Gunde Ninda Gudi Gantalu Today Episode: మందు కొట్టి మొగుళ్లతో ఆడుకున్న పెళ్లాలు.. నీతూ పార్ట్‌నర్‌గా రవి.. తగ్గని బాలు

Gunde Ninda Gudi Gantalu Serial November 19th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 19 ఎపిసోడ్ లో మొగుళ్లతో పెళ్లాలు ఆడుకుంటారు. మందు కొట్టినట్లు నటించి బీర్ బాటిళ్లతో రచ్చ చేస్తారు. అటు శృతి దెబ్బకు నీతూ దిగి వచ్చి రవిని బిజినెస్ పార్ట్‌నర్ గా చేసుకుంటుంది.

Published on: Nov 19, 2026, 06:58:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో జంబలకిడి పంబ సీన్ కనిపిస్తుంది. మొగుళ్లు పెళ్లాలుగా.. పెళ్లాలు మొగుళ్లుగా మారిపోతారు. అయితే బాలు, మీనా మధ్య మాత్రం సుమతి విషయంలో గొడవ ముదురుతూనే ఉంటుంది. అటు శృతి జీవితంలో నీతూ మరో చిచ్చు పెడుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 19 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 19 ఎపిసోడ్

రాజేష్‌కు మీనా థ్యాంక్స్

బాలుకి రాజేష్ డబ్బు ఇచ్చే సీన్ తో సీరియల్ గురువారం (నవంబర్ 19) ఎపిసోడ్ మొదలైంది. మీనా ఇచ్చిన డబ్బునే బాలుకి రాజేష్ ఇస్తాడు. దీంతో బాలు అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత మీనా కూడా రాజేష్ కు థ్యాంక్స్ చెబుతుంది. నీ డబ్బే ఇచ్చి నాకు థ్యాంక్స్ చెబుతావేంటని రాజేష్ అంటాడు.

నా దగ్గర తీసుకోవడం లేదని, అందుకే మీ ద్వారా ఇచ్చానని మీనా చెబుతుంది. ఒకప్పుడు శివ విషయంలో మీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది.. ఇప్పుడు సుమతి విషయంలో జరిగేలా ఉంది.. అందుకే నీ దగ్గర డబ్బు తీసుకోవడం లేదు.. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు.. అని మీనాను రాజేష్ హెచ్చరిస్తాడు.

మందు కొట్టినట్లు మొగుళ్లతో ఆడుకున్న పెళ్లాలు

ఆ తర్వాత ఇంటి డాబాపై బీర్ బాటిల్స్ ముందు పెట్టుకొని ముగ్గురు పెళ్లాలు రచ్చ చేస్తారు. పీకలదాకా మందు కొట్టినట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మేడ మీదికి వచ్చిన బాలు, రవి, మనోజ్ వాళ్లను చూసి షాక్ తింటారు. మీరు మందు కొడితే తప్పు లేదు కానీ మేము కొట్టొద్దా అని నిలదీస్తారు. స్వాహా రావ్.. నాకు మందులోకి మంచింగ్ కోసం చికెన్ తీసుకురా అని మనోజ్ ను రోహిణి అంటుంది.

అది విని అందరూ షాకవుతారు. నువ్వు అన్నీ మింగుతావు కదా.. అందుకే ఆ పేరు అని రోహిణి చెబుతుంది. రవికి ఆమ్లెట్లు వేసుకొని రావాలని శృతి ఆర్డర్ వేస్తుంది. అయితే ఇదంతా నాటకమని, తాము నిజంగా మందు కొట్టలేదని, మీరు తాగి పడేసిన బీరు బాటిల్స్ ముందేసుకున్నామని మీనా చెబుతుంది. దీంతో ముగ్గురూ వెళ్లిపోతారు.

డబ్బు గురించి మీనా, శృతి, రోహిణి మీటింగ్.. అత్తకు షాకిచ్చిన కోడళ్లు

వాళ్లు వెళ్లిన తర్వాత డబ్బు గురించి మీనా, శృతి, రోహిణి మాట్లాడుకుంటారు. తాను డబ్బు ఇస్తే బాలు తీసుకోలేదని, అందుకే రాజేష్ ద్వారా ఇప్పించాలన్న శృతి ప్లాన్ ను తాను అమలు చేసినట్లు మీనా చెబుతుంది. శృతికి థ్యాంక్స్ చెబుతుంది. అటు రవి దగ్గర కూడా కేవలం రూ.15 వేలే ఉన్నాయని, తానే రూ.35 వేలు ఇచ్చానని శృతి అంటుంది.

మీ మొగుళ్లు డబ్బు ఇచ్చినా తీసుకోవడానికి వెనుకడుతారు.. నా ఖర్మ.. నా మొగుడు నువ్వు తప్ప వేరే దిక్కులేదని నా దగ్గరే మొత్తం రూ.50 వేలు తీసుకున్నాడని రోహిణి తన బాధ చెప్పుకుంటుంది. దీంతో ముగ్గురూ గట్టిగా నవ్వుతారు. అది విని కోడళ్లు తన గురించే మాట్లాడుకుంటున్నారేమో అని ప్రభావతి మేడపైకి వచ్చి వాళ్ల ముందు మందు బాటిల్స్ చూసి షాకవుతుంది. మీ కొడుకులు తాగి పడేసిన బీర్ బాటిల్స్ లెక్కపెడుతున్నామని శృతి సెటైర్ వేస్తుంది. దీంతో ప్రభావతి వెళ్లిపోతుంది.

