...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి కొంప ముంచే మరో సీక్రెట్ తెలుసుకున్న బాలు, మీనా.. మామ కూడా దూరం పెట్టేశాడు

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 13 ఎపిసోడ్ లో బాలు, మీనాకు రోహిణి గురించి మరో షాకింగ్ సీక్రెట్ తెలుస్తుంది. అటు మామయ్య సత్యం కూడా రోహిణిని క్షమించడు.

Published on: May 13, 2026, 07:35:23 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి మరిన్ని కష్టాల్లో కూరుకుపోతుంది. అత్త ప్రభావతి ఆమెను పూర్తిగా కరివేపాకులా తీసిపారేస్తుంది. అటు మామ సత్యం కూడా క్షమించలేనని చెప్పేస్తాడు. ఇది చాలదన్నట్లు గుణతో రోహిణికి ఉన్న బంధం గురించి బాలు, మీనా తెలుసుకుంటారు.

పుల్లలు పెట్టడం రాదంటూ ఊగిపోయిన మీనా

Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి కొంప ముంచే మరో సీక్రెట్ తెలుసుకున్న బాలు, మీనా.. మామ కూడా దూరం పెట్టేశాడు
Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణి కొంప ముంచే మరో సీక్రెట్ తెలుసుకున్న బాలు, మీనా.. మామ కూడా దూరం పెట్టేశాడు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (మే 13) ఎపిసోడ్ రోహిణికి మీనా భోజనం తీసుకెళ్లడాన్ని తప్పుబడుతూ ప్రభావతి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది.

రోహిణిని నీ పార్టీలోకి తిప్పుకుందామని అనుకుంటున్నావా.. ఇప్పటికే శృతిని తిప్పుకున్నావు.. ఇప్పుడు రోహిణిని కూడా తిప్పుకొని ఇంటిని ఏలుదామనుకుంటున్నావా అని ప్రభావతి తిడుతుంది. అయితే మీనా కూడా వెనక్కి తగ్గదు. నాకు పూలు అల్లడం వచ్చు కానీ పుల్లలు పెట్టడం రాదు అని అత్త ముఖం మీదే చెప్పి వెళ్లిపోతుంది. దీంతో ప్రభావతి కంగుతింటుంది.

మంచి చేయబోతే చెడు జరిగిందని చెప్పుకున్న బాలు, మీనా

ఆ తర్వాత బాలు ఇంటికి వచ్చి తనను చెప్పుతో కొట్టమని మీనాతో అంటాడు. ఎందుకు అని అంటే మనోజ్ కు మంచి చేద్దామని భోజనం తీసుకెళ్తే తన షాపు కొట్టేద్దామని వచ్చావా అని తనకు బుద్ధి చెప్పాడని బాలు అంటాడు.

అలా అయితే రెండో చెప్పుతో నన్ను కొట్టండి.. నేను కూడా రోహిణికి భోజనం తీసుకెళ్తే.. ఇప్పుడు సంతోషంగా ఉందా అని అడిగిందని మీనా అంటుంది. ఇక నుంచి వాళ్లకు మంచి చేయొద్దని, వాళ్లతో ఎలా ఉండాలో అలాగే ఉండాలని బాలు అంటాడు.

అత్తింటి విషయం పుట్టింటి వారికి చెప్పిన మీనా

అప్పుడే రోహిణి గురించి మరో సీక్రెట్ ను అక్కకు చెబుతాడు శివ. ఆమె తరచూ గుణ దగ్గరికి వచ్చేదని, లక్షలు అప్పుగా తీసుకునేదని వెల్లడిస్తాడు. గుణ దగ్గర రోహిణి అప్పు తీసుకోవడం ఏంటి? మనోజ్ కూడా వచ్చేవాడా అని మీనా అడుగుతుంది.

లేదు.. రోహిణి ఒక్కతే వచ్చేది.. ఆమె వచ్చినప్పుడల్లా నేను కనపడకుండా దాక్కునేవాడినని శివ అంటాడు. అది విని అసలు రోహిణి చుట్టూ ఏం జరుగుతోంది? అసలు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? అనే అనుమానం మీనాలో మొదలవుతుంది.

రోహిణితో మనోజ్‌ను మాట్లాడనీయని ప్రభావతి

మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన మనోజ్.. తన గదికి వెళ్తాడు. రోహిణిని ఎంత పిలిచినా తలుపు తీయదు. ప్రభావతి కూడా వచ్చి ఎంత తలుపులు బాదినా తీయకపోవడంతో అందరూ కంగారు పడతారు. చివరికి మంచి నిద్రలో ఉన్న రోహిణి తలుపు తీస్తుంది. అయితే మనోజ్ ను భార్యతో ప్రభావతి మాట్లాడనీయదు. తలుపులు తెరిచే ఉంచాలని, వెంటనే రెడీ అయి కిందికి రావాలని మనోజ్ కు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

రోహిణి, గుణ గురించి బాలుకి చెప్పిన మీనా

ఇటు రోహిని, గుణ గురించి నమ్మలేని నిజం తెలుసుకున్న మీనా.. అదే విషయం బాలుకి చెబుతుంది. అతనిలోనూ సందేహం మొదలవుతుంది. గుణ అంటే మనకు పడదన్న విషయం తెలిసి కూడా అతని దగ్గర రోహిణి అప్పు చేయడం ఏంటి? ఇది వదిలేయాల్సిన విషయం కాదు.. కచ్చితంగా తేల్చాల్సిన విషయం.. అదేంటో నేను తేలుస్తానని బాలు అంటాడు.

సత్యంకు క్షమాపణ చెప్పిన రోహిణి

అత్త దగ్గర తన పప్పులుడకకపోవడంతో మెల్లగా మామ సత్యం దగ్గరికి వెళ్తుంది రోహిణి. తాను చేసిన పనికి క్షమాపణ చెబుతుంది. మోసం చేయాలని అనుకోలేదని, బిజినెస్ చేసిన వచ్చిన లాభాలతో ఆ డబ్బు ఇద్దామనుకున్నట్లు చెబుతుంది. దీనికి మనోజ్ కూడా ఒప్పుకున్నాడని అంటుంది.

కానీ సత్యం మాత్రం మెత్తగా మాట్లాడుతూనే రోహిణిని మందలిస్తాడు. ఉమ్మడి కుటుంబంలో సొంత నిర్ణయాలు తీసుకుంటే.. ఇక మేమెందుకు.. మీకు మీదే ఏదో ఊహించేసుకుంటే ఎలా అని క్లాస్ పీకుతాడు. క్షమించమని రోహిణి అడిగినా.. ఇప్పుడు తానేమీ చేయలేనని, తనకు టైమ్ అవుతోందని వెళ్లిపోతాడు.

సత్యాన్ని ఉద్యోగం వద్దని వారించిన బాలు

ఇటు సత్యం ఉద్యోగానికి వెళ్తుంటే బాలు వద్దని మరోసారి వారిస్తాడు. అయినా అతడు మాత్రం వినడు. తన పని తనదే అని స్పష్టం చేస్తాడు. సత్యం వెళ్లిపోయిన తర్వాత అతని గదిలో నుంచి బయటకు వస్తున్న రోహిణిని ప్రభావతి అడ్డుకుంటుంది.

తాను క్షమించను అనే సరికి ఆయన దగ్గరికి వెళ్లావా.. నిన్ను ఈ జన్మలో క్షమించను అని మరోసారి స్పష్టం చేస్తుంది. అదే సమయంలో రోహిణి, గుణ గురించి కూడా చెప్పేద్దామా అని బాలు అంటాడు. కానీ మీనా మాత్రం ఇప్పుడు వద్దని అడ్డుకుంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తుంటారు. రోహిణి వచ్చినా ప్రభావతి పట్టించుకోదు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe