Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ లో బాలుకి రోహిణి దొరికినట్లే దొరికి తప్పించుకుంటుంది. దానికి కూడా మనోజ్ నే వాడుకుంటుంది. ఇదే అదునుగా బాలు నుంచి గుణ తప్పించుకొని పారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
రవి, సత్యం ఆకలి కష్టాలు.. బాలు ఓదార్పు

బార్ లో మనోజ్ వెనకాలే గుణ కూర్చోవడం రాజేష్ చూసి కంగారు పడే సీన్ తో సీరియల్ గురువారం (సెప్టెంబర్ 10) ఎపిసోడ్ మొదలైంది. ఈ విషయం వెంటనే బాలుకి చెప్పాలని అతడు అనుకుంటాడు. ఇటు ఇంట్లో వ్రతం కావడంతో రవి ఆకలితో అలమటిస్తుంటాడు.
అతన్ని బాలు ఓదారుస్తాడు. కాస్త నీళ్లు తాగి ఆకలి మంటలు చల్లార్చుకో అని చెబుతాడు. అటు సత్యం కూడా ఆకలికి తట్టుకోలేక బయట కూర్చొని అరటి పండు తినడం చూసి బాలు షాక్ తింటాడు. నీకూ, రవికి కూడా రెండు పండ్లు అక్కడ పెట్టాను తినండి అని సత్యం అని వెళ్లిపోతాడు.
బాలుకి రాజేష్ ఫోన్.. గుణ గురించి చెప్పి..
అప్పుడే బాలుకి రాజేష్ ఫోన్ చేస్తాడు. బార్ కు రమ్మని చెప్పడంతో ఇంట్లో వ్రతం ఉందంటాడు. ఇక్కడ మనోజ్ ఉన్నాడు. వాడి వెనుకే గుణ కూర్చున్నాడు. వాడు నీపై పగతో మనోజ్ ను ఏమైనా చేస్తాడేమో అనిపిస్తోంది అని రాజేష్ అంటాడు. దీంతో బాలు హడావిడిగా వెళ్లిపోతాడు. మీనా అడ్డుపడినా వెంటనే వస్తానంటూ వెళ్తాడు.
మనోజ్ వీడియో తీసి పంపిన గుణ.. పరుగెత్తుకుంటూ వెళ్లిన రోహిణి
మరోవైపు రోహిణి బాధగా ఓ మూలన నిల్చోవడం చూసి ప్రభావతి ఆమెను తిడుతుంది. వాళ్లకు ఏదైనా సాయం చేయమని అంటుంది. సరే అంటూ రోహిణి సిద్ధమవుతుంది. అటు రోహిణి ఇంకా రాకపోవడంతో ఆమెను మరింత భయపెట్టాలనుకొని మనోజ్ వీడియో తీసి ఆమెకు పంపిస్తాడు గుణ. అది చూసి రోహిణి షాక్ తింటుంది. వ్రతంలో కూర్చోకపోతే అత్తయ్య తిడుతుంది.. కానీ అక్కడికి వెళ్లకపోతే ఆ గుణగాడు తన కాపురాన్నే కూల్చేలా ఉన్నాడు.. తిడితే తిట్టింది కానీ అక్కడికే వెళ్దామనుకొని పరుగెత్తుకొని వెళ్తుంది.
వ్రతం ప్రారంభం.. కనిపించని రోహిణి.. ప్రభావతికి ఆవేశం
{{/usCountry}}మరోవైపు రోహిణి బాధగా ఓ మూలన నిల్చోవడం చూసి ప్రభావతి ఆమెను తిడుతుంది. వాళ్లకు ఏదైనా సాయం చేయమని అంటుంది. సరే అంటూ రోహిణి సిద్ధమవుతుంది. అటు రోహిణి ఇంకా రాకపోవడంతో ఆమెను మరింత భయపెట్టాలనుకొని మనోజ్ వీడియో తీసి ఆమెకు పంపిస్తాడు గుణ. అది చూసి రోహిణి షాక్ తింటుంది. వ్రతంలో కూర్చోకపోతే అత్తయ్య తిడుతుంది.. కానీ అక్కడికి వెళ్లకపోతే ఆ గుణగాడు తన కాపురాన్నే కూల్చేలా ఉన్నాడు.. తిడితే తిట్టింది కానీ అక్కడికే వెళ్దామనుకొని పరుగెత్తుకొని వెళ్తుంది.
వ్రతం ప్రారంభం.. కనిపించని రోహిణి.. ప్రభావతికి ఆవేశం
{{/usCountry}}ఇటు ఇంట్లో వ్రతం ప్రారంభించడానికి మీనా అంతా సిద్ధం చేస్తుంది. తీరా సమయానికి రోహిణి కనిపించదు. పెద్ద కోడలితో దీపం వెలిగించిన తర్వాతే వ్రతం ప్రారంభించాలని చుట్టుపక్కల వాళ్లు అనడంతో ప్రభావతికి కోపం ముంచుకొస్తుంది. వద్దంటే మీరందరూ కలిసి దానితో వ్రతం చేయించడానికి ఒప్పించారు.. తీరా వ్రతం సమయానికి అది ఎక్కడికో వెళ్లిపోయింది అని మీనా, సత్యంతో ప్రభావతి అంటుంది. ఆ మలేషియా మంత్రగత్తె అంటూ మళ్లీ తిట్టడం ప్రారంభించే సరికి తాను ఫోన్ చేస్తానని మీనా అంటుంది. వద్దు నేనే చేస్తానని ప్రభావతి చేస్తుంది.
