Gunde Ninda Gudi Gantalu Today Episode: కలిసి తిన్న బాలు, ప్రభావతి- తల్లికొడుకుల ప్రేమ- మీనా తండ్రిని సత్యం చంపాడన్న శోభ

Gunde Ninda Gudi Gantalu Serial October 26th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 26వ తేది ఎపిసోడ్‌లో బాలు కోసం మీనా స్పెషల్‌గా వంటలు చేస్తుంది. ప్రభావతి తినకుండా అలిగి పైన కూర్చుంటుంది. దాంతో తల్లి అలక తీర్చి బాలు, ప్రభావతి కలిసి ప్రేమగా అన్నం తింటారు. మనోజ్‌ను చితకబాదుతుంది ప్రభావతి.

Published on: Oct 26, 2026, 07:15:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు స్నానానికి వెళ్తూ మీనాను రమ్మంటాడు. మిమ్మల్ని నొక్కుతానని మీనా అనడంతో బాలు వెళ్తాడు. బాలు కోసం స్పెషల్‌గా వంటలు చేస్తుంది మీనా. రవి అడిగితే.. బావగారు పెద్ద కేసు నుంచి బయటపడ్డారుగా. అందుకే మా అక్క మా బావగారి కోసం స్పెషల్స్ చేసిందని శ్రుతి అంటుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 26 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 26 ఎపిసోడ్

ఇవన్నీ మింగే పెద్ద బావగారు

వాడేమైనా దేశం కోసం వెళ్లి వచ్చాడా అని మనోజ్ అంటాడు. ఇవన్నీ మింగే పెద్ద బావగారు ఏదో కూస్తున్నారు చూడండని శ్రుతి అంటే.. నోరు అదుపులో పెట్టుకోమని రోహిణి వారిస్తుంది. అక్కా.. పెద్దక్కా.. ఆ ముక్క ముందు మీ భర్తకి చెప్పు అని శ్రుతి అంటుంది. యాక్సిడెంట్ చేసి వచ్చాడని మనోజ్ అంటే.. ఇంతలో బాలు వచ్చి మీరు చేసినదాని గురించి మాట్లాడమంటారా అంటాడు.

నాకు ఆకలేస్తుంది అని డైనింగ్ టేబుల్‌పై కూర్చుని అన్నం పెట్టుకుంటాడు మనోజ్. తినేందుకు ముద్ద పెట్టుకుంటుండగా.. మనోజ్ నోరు బాలు మూస్తాడు. నోటి దూల తగ్గించుకుంటేనే, తనను అన్నందుకు చెంపలు వేసుకుంటేనే తిననిస్తానని బాలు అంటాడు. వాడే వేసుకోవాలా నువ్వు వేయుగా అని రవి అంటే.. మనోజ్‌ చెంపలు వాయిస్తాడు బాలు.

అప్పుడే సత్యం వస్తాడు. మనోజ్ ఆవురావురుమంటూ తింటాడు. అత్తయ్య అలిగి తినకుండా పైకి వెళ్లి కూర్చుందని, కారు తాళాల విషయంలో మీరు అన్నందుకే తినట్లేదని, ఇప్పుడు ప్రేమ పొంగుకొచ్చిందేమో అని మీనా అంటుంది. అది విన్న సత్యం కూడా భార్య తినకుండా ఎలా తినాలని వెళ్లిపోతాడు. మీ అమ్మ తిననంటుందటా. వెళ్లి అడుగురా అని బాలు అంటే.. అలిగింది నీ వల్ల. నువ్వే బతిమిలాడుకో. నేను తినడంలో బిజీగా ఉన్నానని మనోజ్ అంటాడు.

నువ్వు తిడితేనే తిన్నట్టు

పైన ప్రభావతి అలిగి కూర్చుంటుంది. ఇక చేసేదేం లేక బాలు రెండు ప్లేట్లు తీసుకెళ్తాడు. ప్రభావతి తిననంటే రెండు నాకే. మీనా వెరైటీలు చేసింది. కానీ నేను తినాలంటే నువ్వు తిట్టాలి. నువ్వు తిడితేనే నాకు తిన్నట్టు ఉంటుందని బాలు అంటాడు. ఇంతలో మనోజ్ వచ్చి అమ్మ వంటలు చాలా బాగున్నాయని అంటాడు. దాంతో మనోజ్‌ను చితకబాదుతుంది ప్రభావతి.

ఈ అలక ఏంటీ ప్రభా అని సత్యం అంటే.. వీడు నన్ను కారు బ్రేకులు తీయించానని అంటాడా. నన్నే అనుమానిస్తున్నాడా అని ప్రభావతి అంటుంది. చింతీతో కలిసి మరి అని శ్రుతి అంటే.. అగ్గిలో ఆజ్యం పోయకమ్మా అని బాలు అంటాడు. నాకు వెనుక గోతులు తీయడం తెలియదు. ఇప్పటివరకు ఎవరు నన్ను అనలేదని ప్రభావతి అంటుంది.

