Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్‌కు నీతూకి పెళ్లి.. 20 కోట్లు విని ప్రభావతి షాక్.. బాలుకి అరుణ్ క్షమాపణ!
Gunde Ninda Gudi Gantalu Serial November 20 Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 20 ఎపిసోడ్ లో రవితో బిజినెస్ కోసం వచ్చిన నీతూతో మనోజ్ కు పెళ్లి చేయాలని ప్రభావతి అనుకుంటుంది. అయితే ఆమె షాకిచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు అరుణ్ తల్లి మీనా సాయం కోరి వస్తుంది.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం రవి, నీతూ బిజినెస్ డీల్ చుట్టూనే తిరిగింది. శృతి అడ్డుపడుతుందనుకుంటే ఆమె బలవంతంతోనే ఈ డీల్ కు రవి ఓకే చెబుతాడు. అటు సుమతి పెళ్లి విషయంలో మరోసారి బాలు, మీనా మధ్య తీవ్ర స్థాయిలో ఫైట్ జరగబోతున్నట్లు స్పష్టమవుతోంది.

రోమియో జూలియట్ అంటూ ఏడిపించిన రోహిణి
మహేష్ అంటూ రోహిణి ఫోన్ లో మాట్లాడే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 20) ఎపిసోడ్ మొదలైంది. రోమియో జూలియట్ బుక్స్ ఇచ్చేవాడివి.. వాటిని చదివి వాటిపైనే మనం డిస్కస్ చేసుకునే వాళ్లమని రోహిణి అనడంతో మనోజ్ షాకవుతాడు.
నీతో ఇలాగే మాట్లాడుతూ ఉండాలని ఉంది.. ఒకవేళ నీకు నిద్ర రాకపోతే మళ్లీ ఫోన్ చెయ్ నేను మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అదంతా విన్న మనోజ్ రోహిణి వస్తుండటంతో వెళ్లి పడుకున్నట్లు నటిస్తాడు. అతని నాటకాన్ని ఆమె పసిగడుతుంది. నీకోసం నేను ఎంత ఏడ్చాను.. నువ్వు కూడా ఏడవాల్సిందే అని అనుకుంటుంది. అటు ఆ రోహిణి ఫోన్ లో మహేష్ నంబర్ తీసుకొని మాట్లాడాలని మనోజ్ డిసైడవుతాడు.
రవి ఇంటికి నీతూ.. శృతితో ఫైట్
మరుసటి రోజు ఉదయమే రవి ఇంటికి నీతూ వస్తుంది. హాల్లో ఉన్న సత్యం, ప్రభావతిలను పరిచయం చేసుకుంటుంది. రవి రెస్టారెంట్ ఓనర్ అనగానే ప్రభావతి ఆమెకు మర్యాదలు మొదలు పెడుతుంది.
అప్పుడే శృతి వచ్చి ఎందుకొచ్చావ్ అంటూ గొడవ పడుతుంది. సత్యం, ప్రభావతి ముందే ఇద్దరూ మాటామాటా అనుకుంటారు. ఇంట్లో వాళ్లందరు కూడా వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్లతో అలా మాట్లాడకూడదంటూ సత్యం, బాలు, మీనా, రోహిణి ఆమెకు సలహా ఇస్తారు. దీంతో శృతి కాస్త వెనక్కి తగ్గుతుంది.
రవికి నీతూ బిజినెస్ ఆఫర్.. అగ్రిమెంట్ వెంట తీసుకొచ్చి..
తాను రవికి బిజినెస్ ఆఫర్ తీసుకొచ్చినట్లు నీతూ చెబుతుంది. మరిన్ని రెస్టారెంట్లు ప్రారంభించాలని అనుకుంటున్నానని నీతూ అంటుంది. వాటిలో రవిని బిజినెస్ పార్ట్నర్ గా చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పడంతో అందరూ షాకవుతారు. అలా అయితే రవి డబ్బు ఇన్వెస్ట్ చేయాలా అని మనోజ్ అడుగుతాడు. అవసరం లేదు.. డబ్బు తానే చేస్తానని లాభాల్లో వాటా ఇస్తానని నీతూ అంటుంది.
