Gunde Ninda Gudi Gantalu Today Episode: నవరాత్రులకు బాలు నిష్ట- శ్రుతిని ఉసిగొలిపిన రోహిణి- పగతో ఒక్కటైన శోభ, చింతామణి

Gunde Ninda Gudi Gantalu Serial October 27th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 27వ తేది ఎపిసోడ్‌లో శోభను మాటలతో అవమానించి వెళ్లగొడతాడు బాలు. పగతో రగిలిపోతుంది శోభ. బాలుపైకి శ్రుతిని రోహిణి ఉసిగొలుపుతుంది. అది రవి చూస్తాడు. అమ్మవారి మండపం పెట్టుకునేందుకు పర్మిషన్ కోసం బాలు వెళ్తాడు.

Published on: Oct 27, 2026, 07:30:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నవరాత్రుల సందర్భంగా సత్యం ఇంట్లోవాళ్లంతా బూజు దులుపుతుంటారు. అక్కడికి వచ్చిన శ్రుతి తల్లి శోభ కూలీల్లాగా పనులేంటని, శ్రుతి పని చేస్తున్నందుకు తిడుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 27 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 27 ఎపిసోడ్

పాలు విరిగిపోయాయి

పూలమ్ముకునే ఇంట్లో పుట్టావా అని మీనాను ఉద్దేశించి, తల్లితండ్రి లేకుండా అనాథలా పెరిగావా అని రోహిణిని కలిపి శ్రుతిని అంటుంది శోభ. చాలా రోజుల తర్వాత వచ్చారు. కూర్చోండి. మీనా కాఫీ పెట్టివ్వమని డైవర్ట్ చేసేందుకు ప్రభావతి అంటుంది. పాలు విరిగిపోయాయని మీనా, గ్యాస్ కూడా అయిపోయిందని రోహిణి అంటారు.

నా కూతురుతో ఎందుకు పని చేయిస్తున్నారని శోభ అంటే.. మేము వద్దాన్నాం. తనే చేస్తానందని సత్యం చెబుతాడు. చేస్తానంటే చేయిస్తారా. ఇంకా కోడళ్లు ఉన్నారుగా. నా కూతురు వాళ్లలా దిక్కుమాలిన ఇంటి నుంచి రాలేదని శోభ అంటుంది. దాంతో బాలు సెటైర్లు వేస్తాడు. కూలీ డబ్బులు మిగిలేందుకు చెక్కులు రాసిస్తుందేమో లేదా తనే బూజు దులిపి పోతుందేమో అని బాలు అంటాడు.

నాకేం కర్మ. బస్సు డ్రైవర్‌గా చేసి రిటైర్డ్ ఖాళీగా ఉన్నా మీ నాన్నతో దుళిపించుకోండని శోభ అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మా నాన్న ఎలా కనిపిస్తున్నారు అని మనోజ్ అరుస్తాడు. మా మావయ్య ఇంటిపెద్ద ఆయనతో ఎలా పని చేయిస్తామని రోహిణి అంటుంది. మమ్మీ నువ్వు వెళ్లిపో. ఇంకా ఒక్క క్షణం ఉన్నా బాలు తరిమేస్తాడు. చాలా పెద్ద తప్పు మాట జారావ్. మా అంకుల్ అందరికి దేవుడితో సమానం అని శ్రుతి అంటుంది.

తండ్రిని చంపి మీనాను కోడలిగా చేసుకున్నాడు

ఏంటే ఈ ఇల్లు పెద్ద గొప్ప. పెద్ద కొడుకు లక్షలు ఎత్తుకెళ్లి నచ్చినదానికి దోచుకెళ్లాడు, పెద్ద కోడలు కోటీశ్వరుల కూతురని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఇక మీనా తండ్రిని మా మావయ్య బస్సుతో గుద్ది చంపి కోడలిగా చేసుకున్నాడు అని శోభ అంటుంది. దాంతో బాలు కోప్పడుతాడు. ప్రభావతి ఆపుతుంది. మీరు ఇలా మాట్లాడటం పద్ధతి కాదు. వెళ్లిపోండని ప్రభావతి అంటుంది.

వెళ్తావా. మెడపట్టి గెంటేయమంటావా అని బాలు అంటాడు. తర్వాత చెబుతా నీ సంగతి అని శోభ వెళ్లిపోతుంది. ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ముందున్న టేబుల్‌ను తంతాడు బాలు. శోభ అన్నమాటల గురించి మాట్లాడుకుంటారు. బాలుకు ఎలాంటి కోపం వస్తుందో అని భయంగా ఉందని మీనా అంటుంది. ఇలా ఆవేశంతో సమస్యలన్నీ తెచ్చుకుంటున్నాడు. ఈ నవరాత్రులు బయటకెళ్లకు అని సత్యం చెబుతాడు.

మా డ్రైవర్ వాళ్లంతా ఆటో స్టాండ్ పక్కన దేవీ విగ్రహం నిలబెడతామని చూస్తున్నారని బాలు అంటాడు. అయితే పూజ చేయండి, నిష్టగా చేయండని మీనా అంటుంది. వీడా.. అయితే బాటిల్ ఎత్తుతాడు, లేదా చేయి ఎత్తుతాడు. రెండు లేకుండా ఎక్కడ ఉంటాడని ప్రభావతి హేళన చేస్తుంది. నేను చేయిస్తానని బాలును దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది మీనా.

నిష్టగాఉంటానని బాలు ప్రమాణం

హారతి వెలిగించి.. ఈ దసరా నవరాత్రులు మందు మానేయ్యాలి, కోపం మానేయాలి. ఏ కారణంగా కూడా ఎవరిపై కోపం తెచ్చుకోకూడదని మీనా చెబుతుంది. దాంతో బాలు సరేనని హారతి ఆర్పేసి ప్రమాణం చేస్తాడు. అంటే, బాలు ఈ నవరాత్రులు నిష్టగా ఉంటానని ప్రామిస్ చేస్తాడు. చూస్తాను అని ప్రభావతి అంటుంది. బాలు అన్న మాటలకు కోపంతో రగిలిపోతుంది శోభ.

కారు నడుపుకునే వాడు నన్ను అన్ని మాటలంటాడా. చేయి ఎత్తుతాడా. వదిలిపెట్టను. అమ్మా నన్ను క్షమించు అని కాళ్లపై పడేలా చేస్తానని శోభ రగిలిపోతుంది. మరోవైపు తల్లి విషయంలో జరిగినదానికి శ్రుతి ఆలోచిస్తుంటుంది. అది చూసిన రోహిణి.. ఇప్పుడు శ్రుతిని రెచ్చగొడితే బాలు మీదకు కోపంగా వెళ్తుందని అనుకుంటుంది.

నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినరోజే నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించాను. ఇది నీ తల్లికి జరిగిన అవమానం కాదు. నీలాంటి నాలాంటి ఆడపిల్లను కన్న తల్లికి జరిగిన అవమానం. ప్రతితల్లికి ఇది ఒక కనువిప్పు. అయినా బాలు నోటికి హద్దు అదుపు ఉండదంటూ పెద్ద పెద్ద మాటలతో శ్రుతిని ఉసిగొలిపేందుకు ట్రై చేస్తుంది రోహిణి.

శ్రుతిని ఉసిగొలిపిన రోహిణి

అప్పుడే వచ్చిన రవి ఆ మాటలు విని శ్రుతికి వదిన ఏదో నూరిపోస్తున్నట్టుందని అనుకుంటాడు. తల్లి లేని నాకే బాలు మాటలు వింటే కడుపు రగిలిపోయింది. బాలు అంటే అందరం పడాల్సిందే. అయినా బాలు అన్ని మాటలు అంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నావ్ అని అడుగుతుంది రోహిణి. నేనెందుకు సైలెంట్‌గా ఉంటాను. మా అమ్మను అంటే ఊరుకుంటానా. నువ్వు నా కళ్లు తెరిచావ్ రోహిణి అని శ్రుతి బయలుదేరుతుంది.

రోహిణి సంతోషిస్తుంది. శ్రుతి ఆగి ఇలా అంటాననుకున్నావుగా రోహిణి అని అంటుంది. ఇదేంటీ శ్రుతి ట్విస్ట్ ఇచ్చిందని రవి అనుకుంటాడు. నా భుజం తట్టి అగ్గిరాజేస్తే నేను రెచ్చిపోయి ఇంటిని తగలబెట్టేస్తా అనుకున్నావా. నీ పాపాలు ఎండగట్టిన బాలుపై పగ తీర్చుకునేందుకు ఇలా చేశావ్. బాలు ఇంకా మా మమ్మీని తక్కువ తిట్టాడని ఫీల్ అవుతున్నా. బాలు అంటుంటే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా అని శ్రుతి అంటుంది.

మా అమ్మ అంటే నాకు ఇష్టమే. అలా అని మావయ్యను అని, చీటికి మాటికి గొడవ పడితే నాకే చిరాకుగా ఉంది. అలాంటిది బాలు ఊరుకుంటాడా. నీ మొగుడిలా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉండలేనుగా అని ఇచ్చిపడేస్తుంది శ్రుతి. రోహిణి చిరాకుగా వెళ్లిపోతుంది. రోహిణి ప్లాన్ ఫెయిల్ చేసినందుకు శ్రుతిని ఎత్తుకుని హగ్ చేసుకుంటాడు రవి.

పది కేసులు పెట్టేవాన్ని

జరిగింది అంతా విన్నది చెబుతాడు. వాళ్లు వీళ్లు చెప్పిన మాటలు వినడానికి నేనేమైనా మనోజ్, ప్రభావతినా అని అంటుంది శ్రుతి. దాంతో రవి భయపడతాడు. ఊరికే అన్నాను అని రవిని హగ్ చేసుకుంటుంది శ్రుతి. మరోవైపు అరుణ్ తన ఫ్రెండ్ ఎస్సై దగ్గరికి వెళ్తాడు. ఇలా నెలకోసారి సస్పెండ్ అయితే ట్రాక్ రికార్డ్ ఏమవుతుంది. ఎవరో పవర్‌ఫుల్ వ్యక్తి కక్ష్య గట్టి ఇరికిస్తున్నాడని ఆ ఎస్సై అంటాడు.

వాడొక సామాన్య క్యాబ్ డ్రైవర్. వాడు చాలా పొగరుబోతు అని అరుణ్ చెబుతాడు. వాడు చేస్తుంటే ఎలా ఊరుకున్నావురా. నేనైతే పది కేసులు పెట్టి పదేళ్లు జైళ్లో పెట్టేవాన్ని అని ఎస్సై అంటాడు. మరోవైపు అదే పోలీస్ స్టేషన్‌కి బాలు, రాజేష్ వస్తారు. అమ్మవారి మండపం పెట్టుకోడానికి పర్మిషన్ కావాలని లెటర్ ఇస్తారు. అది ఎస్సైకి ఇస్తాడు కానిస్టేబుల్.

మన పర్మిషన్ లేకుండా చాలా మంది పెట్టుకుంటున్నారు. వీళ్లు అడుగుతున్నారు ఎవరు వీళ్లు అని ఎస్సై అంటే.. ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ అని కానిస్టేబుల్ చెబుతాడు. దాంతో అరుణ్ బాలును చూస్తాడు. ఎస్సై పర్మిషన్ ఇవ్వబోతుంటే నేను సస్పెండ్ అయినందుకు కారణమైన వాడే వచ్చాడని అరుణ్ చెబుతాడు. సరే నేను చేసుకుంటానని ఎస్సై అంటాడు.

దురుసుగా ప్రవర్తించినందుకు

అరుణ్ పక్కకు వెళ్తాడు. నేను పర్మిషన్ ఇవ్వను. కరెక్టుగా రాయలేదు. ఇవ్వనురా అని రెచ్చగొడతాడు ఎస్సై. దాంతో బాలు కోప్పడుతుంటే రాజేష్ ప్రమాణం గుర్తు చేసి ఆపుతాడు. ఏం చేస్తావురా. నన్ను కుడా సస్పెండ్ చేయిస్తావా. పగ పెంచుకుంటావా. నా బైక్‌ను కూడా కారుతో గుద్దేస్తావా అని ఎస్సై అంటాడు. ఇది అన్యాయం సర్. తప్పు చేసినవాళ్లను సపోర్ట్ చేస్తే ఎలా సర్ అని రాజేష్ అంటాడు.

డ్యూటీలో ఉన్న ఎస్సైపై దురుసుగా ప్రవర్తించినందుకు లోపల వేస్తానని ఎస్సై అంటాడు. బాలు, రాజేష్ బయటకెళ్తారు. అరుణ్ వస్తాడు. బాలు అమ్మవారి మండపం పెట్టుకోడానికి తనే అడ్డుపడినట్లు బాలు ఊహిచడం కరెక్ట్ అని అరుణ్ చెబుతాడు అంటాడు. కానీ, కట్ చేస్తే బాలు వాళ్లు అమ్మవారి విగ్రహం పెట్టుకుంటారు. మరోవైపు శోభను చింతామణి కలుస్తుంది.

బాలుపై పగతో ఒక్కటైన శోభ, చింతామణి

మీకు జరిగిన అవమానం తెలుసు. మీకు జరిగిన అవమానం పోయేలా చేస్తాను. మీకు డీల్ ఓకేనా అని చింతామణి అంటే.. శోభ సరేనంటుంది. బాలుపై పగ తీర్చుకునేందుకు చింతామణి, శోభ ఒక్కటవుతారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More