Gunde Ninda Gudi Gantalu Today Episode: తల్లి ఒడిలో బాలు.. ప్రభావతి కంటతడి.. హాస్పిటల్లో సుమతి.. అత్తతో బాలు గొడవ

Gunde Ninda Gudi Gantalu Serial November 24th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 24 ఎపిసోడ్ లో బాలు, ప్రభావతి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ హైలైట్ గా నిలిచింది. అయితే చివరికి సుమతి హాస్పిటల్ పాలవడం, దానికి కారణం తానే అన్నట్లుగా మాట్లాడటంతో అత్తతో బాలు గొడవ పడటం మరో ట్విస్ట్ ఇచ్చింది.

Published on: Nov 24, 2026, 07:26:58 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో నట్టింట్లో బాలు చేసిన రచ్చ, ప్రభావతి ఎమోషనల్ అవడం, మనోజ్ ను బాలు కొట్టడం, సత్యం నిలదీయడంలాంటి సీన్లతో సాగిపోయింది. అరుణ్, సుమతి పెళ్లి మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే కొనసాగుతోంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 24 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ నవంబర్ 24 ఎపిసోడ్

మహేష్ పేరు విని మనోజ్ షాక్

రోహిణిని ఫాలో అవుతూ మనోజ్ వెళ్లే సీన్ తో సీరియల్ మంగళవారం (నవంబర్ 24) ఎపిసోడ్ మొదలైంది. ఆమె కేకు తీసుకెళ్లిన షాపులోకి మనోజ్ వెళ్తాడు. నేరుగా ఆమె కేకుపై ఎవరి పేరు రాయించిందో అడగకుండా.. బర్త్ డే కోసం 3 కేజీల కేకు కావాలని, దానిపై పేరు బాగా రాస్తారా అని అడుగుతాడు.

దానికి ఆ షాపతను ఇంతకుముందే ఒకరు కేకు తీసుకెళ్లారని, దానిపై చాలా బాగా పేరు రాశామని అంటాడు. ఏంటా పేరు అని మనోజ్ అడిగితే మహేష్ అని అంటాడు. దీంతో మనోజ్ ముఖం వాడిపోతుంది. నిరాశగా షాపులో నుంచి వెళ్లిపోతాడు.

తాగి తల్లి కాళ్లపై పడ్డ బాలు.. తల నిమురుతూ ప్రభావతి కంటతడి

ఇటు ఇంట్లో మీనా, ప్రభావతి మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తూ ఉంటుంది. అప్పుడే తప్పతాగి బాలు ఇంట్లోకి వస్తాడు. నేరుగా వెళ్లి తల్లి కాళ్లపై పడతాడు. నాన్న అనుకొని నీ కాళ్లపై పడ్డానని, తాగినందుకు నాన్నకు సారీ చెప్పాలనుకున్నానని బాలు అంటాడు. ఆ తర్వాత తల్లిని కుర్చీలో కూర్చోబెట్టి ఆమె ఒడిలో పడుకుంటాడు బాలు. నాకు ఎప్పుడూ జోల పాట పాడలేదు.. చిన్నతనంలో నువ్వు నన్ను ఇలా ప్రేమగా దగ్గరకు తీసుకొని జోల పాట పాడి నిద్రపుచ్చుతావని ఎంతో ఎదురు చూశాను.

కానీ నువ్వెప్పుడూ అలా చేయలేదు.. ఎందుకమ్మా.. నన్ను పట్టించుకోకుండానే నాన్నమ్మ ఇంటికి ఇలా వచ్చి అలా వెళ్లేదానివి.. నువ్వు వెళ్లిన తర్వాత నాన్నమ్మ నన్ను పట్టుకొని ఏడ్చేది అని బాలు అనడంతో ప్రభావతి ఎమోషనల్ అవుతుంది. బాలు తల నిమురుతూ కంటతడి పెడుతుంది. సమాధానం చెప్పండని మీనా కూడా నిలదీస్తుంది. కానీ ప్రభావతి మాత్రం ఏమీ చెప్పదు.

అందరి ముందు మీనా గురించి బాలు పంచాయితీ

ఆ తర్వాత బాలు సత్యంతో పాటు ఇంట్లో వాళ్లందరినీ పిలుస్తాడు. ఇవాళ ఒకరి కళ్లు తెరిపించాలి.. భర్త మాట భార్య వినడం అంటే ఏంటో చూపించాలి అని అంటాడు. తాగొచ్చినందుకు తండ్రి తిడుతున్నా బాలు పట్టించుకోడు. మానేసిన వాడికి ఇంతలా ఎందుకు తాగావని అడుగుతాడు. కానీ బాలు మాత్రం చాక్ పీస్ తీసుకురా అంటూ మీనాను పంపిస్తాడు. తర్వాత నట్టింట్లో ఓ గీత గీస్తాడు. ఆ గీతను దాటమని అమ్మకు చెప్పు నాన్న అని సత్యాన్ని అడుగుతాడు.