అలా అయితే తనను కూడా పార్ట్నర్ చేసుకోవాలని మనోజ్ అడిగితే.. నేను నీలాంటి బిజినెస్ మ్యాన్ అని చెప్పుకునే వాళ్లను, మోసపోయే వాళ్లను చేసుకోనని పరువు తీస్తుంది నీతూ. మరి ఇప్పుడు ఓకే అని భవిష్యత్తులో రవికి లాభాల్లో వాటా ఇవ్వకపోతే ఎలా అని బాలు అడిగితే.. దానికోసమే తాను అగ్రిమెంట్ తీసుకొచ్చానని, చదివి ఓకే అంటేనే సంతకం పెట్టాలని చెబుతుంది.
ఆఫర్ ఇష్టం లేదన్న రవి.. ఒప్పించిన శృతి
అయితే దానిపై సంతకం చేసే ముందు రవితో తాను పర్సనల్ గా మాట్లాడాలని శృతి అంటుంది. రవిని మేడపైకి తీసుకెళ్లి ఆఫర్ గురించి అడుగుతుంది. ఈ ఆఫర్ తనకు ఇష్టం లేదని రవి అంటాడు. తనకు ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్ కావాలనో, బిజినెస్ పార్ట్నర్ కావాలనో లేదని, నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెబుతాడు.
అయినా పేరుకు తాను పార్ట్‌నరే అయినా రెస్టారెంట్ వాళ్లదే అవుతుంది కదా.. లాభమేంటి అని ప్రశ్నిస్తాడు. తాను పార్ట్నర్ గా రెస్టారెంట్ నడపడం కూడా తెలియదని అంటాడు. అవన్నీ నీతూ చూసుకుంటుంది.. దాని గురించి పెద్దగా ఆలోచించకు.. అవన్నీ నేను చూసుకుంటాను.. ముందు సంతకం పెట్టు అని శృతి బలవంతం చేస్తుంది. దీంతో రవి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు.
నీతూ రూ.20 కోట్ల ప్లాన్.. మనోజ్‌కు నీతూకి పెళ్లి.. బేరర్లుగా చేస్తున్నారంటూ..
ఇటు కింద ఇంట్లో నీతూ వివరాలు లాగడానికి ప్రభావతి ప్రయత్నిస్తుంది. రెస్టారెంట్లు ప్రారంభించాలంటే ఎన్ని లక్షలు కావాలి అని అడుగుతుంది. లక్షలు కాదమ్మ రెండు, మూడు కోట్లు కావాలని మనోజ్ అంటాడు. ప్రస్తుతానికి మరో రెండు ప్రారంభించాలని అనుకుంటున్నానని, వాటికే రూ.20 కోట్లు కావాలని నీతూ చెప్పడంతో ప్రభావతి నోరెళ్లబెడుతుంది. మరి అంత డబ్బు ఎక్కడిది అని అడిగితే.. మా నాన్న ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తాడని నీతూ అంటుంది.
ఇలాంటి అమ్మాయిని మనోజ్ కు ఇచ్చి చేస్తే కోట్లే కోట్లు వస్తాయని అనుకుంటుంది. అంత పెద్ద రెస్టారెంట్లు చూసుకోవాలంటే కనీసం నాలుగైదు డిగ్రీలు ఉన్న వాడిని పెళ్లి చేసుకోవాలని, మా మనోజ్ లాగా తెలివి తేటలు ఉండాలని ప్రభావతి అంటుంది. అలాంటి వాళ్లు తన రెస్టారెంట్లో బేరర్లుగా పని చేస్తున్నారని నీతూ అనడంతో ప్రభావతి, మనోజ్ ముఖాలు మాడిపోతాయి. ఇదే అదునుగా గుడి, నగలు అంటూ మనోజ్ పరువు మరింత తీస్తాడు బాలు.
రవిని పెళ్లి చేసుకునేదాన్నన్న నీతూ.. మాట మార్చిన ప్రభావతి
తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని నీతూ అంటుంది. అయినా తాను నిజాయతీగా కష్టపడుతూ క్రియేటివ్ గా ఆలోచించేవాళ్లనే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. రవి సరిగ్గా అలాంటి వ్యక్తే అని, ఒకవేళ అతనికి పెళ్లి కాకపోయి ఉంటే తానే పెళ్లి చేసుకునేవాడనని అనడంతో ప్రభావతి సహా అందరూ షాకవుతారు. అప్పుడే రవి, శృతి కిందికి వస్తారు. తమకు ఓకే అని చెప్పడంతో రవి అగ్రిమెంట్ పై సంతకం పెడతాడు.
నీతూ వెళ్లిపోతుంది. అయితే ఆమె వెళ్లగానే ప్రభావతి మాట మారుస్తుంది. సొంతంగా రెస్టారెంట్ పెడతానన్న నువ్వు ఇప్పుడు మళ్లీ ఆ అమ్మాయితో కలుస్తున్నావేంటి అని ప్రభావతి అడుగుతుంది. మీరు ఆ అమ్మాయి గురించి మళ్లీ మాట మారుస్తున్నారేంటి అని మీనా అంటుంది. ఆ సీన్ అక్కడితో ముగుస్తుంది.
మణికంఠతో బాధ చెప్పుకున్న మనోజ్
షాపులో మనోజ్ రోహిణి గురించే ఆలోచిస్తూ కూర్చొంటాడు. అప్పుడే మణికంఠ రావడంతో అతనికి తన బాధ చెప్పుకుంటాడు. రోహిణి ఎవరో మహేష్ అనే వాడితో మాట్లాడుతోందని, చాలా రొమాంటిక్ గా మాట్లాడుతుందని అంటాడు. నువ్వు టైమ్ ఇవ్వకపోతే ఆమె ఏం చేస్తుంది.. ఇలాగే పరాయివాళ్లతో మాట్లాడుతుంది అని మణికంఠ అంటాడు. వాడెవడో తెలుసుకోవాలని, ఫోన్ చేసి మాట్లాడు అని మనోజ్ చెబుతాడు. ఈ సీన్ లో మెయిన్ క్యారెక్టర్ నువ్వే.. నువ్వే ఫోన్ చేసి మాట్లాడు అని మణికంఠ స్పష్టం చేస్తాడు.
మీనా దగ్గరికి అరుణ్ తల్లి
మరోవైపు పెళ్లి విషయంలో మీనా సాయం కోరి మరోసారి ఆమె దగ్గరికి వస్తుంది అరుణ్ తల్లి. ఈ పెళ్లి జరగకపోతే వాడు ఏమైపోతాడో అన్న భయం ఉంది.. నువ్వే ఎలాగైనా ఈ పెళ్లి చేయాలని మీనా చేతులు పట్టుకొని ఆమె బతిమాలుతుంది. దీంతో మీనా బాలు దగ్గరికి వెళ్లి అరుణ్ మీకు క్షమాపణ చెబితే పెళ్లికి ఓకే చెబుతారా అని అడుగుతుంది.
ఆ క్షమాపణ వెనుక ఎన్ని కుట్రలు ఉంటాయో నేను అంగీకరించను అని బాలు తెగేసి చెబుతాడు. ఒకవేళ మీకు చెప్పకుండా వాళ్లు పెళ్లి చేస్తే ఏం చేస్తారని మీనా అడిగితే.. ఆ క్షణం నుంచే నీకు నాతో, ఈ ఇంటితో బంధం తెగిపోయినట్లే అని బాలు అంటాడు. దీంతో మీనా ఆలోచనలో పడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


