Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో మీనా మరో మెట్టు పైకి ఎక్కుతుంది. తన పూల వ్యాపారమే కాదు.. రెస్టారెంట్ లోనూ తన టాలెంట్ చూపిస్తుంది. దీంతో ఆమెకు ఓ గోల్డ్ రింగ్ గిఫ్ట్ గా వస్తుంది. అటు రోహిణి కష్టాలు మరింత ఎక్కువవుతాయి.
రవి, శృతికి పర్ఫెక్ట్ పార్థు క్లాస్.. రెస్టారెంట్‌లో ఓవరాక్షన్

రవి, శృతి రెస్టారెంట్ కు వచ్చిన పర్ఫెక్ట్ పార్థు వచ్చీ రాగానే ఓవరాక్షన్ చేసే సీన్ సీరియల్ గురువారం (అక్టోబర్ 1) మొదలైంది. రవి, శృతికి టైమ్ గురించి క్లాస్ పీకుతాడు. టైమ్ చాలా ముఖ్యం.. నాకు డిష్ చేసే వాళ్లు తప్ప మిగిలిన వాళ్లందరూ పని చూసుకోండి.. కస్టమర్ కు మంచి డిష్ చేయడమే కాదు.. ఎంత టైమ్ లో చేస్తున్నారన్నది కూడా ముఖ్యమే.. నేను టైమ్ చాలా విలువ ఇస్తాను అంటూ క్లాస్ పీకుతాడు. ఆ తర్వాత రెస్టారెంట్ లో హడావిడి చేస్తాడు.
అటు రవి, శృతి లోనికి వెళ్లి ఏం డిష్ చేయాలో అర్థం కాక తలపట్టుకుంటారు. ఏదో ఒకటి చేసి తీసుకు రండి.. నేను అతనికి కంపెనీ ఇవ్వాలి.. ఏమాత్రం నెగటివ్ రివ్యూ ఇచ్చినా మన పనైపోయినట్లే అని నీతూ చెప్పి వెళ్తుంది.
మీనా స్పెషల్ డిష్ గులాబీ గుల్ఖండ్.. ఫిదా అయిపోయిన పార్థు
ఈ హడావిడి చూసిన మీనాకు ఏం జరుగుతుందో అర్థం కాదు. లోనికి వెళ్లి అతనికి వేగంగా రెడీ అయ్యే డిష్ కావాలి అంతే కాదు.. నేను గులాబీలతో ఓ డిష్ చేస్తాను అని ప్రిపరేషన్ మొదలు పెడుతుంది. అందరూ తలా ఓ చేయి వేస్తారు. అప్పటికే తాను తీసుకొచ్చిన స్వీటులో గులాబీలను యాడ్ చేస్తుంది. పది నిమిషాల్లోనే డిష్ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఆ స్వీటును అందంగా గార్నిష్ కూడా చేస్తుంది. రవి, శృతి వెళ్లి పార్థుకు దానిని ఇస్తారు. ఆ స్వీటు తిని పార్థు ఫిదా అయిపోతాడు.
దీని పేరేంటి అని అడిగితే.. ఎవరూ చెప్పరు. అప్పుడే మీనా వచ్చి దీనిని గులాబీ గుల్ఖండ్ అంటారు.. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచి జరుగుతుంది.. కడుపు కూడా శుభ్రమవుతుంది.. జీర్ణ వ్యవస్థ బాగుంటుంది అని చెబుతుంది. అది విన్న పార్థు మరింత ఫిదా అవుతాడు. ఫాస్ట్ గా డిష్ చేయడమే కాదు దానివల్ల కలిగే లాభాలను కూడా చెప్పే వాళ్లు మీ రెస్టారెంట్ లో ఉన్నారు.. అందుకే మీకు 9.5 రేటింగ్ ఇస్తున్నాను అని చెప్పి పార్థు వెళ్లిపోతాడు. ఆ తర్వాత మీనా కూడా వెళ్లిపోతుంది. రెస్టారెంట్ పరువు కాపాడిన రవి, శృతికి కొంత డబ్బును నీతూ గిఫ్ట్ గా ఇస్తుంది.
మీనాపై శృతి, రవి పొగడ్తలు.. గోల్డ్ రింగ్ గిఫ్ట్.. కుళ్లావతి ఈర్ష్య
{{/usCountry}}దీని పేరేంటి అని అడిగితే.. ఎవరూ చెప్పరు. అప్పుడే మీనా వచ్చి దీనిని గులాబీ గుల్ఖండ్ అంటారు.. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచి జరుగుతుంది.. కడుపు కూడా శుభ్రమవుతుంది.. జీర్ణ వ్యవస్థ బాగుంటుంది అని చెబుతుంది. అది విన్న పార్థు మరింత ఫిదా అవుతాడు. ఫాస్ట్ గా డిష్ చేయడమే కాదు దానివల్ల కలిగే లాభాలను కూడా చెప్పే వాళ్లు మీ రెస్టారెంట్ లో ఉన్నారు.. అందుకే మీకు 9.5 రేటింగ్ ఇస్తున్నాను అని చెప్పి పార్థు వెళ్లిపోతాడు. ఆ తర్వాత మీనా కూడా వెళ్లిపోతుంది. రెస్టారెంట్ పరువు కాపాడిన రవి, శృతికి కొంత డబ్బును నీతూ గిఫ్ట్ గా ఇస్తుంది.
