Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌ను చితకబాదిన ప్రభావతి.. ఉంగరం కాపాడిన బాలు..రాజేష్ ద్వారా బాలుకి మీనా సాయం
Gunde Ninda Gudi Gantalu Serial November 18th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 18 ఎపిసోడ్ లో మనోజ్ ను ప్రభావతి చితకబాదుతుంది. బాలుకి సపోర్ట్ చేస్తుంది. అటు చింతామణి వడ్డీ కోసం బాలుకి రాజేష్ ద్వారా మీనా సాయం చేస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో చాలా రోజులుగా అందరూ చూడాలనుకున్న సీన్ రానే వచ్చింది. తన ముద్దుల కొడుకును చితకబాది క్లాస్ పీకుతుంది. అటు చింతామణికి కట్టాల్సిన లక్షన్నర కోసం తండ్రి ఉంగరం వద్దని వారించిన బాలు.. ఆ డబ్బు కోసం తంటాలు పడతాడు.

చింతామణి కొత్త ప్లాన్.. వడ్డీ తీసుకురావాలని అసిస్టెంట్‌కు చెప్పి..
చింతామణి తన వడ్డీ కోసం కొత్త ప్లాన్ వేసే సీన్ తో సీరియల్ బుధవారం (నవంబర్ 18) ఎపిసోడ్ మొదలైంది. బాలు ఇంటికి వెళ్లి వడ్డీ తీసుకురావాలని చెబుతుంది. తమ దగ్గర అగ్రిమెంట్ ఉందని, ఓ లెటర్ అతని చేతికి ఇచ్చి దీనిని చూపించి డబ్బు తీసుకురావాలని చెబుతుంది. కానీ అతడు భయపడతాడు. అక్కడికి వెళ్తే బాలు చితకబాదుతాడని అంటాడు. కానీ మనం అనే స్టేజ్ లో ఉన్నాం.. వాళ్లు పడే స్టేజ్ లో ఉన్నారని అతనికి చింతామణి ధైర్యం చెప్పడంతో సరే అంటాడు.
వడ్డీ కోసం ఇంటికి చింతీ అసిస్టెంట్.. చితకబాదిన బాలు
ఆ వడ్డీ వసూలు చేయడానికి చింతీ అసిస్టెంట్ ఇంటికి వెళ్తాడు. దీంతో ప్రభావతి ఇంట్లో వాళ్లందరినీ పిలుస్తుంది. కాఫీ, టీ, మజ్జిగలాంటివి ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఈ ఇల్లు తమదే అని, ఇల్లు పోకుండా ఆపినా వడ్డీ అయతే ఇవ్వాల్సిందే కదా అని అంటాడు.
అలాగే ఎక్స్‌ట్రాలు మాట్లాడుతూ ఉండటంతో మొదట బాలు, ఆ తర్వాత ప్రభావతి, మీనా, శృతి, రోహిణి అతన్ని చితకబాదుతారు. దీంతో అతడు కాస్త తగ్గి చింతామణి ఇచ్చిన లెటర్ చూపిస్తాడు. వడ్డీ కట్టకపోతే పోలీస్ కేసు పెడతానని, మీ నాన్న పరువు తీస్తానని అందులో రాసి ఉంటుంది.
లక్షన్నర కోసం ఇంట్లోవాళ్ల టెన్షన్.. ఉంగరం ఇచ్చిన సత్యం..
దీంతో ఆ లక్షన్నర వడ్డీ కోసం ఇంట్లో వాళ్లు టెన్షన్ పడుతుంటారు. వడ్డీ అయితే కట్టాల్సిందే కదా అనుకొని.. సాయంత్రంలోగా ఇస్తామని చెప్పి చింతామణి అసిస్టెంట్ ను పంపించేస్తారు. తాను, రోహిణి కలిసి డబ్బు ఏర్పాటు చేస్తామని శృతి అంటే.. కోడళ్ల డబ్బు వద్దంటూ తాకట్టుపెట్టమంటూ తన వేలికి ఉన్న ఉంగరం ఇస్తాడు సత్యం.
ఇది మీ మొదటి పెళ్లి రోజుకు అమ్మ ఇచ్చిందని చెప్పారు.. అది ఎందుకు తాకట్టు పెట్టడం అని బాలు, రవి వారిస్తారు. ఇన్నాళ్లూ దీనిని వాడలేదు కానీ.. ఇప్పుడు వాడాల్సిన టైమ్ వచ్చింది అని సత్యం అంటాడు. అవసరం లేదు.. ముగ్గురం ఉన్నా.. తలా 50 వేలు సర్దుతాం అని బాలు చెబుతాడు.
మనోజ్‌కు క్లాస్ పీకిన ప్రభావతి.. అష్ట దరిద్రుడా అంటూ..
తాను ఇవ్వనని, ఇల్లు పోతే పోయింది.. ఇదేం తాజ్మహలా.. ఏదో చిన్న కొంపే కదా అంటూ మనోజ్ నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. దీంతో ప్రభావతి చెలరేగిపోతుంది. మనోజ్ చెంప పగలగొడుతుంది.
ఇది నీకు కొంపలా కనిపిస్తోందా.. అష్టదరిద్రుడా.. అందరి ఉసురు పోసి నీకు పెట్టాను.. ఆ బాలుగాడిని నేను కనీసం పెంచలేదు.. అయినా మాకోసం, మేము రోడ్డు పడకుండా ఉండాలని డబ్బు సర్దుతానంటే నువ్వు ఇవ్వనంటావా.. నువ్వు అసలు మనిషివేనా.. రెండున్నర లక్షలు అని చెప్పి పాతిక లక్షలు అప్పు చేసి ఇల్లు పోయే పరిస్థితి తీసుకొచ్చావు.. ఎందుకూ పనికిరాని అసమర్థుడివి అంటూ ఎడాపెడా బాదేస్తుంది. దీంతో ఇన్నాళ్లూ నిజం తెలుసుకున్నావని రవి, బాలు అంటారు. అయితే తనకు సాయంత్రంలోగా రవి, మనోజ్ వాటా రావాల్సిందే అని చెప్పి బాలు వెళ్లిపోతాడు.
