Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మొత్తం రోహిణిని మనోజ్ దగ్గరికి వెళ్లకుండా చేయడానికి ప్రభావతి పడే తంటాల చుట్టూ తిరిగింది. చివరికి ఆమె ఓ స్వామీజీ తాయత్తుతో ఆ పని చేయడానికి సిద్ధపడి.. దానిని తీసుకొచ్చినా బాలు వల్ల ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది.
రోహిణితో ఆడుకున్న శృతి.. కామాక్షి దగ్గరికి వెళ్లమన్న మీనా

మీనా, శృతి దగ్గరికి వెళ్లి తన కష్టాలు చెప్పుకోవడానికి రోహిణి ప్రయత్నించే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 2) ఎపిసోడ్ మొదలైంది. అత్తయ్య నుంచి తనను కాపాడే ప్లాన్ ఏదైనా ఉంటే చెప్పండి అని వాళ్లను రోహిణి అడుగుతుంది. నువ్వు మమ్మల్ని ప్లాన్ అడుగుతున్నావా.. ఎవరిని ఎలా బోల్తా కొట్టించాలో నీ దగ్గరే కన్నింగ్ ప్లాన్స్ చాలా ఉంటాయి కదా అంటూ శృతి మరోసారి ఆడుకుంటుంది. అయితే మీనా మాత్రం కామాక్షి దగ్గరికి వెళ్లి నీ కష్టాలు చెప్పుకొని, అత్తయ్యకు చెప్పమని చెప్పు అని సలహా ఇస్తుంది. ఆవిడ చెబితే మాత్రం వింటారా.. మామయ్య చెబితేనే వినడం లేదు అని రోహిణి అంటుంది.
మీనానే నిందించిన రోహిణి
మరైతే ఓ ఫేక్ స్వామీజీని ఏర్పాటు చేసి రోహిణి వల్లే ఇల్లంతా సంతోషంగా ఉందని ఎలివేషన్ ఇద్దామని శృతి అంటుంది. అది తెలిసిన రోజు నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది అని రోహిణి అంటుంది. ఎవరు చెబుతారు.. మనం చెప్పం కదా అని శృతి అంటే.. నువ్వు, నేను చెప్పకపోయినా ఇంట్లో అన్నింటికీ నీతి నిజాయతీ అంటూ తిరిగే ఇద్దరు ఉన్నారు.. వాళ్లు చెప్పేస్తారు అంటూ మీనా, బాలు గురించి రోహిణి పరోక్షంగా అంటుంది.
నీకు మంచి చెప్పడానికి ప్రయత్నిస్తే అలా అంటావేంటని మీనా అడుగుతుంది. నీ వల్లే కదా నాకు ఇలా జరిగింది అని మీనాను రోహిణి నిందిస్తుంది. మరి నువ్వు అన్ని మోసాలు చేసినా, అది తెలిసిన తర్వాత కూడా అత్తయ్య, మామయ్యకు చెప్పకపోవడం వాళ్లకు ద్రోహం చేసినట్లే అవుతుంది.. మేము చెప్పకపోయినా కామాక్షి పిన్ని చెప్పేది అని మీనా అంటుంది. దీంతో రోహిణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మనోజ్, రోహిణి రొమాన్స్.. ప్రభావతికి కల.. మనోజ్‌కు క్లాస్
{{/usCountry}}నీకు మంచి చెప్పడానికి ప్రయత్నిస్తే అలా అంటావేంటని మీనా అడుగుతుంది. నీ వల్లే కదా నాకు ఇలా జరిగింది అని మీనాను రోహిణి నిందిస్తుంది. మరి నువ్వు అన్ని మోసాలు చేసినా, అది తెలిసిన తర్వాత కూడా అత్తయ్య, మామయ్యకు చెప్పకపోవడం వాళ్లకు ద్రోహం చేసినట్లే అవుతుంది.. మేము చెప్పకపోయినా కామాక్షి పిన్ని చెప్పేది అని మీనా అంటుంది. దీంతో రోహిణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
మనోజ్, రోహిణి రొమాన్స్.. ప్రభావతికి కల.. మనోజ్‌కు క్లాస్
{{/usCountry}}ఆ తర్వాత మనోజ్ గదిలోకి రోహిణి వెళ్తుంది. అతను పడుకోవడం చూసి దగ్గరవడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకుంటుంది. అతని చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ తీస్తుంది. అది ఇవ్వమంటూ రోహిణి వెంట పడతాడు మనోజ్. ఈ క్రమంలో ఇద్దరూ మంచంపై పడతారు. రొమాన్స్ మొదలవుతుంది.
