గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ముగ్గురు అన్నదమ్ములు తాగి నానా హంగామా చేస్తారు. అయితే ఆ తాగుడే మనోజ్ ను నిండా మునిగేలా చేస్తుంది. బాలు వద్దంటున్నా సంతకం చేసి మనోజ్ మోసపోతాడు. అయితే దీనికి కారణం మాత్రం బాలునే అవుతాడు.
బాలు వద్దంటున్నా తాగి సంతకం చేసిన మనోజ్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (మార్చి 19) ఎపిసోడ్ ముకేష్ మొహమాటానికి మనోజ్ కూడా తాగే సీన్ తో మొదలవుతుంది. మనోజ్ నే కాకుండా రవి, బాలుని కూడా తాగాలని ముకేష్ బలవంతపెడతాడు.
అదే సమయంలో డీలర్‌షిప్ ఇస్తున్నట్లు కాగితాలపై సంతకం పెట్టమంటాడు. అప్పటికే మనోజ్ తాగేసి ఉంటాడు. ఇంకా మొదలుపెట్టని బాలు మాత్రం ఇప్పుడు వద్దు.. రేపు చదివి సంతకం పెట్టాలని అంటాడు. కానీ మనోజ్ మాత్రం వినకుండా సంతకం పెట్టేస్తాడు.
బాటిల్ ఎత్తేసిన బాలు.. తాగి చిందేసిన అన్నదమ్ములు
ఇక ముకేష్ బలవంతం చేయడంతో మొదట నాన్న ఫీలవుతాడని అన్న బాలు.. తర్వాత ఏకంగా బాటిలే ఎత్తేస్తాడు. అటు మీనా, శృతి వాళ్లు ఎక్కడ తాగుతారో అని టెన్షన్ పడుతుంటారు. ఇక్కడ బాలు, రవి మాత్రం పీకలదాకా తాగేస్తారు. తర్వాత బాలు.. ముకేష్ ను పొగుడుతూ పాట పాడతాడు. ఆ తర్వాత ముగ్గురు అన్నదమ్ములు కలిసి అతనితో చిందేస్తారు. డ్రమ్ముపైకి ఎక్కి బాలు నానా హంగామా చేస్తాడు.
బాలు ఫోన్ కొట్టేసే ప్లాన్ ఫెయిల్
బాలు ఫోన్ కొట్టేయడానికి ఇదే సరైన సమయం అని భావించిన రోహిణి.. విద్యను పంపిస్తుంది. మీ డ్యాన్స్ వీడియో తీస్తానంటూ బాలు ఫోన్ తీసుకుంటుంది విద్య. కాసేపు వీడియో తీసినట్లు నటించి తర్వాత పక్కకు వెళ్లి బాలు ఫోన్ వీడియో కోసం రోహిణి వెతుకుతుంటుంది. అప్పుడే బాలు అక్కడికి వచ్చి తన ఫోన్ లాక్కుంటాడు. అది చూసి విద్య ఇక ఈ ప్లాన్ ఆపెయ్.. అది అయ్యేలా లేదని రోహిణితో అంటుంది.
ముకేష్‌కు నిజం చెప్పేసిన బాలు
{{/usCountry}}బాలు ఫోన్ కొట్టేయడానికి ఇదే సరైన సమయం అని భావించిన రోహిణి.. విద్యను పంపిస్తుంది. మీ డ్యాన్స్ వీడియో తీస్తానంటూ బాలు ఫోన్ తీసుకుంటుంది విద్య. కాసేపు వీడియో తీసినట్లు నటించి తర్వాత పక్కకు వెళ్లి బాలు ఫోన్ వీడియో కోసం రోహిణి వెతుకుతుంటుంది. అప్పుడే బాలు అక్కడికి వచ్చి తన ఫోన్ లాక్కుంటాడు. అది చూసి విద్య ఇక ఈ ప్లాన్ ఆపెయ్.. అది అయ్యేలా లేదని రోహిణితో అంటుంది.
ముకేష్‌కు నిజం చెప్పేసిన బాలు
{{/usCountry}}అందరూ పీకలదాకా తాగుతారు. ముగ్గురు అన్నదమ్ములను, తండ్రి సత్యంను ముకేష్ తెగ పొగిడేస్తాడు. అది విని బాలు ఫీలవుతాడు. మీరు మా నాన్నను పొగిడారు కాబట్టి మీకు నిజం చెబుతాను.. మేము చెప్పిందంతా అబద్ధం.. నాకు 40 కార్లు లేవు.. రెండే ఉన్నాయి.. వాటికి కూడా ఈఎంఐ కడుతున్నాను.. వీడు రెస్టారెంట్లో చెఫ్.. నా భార్య పూలు డోర్ డెలివరీ చేస్తుంది అని మొత్తం చెప్పేస్తాడు. ఇది నిజమేనా మనోజ్ అని ముకేష్ అడుగుతాడు. తాగిన మత్తులో ఉన్న అతడు బాలు ఏం చెబితే అది నిజం అని అంటాడు. దీంతో ముకేష్ వెళ్లిపోతాడు.
బాలు ఫోన్ కొట్టేసిన రోహిణి
ఆ తర్వాత తమ భర్తలను చూసి మీనా, రోహిని, శృతి షాక్ తింటారు. ముగ్గురూ కనీసం నడవలేని స్థితిలో ఉంటారు. దీంతో వాళ్లకు క్లాస్ పీకుతారు. తాగొద్దని చెప్పాను కదా అని మీనా.. గెస్టుకు పోయకుండా మీరు తాగడమేంటని రోహిణి అంటారు. ముగ్గురినీ బలవంతంగా తీసుకెళ్తారు. అదే అదునుగా బాలు కోటు జేబులో ఉన్న అతని ఫోన్ ను రోహిణి కొట్టేస్తుంది.
ఇంటి ముందుకు వెళ్లిన తర్వాత కూడా అన్నదమ్ముల హంగామా మామూలుగా ఉండదు. సత్యాన్ని చూసి రవి అంకుల్ అనడం, బాలు మామయ్య అనడం, మనోజ్ బాబాయి అని అంటారు. వాళ్లను చూసి సత్యం, ప్రభావతి షాక్ తింటారు.
నిండా మునిగిన మనోజ్
మరుసటి రోజు ఉదయం మత్తు దిగిన తర్వాత మనోజ్ కు అసలు విషయం తెలుస్తుంది. తన డీల్ క్యాన్సిల్ అయిందని తెలుసుకుంటాడు. ముకేష్ కు ఏం చెప్పావని బాలుని నిలదీస్తాడు. మొత్తం నిజం చెప్పేశానని అంటే.. అసలు ఏం జరిగిందని సత్యం అడుగుతాడు. మనోజ్ చేసిన డ్రామా గురించి చెబితే.. అందరినీ మోసగాళ్లను చేశావా అంటూ మనోజ్ పై సత్యం మండిపడతాడు. అయితే మోసం వల్ల డీల్ రద్దయితే నేను రూ.50 లక్షలు ఇవ్వాలని ఇందులో రాసి ఉందని, తాను మునిగానని మనోజ్ తల పట్టుకుంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.