మీనాతో వరలక్ష్మీ వ్రతం చేయించిన ప్రభావతి
కానీ రోహిణి మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే వెంటనే రమ్మంటుంది.. కానీ గుణ దగ్గరికి వెళ్లడమే ఇప్పుడు ముఖ్యం అని అనుకుంటుంది. రోహిణి లేకపోవడంతో అందరూ మీనా వైపు చూస్తారు. ఈ ఇంట్లో మొదట అడుగుపెట్టింది మీనానే కాబట్టి ఆమెతో దీపం వెలిగించండి అని చుట్టుపక్కల వాళ్లు చెబుతారు. సత్యం కూడా అదే కరెక్ట్ అని అంటాడు. దీంతో ఇష్టం లేకపోయినా ప్రభావతి సరే అనడంతో మీనా వ్రతం ప్రారంభిస్తుంది.
గుణను పట్టుకున్న బాలు.. రోహిణిని చూసి పారిపోయిన గుణ
అటు బార్ లో మనోజ్ నే చూస్తూ అతని వైపు వెళ్తున్న గుణను బాలు పట్టుకుంటాడు. నువ్వు ఇక మారవా రా.. నాపై ఉన్న కోపాన్ని ఇప్పుడు నా అన్నపై చూపించాలనుకుంటున్నావా అని గుణ కాలర్ పట్టుకొని అడుగుతాడు. నీపై మా డ్రైవర్లందరూ చాలా కోపంగా ఉన్నారు.. అందరినీ పిలిస్తే చేతులు, కాళ్లు పట్టుకుపోతారు అని రాజేష్ అంటాడు.
ఇలా కుదరదు పోలీస్ స్టేషన్ కు పదా అని గుణను తీసుకెళ్తున్న సమయంలోనే రోహిణి వస్తుంది. ఆమెను చూసి బాలు షాక్ తింటాడు. ఇదే అదునుగా గుణ తప్పించుకొని పారిపోతాడు. అతని వెంట బాలు, రాజేష్ పడతారు.
రోహిణిని నిలదీసిన బాలు.. మళ్లీ తప్పించుకున్న పార్లరమ్మ
ఇటు మనోజ్ దగ్గరికి రోహిణి వెళ్తుంది. ఆమెను చూసి నువ్వు కూడా తాగడానికి వచ్చావా.. మోసం చేయడమే వచ్చనుకున్నా తాగే అలవాటు కూడా ఉందా అంటూ మనోజ్ తాగిన మత్తులో వాగుతాడు. అప్పుడే బాలు వచ్చి రోహిణిని నిలదీస్తాడు. నువ్వేంటి ఇక్కడ.. వాడు ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలుసు అని అడగుతాడు.
దీంతో మనోజే ఫోన్ చేశాడు అని రోహిణి అబద్ధం చెబుతుంది. తాగిన మత్తులో ఉన్న మనోజ్ ను బకరాను చేస్తుంది. పక్కనే ఉన్న మణికంఠ తనకు తెలియకుండా ఎప్పుడు చేశాడని ఆశ్చర్యపోతాడు. మనోజ్ చెప్పకుండా అతడు ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలుస్తుందని రోహిణి బుకాయిస్తుంది. దీంతో బాలు కూడా అదీ కరెక్టే అనుకుంటాడు. అందరూ కలిసి మనోజ్ ను బలవంతంగా తీసుకెళ్తారు.
ఇంట్లో ప్రభావతి రచ్చ..
అటు ఇంట్లో వ్రతం పూర్తవుతుంది. మీనా అందరికీ వాయనాలు ఇస్తుంది. అప్పటికీ రోహిణి రాకపోవడంతో ప్రభావతి రచ్చ చేస్తుంది. మనోజ్ క్షేమం కోసం దానిని వ్రతానికి అనుమతిస్తే.. తీరా సమయానికి కనిపించకుండా పోయిందని అంటుంది. అప్పుడే మనోజ్ ను తీసుకొని బాలు, రోహిణి వస్తారు. ముందు రోహిణి లోనికి వెళ్లడంతో ప్రభావతి ఆమెను తిడుతుంది.
తాను బార్ కు వెళ్లానని ఆమె అనడంతో అందరూ షాక్ తింటారు. ఆ తర్వాత బాలు వస్తాడు. నువ్వెక్కెడికెళ్లావని సత్యం అడిగితే బార్ కు వెళ్లానని అంటాడు. దీంతో అందరూ బిక్కమొహం వేస్తారు. మనోజ్ గాడు తాగుతున్నాడని తెలిసి తీసుకురావడానికి వెళ్లినట్లు బాలు చెబుతాడు. అప్పుడే మనోజ్ పాకుతూ ఇంట్లోకి వస్తాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.