Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో సుమతి, అరుణ్ పెళ్లి కోసం అతని తల్లి మరోసారి మీనా సాయం కోరడం, ఆమె అదే విషయంలో బాలుతో గొడవ పడటం, అటు మహి అంటూ మనోజ్ ను రోహి మరింత ఉడికించడం చూడొచ్చు.
మహేష్‌కు మనోజ్ ఫోన్.. బిచ్చగాడి షాక్

మహేష్ కు ఫోన్ చేయమంటూ మణికంఠను మనోజ్ ఒత్తిడి చేసే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. మనోజ్ రిక్వెస్ట్ తో చేసేది లేక మహేశ్వరి నంబర్ కు మణికంఠ కాల్ చేస్తాడు. అవతలి నుంచి ఓ మగ గొంతు హలో అంటుంది. ఎవరు మాట్లాడుతున్నారు అని మణికంఠ అడిగితే తన పేరు మహేష్ అని చెబుతాడు. దీంతో మనోజ్ అనుమానం నిజమవుతుంది.
ఇతనితోనే మా ఆవిడ రోజూ గంటల తరబడి మాట్లాడుతోంది.. ఇప్పుడేమీ మాట్లాడొద్దు.. తర్వాత చూద్దాంలే అంటూ మనోజ్ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే మనోజ్ షాప్‌కి ఓ బిచ్చగాడు వస్తాడు. కాళ్లూ చేతులు బాగున్నా ఎందుకు అడుక్కుంటున్నావని మనోజ్ అడిగితే.. తన భార్య తన ఆస్తులన్నీ తీసుకొని తనను వదిలేసి వేరే వాడితో వెళ్లిపోయిందని చెప్పడంతో మనోజ్ షాకవుతాడు. నీకూ ఈ గత పట్టకుండా జాగ్రత్త పడు అంటూ మణికంఠ వార్నింగ్ ఇస్తాడు.
అరుణ్ కోసం సుమతి ఆరాటం.. బాధపడిన మీనా
మరోవైపు అరుణ్ కోసం సుమతి అల్లాడిపోతూ ఉంటుంది. తిండీతిప్పలు మానేస్తుంది. బావ కోసం తన ప్రేమను త్యాగం చేయడానికి సిద్ధమవుతుంది. ఆమెను చూసిన శివ.. తల్లి పార్వతిని నిలదీస్తాడు. అక్కను అర్థం చేసుకొని ఈ పెళ్లి జరిపించొచ్చు కదా అని అడుగుతాడు. అల్లుడుగారికి ఇష్టం లేకుండా తాను ఈ పెళ్లి చేయలేనని, అయినా అరుణ్ మంచోడు కాదని ఆయన చెప్పినప్పుడు ఎలా ఇచ్చి చేస్తామని పార్వతి అంటుంది.
అప్పుడే మీనా కూడా వస్తుంది. ఆమెతోనూ శివ అదే విషయం మాట్లాడుతాడు. దీంతో సుమతిని మీనా వారిస్తుంది. ఎన్నాళ్లిలా ఉంటావు.. అయినా నా వల్లే నీకు ఈ కష్టం వచ్చింది.. మీ బావకు ఇష్టం లేదని నీ ప్రేమను త్యాగం చేస్తున్నావు.. ఈ పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎక్కడ పాడవుతుందో అని ఆలోచిస్తున్నావు అని మీనా అంటుంది.
సుమతి దగ్గరికి అరుణ్ తల్లి.. మీనాకు రిక్వెస్ట్
{{/usCountry}}అప్పుడే మీనా కూడా వస్తుంది. ఆమెతోనూ శివ అదే విషయం మాట్లాడుతాడు. దీంతో సుమతిని మీనా వారిస్తుంది. ఎన్నాళ్లిలా ఉంటావు.. అయినా నా వల్లే నీకు ఈ కష్టం వచ్చింది.. మీ బావకు ఇష్టం లేదని నీ ప్రేమను త్యాగం చేస్తున్నావు.. ఈ పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎక్కడ పాడవుతుందో అని ఆలోచిస్తున్నావు అని మీనా అంటుంది.
