...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణిని చితకబాదిన ఇంట్లో వాళ్లు.. గుణ ప్లాన్ కనిపెట్టిన బాలు..మీనా కంకణానికి నో

Gunde Ninda Gudi Gantalu Serial October 16th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 16 ఎపిసోడ్ లో రోహిణిని ఇంట్లో వాళ్లందరూ దొంగ అంటూ చితకబాదుతారు. అయినా సరే బాలు కారు కీస్ గుణకు ఇస్తుంది రోహిణి.

Published on: Oct 16, 2026, 07:26:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ బాలుని అడ్డు తొలగించుకోవడానికి ఇటు రోహిణి, అటు గుణ చేసే ప్రయత్నాల చుట్టూ తిరుగుతుంది. బాలు కారు కీస్ తీసుకోవడానికి దొంగలా మారిన రోహిణిని ఇంట్లో వాళ్లందరూ కలిసి చితకబాదుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

మీనా, బాలుని నిందించిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 16 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 16 ఎపిసోడ్

బాలుకి ఏమీ జరగకుండా తాను కంకణం తీసుకొచ్చానని మీనా చెప్పే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. అది విని బాలునే నిందిస్తుంది ప్రభావతి. వీడి వల్ల వేరే వాళ్లకు ఏదైనా జరుగుతుంది కానీ వీడికేం జరుగుతుందని అంటుంది.

అయినా ఈ మీనాను పెళ్లి చేసుకున్న తర్వాతే ఈ ఇంట్లో సమస్యలు వస్తున్నాయి.. వాడికి ఏదైనా జరిగినా దీని వల్లే అని కూడా అంటుంది. దీంతో ప్రభావతిని తిట్టి అక్కడి నుంచి తీసుకెళ్తాడు సత్యం.

మీనా బతిమాలినా కంకణం కట్టించుకోని బాలు

ఆ తర్వాత కంకణం కట్టించుకోవాలని బాలుని మీనా బతిమాలుతుంది. కానీ అతడు మాత్రం వినడు. ఇలాంటి వాటిని నేను నమ్మనని నీకు తెలుసు కదా.. అయినా ప్రభావతి తెచ్చిన తాయత్తు కట్టుకుంటే మనోజ్ గాడి పరిస్థితి ఎలా అయిందో చూశాం కదా అని అంటాడు.

తర్వాత తాను బయటకు వెళ్లి వస్తానని వెళ్లిపోతాడు. కనీసం తిని అయినా వెళ్లండి అని అంటే.. నిన్ను రెండు నిమిషాలు చూస్తే చాలు కడుపు నిండిపోతుంది అని చెప్పి వెళ్తాడు. దీంతో మీనా మరింత కంగారు పడుతుంది. తనకు ఏమీ జరగకుండా ఈ కంకణం తీసుకొస్తే కట్టుకోకుండానే వెళ్లిపోయారు.. ఏం జరుగుతుందో ఏంటో అని ఆందోళన చెందుతుంది.

మీనాకు సర్ది చెప్పిన బాలు.. చింటు గురించి అడిగి..

మీకు ఈ శృతి కూడా తోడైందా అని మీనా అంటుంది. తర్వాత శృతి వెళ్లిపోతుంది. నాకు ఏమీ జరగదు.. ఇవన్నీ పట్టించుకోకు అని మీనాను హగ్ చేసుకొని సర్ది చెబుతాడు బాలు. ఆ తర్వాత చింటు గురించి అడుగుతాడు. వాళ్ల అమ్మకు మళ్లీ ఫోన్ చేయమంటే సుగుణమ్మ భయపడింది.. రేపు వాడి స్కూలుకి వెళ్లి వాళ్ల అమ్మతో వీడియో కాల్ మాట్లాడాల్సిందే అని మీనాతో అంటాడు. అది రోహిణి వింటుంది.

గుణకు రోహిణి ఫోన్.. బాలు కారు కీస్ ఇస్తానని..

అందరూ నా జీవితంపై పడ్డారెందుకు.. ఈ బాలు, మీనాకు వేరే పనేం లేదా.. రేపు చింటు స్కూలు వెళ్దామంటే ఇలా దాపురించారేంటి అనుకుంటుంది. బాలుని రేపు ఇంట్లో నుంచి కదలకుండా చేయడానికి గుణనే కరెక్ట్ అని అనుకుంటుంది. అతనికి ఫోన్ చేస్తుంది. నాకు ప్రస్తుతం నువ్వు తప్ప వేరే దిక్కు లేదని అంటుంది. బాలుని ఇంట్లోనే ఉండేలా చేయాలని అడుగుతుంది.

ఇంట్లో కాదు.. మొత్తం పైకి పంపించేస్తానని గుణ అంటాడు. బాలు కారు కీస్ ఇవ్వడానికి రోహిణి అంగీకరిస్తుంది. కానీ బాలుకి ఏమాత్రం డౌట్ రావద్దని, ఏమాత్రం తేడా వచ్చినా అతడు కనిపెట్టేస్తాడని అంటుంది. అస్సలు రాదని, కేవలం 10 నిమిషాల్లో పని పూర్తి చేస్తానని, తర్వాత ఎవరి పని వాళ్లు చూసుకుందామని గుణ అనడంతో రాత్రి 11 తర్వాత ఇంటి దగ్గరికి రమ్మని చెబుతుంది.