నా భార్యను ఎందుకు బాధపెడుతున్నావని సత్యం అంటాడు. మీనా వండిన వంటను పొగుడుతూ ఇది అమ్మ ముద్ద అని ప్రభావతికి పెడతాడు బాలు. మీరు తినలేదని మావయ్య గారు తినలేదు. మేము కూడా తినలేదని మీనా అంటుంది. రేయ్ నీ తాయిత్తు తీసి నాన్నకు కడతాను. నాన్న మరోసారి తండ్రి అవుతాడు అని బాలు అంటాడు.

బాలు, ప్రభావతి ప్రేమ

మీరు నొప్పులు పడుతుంటే చూడాలని ఉందని మీనా అంటుంది. మనకు బుజ్జి మరిది పుట్టుకొస్తాడా అని శ్రుతి అంటుంది. మనోజ్ తల మీద చేయి పెట్టి అమ్మా నువ్వు అన్నం తినకుంటే వీడు పూర్తిగా దివాలు తీస్తాడు. పార్కులో తిడుతూ గుడి దగ్గర అడుక్కుంటాడని బాలు అంటాడు. దాంతో ప్రభావతి అన్నం తింటుంది. ఒక్కో ముద్ద ఒక్కొక్కరి ముద్దగా చెబుతాడు బాలు.

ప్రభావతికి పొలమారితే నీళ్లు ఇస్తాడు బాలు. అలా తల్లికొడుకులు బాలు, ప్రభావతి అన్నం తింటారు. ఈ కర్రీ బాగుంది తిను అంటూ ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ తింటూ ఉండటం అంతా చూసి ఆనందిస్తారు. ఈ సీన్ చూసేందుకు చాలా బాగుంటుంది. మరుసటి రోజు ఉదయం ఇల్లంతా క్లీన్ చేస్తుంటారు.

సత్యం వచ్చి అడిగితే.. దసరా నవరాత్రులు కదా అందుకే దుమ్ము దుళుపుతున్నామని మీనా చెబుతుంది. శ్రుతి వచ్చి కూడా బూజు దుళుపుతానంటుంది. అంతా వద్దంటారు. అయినా శ్రుతి వినదు. తలపాగా కట్టుకుని బూజు దుళుపుతుంది. ఇంతలో మనోజ్, రోహిణి వస్తారు. మనోజ్ పని చేయనంటే రోహిణి చేస్తానంటుంది. బండెడు బట్టలు ఉన్నాయి ఉతకమని శ్రుతి చెబుతుంది.

డబ్బులు దండగ ఎందుకండీ

ఇల్లు దుళిపించడానికి పనోళ్లను పెట్టారా. ఎందుకండీ డబ్బులు దండగ. బాలు, మీనా ఉన్నారుగా అని ప్రభావతి అంటుంది. దాంతో గొడవ పడతాడు బాలు. ప్రభావతికి చీపురు ఇచ్చి క్లీన్ చేయమని మీనా అంటుంది. సత్యం కూడా చేయమంటాడు. మనోజ్ పని చేయడం చూసి వీడెవడు ఇలా చేస్తున్నాడని తిడుతుంది. ఇల్లు తుడు లేకుంటే బాత్రూమ్ క్లీన్ చేయిస్తానని సత్యం అంటాడు.

శ్రుతి పైకి వెళ్తుంది. బాలు చెత్త డబ్బా తీసుకొస్తూ కిందపడేస్తాడు. దాంతో ప్రభావతి ఇదంతా ఊడాలా అని షాక్ అవుతుంది. చెత్త డబ్బాలో ప్రభావతి ఎత్తుతుంటే కింద పడేస్తూ బాలు ఆడుకుంటాడు. ఇంతలో శ్రుతి తల్లి శోభ వచ్చి ఇంతమంది కూలీలను పెట్టుకున్నారా అని అడుగుతుంది. అంతా మాస్కులు తీస్తారు.

మీకేం కర్మ అండి కూలీలను పెట్టుకోవచ్చుగా అని ప్రభావతితో శోభ అంటుంది. మా ఇల్లు మేము దుళుపుకుంటే మీకేంటీ నొప్పి చిక్కుల శోభ గారు అని బాలు అంటాడు. ఇంతలో శ్రుతి కూడా కూలీలాగా వస్తుంది. అది చూసి శోభ షాక్ అవుతుంది. శ్రుతిని తిడుతుంది. ఇంటికొచ్చి కూలీలాగా బూజు దులుపుతావా. నువ్వేమైనా పూలమ్ముకునేవాళ్ల ఇంట్లో పుట్టావా అని శోభ అంటుంది.

మీనా తండ్రిని చంపి కోడలిగా చేసుకున్నాడు

మీరు కూడా దుళపండని బాలు అంటాడు. రిటైర్డ్ అయి ఖాళీగా ఉన్న మీ నాన్నతో ఇలాంటివి చేయించుకోండి. ఆయనేమైనా గొప్ప. ఈ మీనా తండ్రిని బస్సుతో గుద్ది చంపి అందుకు బదులుగా మీనాను కోడలిగా చేసుకున్నాడు అని శోభ అంటుంది. దాంతో శోభను గెంటేస్తానని బాలు కోపంగా అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More