అయితే ఇదంతా ప్రభావతి కల అని తెలుస్తుంది. దీంతో ఆమె నిద్రలో నుంచి లేచి వెళ్లి వాళ్ల డోరు ముందు నిలబడి విజిల్ వేస్తుంది. మనోజ్ బయటకు వస్తాడు. దానికి దూరంగా ఉండమంటే.. లోపల గడియ పెట్టుకొని ఏం చేస్తున్నారు అని నిలదీస్తుంది. అది నిన్ను మాయ చేసి తన వలలో వేసుకుంటుంది అని నూరిపోస్తుంది. దీంతో సరే దూరంగానే ఉంటాను అని చెప్పి మనోజ్ లోనికి వెళ్తాడు. రోహిణి లోలోపల తిట్టుకుంటుంది.
కామాక్షి దగ్గరికి రోహిణి.. ఎన్ని కష్టాలో అంటూ వెటకారం
ఆ తర్వాత కామాక్షి దగ్గరికి రోహిణి వెళ్తుంది. ఆమెను చూడగానే కామాక్షిలో వెటకారం మొదలవుతుంది. నా కష్టాలు చెప్పుకుందామని వచ్చాను అని రోహిణి అనగానే.. అవును నీకు చాలా కష్టాలే ఉన్నాయి.. కోటీశ్వరురాలినని చెప్పి పెళ్లి చేసుకోవడం, ఎప్పుడో చచ్చిన తండ్రిని మళ్లీ చంపడం, బూడిద తీసుకురావడం, పార్లర్ అమ్మి అందులోనే పని చేయాల్సి రావడం.. ఇవన్నీ కష్టాలే కదా అని కామాక్షి వెటకారంగా అంటుంది. దీంతో రోహిణి ముఖం మాడిపోతుంది. ప్రభావతి తనతో ఎలా వ్యవహరిస్తుందో రోహిణి చెప్పుకుంటుంది. ఏదైనా పరిష్కారం చూపించాలని కోరుతుంది. అయితే అంతలోనే ప్రభావతి వస్తుంది.
ప్రభావతి ఎంట్రీ.. బెడ్‌రూమ్‌లో దాక్కున్న రోహిణి
దీంతో రోహిణి వెంటనే బెడ్‌రూమ్ లోకి వెళ్లి దాక్కుంటుంది. అత్తయ్య ఇక్కడ నన్ను చూస్తే చంపేస్తుంది అని భయపడుతుంది. రోహిణిని బెడ్‌రూమ్ లో పెట్టి గడియ పెట్టిన కామాక్షి.. ప్రభావతిని హాల్లో కూర్చోబెడుతుంది. లోపల ఏసీ వేసుకొని మాట్లాడుకుందాం అని ప్రభావతి వెళ్తుండగా.. ఆమెను అడ్డుకొని ఏసీ పని చేయడం లేదంటూ మళ్లీ హాల్లోనే కూర్చోబెడుతుంది.
మనోజ్, రోహిణికి విడదీయడానికి తాయత్తు
ఆ తర్వాత వచ్చిన విషయం చెబుతుంది. ఊళ్లోకి ఎవరో పెద్ద స్వామీజీ వచ్చాడట కదా.. ఆయన అపాయింట్‌మెంట్ తీసుకో.. మనోజ్, రోహిణిని విడదీయాలి.. దానికోసం ఓ తాయత్తు అడుగుదాం.. దాంతో ఆ మాయలాడిని ఇంట్లో నుంచి తరిమేసి నా కొడుక్కి కోటీశ్వరురాలిని తెచ్చి పెళ్లి చేస్తాను అని అంటుంది. అదంతా గదిలో ఉన్న రోహిణి విని షాకవుతుంది. ఆ తర్వాత ప్రభావతి వెళ్లిపోతుంది.
అయితే అనుకున్నట్లుగానే ఆ తాయత్తు తీసుకొచ్చి ఇంట్లో పూజ గదిలో పెడుతుంది. తర్వాత మీనాను పిలిచి అది ఎవరూ ముట్టకూడదని వార్నింగ్ ఇస్తుంది. కానీ బాలు మాత్రం ఇది నాన్న కోసం అమ్మ ప్రేమతో తెచ్చిన తాయత్తే అని అతనికి కట్టబోతాడు. అది చూసిన ప్రభావతి పరుగెత్తుకుంటూ వస్తుంది. అది ఆయన కోసం కాదని చెబుతుంది. మరి ఎవరి కోసం అని బాలు నిలదీస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.