...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: వంటలక్కగా ప్రభావతి.. వియ్యపురాలికి గట్టిగా ఇచ్చిన పార్వతి.. చింతామణిపై బాలు డౌట్

Gunde Ninda Gudi Gantalu Serial September 23rd Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 23 ఎపిసోడ్ లో ప్రభావతికి వంట కష్టాలు మొదలవగా.. అటు కాబోయే అత్తను అక్క మీనాకు పరిచయం చేస్తుంది సుమతి. బాలు కూడా ఇది చింతామణి పనే అని అనుమానిస్తాడు.

Published on: Sep 23, 2026, 07:05:20 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మీనాను చూడటానికి వచ్చిన ఆమె తల్లి పార్వతి ప్రభావతికి ఎడాపెడా ఇచ్చేయడం.. ఆ తర్వాత ప్రభావతి వంటలక్కగా మారడం.. అటు కాబోయే అత్తను మీనాకు సుమతి పరిచయంలాంటి సీన్లతో సాగిపోయింది.

మీనానే నిందించిన ప్రభావతి.. ఎదురు తిరిగిన మీనా

Gunde Ninda Gudi Gantalu Today Episode: వంటలక్కగా ప్రభావతి.. వియ్యపురాలికి గట్టిగా ఇచ్చిన పార్వతి.. చింతామణిపై బాలు డౌట్
Gunde Ninda Gudi Gantalu Today Episode: వంటలక్కగా ప్రభావతి.. వియ్యపురాలికి గట్టిగా ఇచ్చిన పార్వతి.. చింతామణిపై బాలు డౌట్

ఐదు లక్షలు పోయాయని బాధగా ఇంటికి వచ్చిన మీనానే ప్రభావతి నిందించే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ మొదలైంది. తన నగలను ఇవ్వాలని సత్యం అంటాడు. కానీ ఆమె ఇవ్వనంటుంది. మనోజ్ కోసం మీనా నగలు ఇవ్వలేదా.. అయినా ఆమె ఇప్పటి వరకూ ఏమీ అనలేదు కదా అని సత్యం అంటాడు. కానీ ప్రభావతి మాత్రం అవేమీ పట్టించుకోదు.

ఇంటింటికీ పూలు అమ్మితే సరిపోదన్నట్లు ఎవరు దానిని ఆకాశానికి నిచ్చెన వేయమన్నారు.. ఎందుకు అంత ఆశ అని మీనానే తిడుతుంది. దీంతో ఇక లాభం లేదనుకున్న సత్యం.. బీరువా బద్దలు కొట్టయినా ఆమె నగలు తీసుకొస్తానంటూ వెళ్తుంటే మనోజ్ అడ్డుకుంటాడు. మీనా కూడా వద్దు మావయ్య.. ఇప్పుడు మీరు సాయం చేసినా జీవితాంతం అత్తయ్య నన్ను నిందిస్తూనే ఉంటుంది.. నేను, మా ఆయన ఏవో తంటాలు పడతామని వెళ్లిపోతుంది. ఆ తర్వాత రవి, శృతి కూడా ప్రభావతిని చూసి ఛీ అంటూ వెళ్లిపోతారు.

మీనాను చూడటానికి వచ్చిన పుట్టింటి వాళ్లు..

ఆ తర్వాత మీనాను చూడటానికి పుట్టింటి నుంచి పార్వతి, శివ, సుమతి వస్తారు. గేటు బయట ఉండగానే ప్రభావతి ఏమంటుందో అని పార్వతి కంగారు పడుతుంది. కానీ లోనికి వెళ్లిన తర్వాత మాత్రం తన విశ్వరూపం చూపిస్తుంది. ప్రభావతిని చూడగానే ఆమెకు కౌంటర్ ఇవ్వడం మొదలు పెడుతుంది. శివను పరీక్షలు బాగా రాశావా అని సత్యం అడిగితే.. అతడు ఫస్ట్ క్లాస్ పాసవుతానని అంటాడు.

మీనా రాగానే ఎలా ఉందమ్మా.. అయినా వాళ్లు తోయగానే పడిపోయేంత బలహీనంగా ఉన్నావా.. వాళ్ల కాళ్లు విరగ్గొట్టాల్సిందని పార్వతి అనడంతో అందరూ షాక్ తింటారు. మీరేనా ఇలా మాట్లాడుతుంది అని బాలు అంటాడు.

మీనాకు ధైర్యం.. ప్రభావతికి కౌంటర్

ఆ తర్వాత మీనాకు ధైర్యం చెబుతుంది. డబ్బు గురించి మీనా మాట్లాడుతూ.. సుమతికి క్షమాపణ చెబుతుంది. ఆ డబ్బు ఎలాగైనా ఇస్తానని అంటుంది. దాని గురించి నువ్వు బాధపడకు.. సుమతి పెళ్లి కోసం చేసిన నగలు ఉన్నాయి.. అవసమైతే అవి అమ్మి అయినా డబ్బు ఇచ్చేద్దాం అని మీనాకు పార్వతి ధైర్యం చెబుతుంది. అది విని ప్రభావతి వైపు నీచంగా చూస్తాడు సత్యం. ఆ తర్వాత ప్రభావతి ఏదో అనబోతే.. రోహిణి పేరు చెప్పి మరోసారి క్లాస్ పీకుతుంది పార్వతి.

మీనా ఇల్లు ఇదీ అని మేము పెళ్లి చేశాం.. కానీ పాపం రోహిణికి ఇల్లు, అమ్మానాన్న, నా అనేవాళ్లు ఎవరూ లేరట కదా అని పార్వతి కౌంటర్ వేస్తుంది. దీంతో రోహిణి, మనోజ్ ముఖాలు మాడిపోతాయి. తర్వాత ప్రభావతిని కాఫీ పెట్టివ్వమని సత్యం అడిగితే.. వద్దులే అన్నయ్యా.. ఆమె చేత్తో కాఫీ తాగేంత గొప్పవాళ్లం కాదు.. గుడి దగ్గరే తాగుతాం.. మేము త్వరగా వెళ్లిపోతున్నామని వదినగారు చాలా సంతోషిస్తారు అని పార్వతి మరోసారి క్లాస్ పీకి వెళ్లిపోతుంది. బయటకు వెళ్లిన తర్వాత నువ్వేంటి ఇలా మాట్లాడావని సుమతి, శివ అంటారు. తాను కూడా గుండెను అరచేత్తో పట్టుకొని అలా మాట్లాడనంటూ పార్వతి అంటుంది.

షోరూమ్‌కి వచ్చిన రోహిణి.. క్లాస్ పీకిన మనోజ్

ఆ తర్వాత మనోజ్ షోరూమ్ కి రోహిణి వెళ్తుంది. అతని కోసం లంచ్ తీసుకెళ్తుంది. కానీ ఆమెను చూడగానే మనోజ్ మళ్లీ తిడతాడు. మళ్లీ ఎందుకు వచ్చావ్.. అమ్మకు తెలిస్తే తిడుతుంది.. ఆమె నిన్ను పదే పదే తిడుతుంటే నేను వినలేకపోతున్నాను అని మనోజ్ అంటాడు.

కానీ రోహిణి మాత్రం అన్నీ మీ అమ్మకి చెప్పి చేయాలా.. మనం ప్రేమించుకుంటున్నామన్నది మీ అమ్మకు చెప్పామా.. షోరూమ్ పెట్టేది ముందుగా చెప్పామా.. ఇప్పుడామె జీవితాంత మాట్లాడొద్దంటే మాట్లాడవా.. నన్ను చచ్చిపోమంటావా అని నిలదీస్తుంది. దీంతో మనోజ్ నోట మాట రాదు. రోహిణి ఏడుస్తూ వెళ్లిపోతుంది.

ప్రభావతికి వంట కష్టాలు.. వేలు తెగి.. ఆట పట్టించిన కామాక్షి

అటు ఇంట్లో ప్రభావతికి వంట కష్టాలు మొదలవుతాయి. మీనాకు గాయం కావడంతో ప్రభావతి వంట చేస్తుంటుంది. ఈ క్రమంలో కారం పొడి ఉన్న చేతిని కళ్లలో పెట్టుకుంటుంది. ఆ తర్వాత చేతి వేలు కట్ చేసుకుంటుంది.. పసుపు బదులు కారంపొడి వేసుకొని లబోదిబోమంటుంది. అప్పుడే కామాక్షి ఇంటికి వస్తుంది. ప్రభావతి వంట చేయడం చూసి షాక్ తింటుంది. మీనా గురించి చెప్పి ప్రభావతి రుసరుసలాడుతుంది. అయినా ఆమె డబ్బు కావాలని ఏదో చేయలేదు కదా.. మీ మనోజ్ గాడిలాగా మింగేయలేదు కదా అని కౌంటర్ ఇవ్వడంతో ప్రభావతి షాక్ తింటుంది.

కాబోయే అత్తను పరిచయం చేసిన సుమతి

మరోవైపు సుమతి పని చేసే హాస్పిటల్ కు మీనా వెళ్తుంది. ఆమె వెంట అరుణ్ తల్లి కూడా ఉంటుంది. సుమతి దగ్గరికి వెళ్లి ఈమెనే మా చెల్లి అని ఆమెకు పరిచయం చేయగా.. ఇక్కడ పని చేస్తున్న మంచి అమ్మాయి కూడా ఈమెనే అని అరుణ్ తల్లి అంటుంది.

ఆమె వెళ్లిపోయిన తర్వాత డబ్బు తీసుకున్నది వాళ్ల దగ్గరే అని మీనాతో అంటుంది సుమతి. దీంతో మీనా షాక్ తింటుంది. అటు కామాక్షి దగ్గరికి వెళ్లిన బాలు.. డబ్బు దొంగలించడం చింతామణి పనే అయి ఉంటుందని అనుమానిస్తాడు. ఆమె కూడా అదే అంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks