...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణికి గుణ బ్లాక్ మెయిల్- బారులో గుణను పట్టుకున్న బాలు- రోహిణికి మైండ్ బ్లాక్

Gunde Ninda Gudi Gantalu Serial September 8th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 8వ తేది ఎపిసోడ్‌లో కిచెన్‌లో మీనా నడుము చూసి బాలు టెంప్ట్ అవుతాడు. బారులో మనోజ్ మందు తాగే వీడియో తీసి రోహిణికి పంపిస్తాడు గుణ. బారులో గుణ ఉన్న విషయం తెలుసుకున్న బాలు వెళ్లి కాలర్ పట్టుకుంటాడు.

Published on: Sep 8, 2026, 07:28:29 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వరలక్ష్మీ వ్రతంలో ఏమేం చేయాలో రోహిణికి చెబుతుంది ప్రభావతి. ఇదన్నా నువ్వు నిష్టగా చేస్తే నువ్వు చేసిన కుట్రలు కాస్తాన్నా క్షమించబడతాయి. అమ్మవారి దయ ఉంటుందని ప్రభావతి చెప్పి వెళ్లిపోతుంది.

కొత్త పూలగంప దగ్గరికి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 8 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 8 ఎపిసోడ్

మరోవైపు మీనా తన జుట్టుకున్న తడి ఆరుపుకుంటుంది. బాలు చూసి ముట్టుకుంటే.. అసుంట అసుంట అని మీనా అంటుంది. తాకరాదు అని వ్రతం గురించి చెబుతుంది మీనా. దాంతో కొత్త పూలగంప దగ్గరికి వెళ్తానని బాలు అంటాడు. సరే, వ్రతం అయ్యాక ఆశీర్వదించాలని మీనా చెబుతుంది. బాలు బయటకెళ్లేసరికి రవిని కూడా శ్రుతి తోస్తుంది.

ఇద్దరికి ఒకే పరిస్థితి అని బాలు, రవి అనుకుంటారు. రోహిణి విషయంలో మాత్రం రివర్స్ అని, పార్లరమ్మనే మనోజ్ గాడు గెంటేసుంటాడని బాలు అంటాడు. మౌనిక రెడీ కిందకు వచ్చాక అంతా వింతగా చూస్తారు. సాయంత్రం రావాల్సిన వరలక్ష్మి ఇప్పుడే వచ్చినట్లుందని మీనా అంటుంది. నా ఒక్క కూతురుని బాగా చూసుకోండని ప్రభావతి అంటుంది.

అది మీరంటున్నారా. మౌనికను ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అత్తగారింటికి పంపించామని శ్రుతి అంటే.. మీరు ఏమైనా కోట్లు తెచ్చారా. ముగ్గురు మూడు ముష్టి చీరలతో దిగబడ్డారు అని ప్రభావతి అంటుంది. మంచి మూడ్ పాడుచోసుకోవడం ఇష్టం లేక ఇప్పటివరకు ఊరుకున్నా. కానీ, దీనికి ఆన్సర్ ఇవ్వాల్సిందేనని శ్రుతి అంటుంది.

మౌనికకు డౌట్

రోహిణి మాట్లాడుతుంటే పనులన్నీ ఎవరు చేస్తారు. మలేషియా నుంచి చచ్చినా మీ నాన్న చేస్తాడా. నైవేద్యం వండావా అని ప్రభావతి తిడుతుంది. నాకు వండరాదని రోహిణి అంటే.. నేను చేస్తానని మీనా అంటుంది. రోహిణికి చెప్పి చేయించి, ఎవరికి చెప్పిన పని వాళ్లు చేస్తే చాలని ప్రభావతి అంటుంది. ఎప్పుడు నెత్తిన పెట్టుకునే రోహిణి వదినను అమ్మేంటీ ఇలా తిడుతుందని మౌనిక అనుకుంటుంది.

తర్వాత మౌనికకు ఎంత బంగారం ఉంది, ఎన్ని చీరలు ఉన్నాయని ఆరాలు తీస్తుంది ప్రభావతి. అడగాల్సింది అత్త, మామ, భర్త ఎలా చూసుకుంటున్నారని మౌనిక అంటుంది. వాళ్లకు గొడవ పెట్టుకునే తీరిక ఎక్కడ ఉంటుంది అని ప్రభావతి అంటుంది. ప్రభావతి ఏదోటి అంటే.. బాలు పంచ్‌లు ఇస్తాడు. తర్వాత నీకు కొడుకు పుడితే నా కూతురుకి ఇస్తావా అని బాలు అడుగుతాడు.

మీనా నడుముకు టెంప్ట్ అయిన బాలు

ముందు నువ్వు కూతురుని కను అని మౌనిక అంటుంది. కిచెన్‌లో పైనుంచి డబ్బా తీసుకుంటుంది మీనా. మీనా నడుము చాలా గ్లామర్‌గా కనిపించడంతో బాలు టెంప్ట్ అవుతాడు. మీనా నడుము ముట్టుకోబోతాడు. అది గమనించిన మీనా వారిస్తుంది. ఓ చిన్న సాయం చేయమని మీనా అంటే.. బాలు మీదకు వెళ్తాడు. చేయమంది సాయం సరసం కాదని మీనా చెబుతుంది.