సుమతి దగ్గరికి అరుణ్ తల్లి.. మీనాకు రిక్వెస్ట్
{{/usCountry}}వాళ్లు మాట్లాడుకుంటుండగానే అరుణ్ తల్లి వస్తుంది. సుమతితో ఏదైనా మాట్లాడాలా.. నేను బయటకు వెళ్లాలా అని మీనా అడుగుతుంది. అందరికీ సంస్కారం ఉంది.. కానీ సమస్య మాత్రం అలాగే ఉంది అని అరుణ్ తల్లి అంటుంది. నీతోనే మాట్లాడాలి.. ఈ పెళ్లికి ఎలాగైనా మీ ఆయనను ఒప్పించాలి అని చెబుతుంది. సుమతిని అరుణ్ ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడు.. మీ ఆయనతో గొడవలు ఈ మధ్యే మొదలయ్యాయి.. సుమతి దూరమైతే అరుణ్ ఏమైపోతాడో అని భయంగా ఉంది.. ఈ పెళ్లి నువ్వే జరిపించాలి.. ఆయనను ఎలాగైనా ఒప్పించాలి అని మీనాను బతిమాలి వెళ్లిపోతుంది.
మనోజ్ కాల్ చేసిన విషయం చెప్పిన మహేశ్వరి
అటు మనోజ్ తో ఆడుకుంటున్న రోహిణి.. మహేశ్వరితో ఫోన్ మాట్లాడుతుంటుంది. అప్పుడే మనోజ్ తనకు కాల్ చేసిన విషయం ఆమె చెబుతుంది. ఎందుకు మాట్లాడావ్.. నీ వాయిస్ గుర్తు పడతాడు కదా అని రోహిణి అంటుంది. తాను తన భర్తకు ఫోన్ ఇచ్చి మాట్లాడించానని ఆమె చెప్పడంతో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది.
అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నావని మహేశ్వరి అడుగుతుంది. మనోజ్ ను తన వైపుకు తిప్పుకోవడానికే ఇదంతా చేస్తున్నానని, అతడు మాత్రం తల్లి మాట విని తనను దూరం పెడుతున్నాడని బాధపడుతుంది. ఏదైనా సరే తెగే వరకూ లాగకు.. ఇలాంటివి ప్రమాదం అని మహేశ్వరి వార్నింగ్ ఇస్తుంది.
మహి, రోహి మాట విని మనోజ్ షాక్
అప్పుడే మనోజ్ రావడం గమనించిన రోహిణి మాట మారుస్తుంది. నేను నిన్ను మహి అని పిలుస్తాను.. నువ్వు నన్ను రోహి అని పిలువు అని అంటుంది. అది విన్న మనోజ్.. ఇప్పటి వరకూ తాను కూడా ఇంత రొమాంటిక్ గా పిలవలేదని అనుకుంటాడు. మనోజ్ ముందే రోహిణి చాలా రొమాంటిక్ గా ఫోన్ మాట్లాడటం చూసి అతనికి కోపం ముంచుకొస్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత ఎవరు అని నిలదీస్తాడు. తన క్లోజ్ ఫ్రెండ్ అని రోహిణి చెబుతుంది. అయినా ఎప్పుడూ మీ ఫ్రెండ్ తో ఈ మాటలేంటి అని మనోజ్ అంటే.. నేను మాట్లాడుతుంటే చాలా బాగుంటుందట.. అలా మాట్లాడుతూనే ఉండాలని అనిపిస్తుందట అని రోహిణి అనడంతో మనోజ్ మరింత కంగుతింటాడు.