రోహిణి ఇంటికి గుణ.. కీస్ కోసం రోహిణి తంటాలు

రోహిణి చెప్పినట్లు రాత్రి 11కి గుణ రోహిణి ఇంటికి వస్తాడు. ఆమెకు ఫోన్ చేస్తాడు. కారు కీస్ ఇస్తానన్నావ్ కదా.. అంటాడు. దీంతో రోహిణికి కింది వెళ్లి కీస్ కోసం వెతుకుతుంది. ఇంట్లో ఎవరూ చూడకుండా ఉండాలని కరెంట్ ఆఫ్ చేస్తుంది. ఫోన్ వెలుతురులో హాలంతా కీస్ కోసం వెతుకుతుంది.

ఈ క్రమంలో చీకట్లో కిందపడుతుంది. మీనా కాళ్ల దగ్గర పడటంతో ఆమె తంతుంది. కీస్ ఎక్కడా కనిపించకపోవడంతో బాలు దిండు కింద ఉందేమో అని చూస్తుంది. బాలు, మీనా గాఢ నిద్రలో ఉండటంతో రోహిణి చేయి దిండు కింద ఇరుక్కుపోతుంది. ఎలాగోలా కీస్ అయితే దిండు కింది నుంచి తీస్తుంది.

రోహిణి నీడ చూసి అరిచిన శృతి.. టేబుల్ కింద దాక్కున్న రోహిణి

డోరు తెరిస్తే డౌట్ వస్తుందని అనుకుంటుంది. ఇంటి పైకి వెళ్లి కీస్ గుణకు విసిరేయాలని భావిస్తుంది. ఇంతలో కరెంట్ లేకపోవడంతో శృతి నిద్ర లేస్తుంది. కిటికీ కర్టెన్లు ఓపెన్ చేస్తుంది. ఇంట్లో ఉన్న కిటికీ దగ్గర నుంచి ఎవరో వెళ్లినట్లు నీడ కనిపించడంతో అరుస్తుంది.

దీంతో రోహిణి కంగారు పడి వెనక్కి వెళ్తుంది. తర్వాత రవి కూడా లేచి ఎవరూ ఉన్నారని అంటాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్తారు. రోహిణి కింద హాల్లోకి వెళ్తుంది. గ్లాసు కింద పడిన శబ్దానికి బాలు, మీనా, ప్రభావతి, సత్యం లేచి ఏం జరిగిందంటూ కంగారు పడతారు. ఎవరికీ కనిపించకుండా రోహిణి డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది.

రోహిణిని చితకబాదిన మీనా, శృతి, ప్రభావతి

ఇంట్లోకి దొంగ వచ్చాడని అందరూ అనుకుంటారు. మన ఇంట్లోనే కరెంట్ పోయిందని బాలుతో మీనా అంటుంది. ఆ దొంగ మెయిన్ ఆఫ్ చేశాడేమో అని అనుకుంటారు. తాను వెళ్లి చూస్తానని బాలు వెళ్తాడు. ఇంతలో రోహిణి మెల్లగా తప్పించుకుందామని చూస్తుంది. మనోజ్ వెనుకకు వెళ్లడంతో అతడు చీకట్లో కంగారు పడతాడు.

దీంతో దొంగ దొంగ అంటూ అందరూ కలిసి రోహిణిని చితకబాదుతారు. బాలు మెయిన్ ఆన్ చేయడంతో కరెంట్ వస్తుంది. తాము కొడుతుంది రోహిణిని అని తెలుస్తుంది. మనోజ్ కనిపించకపోవడంతో కిందికి వచ్చానని, ఫోన్ కింద పడితే తీసుకోవడానికి వెళ్లానని, మనోజ్ అరిచాడని చెబుతుంది. సరే అందరూ వెళ్లి పడుకోండని బాలు పంపించేస్తాడు.

గుణ ప్లాన్ కనిపెట్టిన బాలు

మరుసటి రోజు ఉదయం చింటు స్కూలుకు వెళ్లడానికి బాలు, మీనా రెడీ అవుతారు. బాలు తన కారు కీస్ కోసం వెతుకుంటే అవి ఓ మూలన పడి ఉండటం చూసి మనోజ్ తీసి ఇస్తాడు. ఇంతలో బాలు ఇంటి బయటే వేచి చూస్తున్న తన మనుషులకు గుణ ఫోన్ చేసి.. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ బాలు తప్పించుకోకూడదని చెబుతాడు.

బాలు బయటకు వచ్చి చూస్తే కారు బానెట్ తెరిచినట్లుగా ఉంటుంది. దీంతో బాలు దానిని ఓపెన్ చేస్తాడు. అది తెరిస్తే మనం చేసిన పని తెలిసిపోతుందిగా అని గుణ మనుషులు అనుకుంటారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks