Gunde Ninda Gudi Gantalu Today Episode: 50 లక్షలు ఇచ్చిన శోభ- ప్రభావతి ఇల్లు దక్కించుకున్న చింతామణి- హెడ్ చెఫ్‌గా రవి
Gunde Ninda Gudi Gantalu Serial October 29th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 29వ తేది ఎపిసోడ్లో లక్కీ డ్రా పేరు చెప్పి మనోజ్‌కు రూ. 10 వేలు టోకరా వేస్తాడు రాజేష్. శోభ దగ్గరికి వెళ్లిన చింతామణి ప్రభావతి అప్పు చేసిన వీర్రాజును తీసుకెళ్లి ఇల్లు తన పేరు మీదకు రాయించుకుంటుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో బాలు వాళ్లు నిర్వహిస్తున్న దేవి నవరాత్రులకు చందా రాసినవాళ్లకు ప్రైజ్ మనీ ఇస్తున్నామని బాలు చెప్పినట్లుగా ఫోన్లో రాజేష్ చెబుతాడు. మనోజ్ లక్కీ డ్రా తీస్తారా అని అడుగుతాడు.

మనోజ్‌కు లక్కీ డ్రా ఎర
ఫస్ట్ ప్రైజ్ కారు, రెండో ప్రైజ్ 100 గ్రాముల గోల్డ్, మూడో ప్రైజ్ 10 లక్షల క్యాష్ ఇంకా చాలా ఉన్నాయని రాజేష్ చెబుతాడు. స్ల్పిట్ చేసి రాయొచ్చా అని మనోజ్ అడిగితే.. నువ్వు డబ్బు వేస్ట్ చేయను అన్నావుగా అని రాజేష్ అంటాడు. లక్కీ డిప్ ఉందని చెప్పలేదుగా అని రాజేష్ అంటాడు. అయితే మినిమమ్ వెయ్యి రూపాయల చందా రాయాలని రాజేష్ అంటాడు.
అయితే, పది రిసిట్స్ ఇవ్వమని మనోజ్ అంటే.. రూ. 10 వేలు ఇవ్వమని రాజేష్ అంటాడు. అలా మనోజ్‌తో రూ. 10 వేలు టోకరా వేసి చందా రాయిస్తారు బాలు, మనోజ్. పదా లక్కీ డిప్ తీద్దువు అని మనోజ్ అంటే.. ఇవాళ కాదు. చివరి రోజు లక్కీ డ్రా తీస్తామని రాజేష్ అంటాడు. దాంతో నిరాశపడతాడు మనోజ్. మరోవైపు శోభన దగ్గరికి వీర్రాజు అనే ఫైనాన్షియర్‌ను తీసుకెళ్తుంది చింతామణి.
ఇతని దగ్గర ప్రభావతి అప్పు తీసుకుంది. దాని వడ్డీలు పెరిగి పెరిగి ఇప్పుడు రూ. 50 లక్షలు అయింది. ఇప్పుడు ఆవిడ ఒక్కత్తే ఇంత డబ్బు కట్టలేదు. కాబట్టి మిమ్మల్ని అవమానించిన ఇంట్లోనుంచే వాళ్లను పంపిచేద్దాం. ఆ 50 లక్షలు ఇతనికిచ్చి ఆ తాకట్టు మన పేరు మీదకు రాయించుకుంటే వాళ్లందరి జుట్లు మన చేతుల్లో ఉన్నట్లే కదా అని చింతామణి అంటుంది.
చింతామణి పేరు మీదకు ప్రభావతి ఇల్లు
ఆ ఇంట్లో నా కూతురు ఉంది. అది శ్రుతికి తెలిస్తే నన్ను శాశ్వతంగా దూరం పెడుతుందని శోభ అంటుంది. అయితే, అగ్రిమెంట్ నా పేరు మీదకు రాయించుకుంటా. మీరు జరిగిదేంతా వెనుకుండి వాళ్ల పతనాన్ని చూస్తూ ఎంజాయ్ చేయండని చింతామణి అంటుంది. కానీ, ఇతనికి ఇవ్వడానికి ఇప్పటికిప్పుడు 50 లక్షలు ఇవ్వాలంటే అని చింతీ అంటే.. అర్థమైందని చెప్పి రూ. 50 లక్షలు తీసుకొచ్చి వీర్రాజుకు ఇస్తుంది శోభ.
కుటుంబాన్ని వీధినా పడేసేందుకు ఎన్ని దిక్కుమాలిని ప్లాన్స్ వేస్తున్నావ్. ఏదో ఒకరోజు దిక్కుమాలిన చావు చస్తావని మనసులో అనుకుంటాడు అసిస్టెంట్. అతను డబ్బు తీసుకుని అగ్రిమెంట్ మీద సైన్ చేయమని చింతామణికి ఇస్తాడు. చింతామణి సంతకం చేసి అగ్రిమెంట్ తీసుకుంటుంది. ఇకనుంచి ఆ ఇంటి మీద సర్వ హక్కులు మీదే అని వీర్రాజు వెళ్లిపోతాడు.
