Gunde Ninda Gudi Gantalu Today Episode: భర్తకు మహేశ్వరిని ఎరగా వేసిన రోహిణి- బాలుకు చింతామణి లెటర్- సత్యం ఉంగరం తాకట్టు

Gunde Ninda Gudi Gantalu Serial November 17th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 17వ తేది ఎపిసోడ్‌లో మౌనికలాగే నీ జీవితం కాకూడదనే ఆయన అంతగా ఆలోచిస్తున్నారని సుమతితో మీనా అంటుంది. సుమతి వెళ్లి అరుణ్‌ను వదిలేయమని, పెళ్లి జరగదని చెబుతుంది. 6 నెలల్లో మనోజ్‌ను దక్కించుకుంటానని రోహిణి అంటుంది.

Published on: Nov 17, 2026, 07:31:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సుమతి హాస్పిటల్‌కు వెళ్తుంది. అరుణ్ చూస్తుండగానే బాలు, మీనా ఉండటం వల్ల పట్టించుకోకుండా ఆటోలో సుమతి వెళ్తుంది. బాలు, మీనా వెళ్లిపోతారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 17 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 17 ఎపిసోడ్

మహేశ్వరిని మహేశ్‌గా మార్చిన రోహిణి

మరోవైపు రోహిణి తన ఫ్రెండ్ మహేశ్ అంటూ మహేశ్వరిని కలుస్తుంది. హగ్ చేసుకుంటుంది. నా జెండర్ మార్చేసి మహేశ్.. మహేశ్ అని చంపేస్తున్నావ్. నీ వల్ల నా పేరు మహేశ్వరి అనే మర్చిపోయాను. ఏమైంది. దేనికి ఇదంతా అని రోహిణి ఫ్రెండ్ అంటుంది. నా కాపురం కోసం. మనోజ్‌ను దగ్గరికి మా అత్త రానివ్వట్లేదు. నేను మార్చాల్సింది అత్తను కాదు మనోజ్‌ను. అందుకే మనోజ్ పొసెసివ్‌నెస్‌ని అడ్డంపెట్టుకుని దారి తప్పుతున్నట్లు నాటకం ఆడుతున్నాను అని రోహిణి అంటుంది.

ఏ మగాడు ఇంకో మగాడితో తన భార్య ప్రేమగా ఉండాలనుకోడు. నా వల్లే ఇలా చేస్తుందనుకోవాలి. మా అత్తలాంటి కుళ్లుబోతు అత్తల దగ్గర ఇలాగే ఉండాలి. నాకోసం నేను ఆడుతున్న ఈ నాటకంలో ఆరు నెలలు మహేశ్‌లా ఉంటావుగా అని రోహిణి అడుగుతుంది. తప్పకుండా నా ఫుల్ సపోర్ట్ నీకిస్తానని మహేశ్వరి అంటుంది. ఈ 6 నెలల్లో మనోజ్ నాకు కచ్చితంగా దగ్గరవుతాడు. నా కొడుకు చింటూను కూడా మనోజ్‌కి దగ్గర చేస్తానని రోహిణి టార్గెట్ పెట్టుకుంటుంది. అలా మహేశ్వరిని భర్త మనోజ్‌కి ఎరగా వాడుతుంది రోహిణి.

ఈరోజుల్లో ఇలా రివర్స్ గేర్ వేస్తేనే మనుషులు మాట వింటారని రోహిణి అంటే.. సరేనే నువ్వు చేసే యాగంలో నేను ప్రమిదనవుతాను అని మహేశ్వరి అంటుంది. మరోవైపు సుమతి, అరుణ్‌ల గురించి మాట్లాడుకుంటారు పార్వతి, మీనా. అల్లుడుని కాదని నేను ఏ నిర్ణయం తీసుకోలేను. కానీ దాన్ని చూస్తే బాధగా ఉందే అని పార్వతి అంటుంది.

మౌనిక పరిస్థితి రాకూడదనే

సుమతి దగ్గరికి వెళ్లి మీనా మాట్లాడుతుంది. అరుణ్ వల్ల ఆయన ఎంత ఇబ్బందిపడ్డారో నేను కళ్లారా చూశాను. అందుకే ఆయన నమ్మట్లేదని మీనా అంటుంది. కానీ, వాళ్ల గొడవలకు నాకు సంబంధం ఏంటక్క అని సుమతి అంటుంది. ఉంది. తనమీద కోపంతో నిన్ను ఎక్కడ బాధపెడతాడో అని అనుకుంటున్నారు. ఇప్పటికే సంజు వల్ల మౌనిక ఎంత ఇబ్బందిపడుతుందో తెలుసు కదా. అలాంటి పరిస్థితి నీకు రాకూడదని ఆయన కోరుకుంటున్నారు. నేను కూడా పూర్తిగా కాదనలేకపోతున్నా అని మీనా అంటుంది.

