Gunde Ninda Gudi Gantalu Today Episode: నీలకంఠంకు రాఖీ, గోల్డ్ రింగ్ కొట్టేసిన ప్రభావతి- వ్రతం కోసం రోహిణి కొత్త నాటకం
Gunde Ninda Gudi Gantalu Serial September 4th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 4వ తేది ఎపిసోడ్‌లో బాలుకు సంజు సారీ చెబుతాడు. మౌనిక రాఖీ కడుతుంది. వ్రతానికి మౌనిక పుట్టింట్లోనే ఉంటుందని చెబుతుంది మీనా. మీనాపై బాలు ముద్దులవర్షం కురిపిస్తాడు. వ్రతానికి రోహిణిని వద్దంటుంది అత్త.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా, శ్రుతిని గేట్ బయటి నుంచే పంపించేసి ఉంటారని ప్రభావతి, రోహిణి అవమానంగా మాట్లాడుతారు. మన గేట్ బయట ఏం జరుగుతుందో చూడండని శ్రుతి అంటుంది.

అప్పుడే కారులో నీలకంఠం, సంజు వస్తారు. ఇద్దరికి మర్యాదలు చేస్తారు. ఎన్నాళ్లకు మా పేదింటికి వచ్చారని ప్రభావతి అంటుంది. పేదిళ్లా.. గంజినీళ్లు తాగి అతుకుల బట్టలు వేసుకుంటున్నామా అని శ్రుతి కౌంటర్ ఇస్తుంది. ఏదైనా సమస్య అని సత్యం అడుగుతాడు. మా నుంచి ఓ తప్పు జరిగింది. అది సరిదిద్దుకుందామని వచ్చామని నీలకంఠం అంటాడు.
అమానుషం అనిపించింది
అయ్యో బాబాయ్ ఎంతమాట. అది సంజు అన్నయ్య చెబితే ఎంత బాగుండేది మీరు చెబుతున్నారు అని మీనా, శ్రుతి అంటారు. నీలకంఠం సైగ చేయడంతో మేము హడావిడిలో ఉండి మౌనికను బాధపెట్టాల్సి వచ్చింది. బాలుకి మౌనికతో రాఖీ కట్టించలేకపోయామని సంజు అంటాడు. మీ అల్లుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. మా ఇంట్లో కార్యక్రమం నడుస్తుంది. బాలు ఎప్పుడు వచ్చిన గొడవ చేస్తాడుగా. అందుకే రానివ్వలేదన్నట్లుగా అని నీలకంఠం అంటాడు.
ఇంతకుముందు ఎన్నైనా జరిగి ఉండొచ్చు. కానీ, చెల్లిచేత రాఖీ కట్టించుకునేందుకు వచ్చిన అన్నయ్యను ఆపడం అమానుషం అనిపించింది అని సత్యం అంటాడు. గొడవ పడితే ఎక్కడ బ్యాడ్‌గా ప్రచారం అవుతుందేమో అని నీలకంఠం కవర్ చేస్తాడు. అయ్యో.. ఎలా పడితే అలా గొడవ పడేందుకు మా ఆయన సంస్కారం లేనివాడు కాదు. మీరే చూశారుగా. రాక్షసుల్లా ప్రవర్తించినందుకు మీ అబ్బాయి చేత మా ఆయనకు సారీ చెప్పించండి అని మీనా అంటుంది.
అంతా షాక్ అవుతారు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అనే ప్రభావతి అంటే.. మీ కుప్పిగంతులు కాసేపు ఆపుతారా అని మీనా కౌంటర్ ఇస్తుంది. కాసేపు తైతక్కలు ఆపండని శ్రుతి కూడా అంటుంది. నీలకంఠం సైగ చేయడంతో.. బాలు చేతులు పట్టుకుని బావ నువ్వు నాకన్న పెద్దవాడివి. మౌనికతో రాఖీ కట్టించకుండా పంపించాను. నాకు చెల్లి ఉంటే ఆ బంధం విలువ తెలిసేది. అప్పుడు నేను చేసినందుకు మనస్ఫూర్తిగా క్షమించానని చెప్పు చాలు అని సంజు క్షమాపణలు చెబుతాడు.