బాలుని ఒప్పించే ప్రయత్నం చేసిన మీనా.. మళ్లీ గొడవ
ఇటు ఇంటికి వచ్చిన మీనా బాలుని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తుంటుంది. అతడు రాగానే మరోసారి సుమతి విషయం మాట్లాడుతుంది. ఎందుకింత పంతం.. అరుణ్ విషయం మరోసారి ఆలోచించాలని అడుగుతుంది. బాలు సమాధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. దీంతో మీకు చెప్పకుండా, మీ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా వాళ్లకు పెళ్లి చేస్తే ఏం చేస్తారు అని మీనా అంటుంది. అదే జరిగితే నువ్వు ఆ ఇంటి గడప మళ్లీ తొక్కగలవా అని బాలు ఆవేశంతో ఊగిపోతాడు.
లేదు నాకు అమ్మ, చెల్లి, తమ్ముడే కావాలనుకుంటే నీకు ఈ ఇంటితో బంధం తెగిపోతుంది అని అంటాడు. ఒకవేళ అరుణే దిగి వచ్చి క్షమాపణ చెబితే ఏం చేస్తారు అని అడిగితే.. అది ఇంకా ప్రమాదం.. ఇన్నాళ్లూ శత్రువుగా చూసిన వ్యక్తి సడెన్ గా వచ్చి క్షమాపణ చెబితే దాని వెనుక ఎన్ని కుట్రలు ఉంటాయో అని బాలు అంటాడు. బాలు ఎంతకీ వినకపోవడంతో మీ మాట నేను వినకపోతే ఏం చేస్తారు అని మీనా అంటుంది. బాలు ఏమీ మాట్లాడకుండా సీరియస్ గా ఆమె వైపు చూసి వెళ్లిపోతాడు.
ఫ్రెండ్ బర్త్‌డే కోసం రోహిణి రెడీ
అటు రోహిణి అందంగా ముస్తాబవుతూ ఉండగా మనోజ్ వస్తాడు. ఆమెను చూసి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు. ఫ్రెండ్ బర్త్ డే ఉందని, వెళ్తున్నానని చెబుతుంది. ఎవరా ఫ్రెండ్ అని అడిగితే మాత్రం రోహిణి సమాధానం చెప్పదు. పైగా నన్ను అనుమానిస్తున్నావా అని మనోజ్ నే నిలదీస్తుంది. అతడు ఎన్నిసార్లు అడిగితే పేరు చెప్పదు. పైగా టైమ్ అవుతోంది.. నేనే కేక్ కూడా తీసుకెళ్లాలి అని చెప్పి వెళ్లిపోతుంది.
రోహిణిని ఫాలో అయిన మనోజ్
దీంతో మనోజ్ లో అనుమానం మరింత బలపడుతుంది. అసలు రోహిణి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి.. ఆమెను ఫాలో అవ్వాలి అని డిసైడవుతాడు. ఆమె ఆటోలో వెళ్తుంటే వెనుక కారులో ఫాలో అవుతాడు. రోహిణి ఓ బేకరీలో కేక్ తీసుకుంటుంది. అసలు ఈమె ఎవరి కోసం ఇంతలా రెడీ అయి, కేక్ తీసుకొని వెళ్తుందో అని మనోజ్ అనుకుంటాడు. ఈరోజు ఏదిఏమైనా అతడెవరో కనిపెట్టాలని మనోజ్ డిసైడవుతాడు.
తప్పతాగిన బాలు
మరోవైపు మీనాతో గొడవ పడిన బాలు తప్పతాగి ఇంటికి వస్తాడు. ఇంట్లో అందరి ముందే రచ్చ చేస్తాడు. నట్టింట్లో ఓ గీత గీసి ఈ గీతను దాటమని అమ్మకు చెప్పు అని తండ్రితో అంటాడు. సత్యం అలాగే చేస్తాడు. సరిగ్గా ప్రభావతి గీత దాటుతుండగా ఆగమని చెప్పు అని బాలు అంటాడు. సత్యం ఆగమనడంతో ప్రభావతి ఆగిపోతుంది. చూశావా.. మా నాన్న ఏం చెబితే మా అమ్మ అదే చేస్తుంది.. కానీ నా మాట మాత్రం కొందరు వినడం లేదు అని బాలు అంటాడు. దీంతో మీనా బాధపడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHOR
హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.