బాలుకి మీనా డబ్బు.. వద్దని మొండికేసిన బాలు
తర్వాత వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బు చూస్తాడు బాలు. కేవలం పది వేలే ఉంటాయి. దీంతో మిగిలిన డబ్బు కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మీనా వస్తుంది. తన దగ్గర రూ.40 వేలు ఉన్నాయని, ఇవి ఇవ్వండి అని చెబుతుంది. కానీ బాలు వద్దని వారిస్తాడు. నీ డబ్బు అవసరం లేదంటాడు. నీ డబ్బు, నా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని మీనా అంటుంది.
సుమతి పెళ్లి విషయంలో మీ నిర్ణయాలు, నా అభిప్రాయాలు వేరు అని తెలియలేదా.. ఇదీ అలాగే అని అంటాడు బాలు. మీ నిర్ణయాన్ని గౌరవించకపోతే మీ అభిప్రాయం కోసం ఎందుకు వేచి చూస్తారు అని మీనా అడుగుతుంది. కానీ బాలు మాత్రం వినడు. పూల ఆర్డర్ అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బు మళ్లీ వాటిని కొనడానికి ఎక్కడి నుంచి తెస్తావ్.. మరొకరి దగ్గర తీసుకోవాలి.. అయినా కోడళ్ల డబ్బు నాన్న వద్దన్నాడంటూ బాలు వెళ్లిపోతాడు.
రవికి శృతి డబ్బు.. నీతూకి షాకిచ్చి..
అటు రెస్టారెంట్ లో నీతూతో మాట్లాడుతుండగా శృతి వెళ్తుంది. బయటే ఉండి రవికి ఫోన్ చేస్తుంది. సాయంత్రంలోగా డబ్బు ఇవ్వాలి.. నీ దగ్గర ఉన్నాయా అని అడుగుతుంది. తన దగ్గర రూ.15 వేలు ఉన్నాయి.. మిగిలిన డబ్బు నీతూని అడుగుదామని అనుకుంటున్నానని చెబుతాడు. దానిని ఏంటి అడిగేది.. ఇప్పటికే ఓనర్ అని బిల్డప్ ఇస్తోంది.. అవసరం లేదు.. నా దగ్గర రూ.35 వేలు ఉన్నాయి.. ఇవి ఇచ్చెయ్ అని శృతి అంటే రవి వద్దంటాడు. కానీ శృతి బలవంతంగా డబ్బు చేతుల్లో పెడుతుంది.
తాను వెళ్లాలని కంగారు పడుతుంటే.. ఇందుకే మనం సొంతంగా రెస్టారెంట్ పెడదామన్నాను.. మన రెస్టారెంట్ ఉంటే ఈ పరిస్థితి రాదు కదా అని శృతి అంటుంది. మళ్లీ ఆ టాపిక్ వద్దని చెప్పి రవి వెళ్లిపోతాడు. అప్పుడే నీతూ వచ్చి శృతిని రెస్టారెంట్ గురించి అడుగుతుంది. రవి ఇప్పటికే ఒప్పుకున్నాడని, రెస్టారెంట్ పెడుతున్నామని శృతి కావాలని అబద్ధం చెబుతుంది. దీంతో నీతూ టెన్షన్ పడుతుంది. రవికి ఏదైనా మంచి రెస్పాన్సబిలిటీ ఇవ్వాలని అనుకుంటుంది.
డబ్బు కోసం బాలు తంటాలు.. రాజేష్ ద్వారా మీనా సాయం
మరోవైపు మిగిలిన డబ్బు కోసం బాలు తంటాలు పడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్ కు ఫోన్ చేసినా ఫలితం ఉండదు. అప్పుడే రాజేష్ వస్తాడు. ఏమైందని అడుగుతాడు. జరిగిన విషయం చెబుతాడు. దీంతో రాజేష్ తన దగ్గర ఉన్న రూ.40 వేలు ఇస్తాడు.
ఇంత డబ్బు ఎక్కడిది అని అడిగితే.. నీకో డ్రైవింగ్ స్కూలు ఉంది.. మరో కారు కూడా ఉంది.. అది నేను నడుపుతున్నాను.. ఆ డబ్బు వస్తుందని మరచిపోయావా అని రాజేష్ అంటాడు. కానీ ఆ డబ్బు ఇస్తున్న సమయంలో మీనా పక్కనే ఉండి చూడటం చూస్తుంటే.. అది మీనా ఇచ్చిన డబ్బే అని స్పష్టమవుతుంది.
బాలు, మీనా మళ్లీ గొడవ
అటు సుమతి పెళ్లి విషయంలో బాలు, మీనా మరోసారి గొడవ పడతారు. సుమతి కోసం బాలు మరో సంబంధం తీసుకురావడం, మీనా వద్దని వారించడం, అరుణ్ తో మన గొడవల వల్ల సుమతి జీవితాన్ని నాశనం చేయొద్దని స్పష్టం చేస్తుంది. కానీ సుమతికి తాను తీసుకొచ్చిన వాడితోనే పెళ్లి చేస్తానని బాలు తేల్చి చెబుతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


