందరికీ స్వీట్లు పంచాలని అంటాడు. అసలు ఇదంతా ఎలా జరిగిందని అడిగితే అసలు విషయం చెబుతాడు. అంత రూల్స్ మాట్లాడే వ్యక్తి అలా చేశాడంటే కచ్చితంగా ఏదో ఎమర్జెన్సీయే అయి ఉంటుందని, పైగా డయాగ్నస్టిక్ సెంటర్ కు వెళ్లాడంటున్నారు.. అది తెలుసుకోకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదని బాలుకి మీనా క్లాస్ పీకుతుంది. మీరు చేసింది కరెక్ట్ కాదని కరాఖండిగా చెప్పి వెళ్లిపోతుంది.

మీనాకు కారు నేర్పిన బాలు

మరుసటి రోజు మీనాకు బాలు కారు నేర్పుతుంటాడు. ఆమె కారు నడుపుతుండగా శృతి ఎదురవుతుంది. ఇద్దరినీ అలా చూసి ఆమె చాలా సంతోషిస్తుంది. మీ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే డ్రైవింగ్ స్కూల్ కి కూడా మంచి ప్రమోషన్ వస్తుందని అంటూ ఫోటోలు తీసుకొని వెళ్లిపోతుంది.

ఆ తర్వాత మీనా సరిగా నడపకపోవడంతో బాలు తిడతాడు. ప్రేమగా చెబితే బాగా నడుపుతానని మీనా అంటుంది. బాలు అలాగే చేయడంతో మీనా పర్ఫెక్ట్ గా కారు నడుపుతుంది.

ప్రభావతిని బుట్టలో వేసుకున్న శిష్యుడు

అటు డ్యాన్స్ క్లాస్ లో ప్రభావతి, చింతామణి మాట్లాడుతుండగా.. లవర్స్ జంట వస్తుంది. ఎందుకింత ఆలస్యమైందని ప్రభావతి అడుగుతుంది. డ్యాన్స్ క్లాస్ కోసం ఓ వేయింగ్ మెషీన్ తీసుకున్నానని, ఈ మధ్య జిమ్ తోపాటు డ్యాన్స్ క్లాస్ లలోనూ వీటిని పెడుతున్నారంటూ అతడు ప్రభావతిని బుట్టలో వేసుకుంటారు. ఆ తర్వాత వెయిట్ చూసుకుంటాడు.

కామాక్షి, చింతామణి ఓవర్ వెయిట్ ఉంటారు. ప్రభావతి ఎక్కతే అసలు మెషీన్ పని చేయకపోవడంతో అందరూ నవ్వుతారు. తర్వాత ప్రభావతికి చింతామణి వెయిట్ తగ్గే ఛాలెంజ్ విసురుతూ.. మీ ఒంటినే నియంత్రించుకోలేకపోతే ఇక ఇంట్లో కోడళ్లను ఏం నియంత్రిస్తారంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More