అల్లుడి మాట కాదని ఈ పెళ్లి ఒప్పుకుంటే మనందరిని దూరం పెట్టేస్తాడేమోనే. నా వల్ల మీ ఇద్దరికి గొడవలు రావడం నాకు ఇష్టం లేదే అని పార్వతి అంటుంది. ఆయనతో నేను బాగానే ఉంటాను. నువ్వు సుమతి గురించి ఆలోచించమని మీనా అంటుంది. ఎవరిని నొప్పించకుండా ఈ పెళ్లి చేసేది ఎలాగా అని పార్వతి అంటుంది. నా మంచి కోసమే అంటున్నారు. కానీ నా మనసు అర్థం చేసుకోవట్లేదు. నేనే ఏదోక నిర్ణయం తీసుకోవాలని సుమతి అనుకుంటుంది.

అరుణ్ ఇంటికి వెళ్తుంది సుమతి. అరుణ్‌తో మాట్లాడుతుంది. ఇన్ని రోజులకా చూడాలనిపించిందా అని అరుణ్ అంటే.. ఆఖరి సారి చూడాలనిపించిందని సుమతి అంటుంది. మన పెళ్లి ఎవరికి ఇష్టం లేదు. మా బాధ్యతలను మా బావే మోస్తున్నాడు. ఆయన్ను కాదని ఈ పెళ్లి చేసుకోలేను. మన పెళ్లి వల్ల మా కుటుంబాల్లో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. అందుకే మనం విడిపోవాలి సుమతి అంటుంది.

అరుణ్ ప్రేమను త్యాగం చేసిన సుమతి

నా వల్ల కాదని అరుణ్ అంటాడు. ఇక మనం ఏం చేయలేం. ఇక నాతో మాట్లాడాలని ప్రయత్నించకు. మనం కలిశామని తెలిస్తే మళ్లీ మా బావకు కోపం వస్తుంది. మరో గొడవ మొదలవుతుంది. ఇక భరించడం నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను వదిలేయి అని సుమతి అంటుంది. చేయి పట్టుకుని అరుణ్ బతిమిలాడుతాడు. నా కుటుంబం కోసం తప్పట్లేదు. నీకు ఎన్నో మాటలు చెప్పి వదిలేస్తున్నందుకు నన్ను క్షమించు. నిన్ను బాధపెట్టడం తప్పా నాకు ఇంకో మార్గం కనిపించట్లేదు. నన్ను వదిలేసేయ్ అని సుమతి ఏడుస్తూ వెళ్లిపోతుంది.

అరుణ్‌ను ఏమైందని అడుగుతుంది తల్లి. సుమతి చెప్పింది చెబుతాడు అరుణ్. మరోవైపు సుమతి బయటకు వెళ్లిందని తెలియడంతో పార్వతి కంగారుపడుతుంది. ఇంతలో సుమతి వస్తే ఎక్కడికి వెళ్లావని నిలదీస్తుంది. అరుణ్ ఇంటికి వెళ్లాలని, వాళ్లతో పెళ్లి జరగదని చెప్పాను. ఇకపై వాళ్లతో ఎలాంటి సమస్య లేదని సుమతి అంటుంది.

చేశావులే పెద్ద ఘనకార్యం. శివ చూస్తున్నాడు తిను అంటుంది పార్వతి. నాకు ఆకలిగా లేదు మీరు తినండి. మీ సమస్య నా పెళ్లేగా. అతనితో జరగదని చెబుతున్నాగా. నన్ను వదిలేయండని లోపలికి వెళ్తుంది సుమతి. సుమతి బాధ చూసి అరుణ్‌తో పెళ్లి చేస్తే తర్వాత అతని వల్ల ఏమైనా ఇబ్బంది అయితే బాధపడేది మీ బావేరా. పోనీలే మంచే జరిగింది. నాలుగు రోజులు పోతే దాని బాధ పోతుంది. బావ మంచి సంబంధం చూస్తాడని పార్వతి అంటుంది.

సుమతి తప్పు చేసింది

అక్క తనకంటూ ఏది ఆశపడలేదు. మొదటిసారి ఆశపడింది ఇదే అని శివ అంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నోళ్లు సంతోషంగా ఉన్నారా. మీ అక్క బావకు ముందు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో. సుమతి కూడా అలాగే ఉంటుందని పార్వతి అంటుంది. అరుణ్ ప్రేమలో నిజాయితీ ఉంటే బావ ఒప్పుకునేలా చేయమని మనసులో దేవుడుని కోరుకుంటాడు శివ.