మీనాపై శృతి, రవి పొగడ్తలు.. గోల్డ్ రింగ్ గిఫ్ట్.. కుళ్లావతి ఈర్ష్య
{{/usCountry}}ఇంటికి రాగానే మీనా, బాలు ఎక్కడ అంటూ రవి, శృతి అడుగుతారు. హాల్లోనే ఉన్న మనోజ్, రోహిణి, ప్రభావతిలను పట్టించుకోరు. మీనా, బాలు రాగానే రవి, శృతి జరిగిన విషయం చెబుతారు. మీనాను ఆకాశానికెత్తుతారు. పూల వ్యాపారమే కాదు.. రెస్టారెంట్ లోనూ నీ ప్రతిభ చూపించావా అని సత్యం అంటాడు. ఆమె మల్టీ టాలెంటెడ్ అని శృతి అంటే.. బహుముఖ ప్రజ్ఞాశాలి అని రవి తెలుగులో మెచ్చుకుంటాడు.
ప్రభావతి కుళ్లుకుంటుంటే.. కుళ్లావతి, ఈర్ష్యావతి, కుట్రావతి అంటూ బాలు తల్లిని తిట్టడం మొదలు పెడతాడు. మీనా అతన్ని ఆపుతుంది. నీతూ డబ్బు ఇచ్చిందని, అది మీనాకే చెందాలన్న ఉద్దేశంతో ఓ రింగ్ తీసుకొచ్చామని రవి, శృతి ఇస్తారు. బాలుతో ఆమెకు రింగు తొడిగిస్తారు. అందరూ చప్పట్లు కొడితే మనోజ్, ప్రభావతి మాత్రం కుళ్లుకుంటారు.
ఇంటిపై అన్నదమ్ముల సిట్టింగ్.. మనోజ్‌కు క్లాస్
ఆ తర్వాత ఇంటిపై అన్నదమ్ములు సిట్టింగ్ ప్లాన్ చేస్తారు. రవి, మనోజ్ కోసం బాలు బీర్లు తీసుకొస్తాడు. ముగ్గురూ తాగడం మొదలుపెడతారు. అప్పుడే మీనాకు అమ్మ ముందే ఎందుకు రింగు ఇచ్చావు.. ఇప్పుడు ఆమె రోహిణిని మరింత అసహ్యించుకుంటుంది అని రవితో మనోజ్ అంటాడు. దీంతో రవి, బాలు ఇద్దరూ కలిసి మనోజ్ కు క్లాస్ పీకుతాడు.
నువ్వు ఎలాంటి వాడివైనా రోహిణి నిన్ను భరిస్తోంది.. ఎంతో ప్రేమిస్తోంది.. జీవితాంతం నీతో కలిసి ఉండేది ఆమెనే.. అందుకే నువ్వే అమ్మతో మాట్లాడి ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేయు అని చెబుతారు. నేనేం చెప్పినా అమ్మ వినడం లేదు.. కనీసం రోహిణిని చూడనివ్వడం లేదు.. ఇటు పెళ్లాం.. అటు తల్లి మధ్యలో నలిగిపోతున్నాను అని మనోజ్ తన బాధ చెప్పుకుంటాడు. అమ్మతో మాట్లాడటానికి మరో బీరు ఎక్కువగా తాగితే.. ఇప్పుడు తాగి మాట్లాడొద్దు తర్వాత మాట్లాడు అని రవి అంటాడు.
మీనా, శృతితో బాధ చెప్పుకున్న రోహిణి
ఇటు కింద కిచెన్ లో శృతి, మీనా మాట్లాడుకుంటూ ఉంటే రోహిణి వస్తుంది. ఒక్కసారి పొరపాటు చేస్తే అత్తయ్య నన్ను ఇంతలా హింసిస్తోంది అని బాధ చెప్పుకుంటుంది. ఒక్కసారి, పొరపాటా అని శృతి అంటే.. అవకాశం దొరికినప్పుడల్లా అనుకో అని రోహిణి అంటుంది. ఆంటీ ఇంకా నిన్ను హింసించడం లేదు.. మరొకరు అయితేనా అని శృతి తనదైన స్టైల్లో క్లాస్ పీకడంతో రోహిణి బిక్కమొహం వేస్తుంది.
మనోజ్, రోహిణి రొమాన్స్.. ప్రభావతి విడాకుల ప్లాన్
ఆ తర్వాత మనోజ్, రోహిణి గదిలో బెడ్ పై ఒకరిపై ఒకరు పడటం చూసి ప్రభావతి షాక్ తింటుంది. వాళ్ల రొమాన్స్ చూసి తట్టుకోలేకపోతుంది. కామాక్షి దగ్గరికి వెళ్లి మనోజ్, రోహిణికి విడాకులు ఇప్పిద్దామనుకుంటున్నానని, మనోజ్ కు ఓ కోటీశ్వరురాలిని తీసుకొస్తానని అంటుంది. అయితే అప్పటికే కామాక్షి ఇంట్లో ఉన్న రోహిణి బెడ్ రూమ్ లో దాక్కొని ఇదంతా వింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.