Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతి కరివేపాకు గొడవ- సీఐకి నిజం చెప్పిన కానిస్టేబుల్, కూతురు-బుక్కయిన రోహిణి

Gunde Ninda Gudi Gantalu Serial October 22nd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 22వ తేది ఎపిసోడ్‌లో ప్రభావతి తెమ్మని మనోజ్‌కు చెబుతుంది. బాలు ఖాళీగా ఉన్నాడుగా పంపమని అవమానంగా మాట్లాడుతాడు మనోజ్. పోలీస్ స్టేషన్‌లో సీఐ ముందు బాలు కారు బ్రేకుల్ ఫెయిల్ విషయంపై పంచాయతీ నడుస్తుంది.

Published on: Oct 22, 2026, 07:10:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నిన్ను అడిగినందుకు నా చెప్పులతో నేను కొట్టుకోవాలని ప్రభావతి అంటే.. బయట ఉన్నాయి తీసుకురావాల అని మీనా కౌంటర్ ఇస్తుంది. ఇవాళ నాకు కరివేపాకు పచ్చడి తినాలని ఉందని ప్రభావతి అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 22 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 22 ఎపిసోడ్

ప్రభావతి కరివేపాకు గొడవ

కరివేపాకు లేదు. తీసుకురండని మీనా అంటే.. తీసుకురావడానికి ఎవరున్నారు. అందరూ బిజీనేగా అని ప్రభావతి అంటుంది. నేను కూడా బిజీనే. కరివేపాకు పచ్చడి మీరే చేసుకోండని వంట మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోతుంది మీనా. దాంతో ప్రభావతి ఆపి.. నువ్వు కూడా బిజీనే. కరివేపాకు సంగతి నేను చూసుకుంటా. వంట మాత్రం మధ్యలో వదిలిపెట్టకని అంటుంది ప్రభావతి.

మాటకు మాట సమాధానం ఇవ్వకుంటే వినరుగా అని వంట చేసేందుకు వెళ్తుంది మీనా. మనోజ్ వస్తే.. సంధు చివర కరివేపాకు తీసుకురారా. నాకు కరివేపాకు పచ్చడి తినాలని ఉందని ప్రభావతి బతిమిలాడుకుంటుంది. కానీ, మనోజ్ మాత్రం నేను బిజినెస్ మ్యాన్‌ని. నాకు ఇలాంటి పనులు చెబుతున్నావ్. ఇది నా ప్రెస్టేజ్ విషయం అని అంటాడు.

కన్నతల్లికి కరివేపాకు పచ్చడి తినాలనే కోరిక నెరవేర్చని కొడుకుగా చరిత్రలో మిగిలిపోయినా పర్వాలేదు నేను తేను. అయినా ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్లకు చెప్పొచ్చుగా. బాలుగాడు ఉన్నాడుగా. వాడి లైసెన్స్ లాక్కున్నారుగా అని అవమానంగా మాట్లాడుతాడు మనోజ్. దాంతో కోపంగా మీనా కత్తిపట్టుకుని వస్తుంది. ఏంటో మాట్లాడుతున్నారని మీనా అనడంతో మనోజ్ భయపడి పైకి వెళ్తాడు.

కత్తితో పొడుస్తావా

వీడికి పని చెబితే కత్తితో పొడిచి చంపేస్తావా ఏంటీ అని ప్రభావతి అంటుంది. లేదన్నట్లుగా మీనా అంటుంది. బాలును ప్రభావతి కరివేపాకు తీసుకురమ్మని ఖాళీగా ఉన్నావు కదా అని అంటుంది. నాకు ఏ పని చెప్పకమ్మా అని బాలు డల్‌గా అంటే ప్రభావతి వినదు. గొడవ చేస్తుంది. ఆయన మనసు బాలేదని నీకు, నీ పెద్ద కొడుక్కు అనిపించదా అని మీనా అంటుంది.

ఇంతలో సత్యం వస్తే.. కరివేపాకు గొడవ గురించి చెబుతుంది ప్రభావతి. వాడికి పని చెప్పడం నిజంగా పాపమే. వాడు బాధలో ఉన్నావని కాస్తైనా గుర్తించావా. అసలు వాడిని కొడుకులా చూశావా అని ప్రభావతిని తిడతాడు సత్యం. బాలును ఓదారుస్తాడు. నువ్వు ఏం తప్పు చేశావని తలదించుకున్నావని అంటాడు. అమ్మ అన్నది నిజమేగా. ఖాళీగా ఉన్నానుగా అని బాలు అంటే వంట గదిలోకి బాలును లాక్కెళ్తుంది మీనా.

ప్రభావతి, మనోజ్, రోహిణి అనే మాటల గురించి మాట్లాడుకుంటారు. మీనా కన్నీళ్లుపెట్టుకుంటుంది. ఇక ఈ ఇంట్లో వద్దు అని మీనా అంటే.. వేరే ఇల్లు చూసుకుందామా అని బాలు అంటాడు. కాదు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అడుగుదామని, వాళ్లకు జరిగింది అర్థమయ్యేలా చెప్పి చూద్దామని మీనా అంటుంది. ఇద్దరు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు.

నేను రిటైర్ కాబోతున్నాను

అక్కడ ఉన్న తన కారును చూసుకుని బాలు ఎమోషనల్ అవుతాడు. లోపలికి వెళ్లి అరుణ్ గురించి అడిగితే.. లేడని చెబుతారు. సీఐ గురించి అడిగితే.. వచ్చాక చెబుతామని చెబుతాడు కానిస్టేబుల్. బయట కూర్చుకుంటారు బాలు, మీనా. తన కారుపై ఒకడు పుకిలించి ఉమ్మేస్తే బాలు గొడవ పడతాడు. ఇంతలో కారు తీసుకొచ్చిన కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్‌తో కారుకు బ్రేకులు పడట్లేదని చెప్పిన అరుణ్ సర్ వినలేదని మాట్లాడుతాడు.

ఆ మాటలు విన్న మీనా వెళ్లి అడుగుతుంది. ఇందులో మా ఆయన తప్పు ఏం లేదుగా అని మీనా అంటుంది. నేను రిటైర్ కాబోతున్నాను. నాకు ఏ గొడవ వద్దు. నేను వేరే మాట్లాడుతున్నాను అని కానిస్టేబుల్ అంటాడు. అరుణ్‌తో ఉన్న గొడవ గురించి చెప్పి కావాలనే చేశారంటుంది. బ్రేకులు ఫెయిల్ అయిన విషయం అరుణ్ సర్‌తో చెబితే మా ఆయన కారు మాకొస్తుందని మీనా చేతులతో దండం పెట్టి వేడుకుంటుంది.

అమ్మా నన్ను లాగొద్దు. ఏదైనా ఉంటే అరుణ్ సర్‌తో మాట్లాడుకోండని కానిస్టేబుల్ వెళ్లిపోతాడు. ఇంతలో క్యారేజ్ తీసుకొస్తున్న ఒకావిడ కళ్లు తిరిగి పడిపోతే మీనా పట్టుకుంటుంది. పక్కన కూర్చోబెట్టి నీళ్లు తాగిస్తుంది మీనా. తను ప్రెగ్నెంట్‌గా ఉంటుంది. మీనాకు థ్యాంక్స్ చెబుతుంది. పోలీస్ స్టేషన్‌లో తన తండ్రి పని చేస్తున్నాడని చెబుతుంది ఆమె.

నిజం చెప్పిన కానిస్టేబుల్, కూతురు

ఇంతలో సీఐ రావడంతో మీనా వెళ్లిపోతుంది. సీఐతో మాట్లాడుతారు. నన్ను కావాలనే చంపాలని చూశాడు సర్ అని అరుణ్ అంటాడు. ఇద్దరి మధ్య గొడవ ఉంది కానీ చంపేంత కోపం లేదని మీనా అంటుంది. బాలు ఎంత చెప్పిన ఇది కావాలనే చేశాడని అరుణ్ అంటాడు. ఇతను నా ముందే ఎదురించి మాట్లాడుతున్నాడు. తప్పు చేయట్లేదంటే ఎలా నమ్మాలి. వీడిని జైల్లో వేయండని సీఐ అంటాడు.

ఇంతలో యాక్సిడెంట్ అయిన కానిస్టేబుల్‌ని పిలిచి మీకు నిజం తెలుసుగా. నిరపరాధికి శిక్ష పడేలా చేస్తున్నారు. దయచేసి నిజం చెప్పండని మీనా బతిమిలాడుకుంటుంది. అరుణ్ చెప్పొద్దని సైగ చేస్తాడు. ఇంతలో మీనా సహాయం చేసిన ఆవిడ వచ్చి ఆ అన్నయ్య తప్పేం లేదని అంటుంది. ఈరోజు నేను, నా కడుపులో బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే ఆ అన్నయ్య పెట్టిన బిక్షే. ఇప్పుడు ఆయన భార్య కూడా కాపాడిందని చెబుతుంది.

వీళ్లు ప్రాణాలు నిలబెట్టేవాళ్లు కానీ తీసేవాళ్లు కాదని ఆమె చెబుతుంది. అయితే బాలు కారు బ్రేకులు ఫెయిల్ అయినప్పుడు ఆటో దగ్గర ఉంది తనేనని చెబుతుంది. ఇప్పుడు కూడా నేను నిజం చెప్పకుంటే పాపం అవుతుందని కానిస్టేబుల్ నిజం చెబుతాడు. సర్ ఇతని తప్పు లేదు. అరుణ్ సరే ఇతనిపై తప్పుడు కేసు పెట్టారని యాక్సిడెంట్ గురించి జరిగిన నిజం మొత్తం చెబుతాడు కానిస్టేబుల్.

రోహిణి మెడకు చుట్టుకున్న ప్లాన్

దాంతో అరుణ్‌ను తిట్టి బాలు కారు బాలుకు ఇస్తాడు సీఐ. ఇంటికెళ్లిన బాలు తన కారు ఇచ్చారని. అయితే బ్రేక్ వైర్ కట్ చేయడంతోనే బ్రేకులు ఫెయిల్ అయ్యాయని బాలు చెబుతాడు. మనింట్లోనుంచే తాళాలు బయటకెళ్లాయా అని శ్రుతి అంటుంది. ముందు రోజు రాత్రి అందరి ఇండ్లల్లో కరెంట్ ఉండి మనింట్లోనే లేదు అని మీనా అంటుంది.

అప్పుడు చీకట్లో రోహిణి తగిలి నేను అరిచాను అని మనోజ్ అంటాడు. కచ్చితంగా ఇంట్లోవాళ్లే చేశారని శ్రుతి అంటుంది. గుణ కారు బ్రేకుల ప్లాన్ అటు ఇటు తిరిగి రోహిణి మెడకు చుట్టుకుని బుక్కవుతుంది. అక్కడి నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More