ఉత్తచేతులతో ఊపుకుంటూ వచ్చారా
అదేంటండి కొయ్యబారిపోయారు అని మీనా.. మా అన్నయ్య నీకు సారీ చెబుతున్నారని శ్రుతి అంటారు. మీరు నాకు మనస్ఫూర్తిగా సారీ చెబుతున్నారా అని బాలు అడుగుతాడు. లేదంటే వాడి నోట వెంట సారీ విన్నావా బాబు అని నీలకంఠం అంటాడు. నిజమే. కానీ, సారీకి బదులు మౌనికతో నాకు రాఖీ కట్టించుంటే ఇంకా సంతోషించేవాన్ననని బాలు అంటాడు.
మౌనికను తీసుకురాకుండా ఉత్తచేతులతో ఊపుకుంటూ వచ్చారా బాబాయ్ గారు అని మీనా అంటుంది. అలా ఎందుకు అనుకుంటారని చెప్పిన నీలకంఠం సంజుతో మౌనికను తీసుకురమ్మంటాడు. మౌనిక వస్తుంది. బాలుకు చాలా సంతోషంగా మౌనిక రాఖీ కడుతుంది. నీలకంఠం ఇంట్లో మనోజ్, రవిలకు ఫార్మాలిటీగా మౌనిక రాఖీ కడితే బాలుకు మాత్రం పుట్టింట్లో స్పెషల్‌గా రాఖీ కట్టేలా చేసింది మీనా.
అలా మాట్లాడినందుకు క్షమించు అని మౌనిక అంటుంది. అది కావాలని వచ్చిన మాటలు కాదని నీలకంఠం అంటే.. తెలుసు. మాకు మౌనిక మనసు తెలుసు. మీరే అమాయకులు అని ఒక్కో కౌంటర్ ఇస్తూ అల్లాడిస్తుంది మీనా. ఇంకేదే మర్చిపోయామే.. మా ఆయన తెచ్చిన చీర నేలకేసి కొట్టారుగా. అదే చీరను మీ చేతులతో మా ఆయనకు ఇచ్చి మౌనికకు ఇప్పించండని మీనా అంటుంది.
ఊహించని షాక్ ఇచ్చిన మీనా
చేసేదేం లేక సంజు అలాగే చేస్తాడు. ఇక వెళ్దామా అని నీలకంఠం అంటే.. మీరు ఇలా ఆలోచిస్తున్నారేంటీ బాబాయ్ అని మీనా అంటే కోడి బ్రెయిన్ అనుకుంటా అని శ్రుతి అంటుంది. మా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటున్నాం. మా ఇంటి ఆడపడుచుతో చేయిస్తాం. మీరు వెళ్లండి. మౌనిక వ్రతం అయ్యాక వస్తుందని మీనా అంటుంది.
రాఖీ వరకు అనుకుందే జరిగిన వ్రతం పేరు చెప్పి నీలకంఠం, సంజుకు ఊహించని షాక్ ఇస్తుంది మీనా. నీలకంఠం వెళ్తుంటే.. నాకు అన్నయ్యలు ఎవరు లేరు. మీరు నాకు వరసకు అన్నయ్యే అవుతారు కాబట్టి, రాఖీ కడతానని ప్రభావతి అంటుంది. నీలకంఠంకు ప్రభావతి రాఖీ కట్టి హారతి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది. గిఫ్ట్ కూడా ఆయన రేంజ్‌లో ఉంటుందని మనోజ్ అంటాడు.
