Gunde Ninda Gudi Gantalu Promo: మీనాకు పెద్ద ఆర్డర్.. ఇంట్లో వాళ్లకు మటన్ బిర్యానీ.. మటన్ కొడుతూ దొరికిన మాణిక్యం
Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో మీనాకు పెద్ద పూల ఆర్డర్ రావడం, ఆమె అందరికీ బిర్యానీ పార్టీ ఇవ్వాలనుకోవడం, మటన్ తీసుకురావడానికి వెళ్తే అక్కడ మాణిక్యం దొరికిపోవడం చూడొచ్చు.
Gunde Ninda Gudi Gantalu Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో రోహిణిని మరోసారి బుక్ చేసేలా కనిపిస్తాడు మటన్ కొట్టు మాణిక్యం. మీనా బిర్యానీ పార్టీ అతని చావుకు వస్తుంది. ఆమె నుంచి అతడు తప్పించుకుంటాడా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది.

మీనాకు పెద్ద పూల ఆర్డర్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ తాజా ప్రోమోలో మీనాకు పెద్ద పూల ఆర్డర్ వచ్చినట్లుగా చూపించారు. ఆమె సాధారణ పూల బిజినెస్ నుంచి ఫంక్షన్లలో డెకరేషన్లు చేసే స్థాయికి ఎదిగిన విషయం తెలుసు కదా. అందులో భాగంగా రెగ్యులర్ గా భారీ ఆర్డర్లు వచ్చే వ్యక్తి మీనాకు పరిచయం అవుతాడు.
అదే సంతోషంలో మీనా ఇంటికి స్వీటు తీసుకొని వస్తుంది. షరా మామూలుగానే ప్రభావతి, మనోజ్ ఆమెను అవమానించేలా మాట్లాడతారు. అయితే బాలు మాత్రం స్వీట్లు కాదు.. అందరికీ మటన్ బిర్యానీ పెడదామంటూ మీనాకు డబ్బులు ఇస్తాడు.
మటన్ కొట్లో మాణిక్యం
దీంతో మీనా మటన్ తీసుకురావడానికి షాపుకు వెళ్తుంది. ఫోన్ రావడంతో ఆమె పక్కకెళ్లి మాట్లాడుతుండగా.. మీనా ఫ్రెండ్ వెళ్లి నాలుగు కిలోల మటన్ కావాలని అడుగుతుంది. ఆ షాపులో మాణిక్యం ఉంటాడు. ఎవరికి అని అడిగితే తన ఫ్రెండ్ కంటూ మీనాను చూపిస్తుంది. ఆమెను చూడగానే మాణిక్యం భయంతో వణికిపోతాడు. అంతటితో గుండె నిండా గుడి గంటలు ప్రోమో ముగుస్తుంది.
మాణిక్యం మీనాకు దొరికిపోతాడా లేక తప్పించుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మలేషియా మామగా రోహిణి అతన్ని ఇంట్లో పరిచయం చేస్తే.. అతడు మాత్రం ప్రతిసారీ ఆమెను ఇరుకునపెట్టేలా కనిపిస్తున్నాడు. ఈసారి అతడు దొరుకుతాడా? అతనితోపాటు రోహిణి గుట్టు కూడా బయటపడుతుందా అన్నది చూడాలి.
తాజా ఎపిసోడ్ ఇలా..
గుండె నిండా గుడి గంటలు తాజాగా ఎపిసోడ్లో మనోజ్ తోపాటు ప్రభావతికి కూడా గండం ఉందని స్వామీజీ చెప్పడంతో అతడు సూచించిన పరిహారం చేయాలని మనోజ్ నిర్ణయించుకుంటాడు. కానీ ప్రభావతి మాత్రం అందుకు ఒప్పుకోదు. అయితే ఆమెపై ఫ్యాన్ విరిగి పడటం, కరెంట్ షాక్ తగలడం లాంటి ప్రాణగండాలు జరుగుతుంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రభావతి.. మనోజ్ చెప్పిన పరిహారం చేయడానికి ఒప్పుకోక తప్పని పరిస్థితిలో పడుతుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