మరోవైపు రాత్రి బాలు కారు కడుగుతుంటాడు. ఇంతలో శివ వస్తాడు. సుమతి తప్పు చేసిందక్కా. తను అరుణ్ దగ్గరికి వెళ్లి మా బావ ఈ పెళ్లికి ఒప్పుకోడు. ఇక నన్ను మర్చిపో అని చెప్పేసిందట అని శివ అంటాడు. దాంతో బాలు సుమతిని మెచ్చుకుంటాడు. ఇంగ్లీషులో మాట్లాడుతాడు. మీనా కోప్పడుతుంది. సుమతి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుందని శివ అంటాడు.

సుమతి మనసును అర్థం చేసుకో బావ. తనకు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసు. ఎవరు ఎలాంటివాళ్లో తెలుసు. అరుణ్‌ను ఒకటికి పదిసార్లు ఆలోచించింది. నువ్వు ఒక్కడివి ఒప్పుకుంటే తను ప్రేమించిన అతనితో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుందని శివ అంటుంది. అందరు నా మీద పడతారేంట్రా. నేనేదే మూర్ఖుడిలా చూస్తున్నారు. సుమతికి మంచి సంబంధం తెస్తానంటున్నానుగా అని బాలు అంటాడు.

అరుణ్‌తో కారు కడిగిస్తుంది

మీరు సుమతి గురించి ఎక్కువ భయపడుతున్నారు అని మీనా అంటుంది. నువ్వు సరే అంటే సుమతి సంతోషంతో ఎగిరి గంతేస్తుంది. ఇది నువ్వు తనకిచ్చే అతిపెద్ద బహుమతి అవుతుంది బావ అని శివ ప్రాధేయపడతాడు. కృతజ్ఞతగా ఏదో ఒకరోజు అరుణ్‌తో మీ కారు కడిగిస్తుందని మీనా అంటుంది.

వాడు మంచోడు కాదని ఎంత చెప్పిన ఒప్పుకోవట్లేదు. సుమతి ఇప్పటి సంతోషం కోసమే ఆలోచిస్తున్నారు. జీవితాంతం బాధపడకూడదని నేను ఆలోచిస్తున్నాను. అది మీకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీకు నచ్చినట్లు చేసుకోండని బాలు కోపంగా వెళ్తాడు. సుమతికి ఇది చెప్పకు. ఏం చేయాలో ఆలోచిద్దామని శివతో మీనా అంటుంది.

మరోవైపు నాలాంటి యూత్ కష్టపడి సంపాదించుకుంటుంటే నేను మాత్రం అక్క తిట్టే తిట్లతో నన్ను నేనే అసహ్యించుకునేలా బతుకుతున్నా. ఎన్నాళ్లీ ఈ బ్రతుకు. ఈ సమాజం నన్ను మగాడిలా గుర్తించడానికి నాకు ఏ పని దొరకట్లేదు. ఒకే ఒక్క పని నాకు ఇవ్వు. నేనేంటో చూపిస్తానని దేవుడిని కోరుకుంటాడు చింతామణి అసిస్టెంట్. ఇంతలో చింతామణి వచ్చి సౌండ్ చేస్తుంది.

బాలుకు చింతామణి లెటర్

ఏంటక్కా ప్రమోషనా అని అతనంటే.. నువ్వు డిప్యూటీ సీఎం కదరా సీఎంగా ప్రమోషన్ అని చింతామణి వెటకారంగా అంటుంది. నీకు పనిలేదని ఫీల్ అవుతున్నావుగా. నీకు కొత్త పని తీసుకొచ్చాను అని చెప్పి తను రాసిన లెటర్‌ను బాలుకు ఇవ్వమని పంపిస్తుంది చింతామణి. ఆ లెటర్ బాలుకు ఇస్తాడు అసిస్టెంట్. అది చదివి కోపంగా మడతపెట్టి అసిస్టెంట్ నోట్లో కుక్కి పంపిస్తాడు బాలు.

6 నెలల్లో అసలు కట్టకపోతే కోర్టు ఊరుకోదని మీనా అంటుంది. ఈ ఉంగరం తాకట్టు పెట్టి ఎంతొస్తే అంత తీసుకురా అని సత్యం అంటాడు. ముగ్గురం ఉన్నాం. తలా 50 వేలు తీసుకొచ్చి లక్షా 50 వేలు వడ్డీ కడదామని బాలు అంటాడు. నువ్వే కట్టుకో. నాకేం సంబంధం లేదని చేతులెత్తేస్తాడు మనోజ్. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More