అంటే ప్రభావతి ఇల్లు హక్కులు చింతామణి పేరు మీదకు రాస్తాడు వీర్రాజు. ఇప్పుడు మనం చేయాల్సిందే ఏంటో చెబుతానని శోభకు ప్లాన్ చెబుతుంది చింతీ. మరోవైపు ఇంటికొస్తారు బాలు వాళ్లు. చాలా టైడ్ అయినట్లు ప్రభావతి అంటే.. శ్రుతి, బాలు సెటైర్లు వేస్తారు. వంట చేయవే అని ప్రభావతి అంటుంది. నేను బయట తీసుకొస్తానని బాలు అంటాడు.
హెడ్ చెఫ్‌గా రవి నమ్మకం
గంట పడుతుంది ఇంట్లోనే సింపుల్‌గా చేయమని మనోజ్ అంటే.. ఉప్మా చేస్తానని శ్రుతి అంటుంది. అంతా భయపడి వద్దంటారు. బాలు ఇలాగే నిష్టగా ఉంటే నీకు అంతా మంచే జరుగుతుందని సత్యం అంటాడు. మరుసటి రోజు అంటే దేవి నవరాత్రుల్లో రెండోరోజు రవ్వ కేసరి, పలిహార చేస్తుంది మీనా. చీర ఏది కట్టుకోవాలని శ్రుతి అడిగితే.. నీలి రంగు చీర అని మీనా చెబుతుంది.
ప్రభావతి వచ్చి తన తెల్ల చీర గురించి అడుగుతుంది. శ్రుతి వచ్చి ఆ చీరను నీలిరంగులో ముంచి ఎండలో ఆరేసానని చెబుతుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. రవి హెడ్ చెఫ్ యూనిఫామ్ ఐరన్ చేస్తాడు. వేరేవాళ్లది ఎందుకు చేస్తున్నావని శ్రుతి అడుగుతుంది. హెడ్ చెఫ్‌గా ప్రమోట్ అవుతానుగా. అందుకే ముందే డ్రెస్ కొని ఐరన్ చేస్తున్నాను. నాకు తప్పా హెడ్ చెఫ్‌గా ఇంకెవరికి ఇస్తారని చాలా నమ్మకంగా అంటాడు రవి.
దీనికే ఇలా అయితే మన సొంత రెస్టారెంట్లో నువ్వే ఓనర్, నువ్వే హెడ్ చెఫ్ అయితే ఎలా ఉంటుందని శ్రుతి అడుగుతుంది. కచ్చితంగా చాలా బాగుంటుందని, హెడ్ చెఫ్ అయితే సేవింగ్స్ పెరుగుతాయ్. అప్పుడు రెస్టారెంట్ పెట్టుకోవచ్చని రవి అంటాడు. ఇద్దరు సంతోషిస్తారు. దేవి నవరాత్రులు నాలుగో రోజుకు వస్తుంది. కట్టె పొంగలి చేయాలని మీనా చెబితే.. కట్టెలు తీసుకొస్తారు శ్రుతి, రోహిణి.
రవిని కట్టేసిన శ్రుతి
ఐదు, ఆరవ రోజుకు వస్తాయి దేవి నవరాత్రులు. అమ్మవారికి ఇష్టమైన పద్మముగ్గు వేస్తుంది మీనా. దాన్ని ఎవరు తొక్కకుండా చూసుకోవాలంటుంది. శ్రుతి చూసుకుంటానంటుంది. ముగ్గుకు కాపల కాస్తుంది శ్రుతి. మీనా, రోహిణి తిరిగి వచ్చేసరికి రవి మూతికి ప్లాస్టర్ వేసి కుర్చీలో కట్టేస్తుంది శ్రుతి. ముగ్గు తొక్కబోయాడని కోప్పడుతుంది శ్రుతి.
రోహిణి, మీనా కట్లు విప్పుతారు. ఏడు, 8 రోజులకు నవరాత్రులు వస్తాయి. బాలు దగ్గరికి వస్తుంటే దూరంగా ఉండమని చెబుతుంది మీనా. ఇవాళ అందరం అమ్మవారి మండపంలో నిద్ర చేయాలని, దాంతో అందరికి మంచి జరుగుతుందని మీనా చెబుతుంది. నాకు చెడు దూరమైతే చాలు అని రోహిణిని అంటుంది ప్రభావతి. రోహిణి పీడ విరగడవ్వాలని గట్టిగా మొక్కుకుంటాను. అప్పుడు నాకు మనోజ్‌కి మంచి జరుగుతుందని ప్రభావతి మనసులో అనుకుంటుంది.
దేవి మండపం దగ్గర అమ్మవారి సమక్షంలో మీనాకు బంగారంతో చేయించిన తాళి కడతాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