ఎందుకు అని సత్యం అడిగినా పట్టించుకోడు. దీంతో ఆ గీత దాటమని ప్రభావతికి చెబుతాడు సత్యం. ఆమె దాటబోతుండగా.. ఆగమని చెప్పు అని బాలు అంటాడు. సత్యం ఆగమని చెప్పడంతో ప్రభావతి ఆగిపోతుంది. చూశావా భర్త మాట వినడం అంటే ఇదీ అంటూ మీనాతో బాలు అంటాడు. తనకు విషయం అంతా అర్థమైందని, మీరు వెళ్లి పడుకోండని సత్యం, ప్రభావతిలను మీనా పంపించేస్తుంది. బాలుపై అలిగి వెళ్లిపోతుంది.

శృతిని టెస్ట్ చేయబోయిన రవి

అందరూ వెళ్లిన తర్వాత శృతి తన మాట వింటుందా లేదా అని టెస్ట్ చేయాలని అనుకుంటాడు రవి. నేను ఆ గీత దాటమంటే నువ్వు దాటుతావా అని అడుగుతాడు. శృతి మాత్రం వెళ్లి ఆ గీతను తుడిచేస్తుంది. ఆ తర్వాత రవి కాలర్ పట్టుకొని వార్నింగ్ ఇస్తుంది. దీంతో అతడు భయపడి వద్దులే అని చెప్పి వెళ్లిపోతాడు.

మనోజ్‌ను కొట్టిన బాలు

పైకి వెళ్లిన తర్వాత బాలు తనలో తానే మాట్లాడుకుంటాడు. మీనాను బతిమాలుతున్నట్లుగా తలుపును పట్టుకొని ఏదేదో చెబుతుంటాడు. అది చూసిన మనోజ్ ఏం చేస్తున్నావ్ రా అని బాలుని అడుగుతాడు. బాలు దొరికిపోయానని అనుకొని కవర్ చేసుకుంటాడు. మీనాతో ఎలా మాట్లాడాలో ఇక్కడ ప్రాక్టీస్ చేసి లోపలికి వెళ్తానని బాలు అంటాడు. అసలు ఇంతలా ఎందుకు తాగావ్.. ఏం జరిగిందని మనోజ్ అడిగితే సుమతి పెళ్లి గురించి బాలు చెబుతాడు.

ఆమె ఒకడిని ప్రేమించింది.. వాడు నీకంటే పెద్ద వెధవ.. నీలా లక్షలు మింగలేదు.. పార్కులో పడుకోలేదు.. గుడి ముందు అడుక్కోలేదు.. కానీ నీకంటే పెద్ద వెధవ అని అంటాడు. దీంతో మనోజ్ ఫీలవుతాడు. అయినా ఆమె ఇష్టపడిన వాడిని చేసుకుంటే నీకేంటి సమస్య.. నీ భార్యతో పాటు ఆమె చెల్లిని కూడా నువ్వే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావా అని మనోజ్ నోరు జారుతాడు. దీంతో నోటికొచ్చినట్లు మాట్లాడతావా అంటూ మనోజ్ కాలర్ పట్టుకొని ముక్కుపై గుద్ది వెళ్లిపోతాడు బాలు.

బాలు, మీనాలను నిలదీసిన సత్యం

మరుసటి రోజు ఉదయం సత్యానికి కాఫీ ఇస్తుంది మీనా. బాలు లేచాడా.. అసలు ఏం జరిగింది.. ఎందుకంతలా తాగాడు అని అడుగుతాడు. ఇంతలో ప్రభావతి కూడా వచ్చి నిష్టూరమాడుతుంది. రాత్రంతా బాలు నిద్రపోలేదని, తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడని మీనా చెబుతుంది.

అప్పుడే బాలు కూడా రావడంతో అసలు ఏం జరిగిందని సత్యం అడుగుతాడు. బాలు వైన్ షాపు పిలిచిందంటూ ఏదో కహానీ చెప్పడంతో ఇప్పుడు నిజం చెప్పు అని సత్యం అంటాడు. దీంతో సుమతి పెళ్లి విషయంలో జరుగుతున్న గొడవ గురించి బాలు చెబుతాడు.

హాస్పిటల్లో సుమతి.. బాలు గొడవ

మరోవైపు సుమతికి తీవ్రంగా జ్వరం రావడంతో పార్వతి, శివ ఆమెను హాస్పిటల్లో చేర్చి మీనాకు ఫోన్ చేసి చెబుతారు. దీంతో బాలు, మీనా హాస్పిటల్ కు వెళ్తారు. ఈ పెళ్లి విషయం ఎక్కడి వరకూ వెళ్తుందో ఏమో అని మీనా అంటుంది. సుమతి సుఖంగా ఉండాలి.. ఆమె అనుకున్నది జరగాలి అన్నట్లుగా పార్వతి మాట్లాడుతుంది.

దీంతో బాలు ఆమెతో గొడవకు దిగుతాడు. అంటే నేనే ఆమె సుఖానికి అడ్డు పడుతున్నానని అంటున్నారా అని అంటాడు. అప్పుడే సుమతి కోసం అరుణ్ కూడా హాస్పిటల్ కు పరుగెత్తుకుంటూ వస్తుంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.