స్టూల్ తీసుకొచ్చి బాలు ఇస్తాడు. అది ఎక్కి డబ్బాలు తీస్తుంటుంది. ఇంతలో స్లిప్ కావడంతో మీనాను పట్టుకుంటాడు బాలు. వంట గదిలో బాలు, మీనాలు ఒకరినొకరు చూసుకుని రొమాన్స్ చేస్తుంటారు. అది చూసి రోహిణి అసూయ పడుతుంది. నా పరిస్థితే బాగోలేదనుకుంటుంది. వెళ్లి మనోజ్‌ను కలుస్తుంది రోహిణి. మనోజ్ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు.

ఇంట్లో ఉండు. భర్తగా నాతో ఉంటే బాగుంటుందని రోహిణి అంటే.. ఇప్పటివరకు మాత్రం బఫూన్‌లా చూశావని మనోజ్ అంటాడు. మనోజ్ బయటకు వెళ్తే.. పూజ అయ్యే టైమ్‌కు రమ్మని, ఆశీర్వాదం తీసుకోవాలని రోహిణి చెబుతుంది. నీ కోపం మళ్లీ ప్రేమగా ఎప్పుడు మారుతుందో అని రోహిణి అనుకుంటుంది. మీనా నైవేద్యం ప్రిపేర్ చేస్తుంది.

మలేషియా మంత్రగత్తె ఇలాగే ఉందేంటీ

ప్రభావతి వచ్చి చూసి ఈ మలేషియా మంత్రగత్తె ఇలాగే ఉందేంటీ. నా కూతురుతో పని చేయిస్తున్నారు. ఇదివరకే దిక్కుమాలింది ఉందంటే ఇంకోటి దాపురమైందని ప్రభావతి అంటుంది. ఇవాళ ఫోన్‌లో లక్ష్మి స్తోత్రాలు చూడండి. నోటికి తాళం వేసి పక్కన కూర్చోండి. దిక్కుమాలిన వాళ్లు ఎవరు లేరని మీనా కోప్పడుతుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావని ప్రభావతి అంటే.. శ్రుతిని పిలుస్తుంది మీనా.

దాంతో వెళ్లిపోతుంది ప్రభావతి. నువ్వేం బాధపడకు రోహిణి అని మీనా ఓదారిస్తే.. ఇంకా ఎన్ని రోజులులే మీనా. ఇంట్లో నా పరిస్థితి నీ పరిస్థితి కాకముందే నేను ఏదోటి చేస్తానని రోహిణి పొగరుగా వెళ్లిపోతుంది. దానికి మీనా, మౌనిక ఇద్దరు షాకై చూస్తారు. ఎంత జరిగినా రోహిణి మాత్రం మారకుండా మీనాను అవమానిస్తూనే ఉంది.

పెళ్లి తర్వాత ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో మీనానే నేర్పించిందని మౌనికతో శ్రుతి చెబుతుంది. నాకు సుమతి ఎలాగో శ్రుతి అలాగే అని సొంత చెల్లి అని మీనా అంటుంది. అవును రోహిణి ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదని శ్రుతి అంటుంది. అవును, రోహిణి వదినను అమ్మా ఎందుకు తిడుతుందని మౌనిక అడిగితే.. జరిగింది అంతా చెబుతుంది శ్రుతి.

రోహిణికి గుణ బ్లాక్ మెయిల్

వాళ్ల మాటలు రోహిణి వింటుంది. ఇవన్నీ ఇక్కడే మర్చిపో మౌనిక. పాపం రోహిణి వింటే ఫీల్ అవుతుందని మీనా అంటుంది. తర్వాత కిచెన్‌లో ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉందిగా అని మీనాను రోహిణి అంటుంది. నాకు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. ఎందుకంటే నేను అబద్ధాలు, మోసాలు చేయట్లేదు కాబట్టి అని మీనా ఇచ్చిపడేస్తుంది.

ఎప్పుడో వచ్చే మౌనికకు చెప్పడం అవసరమా అని రోహిణి అంటే.. రోజూ నీ కథలన్నీ చేసే మాకు కొత్తగా నీ చరిత్ర గురించి మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా అని మీనా పంచ్ ఇస్తుంది. తర్వాత ఫ్రెండ్‌తో మనోజ్ బారులో మందు తాగుతూ ఉంటాడు. దాన్నీ వీడియో తీసి రోహిణిని పంపి బ్లాక్ మెయిల్ చేస్తాడు గుణ. ఇప్పుడు నాకు కొడుకు ఉన్నాడని మనోజ్‌కు చెబితే మా అత్త నాకు సమాధి కడుతుందని రోహిణి భయపడిపోతుంది.

బారులో ఎదురుపడిన బాలు, రోహిణి

బారులో మనోజ్, గుణ ఉన్నారని బాలుకు రాజేష్ కాల్ చేయడంతో బాలు వెళ్తాడు. మనోజ్ వైపు వెళ్తున్న గుణను పట్టుకుని పదరా పోలీస్ స్టేషన్‌కి అని బాలు కాలర్ పట్టుకుని తీసుకెళ్తాడు. అప్పుడే రోహిణి వస్తుంది. బాలు, గుణలను చూసి రోహిణికి మైండ్ బ్లాక్ అవుతుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe