Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌కు 2 తాయిత్తులు- చిన్నపిల్లాడిలా మారిన మనోజ్- మాతాజీ బిందెకు కామాక్షి ఎసరు
Gunde Ninda Gudi Gantalu Serial October 6th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 6వ తేది ఎపిసోడ్‌లో మాతాజీ నుంచి తాయిత్తు తీసుకుని ప్రభావతి వెళ్తుంది. రోహిణి కూడా మాతాజీని కలిసి తల్లికొడులు విడిపోడానికి తాయిత్తు తీసుకుంటుంది. తాయిత్తు కట్టుకుని బాలు మీనాతో రొమాన్స్ చేస్తాడు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో స్వాహా మాతాజీ దగ్గరికి వెళ్లిన ప్రభావతి రోహిణి, మనోజ్ విడిపోయేందుకు తాయిత్తు కావాలంటుంది. దానికి తగినట్లే దొంగ మాతాజీ ఇస్తుంది. సరిగ్గా 9 గంటల 30 నిమిషాలకు కట్టాలని చెబుతుంది.

బిందెతో కొడితే బొందల పడతావ్
కామాక్షి తనకు ఆ బిందే కావాలంటుంది. అమ్మో ఈవిడ నాకే ఎసరు పెట్టేలా ఉందే అని మాతాజీ అనుకుంటుంది. పైకి మాత్రం బిందెతో కొడితే బొందల పడతావ్ అని మాతాజీ అంటుంది. రోజు రోజు కుప్పలుగా డబ్బులు వస్తాయిగా. ఇక్కడ ఉంటే ఏం చేస్తావ్. నాకు ఇస్తే వడ్డీకి తిప్పి చిట్టీలు వేసి పది రెట్లు చేస్తానని కామాక్షి అంటుంది.
అధిక ప్రసంగం అని మాతాజీ అంటుంది. అవన్నీ వద్దుగానీ ఇచ్చిన తాయత్తుకు దక్షిణ దండిగా ఇవ్వండి లేకుంటే తాయత్తు వికటిస్తుందని పక్కనున్న ఆమె చెబుతుంది. దాంతో కామాక్షి బంగారు గాజు బిందెలో వేస్తుంది. నా గాజు అని బాధపడుతుంది కామాక్షి. రోహిణి పీడ విరగడైతే మరో గాజు చేయిస్తానని ప్రభావతి అంటుంది.
నీ డబ్బులు నా దగ్గర ఉన్నాయిగా వాటితో చేయించుకుంటానని కామాక్షి అంటుంది. ప్రభావతి ముందు వెళ్తుంది. రోహిణికి కాల్ చేసి తాయిత్తు గురించి చెప్పి నువ్వు కూడా మాతాజీని కలిసి నీ కాపురం నిలబెట్టుకో అని చెబుతుంది కామాక్షి. రోహిణి థ్యాంక్స్ చెబుతుంది. ఇంట్లో దేవుడి ముందు తాయత్తు పెట్టి రోహిణి పీడ పోవాలని కోరుకుంటుంది ప్రభావతి.
నాన్న కోసమే తాయిత్తు
ఏయ్ అని ప్రభావతి పిలిస్తే మీనా పలకదు. తర్వాత మీనా అని పిలిస్తే వస్తుంది. ఏయ్ అంటే పలకను నాకంటు పేరుందని. మిమ్మల్ని ఓయ్ అని పిలిస్తే సరిపోతుందా అని మీనా కౌంటర్ ఇస్తుంది. దేవుడి ముందు తాయిత్తు పెట్టాను. ఎవరిని ముట్టుకోకు అని అందరికి చెప్పు. ఇక్కడే ఉంటావుగా అందరికి నువ్వే చెప్పు. నేను అలసిపోయాను అని ప్రభావతి వెళ్తుంది.
ఇంతలో బాలు వచ్చి గుడికి వెళ్లాలని చెప్పి ప్రసాదం దేవుడి ముందు పెడుతుంది. బాలు తాయిత్తు చూస్తాడు. అది మీ అమ్మ తెచ్చిందని, ఎవరిని ముట్టుకోకని చెప్పిందని మీనా అంటుంది. నేను ముట్టుకుంటాను. ఇది నాన్న కోసమే తీసుకొచ్చి ఉంటుంది. నేను ఇప్పుడే మా నాన్నకు కడతానని బాలు అంటాడు. మరోవైపు స్వాహా మాతాజీని కలిసిన రోహిణి తన అత్త గురించి చెప్పుకుంటుంది.
మా ఆయన్ను మా అత్త నుంచి దూరం చేయాలి అని రోహిణి అడుగుతుంది. తల్లీకొడుకులను దూరం చేయడం తప్పు తల్లి అని మాతాజీ అంటే.. మరి భార్యాభర్తలను విడదీయాలనుకోవడం తప్పుకాదా అని రోహిణి మాతాజీకి ఎదురు ప్రశ్నిస్తుంది. దాంతో పక్కనున్న ఆవిడ దక్షిణ దండిగా ఇచ్చుకో. అడిగింది నెరవేరుతుందని చెవిలో చెబుతుంది.
మనోజ్ గాడి కోసం తెప్పించా
నా కాపురం కంటే ఏం ఎక్కువ కాదని నోట్ల కట్ట బిందెలో వేస్తుంది. అనుకుంది జరిగితే మరింత డబ్బు ఇస్తానంటుంది రోహిణి. అక్షయ తాయిత్తు ఇవ్వమని అడుగుతుంది మాతాజీ. ఆ తాయిత్తు తీసుకుని ఇది నీ భర్త ఎడమ భుజానికి కట్టు నీపై ప్రేమ పెరిగి తన తల్లిపైన ద్వేషం పెరుగుతుందని మాతాజీ చెబుతుంది. తాయిత్తు తీసుకుని ఇంటికి వెళ్తుంది రోహిణి.
మరోవైపు సత్యంను బాలు పిలుస్తాడు. నాన్నా డాడీ.. డాడీ నాన్న.. అంటూ ఉంటాడు. ఇంతలో సత్యం వస్తాడు. నీ మీద అమ్మకు ప్రేమ ఎక్కువై నీకోసం తాయిత్తు తీసుకొచ్చిందని చెబుతాడు బాలు. మా నాన్న ఆయిరారోగ్యాలతో ఉండాలని తీసుకొచ్చిందని చెబుతాడు బాలు. ఇంతలో ప్రభావతి వచ్చి ఆపండి అంటుంది. ఇది పెళ్లిలో తాళి కట్టేటప్పుడు వినిపిస్తుందిగా. తాయిత్తుకు వినిపిస్తుందేంటీ. ఎవరా అక్కు పక్షి అని బాలు అంటాడు.
ప్రభావతిని చూపిస్తుంది మీనా. అమ్మా పక్షినా అని బాలు అంటాడు. ఈ తాయిత్తు నేను మీకోసం తేలేదు. ఇది నేను మనోజ్ గాడి కోసం తెచ్చానని ప్రభావతి అంటుంది. ఇది మా నాన్నకు మాత్రమే కడతానని బాలు పట్టుపడతాడు. మనోజ్‌కే ఎందుకు కట్టాలని అడుగుతాడు. ఎందుకు కంగారుపడతున్నావని సత్యం అడుగుతాడు.
బుల్లి చెల్లి పుడితే
రవి, శ్రుతి వచ్చి కూడా ఎందుకు అని అడుగుతారు. అంతా నిలదీయడంతో మనోజ్ గాడికి పిల్లలు పుట్టాలని తీసుకొచ్చానని ప్రభావతి అబద్ధం చెబుతుంది. అమ్మో ఇంకా నయం ఇది మా నాన్నకు కట్టలేదు. మాకు బుల్లి చెల్లి పుడితే మన ముగ్గురి కంటే నాన్నే నయం అని బాలు అంటుంటే.. మీనా నోరు మూస్తుంది. రోహిణి అంటే భగ్గుమనే మీరే తాయిత్తు తీసుకొచ్చారా అని మీనా అంటుంది.
అది వేరు ఇది వేరు. పిల్లలు పుడితే అత్తయ్య ఆస్తి రాసిస్తా అన్నారుగా అని ప్రభావతి చెబుతుంది. నేను ఇవన్నీ నమ్మను. అంకుల్‌కి కట్టండి. ఏం జరుగుతుందో చూద్దామని శ్రుతి అంటుంది. సత్యం తలకొట్టుకుంటాడు. మా అమ్మ తల్లి అవుతుంది మా నాన్న ఐదుగురికి తండ్రి అవుతాడు అని బాలు అంటాడు. మీనా నవ్వుతుంది. మీరు నొప్పులు పడుతుంటే చూడాలని ఉంది అత్తయ్య అని మీనా అంటుంది.
నాక్కూడా ఉందని శ్రుతి అంటుంది. మీరు కోడళ్లా కొరివి దెయ్యాలా అని ప్రభావతి అంటుంది. నాకు ఎన్ని తలవంపులు తీసుకొస్తున్నావే.. రేయ్ ఎక్కడుందో అక్కడ పెట్టు అని సత్యం వెళ్లిపోతాడు. మనోజ్ వస్తే బాలు పంచ్‌లు వేస్తాడు. మనోజ్‌ను స్నానం చేసి రా అని ప్రభావతి చెబుతుంది. బాలు పూజా మందిరంలో తాయిత్తు పెడతాడు.
మీనాతో బాలు రొమాన్స్
అమ్మో ఎంత ప్రమాదం తప్పింది. నా కాపురం కూలిపోయేది. అంత స్వాహా మాతాజీనే కాపాడిందని ప్రభావతి అనుకుంటుంది. రాత్రి మీనాను పదే పదే పిలుస్తాడు బాలు. మీనా వస్తుంది. పడకను పూలతో అందంగా రెడీ చేస్తాడు బాలు. మనోజ్‌కేనా పిల్లలు పుట్టేది మనకు వద్దా అని సిగ్గుపడతాడు. మీనా వద్దంటూ కిచెన్‌లోకి వెళ్తుంది.
నీ పని చెబుతానని ప్రభావతి తీసుకొచ్చిన తాయిత్తు కట్టుకుంటాడు బాలు. మెడలో మల్లెపూలు దండ వేసుకుని రొమాంటిక్‌గా మీనాపై పూలు జల్లుతాడు. మరోవైపు మనం కోటీశ్వరులం అయ్యే రోజులు వచ్చాయని చెప్పి మనోజ్‌కు కుడివైపు తాయిత్తు కడుతుంది ప్రభావతి.
చిన్న పిల్లాడిలా మనోజ్
తర్వాత రోహిణి కూడా వచ్చి వరల్డ్‌లోనే రిచ్ పర్సన్ అయ్యేందుకు అని మనోజ్ ఎడమ భుజానికి తాయిత్తు కడుతుంది. రెండు తాయిత్తులు కట్టడంతో మనోజ్‌కు షాక్ తగులుతుంది. చిన్న పిల్లాడిలా మారిపోతాడు మనోజ్. ప్రభావతిని నానమ్మ మా అమ్మ ఏదని అడుగుతాడు. రోహిణిని ఆంటీ నన్ను ఎత్తుకో అంటాడు. మీ తాయిత్తు ఎంత పనిచేసిందో చూశావా అని బాలు అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


