...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: బార్‌లో గుణతో దొరికిపోయిన రోహిణి.. నిలదీసిన బాలు.. రోహిణి దుమ్ము దులిపిన శృతి

Gunde Ninda Gudi Gantalu Serial September 9th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ సెప్టెంబర్ 9 ఎపిసోడ్ లో బార్ లో గుణతో బాలుకి దొరికిపోతుంది రోహిణి. అటు మీనాను అవమానించిన రోహిణికి శృతి ఎడాపెడా క్లాస్ పీకుతుంది.

Published on: Sep 9, 2026, 07:03:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ప్రధానంగా రోహిణి, మనోజ్, గుణ చుట్టూ తిరిగింది. వ్రతం రోజే మనోజ్ తప్పతాగడం, అతన్ని అడ్డు పెట్టుకొని రోహిణిని గుణ బ్లాక్‌మెయిల్ చేయడం, అది తెలిసి బాలు వాళ్లను నిలదీయడంలాంటి సీన్లతో రక్తి కట్టించింది.

రోహిణికి క్లాస్ పీకిన శృతి.. నీదీ ఒక బతుకేనా అంటూ..

Gunde Ninda Gudi Gantalu Today Episode: బార్‌లో గుణతో దొరికిపోయిన రోహిణి.. నిలదీసిన బాలు.. రోహిణి దుమ్ము దులిపిన శృతి
Gunde Ninda Gudi Gantalu Today Episode: బార్‌లో గుణతో దొరికిపోయిన రోహిణి.. నిలదీసిన బాలు.. రోహిణి దుమ్ము దులిపిన శృతి

రోహిణి, మీనా మాటామాటా అనుకునే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 9) ఎపిసోడ్ మొదలైంది. మీనా ఏదో చెప్పబోతుంటే.. పూలు అమ్ముకునే ఫ్యామిలీ నుంచి వచ్చావంటూ రోహిణి అవమానిస్తుంది. దీంతో శృతి రంగంలోకి దిగుతుంది.

పూలమ్ముకునే ఫ్యామిలీయా.. మరి నీ ఫ్యామిలీ ఏంటి? అసలు ఫ్యామిలీ ఉంటే కదా.. మలేషియా కథలు చెప్పావ్.. మటన్ అమ్ముకునేవాడిని మేనమామ అని చెప్పావ్.. పొయ్యిలో బూడిదను నాన్న అస్థికలన్నావ్.. అసలు ఒక అమ్మ, అయ్య, అన్న, చెల్లి.. ఎవరున్నారు నీకు.. నీదీ ఒక బతుకేనా.. అలాంటిది నువ్వు మీనాను అంటావా అంటూ చెలరేగిపోతుంది. దీంతో రోహిణి నోట మాట రాదు. ఇంకా తిట్టబోతుంటే మీనానే అడ్డుకొని శృతిని తీసుకెళ్లిపోతుంది. రోహిణి అవమాన భారంతో కుంగిపోతుంది.

బాలు, మీనా సరసాలు.. చూసి మురిసిపోయిన మౌనిక

ఆ తర్వాత హాల్లో మీనా పూలు అల్లుతూ ఉంటుంది. అప్పుడే బాలు వస్తాడు. ఆమెనే చూస్తూ ఉంటాడు. ఏం చూస్తున్నారంటూ ఆమె ఇబ్బంది పడుతుంది. తర్వాత ఇద్దరూ సరసాలు ఆడతారు. ఒకరిపై మరొకరు పూలు చల్లుకుంటూ ఉంటారు. మెట్లు దిగుతూ ఉన్న మౌనిక వాళ్లను చూసి మురిసిపోతుంది. మీరెప్పుడూ ఇలాగే ఉండాలని అంటుంది.

బిడ్డ పుడితే అయినా ఆయన మారతాడేమో చూడాలి అని మౌనిక అంటుంది. అయితే తనకు కూతురి పుడితే మాత్రం మేనమామ చేయాల్సిన పనులన్నీ నువ్వే చేయాలి అని బాలుతో మౌనిక అంటుంది. తాను రెడీనే కానీ.. మీ ఆయనే ఒప్పుకుంటాడో లేదో.. అయినా నీకు జ్యూస్ తీసుకొస్తాను ఉండు అని బాలు వెళ్తాడు. ఆ తర్వాత మీనా, మౌనిక సంజూ గురించి మాట్లాడుకుంటారు.