ఆయనకు తెలియదారా అని ప్రభావతి అంటుంది. ఏం చేయలేక చేతికున్న గోల్డ్ ఉంగరం కట్నం కింద ప్రభావతికి ఇచ్చేస్తాడు నీలకంఠం. రాఖీ కట్టి గోల్డ్ రింగ్ కొట్టేస్తుంది ప్రభావతి. నీలకంఠం వాళ్లు వెళ్లిపోతారు. ఏంటే ఇది అంతా కలలా ఉందని ప్రభావతి అంటుంది. నా భర్తను అవమానిస్తే యముడినైనా ఎదిరిస్తానని మీనా అంటుంది.
మీనాపై ముద్దుల వర్షం
థ్యాంక్స్ పూలగంప అని బాలు చెబుతాడు. తర్వాత రాఖీ చూసుకుంటూ మురిసిపోతాడు బాలు. మీనా వస్తే గట్టిగా హత్తుకుని ముద్దు పెడతాడు బాలు. జరిగింది చెప్పి చాలా సంతోషిస్తాడు బాలు. ఆనందబాష్పాలు రాలుస్తాడు బాలు. మీనా చేతికి ముద్దు పెట్టి థ్యాంక్స్ చెబుతాడు. వాళ్లను ఎలా ఒప్పించావని బాలు అంటే.. రాఖీ పౌర్ణమి విశిష్టత చెబితే వచ్చారంటుంది.
బాలు నమ్మడు. చెప్పాలని ఉంది కానీ, చెప్పను. చెబితే శ్రుతికి పేరు వస్తుంది. అక్కడ శ్రుతినే డ్రామా ఎక్కువ చేసిందని జరిగింది చెబుతుంది మీనా. నీ బుర్రనిండా ఇన్ని తెలివితేటలు ఉన్నాయా అని మీనాపై ముద్దుల వర్షం కురిపిస్తాడు బాలు. అదంతా వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెడతానని మీనా అంటే.. పూలగంప కాస్తా పూలందేవి అవుతుందే అని బాలు అంటాడు.
ఇద్దరు చక్కిలిగింతలు పెట్టుకుంటారు. తర్వాత సత్యంకు తల్లి సుశీల కాల్ చేస్తుంది. గొడవల గురించి అడిగితే.. ప్రభావతికి ఫోన్ ఇవ్వమంటుంది. శ్రావణమాసం వచ్చింది. ముగ్గురు కోడళ్లతో కలిపి వరలక్ష్మి వ్రతం చేయించు అని సుశీల ఆర్డర్ వేస్తుంది. ఇద్దరు ఓకే కానీ ఆ మోసగత్తే సంగతి తెలియదని ప్రభావతి అంటుంది. రోహిణికి ఇవ్వమని సుశీల అంటుంది.
వ్రతం కోసం రోహిణి కొత్త నాటకం
నీ కాపురం బాగుండాలంటే వ్రతం చేసుకోవాలని రోహిణికి చెబుతుంది సుశీల. అందరితో మాట్లాడి సుశీల కాల్ పెట్టేస్తుంది. ఆరోజు నాకు మేకప్ ఆర్డర్స్ చాలా ఉంటాయి ఎలా అని రోహిణి అడిగితే.. నిన్నెవరు వ్రతం చేయమన్నారు. ఈవిడ చరిత్ర ఊరంతా తెలిసింది. వ్రతం రోజు ఇంట్లో ఉండకపోవడమే మంచిదని ప్రభావతి అంటుంది.
తర్వాత ప్రభావతి దగ్గరికి సోది చెప్పే ఆమె వస్తుంది. పెద్దకోడలు మహాలక్ష్మే తల్లి. నీ పెద్దకొడుకును కోటీశ్వరుడిని చేస్తుందే తల్లి. వ్రతంలో కూర్చోబెట్టు అని ప్రభావతికి జాతకం చెబుతుంది సోది చెప్పే ఆమె. అది కూడా వ్రతం కోసం రోహిణి కొత్త నాటకం వేసిందని తెలుస్తోంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