కిచెన్‌లో అన్నదమ్ముల మీటింగ్.. లక్షన్నర రెడీ

పైన పెళ్లాలు మొగుళ్లుగా మారడంతో.. ఇటు కిచెన్ లో మొగుళ్లు పెళ్లాలుగా మారిపోతారు. బాలు, మనోజ్ కు రవి కాఫీ పెట్టిస్తాడు. తర్వాత లక్షన్నర గురించి బాలు అడగగా.. రవి, మనోజ్ తీసి తమ వాటాలు ఇస్తారు. మనోజ్ తన డబ్బును మొత్తం రోహిణి దగ్గరే తీసుకోవడంతో తమ్ముళ్లు ఆటపట్టిస్తారు. తిడతారు.

అయితే ప్రతి నెలా ఇలాగే డబ్బు ఇవ్వాలని బాలు స్పష్టం చేస్తాడు. తర్వాత ప్రభావతి కిచెన్ లోకి వచ్చి కొడుకులకు చూసి షాకవుతుంది. మీ పెళ్లాలు పైన ఉంటే.. మీరు కిచెన్ లో ఉన్నారేంటని అడుగుతుంది. నీకూ కాఫీ కావాలా అని రవి అడిగితే.. వద్దులే అని చెప్పి వెళ్లిపోతుంది.

బాలు కొత్త సంబంధాలు.. మీనాతో మళ్లీ గొడవ

మరుసటి రోజు ఉదయం బాలుకి మీనా టిఫిన్ వడ్డిస్తుంది. ఆమె చేసిన ఇడ్లీలను బాలు మెచ్చుకుంటాడు. తర్వాత తన ఫోన్ లో కొందరు అబ్బాయిల ఫొటోలను మీనాకు చూపిస్తాడు. వీళ్లంతా ఎవరు అని అడిగితే.. సుమతి కోసం తీసుకొచ్చిన సంబంధాలు.. వీళ్లు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.. సుమతికి బాగా సూటవుతారు అని బాలు చెబుతాడు.

తనకు ఇష్టం లేని సంబంధం ఎందుకు చేస్తారు.. అలా చేస్తే ఆమె జీవితాంతం సంతోషంగా ఉండదు.. మంచి ఉద్యోగం కాదు.. మనసుకు నచ్చిన వాడు కావాలని మీనా అంటుంది. ఇద్దరూ మాటామాటా అనుకుంటారు.

రవికి సర్ది చెప్పిన మీనా.. రవికి బాలు సపోర్ట్

అప్పుడే రవి వస్తాడు. అతని కళ్లు ఎర్రగా ఉండటంతో రాత్రంతా నిద్రపోలేదా అని బాలు అడుగుతాడు. శృతి రెస్టారెంట్ గురించే మాట్లాడిందని, దీంతో నిద్ర లేదని రవి అంటాడు. దీంతో మీనా ఆమెకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. నీతూ దగ్గర సరైన గౌరవం లేదని శృతి భావిస్తోంది.. అందుకే రెస్టారెంట్ పెట్టమంటోంది.. భర్తకు మంచి గౌరవం ఉండటమే ఏ భార్యయినా కోరుకుంటుంది.. ఆమె నీ మంచి కోసమే చెబుతోంది.. మంచి నిర్ణయం తీసుకో అని మీనా చెబుతుంది.

మంచి నిర్ణయం అంటే ఏంటి.. రెస్టారెంట్ పెట్టాలంటే వాళ్ల అత్తగారి దగ్గర డబ్బు తీసుకోవాలి.. ఇప్పటికే ఆమె మనం ఎక్కడ దొరుకుతామా అని చూస్తోంది.. ఇప్పుడా రిస్క్ తీసుకోవడం కంటే.. ఉన్న రెస్టారెంట్ లో పని చేయడమే మేలు.. నా సపోర్ట్ రవికే అని బాలు స్పష్టం చేస్తాడు. రవి వెళ్లిపోయిన తర్వాత సుమతి విషయంలో బాలు, మీనా మళ్లీ గొడవ పడతారు.

మీరు అందరికీ సపోర్ట్ చేస్తారు.. కానీ సుమతికి ఎందుకు చేయరు.. సుమతి అరుణ్ ను ఇష్టపడుతోంది.. అతడు చాలా మంచోడని చెబుతోంది.. అయినా ఎందుకు వినడం లేదు అని మీనా నిలదీస్తుంది. దీంతో బాలు కోపంతో వాడు మంచోడు కాదని చెబుతున్నా ఎందుకు వినడం లేదు.. మిమ్మల్ని ఒప్పించలేక నా తల పగిలిపోతోంది అంటూ టిఫిన్ చేయకుండానే వెళ్లిపోతాడు.

మనోజ్‌ను మళ్లీ ఏడిపించిన రోహిణి

మరోవైపు మనోజ్ ను రోహిణి మరోసారి ఆడుకుంటుంది. మహేష్ అంటూ తన ఫ్రెండ్ మహేశ్వరికి ఫోన్ చేస్తుంది. చాలా గుర్తొస్తున్నావ్.. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయొచ్చు.. మా ఆయన చాలా మంచోడు.. ఏమీ అనుకోడు.. నాకు కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి.. నువ్వు నా కోసం తెచ్చే లంచ్ గుర్తొస్తోంది అని మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా చాటుగా వింటున్న మనోజ్ కుళ్లుకుంటాడు.

రవికి నీతూ బంపర్ ఆఫర్

అటు శృతి రెస్టారెంట్ ప్లాన్ దెబ్బకు నీతూ దిగి వస్తుంది. నేరుగా ఇంటికే వస్తుంది. రవిని తన బిజినెస్ పార్ట్‌నర్ గా చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పి అగ్రిమెంట్ పై సంతకం చేయమంటుంది. అసలు రవి పెళ్లి చేసుకోకపోయి ఉంటే తానే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెబుతుంది. అది విని శృతికి మండుతుంది. ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చినట్లుందని బాలు అనడంతో శృతి షాకవుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More