వ్రతానికి రెడీ అయి పీకలదాకా తాగిన మనోజ్

అటు వ్రతానికి రెడీ అయిన తర్వాత మనోజ్ బారుకు వెళ్తాడు. ఫ్రెండ్ మణికంఠతో కలిసి మళ్లీ తాగడం మొదలు పెడతాడు. ఫుల్ బాటిల్ ఆర్డర్ ఇస్తాడు. మణికంఠ వద్దని వారిస్తున్నా మళ్లీ పీకలదాకా తాగుతాడు. తన భార్య రోహిణి చేస్తున్న మోసాలు గురించి చెబుతుంటాడు. ఫేక్ ఫర్నీచర్ ఆర్డర్ తెచ్చి తనకు దగ్గర కావడానికి చూసిందని కూడా వెల్లడిస్తాడు. మణికంఠ తన బాధల గురించి చెబుతున్నా పట్టించుకోడు.

మనోజ్‌ను అడ్డు పెట్టుకొని రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ

అప్పుడే బారుకు గుణ కూడా వస్తాడు. మనోజ్ ను చూసి సంతోషిస్తాడు. వీడిని అడ్డుపెట్టుకొని రోహిణి దగ్గర డబ్బు లాగాలని అనుకుంటాడు. వెంటనే రోహిణికి ఫోన్ చేస్తాడు. అతని నంబర్ చూసి రోహిణి బాగా ఫ్రస్ట్రేట్ అవుతుంది. ఎంత మంది ఎన్ని విధాలుగా నన్ను చంపుకు తింటారంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తాను చావడానికి సిద్ధంగా ఉన్నానని అంటుంది. ఇంకా తానేం చెప్పక ముందేనా అంటూ మరోసారి దినేష్ ఫోన్ చేశాడని చెబుతాడు.

నీ భర్త మనోజ్ నా ముందే ఇక్కడ బార్ లో ఉన్నాడు.. వీడియో కాల్ చేసి దినేష్ కు చూపిస్తే వాడు నీ సీక్రెట్ ఏంటో అతనికి చెబుతానంటున్నాడు అని బెదిరిస్తాడు. దీంతో రోహిణి షాక్ తింటుంది. అసలు మీకు సిగ్గు లేదా.. ఓ ఆడపిల్లను ఇలా బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు సంపాదిస్తారా అని తిడుతుంది. అయినా గుణ వినడు. వెంటనే డబ్బు తీసుకొని తాను చెప్పిన చోటికి రాకపోతే దినేష్ కు వీడియో కాల్ చేస్తానని అంటాడు. దీంతో రోహిణి టెన్షన్ పడుతుంది.

కోడళ్ల గురించి ప్రభావతితో చుట్టుపక్కల వాళ్ల మాటామంతీ

అటు కింద వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల వాళ్లు వస్తారు. కోడళ్ల గురించి ప్రభావతిని అడుగుతారు. డెకరేషన్ బాగా చేశారని, మీనాలాంటి కోడలు ఉంటే ఇలాంటి సులువుగా చేయొచ్చిన వాళ్లు అంటారు. అది విని ప్రభావతికి మండుతుంది. ఆ తర్వాత టాపిక్ రోహిణి వైపు వెళ్తుంది.

మలేషియా కోడలు ఎక్కడ.. బాగా డబ్బున్న కోడలు.. మీరు కూడా వెళ్లి మలేషియాలో సెటిలైపోతారా అని అంటారు. దీంతో ప్రభావతి ముఖం మాడిపోతుంది. ఆ తర్వాత వరుసగా మీనా, శృతి, రోహిణి వస్తారు. శృతి అందరి ముందే మరోసారి అత్త పరువు తీసేలా మాట్లాడుతుంది. ఆ తర్వాత రోహిణి గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఈ మధ్యే వాళ్ల నాన్నను చంపేసింది అని శృతి అంటుంది. వాళ్లు షాకవడంతో అదే వాళ్ల నాన్న చనిపోయాడు అని మీనా కవర్ చేస్తుంది.

బార్‌లో రాజేష్.. బాలుకి ఫోన్

ఆ తర్వాత బాలు ఫ్రెండ్ రాజేష్ బార్ కి వెళ్తే అక్కడ మనోజ్, గుణలను చూస్తాడు. బాలుని ఏమీ చేయలేక వీడు మనోజ్ ను ఏమైనా చేస్తాడా అనుకొని బాలుకి ఫోన్ చేస్తాడు. దీంతో బాలు వెంటనే అక్కడికి వస్తాడు. మా అన్నవైపు చూస్తున్నావేంట్రా అని గుణ కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కు పదా అంటూ తీసుకెళ్తుంటే రోహిణి ఎదురు పడుతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్.. ఈ గుణ గాడు నీకేం తెలుసు అని ఆమెను బాలు నిలదీస్తాడు. దీంతో ఆమె బిక్కమొహం వేస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks