...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుకి మీనా మోసం.. సుమతి పెళ్లి చిచ్చు.. మనోజ్ చేతిలో చిప్ప.. తగ్గని ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu Serial November 12th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 12 ఎపిసోడ్ లో బాలు మాట కాదని సుమతి దగ్గరికి వెళ్తుంది మీనా. ఇటు రోహిణిని షాపుకి తీసుకెళ్తానన్న మనోజ్ చేతుల్లో చిప్ప పెడుతుంది ప్రభావతి.

Published on: Nov 12, 2026, 07:57:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు తోటికోడళ్లు తమ బాధలను ఒకరితో మరొకరు పంచుకుంటారు. అయితే రోహిణి విషయంలో ప్రభావతి వెనక్కి తగ్గకపోగా.. సుమతి పెళ్లి విషయంలో బాలు మాట కాదని మీనా వెళ్లడం పెద్ద గొడవకు దారి తీస్తుంది.

శృతి కొత్త రెస్టారెంట్ పేరు విని నీతూ షాక్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 12 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 12 ఎపిసోడ్

నీతూని శృతి కలిసి రెస్టారెంట్ విషయం చెప్పే సీన్ తో సీరియల్ గురువారం (నవంబర్ 12) ఎపిసోడ్ మొదలైంది. తాను కొత్తగా రెస్టారెంట్ పెడుతున్నానని శృతి చెప్పడంతో నీతూ కంగారు పడుతుంది. అయినా అది అంత సులువైన విషయం కాదని అంటుంది. తాను పెడతానని, రవిని కూడా తనతో తీసుకెళ్తానని అనడంతో నీతూలో భయం మొదలవుతుంది. శృతి నిజంగానే రెస్టారెంట్ పెడుతుందా? రవిని తీసుకెళ్లిపోతుందా అని నీతూ ఆలోచనలో పడుతుంది.

తాగి బాధలు పంచుకున్న ముగ్గురు అన్నదమ్ములు.. మనోజ్‌ను భయపెట్టిన బాలు

ఇటు ఇంటిపై ముగ్గురు అన్నదమ్ములు సిట్టింగ్ వేస్తారు. రోహిణి గురించి మనోజ్, శృతి విషయంలో రవి, సుమతి పెళ్లిపై బాలు బాధలు చెప్పుకుంటారు. ముగ్గురూ తలా ఓ మూలన కూర్చోవడంతో బాలు మిగిలిన ఇద్దరిని ఒక దగ్గరికి రమ్మంటాడు. రోహిణి తనను వదిలి వెళ్లిపోతుందేమో అని మనోజ్ భయపడతాడు. తన ఫ్రెండ్ మణికంఠకు తెలిసిన వ్యక్తికి ఇలాగే జరిగిందని చెబుతాడు.

మరి రోహిణి ఎందుకు దూరం పెడుతున్నావని రవి అడిగితే.. అమ్మ మాట్లాడొద్దని చెప్పిందని అంటాడు. ఇలాగే ఉంటే మీ మధ్య దూరం ఇంకా పెరుగుతుంది.. నీ దగ్గర దొరకని ప్రేమను రోహిణి మరొకరి దగ్గర చూసుకుంటుంది అని బాలు భయపెడతాడు. దీంతో మనోజ్ లో కంగారు మొదలవుతుంది.

రవి రెస్టారెంట్ బాధ.. సుమతి పెళ్లి విషయంలో బాలు అప్‌సెట్

ఇక సుమతి పెళ్లి విషయంలో బాలు తన బాధ చెప్పుకుంటాడు. సుమతి నిర్ణయాన్ని కూడా గౌరవించాలి కదా అని రవి అంటాడు. ఓ బావగా నీ అభిప్రాయం చెప్పొచ్చు కానీ.. పెళ్లి వద్దని చెప్పే హక్కు లేదు కదా అని చెబుతాడు. వాడు మంచోడు కాదని తాను చెబుతున్నానని, పెళ్లి తర్వాత సుమతిని బాధపెడతాడని బాలు అంటాడు.

ముగ్గురు కోడళ్ల బాధలు.. అత్తను చూడగానే..

అటు అన్నాదమ్ముల బాధలు కొనసాగుతుండగా.. ఇటు కింద ముగ్గురు తోటికోడళ్లు కూడా తమ బాధలు చెప్పుకుంటారు. సుమతి పెళ్లిపై చర్చ రాగా అప్పుడే ప్రభావతి కిందికి వస్తుంది. ఆమెను చూడగానే మీనా మాట మార్చి పప్పు ఎలా చేయాలో శృతికి చెబుతుంది. ప్రభావతి వెళ్లిపోగానే సుమతి పెళ్లి గురించి మీనా.. రెస్టారెంట్ గురించి శృతి.. ఇంట్లో తన బాధల గురించి రోహిణి చెప్పుకుంటారు.

రోహిణి షాపుకొస్తుందన్న మనోజ్.. చేతిలో చిప్ప పెట్టిన ప్రభావతి.. విడాకులివ్వాలని..

మరుసటి రోజు ఉదయం మనోజ్ అందరినీ పిలుస్తాడు. ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నానని, అది చెప్పడానికి అందరూ ఉంటే బాగుంటుందని పిలిచానని అంటాడు. ఏంటది అని ప్రభావతి అడిగితే.. ఈరోజు నుంచి తనతోపాటు రోహిణి కూడా షాప్ కి వస్తుందని మనోజ్ అంటాడు. అంతేనా అంటూ లేచి వెళ్లిన ప్రభావతి.. ఓ చిప్ప తీసుకొచ్చి మనోజ్ చేతుల్లో పెడుతుంది.

దానిని షాపుకి తీసుకెళ్తే నీకు చివరికి ఇదే గతి పడుతుంది.. ఈ చిప్పతో గుడి ముందు కూర్చొని అడుక్కో అని అంటుంది. మనోజ్, రోహిణి బతిమాలుతారు. అలా అయితే మనోజ్ కు విడాకులు ఇవ్వు.. ఆ తర్వాత అతనితో ఎలాంటి సంబంధం లేకుండా షాపుకి వెళ్లి అతనికి సాయంగా ఉండు అని ప్రభావతి అనడంతో రోహిణి షాకవుతుంది. ఇంట్లో ఇన్ని బాధలు పడుతున్నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికే తాను ఇక్కడ ఉన్నానని, విడాకులు ఎలా ఇవ్వగలనని రోహిణి అంటుంది.

రోహిణికి సత్యం, బాలు, మీనా సపోర్ట్.. వినని ప్రభావతి

ప్రభావతి మాట విని సత్యం కూడా ఆమెను మందలిస్తాడు. మనోజ్ ఎంత అసమర్థడని తెలిసినా అతనితోనే రోహిణి కలిసి ఉండాలని నిర్ణయించుకుందని, భార్యాభర్తల బంధం అంటే ఇదే కదా అని అంటాడు. అటు బాలు, మీనా కూడా రోహిణికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు.

రోహిణిని వెళ్లనివ్వండి అని అంటారు. కానీ ప్రభావతి వెనక్కి తగ్గదు. తనను కాదని రోహిణిని తీసుకెళ్లాలని అనుకుంటే.. ఇక నుంచి తనను అమ్మ అని పిలవనని, తనతో ఎలాంటి సంబంధం లేదని రాసి ఇచ్చి తీసుకెళ్లాలని ప్రభావతి అనడంతో మనోజ్ షాకవుతాడు. తానే వెళ్తానులే అని చెప్పి వెళ్లిపోతాడు.

బాలుని మోసం చేసిన మీనా

అప్పుడే మీనాకు ఫోన్ వస్తుంది. ఆమెకు సుమతి కాల్ చేస్తుంది. ఇంటికి అరుణ్ అమ్మ వస్తుందని, పెళ్లి గురించి మాట్లాడాలని చెప్పిందని, అమ్మ తన మాట వినడం లేదని అంటుంది. నువ్వు వస్తేనే అమ్మ వింటుందని అనడంతో మీనా సరే అంటుంది. అప్పుడే బాలు వచ్చి ఏం జరిగిందని అడిగితే.. ఏదో పూల ఆర్డర్ అని అబద్ధం చెప్పి పుట్టింటికి వెళ్తుంది మీనా.

ఆ తర్వాత బాలుని కలిసిన సుమతి.. అరుణ్ గురించి చెబుతుంది. ఇంటికి వాళ్ల అమ్మ వచ్చి అమ్మ, అక్కతో మాట్లాడిందని అనడంతో బాలు షాకవుతాడు. మీనా ఇంటికి వచ్చిందా అని అడుగుతాడు. తర్వాత మీనాను నిలదీస్తాడు. పూల ఆర్డర్ అని చెప్పి సుమతి సంబంధం మాట్లాడటానికి వెళ్తావా అంటూ మీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks