Gunde Ninda Gudi Gantalu Today Episode: తప్పు ఒప్పుకున్న ప్రభావతి- నెరవేరిన మీనా శపథం- మనోజ్‌కు గడ్డిపెట్టిన రోహిణి
Gunde Ninda Gudi Gantalu Serial November 2nd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 2వ తేది ఎపిసోడ్లో అరుణ్‌ను సుమతి కలుస్తుంది. సుమతి ప్రేమించే వ్యక్తిని కలుద్దామని బాలు, మీనా అనుకుంటారు. అమ్మవారి ముందు ఆయుధ పూజ చేసిన తర్వాత మీనాకు బంగారు తాళి కట్టి మళ్లీ పెళ్లి చేసుకుంటాడు బాలు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బాలు, మీనా కారులో వెళ్తుంటారు. సుమతి ఒకరిని ప్రేమిస్తోందని, మా అమ్మకు ఈ విషయం తెలియదు. మనం ఓసారి అతన్ని కలిసి మాట్లాడాలని బాలుకు మీనా చెబుతుంది.

సుమతితో అరుణ్ అబద్ధాలు
అతను ఎలా ఉంటాడో అని బాలు అంటాడు. మరోవైపు అరుణ్ ఇంటికి సుమతి వెళ్తుంది. అరుణ్ చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడని ఆమె అంటుంది. అరుణ్ మళ్లీ సస్పెండ్ చేశారని చెబుతుంది. దాంతో అరుణ్ దగ్గరికి వెళ్లి సుమతి ఓదారుస్తుంది. ఎందుకు సస్పెండ్ చేశారని చేయిపట్టి అడుగుతుంది. నేను కరెక్ట్‌గానే ఉన్నాను. ఏ కారణం లేకుండానే సస్పెండ్ చేశారని అరుణ్ అబద్ధం చెబుతాడు.
ఒకడున్నాడుగా. ఎప్పుడు చూడు వాడు నేను ఉన్నచోటుకే వచ్చి సమస్య చేస్తుంటాడు. ఈసారి కూడా తప్పు వాడిదే. మా ఎస్పీ వాడి మాటలే నమ్మాడని అరుణ్ అంటాడు. ఈ కోపమే మీకు సమస్యలు తెస్తుంది. సస్పెండ్ టైమ్‌ను మంచిగా స్పెండ్ చేయండి, మా అక్క బావను పరిచయం చేస్తానని సుమతి అంటుంది. మరి ఇప్పటికిప్పుడే పరిచయం చేయాలా. సస్పెండ్ అయ్యానని తెలిస్తే తప్పు చేశానని అనుకుంటారు. నా సస్పెన్షన్ ఎత్తేశాకా పోలీస్‌గా హుందాగా వచ్చి మాట్లాడుతాను అని అరుణ్ అంటాడు.
సుమతి లాంటి మంచి అమ్మాయికి మంచి అబ్బాయి దొరకాలి. అసలు అతనిలో ఏం చూసి ప్రేమించిందో అని మరోవైపు మీనాతో బాలు అంటాడు. సుమతి నాకన్న చిన్నదైనా తెలివైనదని మీనా అంటుంది. ఈరోజు నీకు జాతరలో సర్ప్రైజ్ ఉందని బాలు అంటాడు. మరోవైపు మా బావ చాలా మంచోడు. ఇంతమంచిగా ఉంటారా అనిపిస్తుంది అని సుమతి అంటుంది.
మంచి తోడి అల్లుళ్లుగా కలిసి ఉంటాం
మీ బావ మంచోడు అయితే ఇద్దరం తోడి అల్లుళ్లుగా కలిసి ఉంటామని అరుణ్ అంటాడు. మరోవైపు మనోజ్ లక్కీ డ్రా గురించి ఆలోచిస్తాడు. ఆ కారు వస్తే ఇంటిముందు పార్కింగ్ లేదుగా అని ప్రభావతితో మనోజ్ అంటాడు. దాంతో మళ్లీ పార్క్ ఏంట్రా అని బాలు హడావిడి చేస్తాడు. లక్కీ డ్రా గురించి చెబితే శ్రుతి సెటైర్లతో తిడుతుంది. ఎద్దులాగా ఎదగ్గానే సరిపోదు కాస్తా బుద్ధి ఉండాలని శ్రుతి అంటుంది.
ఏయ్ శ్రుతి నోటికి ఎంతొస్తే అంత మాట అంటావా. అత్తయ్య అన్న గౌరవం లేదా అని రోహిణి కోప్పడుతుంది. ఏయ్ శ్రుతి నన్నే అన్నానని చెప్పిందా.. ఆ వంక ఈ వంక పెట్టుకుని నన్ను మచ్చిక చేసుకోవాలని చూస్తే దవడలు వాయించి దివానా కాట్కి వేలాడదీస్తా ఏమనుకున్నావో అని ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది. అందరిని ఆపేసి ఈరోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని బాలు చెబుతాడు.
అంతా రెడీ అయి అమ్మవారి ఉత్సవాలకు వెళ్తారు. అక్కడ సత్యం కుటుంబం అంతా కలిసి సంతోషంగా డ్యాన్స్ చేస్తారు. కారులకు పూజ చేసి సత్యంతో కొబ్బరికాయ కొట్టిస్తాడు బాలు. అమ్మవారి ముందు ఆయుధపూజలో భాగంగా రోహిణి మేకప్ కిట్, రవి కిచెన్ ఐటమ్, మీనా పూలు పెట్టుకెళ్లే డబ్బా పెడతారు. ప్రభావతి ఆయుధం నాలుక బయటకు తీయమని పూజ చేస్తామంటాడు బాలు.
నెరవేరిన మీనా శపథం
నేనేం ఆయుధాల మీద ఆధారపడను. నా బ్రెయినే నా ఆయుధం అని మనోజ్ అంటాడు. పూజ తర్వాత మీనాకు సర్ప్రైజ్ అంటూ బంగారు తాళి చూపిస్తాడు అందరికి. బంగారం గురించి జరిగిన గొడవ అంతా చెప్పి.. రూపాయి రూపాయి కూడబెట్టి ఈ పసుపు తాడు కొన్నానని బాలు చెబుతాడు. ఆరోజు తన భర్త చేయిస్తేనే బంగారం వేసుకుంటానని మీనా శపథం చేసింది. ఈరోజు శపథం నెరవేరిందని శ్రుతి అంటుంది.
అమ్మవారి సాక్షిగా మీనా మెడలో బంగారు తాళి కట్టి మరోసారి పెళ్లి చేసుకుంటాడు బాలు. భర్తను ప్రేమగా చూస్తుంది మీనా. ఆరోజు నేనేదో నోరు జారాను. ఈ గాడిదను తాకట్టుపెట్టుకోరా అంటే.. అమ్మి సచ్చాడు. లేకుంటే ఈరోజు నేనే నీకు బంగారాన్ని ఇచ్చేదాన్ని అని మెల్లిగా తప్పు చేసింది ఒప్పుకున్నట్లుగా ప్రభావతి పశ్చాత్తాపపడుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. అది నేను మర్చిపోయాను అత్తయ్య అని మీనా అంటుంది.
ఇప్పుడైనా తప్పు ఒప్పుకున్నావ్. వాడు చేసిందే మంచి పనేగా అని సత్యం అంటాడు. అవును.. ఎప్పుడో ఏడాదికో మంచి పని చేస్తాడు బండోడు.. అని ప్రభావతి అంటుంది. సత్యం, ప్రభావతి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు బాలు, మీనా. అబ్బో ఒక పుస్తెలతాడుకే ఏదో సాధించినట్లు బిల్డప్ ఇస్తున్నాడని మనోజ్ అంటాడు. శ్రుతి తిట్టబోతుంటే రవి ఆపుతాడు. ఇంతమంది ముందు నిన్ను కొడితే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కూడా నీకు అర్థం కాదని సత్యం అంటాడు.
మనోజ్‌కు గడ్డిపెట్టిన రోహిణి
కనీసం ఒక చీరైనా కొనిపెట్టిన మొహమేనా అది అని శ్రుతి అంటుంది. బాలు కష్టపడిన డబ్బుతో మీనాకోసం బంగారం కొన్నాడు. అది చాలా గ్రేట్. అది ఒప్పుకోవాలి కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు అని రోహిణి కూడా మనోజ్‌కు గడ్డి పెడుతుంది. అందరూ గడ్డి పెట్టారు నాకేం మిగల్లేదని బాలు అంటాడు. అమ్మవారి ముందే పుస్తెలు కుట్టి మెడలో వేసుకోవాలని ప్రభావతి అంటుంది.
మనింట్లో మీకంటే పెద్ద ముత్తయిదువు ఎవరున్నారు. మీ చేత్తోనే పూసలు గుచ్చండని మీనా అంటుంది. ఇంతలో అక్కడికి శోభ వస్తుంది. పిలవని పేరంటానికి వచ్చావేంటని శ్రుతి అంటే.. ఎన్ని చెక్కులు తెచ్చారని బాలు అంటాడు. అమ్మవారి ముందు అంతా సమానమే అలా అనొద్దని సత్యం అంటాడు.
నాకు 50 లక్షలు బాకీ పడ్డారు
మీరున్నారని తెలియదు. నార్మల్‌గా గుడికి వచ్చానని శోభ అంటుంది. తర్వాత చింతామణి వచ్చి మీ అప్పు 50 లక్షలు నేను కట్టానని, అది నాకు బాకీ పడ్డారని, దానికి బదులుగా ఇల్లు నాకు ఇస్తున్నట్లుగా డాక్యుమెంట్స్ మీద సంతకం చేయమని డిమాండ్ చేస్తుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


