Gunde Ninda Gudi Gantalu Today Episode: ప్రభావతిని గదిలో నుంచి గెంటేసిన మనోజ్.. బావను కొట్టిన శృతి.. మరో 10 వేలు స్వాహా

Gunde Ninda Gudi Gantalu Serial October 8th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 8 ఎపిసోడ్ లో మనోజ్ చిన్న పిల్లాడిలా మారిపోవడం, అతన్ని మళ్లీ మామూలు వ్యక్తిని చేయడానికి మాతాజీకి మరో 10 వేలు ప్రభావతి అర్పించుకోవడం చూడొచ్చు.

Published on: Oct 8, 2026, 07:09:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో రెండు తాయత్తులతో మనోజ్ పిచ్చోడిలా, చిన్న పిల్లాడిలా మారిపోతాడు. అది చూసి ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు. తనను నైటీ ఆంటీ అని పిలవడంతో మనోజ్ ను కొడుతుంది శృతి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 8 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ అక్టోబర్ 8 ఎపిసోడ్

బాలుకి మురళీ, మీనాకు విద్య ఫోన్.. బాలు, మీనా ఫైట్

మురళీతో బాలు ఫోన్ మాట్లాడే సీన్ తో సీరియల్ గురువారం (అక్టోబర్ 8) ఎపిసోడ్ మొదలైంది. అప్పుడే మీనాకు విద్య ఫోన్ చేస్తుంది. తాము విల్లా కొంటున్నామని కచ్చితంగా రావాల్సిందే అని చెబుతుంది. అంతేకాదు బాలుని కూడా తీసుకురావాలని చెప్పడంతో ఆయన రారని అంటుంది. కానీ విద్య వినదు. ఇద్దరూ కలిసి రావాలని, నువ్వు నా లవ్ గురు అని విద్య అంటుంది.

మీనా సరే అంటుంది. బాలు వచ్చి ఎవరు అని అడిగితే తన ఫ్రెండ్ ఫోన్ అని చెబుతుంది. మీకెవరు చేశారంటే నా ఫ్రెండ్, నా శిష్యుడు అని చెబుతాడు. రేపు ఒక చోటి వెళ్లాలని బాలు అంటే.. మీనా తాను కూడా వెళ్లాలని అంటుంది. ఇద్దరూ కాసేపు ఈ విషయంపై ఫైట్ చేసుకుంటారు. తర్వాత మెల్లగా రొమాన్స్ లోకి జారుకుంటారు.

మాతాజీ వీడియో చూసి అష్ట దిగ్బంధనంలో మనోజ్

రెండు తాయత్తులు కట్టించుకున్న మనోజ్ ఇక తాను రిచ్ అయిపోయినట్లే అని సంబరపడిపోతాడు. నిద్ర కూడా పట్టదు. దీంతో ఎలా ధనవంతుడు కావాలన్న వీడియోలు చూద్దామని ఫోన్ తీస్తాడు. అంతలో అతనికి మాతాజీ వీడియో ఒకటి కనిపిస్తుంది. ఒక్క తాయత్తు కట్టుకుంటే మంచి జరుగుతుంది.. కానీ కొందరు కక్కుర్తి పడి రెండు కట్టుకొని రాత్రికి రాత్రి కోటీశ్వరులం అయిపోవాలని అనుకుంటారని మాతాజీ చెబుతుంది.

అలాంటి వాళ్లు అష్టదిగ్బంధనంలో చిక్కుకొని అష్టకష్టాలు పడతారని అంటుంది. అది విని మనోజ్ షాకవుతాడు. రెండింట్లో ఏ తాయత్తు తీయాలో తెలియక తికమక పడతాడు. అలాగే పడుకుంటాడు. నిద్రలోనూ వింతగా ప్రవర్తించడంతో రోహిణి అతన్ని చూసి కంగారు పడుతుంది.

చిన్న పిల్లాడిలా మారిన మనోజ్.. మా అమ్మ ఏదంటూ..

అయితే ఉదయాన్నే చిన్న పిల్లాడి ఏడుపు వినిపించి ఇంట్లో వాళ్లందరూ ఉలిక్కి పడి లేస్తారు. బాలు, మీనా, రవి, శృతి, సత్యం, ప్రభావతి హాల్లోకి వచ్చి చూస్తారు. కొంపదీసి తాయత్తు మహిమతో రాత్రికి రాత్రే పిల్లాడు పుట్టలేదు కదా అంటూ బాలు ఎగతాళి చేస్తాడు. ఇంతలో మనోజ్ మెట్లపై నుంచి పాకుతూ కిందికి వస్తాడు. మా అమ్మ ఏది అంటూ ఏడుస్తాడు. ప్రభావతిని నాన్నమ్మ, సత్యంని తాతయ్య, బాలుని అంకుల్, మీనాను ఆంటీ అని పిలుస్తాడు.

మా అమ్మ ఏది.. అమ్మ కావాలి అంటాడు. ఇంత పెద్ద కొండావతి నీ ముందే ఉండగా అమ్మేదంటావేంట్రా అని బాలు అంటే.. మా అమ్మ సన్నగా ఉంటుందని మనోజ్ అంటాడు. తర్వాత పాల బాటిల్ అడుగుతాడు. మనోజ్ చిన్న పిల్లాడిలా మారడంతో ప్రభావతి షాక్ తింటుంది.

ప్రభావతిని నిందించిన సత్యం.. మనోజ్‌ను కొట్టిన శృతి

ఆ తాయత్తు వికటించిందేమో అని అనుకుంటుంది. అయినా 9.09 గంటలకు కట్టమంటే నీ వల్ల 9.19కి కట్టాను.. దాని వల్లే ఇలా జరిగిందేమో అని శృతిని తిడుతుంది ప్రభావతి. ఇంతలో ఏం చేశావే.. అడ్డమైన పనులు చేస్తావు.. నిమ్మకాయలు, తాయత్తులు తెచ్చి వాడిపై ప్రయోగిస్తావ్.. అసలు వాడు ఎందుకిలా తయారయ్యాడు.. ముందు ఆ మాతాజీకి ఫోన్ చేసి ఏం చేయాలో అడుగు అని ప్రభావతిని సత్యం తిడతాడు.

దీంతో ఫోన్ మాట్లాడటానికి వెళ్లిపోతుంది. ఇటు శృతిని చూసి నైటీ ఆంటీ అంటూ మనోజ్ పిలుస్తాడు. దీంతో ఆమె ఆవేశంతో మనోజ్ దగ్గరికి వెళ్లి తలపై ఎడాపెడా బాదేస్తుంది. మీనా, రవి కలిసి ఆమెను లాక్కెళ్తారు. ఆ తర్వాత రవిపై ఎక్కి ఏనుగాట ఆడతాడు మనోజ్. రచ్చరచ్చ చేస్తుంటాడు.

మాతాజీతో మాట్లాడిన ప్రభావతి.. మరో 10 వేలు స్వాహా

మరోవైపు ప్రభావతి బయటకు వెళ్లి కామాక్షికి ఫోన్ చేస్తుంది. ఇంట్లో పరిస్థితిని వివరిస్తుంది. ఆమె వెంటనే మాతాజీకి ఫోన్ కలుపుతుంది. తాయత్తు కట్టిన తర్వాత మనోజ్ చిన్న పిల్లాడిలా మారిపోయాడంట అని చెబుతుంది. నేను చెప్పిన సమయానికే కట్టారా అని అడిగితే.. కాస్త ఆలస్యమైందని ప్రభావతి చెబుతుంది.

అందుకే ఇలా జరిగిందని, మరో రూ.10 వేలు పేమెంట్ చేస్తే పూజ చేస్తానని చెబుతుంది. దీంతో చేసేది లేక కామాక్షిని వడ్డీకి అయినా సరే డబ్బు తీసుకొని మాతాజీకి పంపించమని ప్రభావతి చెబుతుంది. ఆమె సరే అంటుంది. ఆలోపు మనోజ్ ముఖాన్ని అరచేతుల్లో పెట్టి అటూఇటూ వాయిస్తూ ఉండమని మాతాజీ చెప్పడంతో ప్రభావతి షాకవుతుంది.

తల్లిని వెళ్లిపోమన్న మనోజ్

అందరూ మాట్లాడుకుంటూ ఉండగా.. మనోజ్ బయటకు వెళ్లిపోతాడు. అతడు ఎక్కడికెళ్లాడో అని కంగారు పడుతుండగా ఓ కారు బొమ్మతో తిరిగొస్తాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.

కాసేపటికి మనోజ్ నార్మల్ అవుతాడు. గదిలో తన బట్టలు ఐరన్ చేసుకోవడానికి వెళ్లి చేయి కాల్చుకుంటాడు. ఎందుకు ఐరన్ బాక్స్ ఆన్ చేసి పెట్టావంటూ రోహిణిని తిడతాడు. ఇంతలో ప్రభావతి కూడా వచ్చి ఆమెనే తిడుతుంది. దీంతో తల్లిని గదిలో నుంచి వెళ్లిపొమ్మని మనోజ్ అంటాడు. ఆమె ఏడుస్తూ కిందికి వస్తుంది. ఇంత చేస్తే తననే వెళ్లిపొమ్మన్నాడంటూ తన బాధ చెప్పుకుంటుంది. మనోజ్ తన వాడు అవుతున్నాడని రోహిణి అనుకుంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More