Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుని చితకబాదిన ప్రభావతి.. రోహిణిలో అనుమానం.. మీనా కొత్త బిజినెస్ ప్లాన్ సూపర్

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 3 ఎపిసోడ్ లో ప్రభావతి సొంతింటికి తిరిగి వస్తుంది. నాన్నకు రెండో పెళ్లంటూ బాలు వచ్చేలా చేస్తాడు. అటు మీనా కొత్త బిజినెస్ ప్లాన్ అదుర్స్ అనిపించేలా ఉంటుంది.

Published on: Apr 3, 2026, 07:49:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ప్రభావతి బెట్టు వీడుతుంది. మీనా ఇంట్లో వాళ్లకు ఆమె క్షమాపణ చెబుతారు. తర్వాత నాన్నకు రెండో పెళ్లంటూ ఆమెను బాలు రెచ్చగొట్టి తిరిగి ఇంటికి వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుని చితకబాదిన ప్రభావతి.. రోహిణిలో అనుమానం.. మీనా కొత్త బిజినెస్ ప్లాన్ సూపర్
Gunde Ninda Gudi Gantalu Today Episode: బాలుని చితకబాదిన ప్రభావతి.. రోహిణిలో అనుమానం.. మీనా కొత్త బిజినెస్ ప్లాన్ సూపర్

కోపంతో రగిలిపోయిన గుణ

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఏప్రిల్ 3) ఎపిసోడ్ పార్వతి, శివ, సుమతి కలిసి ప్రభావతి దగ్గరికి వెళ్లి థ్యాంక్స్ చెప్పాలనుకునే సీన్ తో మొదలవుతుంది. ఇప్పుడు వద్దని బాలు అంటున్నా.. వాళ్లు వినరు. అటు శివ జైలుకు వెళ్లడం లేదని తెలిసి గుణ కోపంతో రగిలిపోతాడు.

తన ప్లాన్ ఫెయిలవడంతో ఆవేశపడతాడు. శివను వదలనని స్పష్టం చేస్తాడు. అదే సమయంలో దినేష్ బయటకు రావడంతో మరోసారి రోహిణి తనకు ఇస్తానన్న డబ్బు విషయం గుర్తుకు వస్తుంది. అది అంత సులువుగా ఇచ్చే రకం కాదని దినేష్ అంటాడు.

ప్రభావతి దగ్గరికి పార్వతి, శివ.. క్షమించానని చెప్పి..

కామాక్షి ఇంట్లో ఉన్న ప్రభావతి దగ్గరికి బాలు, మీనాతోపాటు పార్వతి, శివ, సుమతి వస్తారు. తమకు చేసిన సాయానికి పార్వతి థ్యాంక్స్ చెబుతుంది. శివ కూడా క్షమాపణ చెప్పి థ్యాంక్స్ చెబుతాడు. వాడి జీవితం నాశనం కాకూడదనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రభావతి అంటుంది. సుమతి కూడా థ్యాంక్స్ చెబుతుంది. ఆ తర్వాత వాళ్లు వెళ్లిపోతారు.

నాన్నకు పెళ్లంటూ ప్రభావతిని రెచ్చగొట్టిన బాలు

అయినా ప్రభావతి ఇంటికి రావడానికి బెట్టు చేయడంతో బాలు కొత్త డ్రామా మొదలుపెడతాడు. శీలా డార్లింగ్ నాన్నకు రెండో పెళ్లి చేయాలని చూస్తోందని, నీలవేణి అనే ఆమెతో నాన్న పెళ్లికి రెడీ అవుతున్నాడని బాలు అంటాడు. ఈ వయసులో కొడుకు ఒంటరిగా ఉండటం నాన్నమ్మ చూడలేకపోతోందని చెబుతాడు. ఈ వయసులో సవతి పోరుతోపాటు ఆమె వస్తే తన ఆధిపత్యం తగ్గిపోతుందని, మీనా కూడా తనపై అధికారం చెలాయిస్తుందని ఊహించుకొని జడుసుకుంటుంది. తన మనసు మార్చుకుంటుంది.

రోహిణిలో మొదలైన అనుమానం

మరోవైపు రోహిణిలో అత్త ప్రభావతిపై అనుమానం మొదలవుతుంది. ఆమె కేసు ఎందుకు వాపసు తీసుకుందో అర్థం కావడం లేదని విద్యతో అంటుంది. ఆమె భయపడి ఉండాలి లేదంటే ఏదైనా లాభం వచ్చి ఉండాలని చెబుతుంది. అప్పుడే గుణ ఆమెకు ఫోన్ చేసి డబ్బుల గురించి ఆరా తీస్తాడు. కాస్త టైమ్ ఇవ్వాలని ఇస్తానని అంటుంది. తన దగ్గర రూ.50 వేలు ఉన్నాయని, మరో లక్షన్నర కావాలని రోహిణి టెన్షన్ పడుతుంది.

ఇంటికి తిరిగొచ్చిన ప్రభావతి

మరోవైపు ప్రభావతి మొత్తానికి సొంతింటికి తిరిగి వస్తుంది. నేరుగా వస్తే బాగుండదని మనోజ్ కు ఫోన్ చేసి బయటకు రమ్మని చెబుతుంది. మనోజ్, రోహిణి ఇద్దరూ బతిమాలి బలవంతంగా తీసుకొచ్చినట్లు బిల్డప్ ఇస్తుంది. బాలు ఆమెను చూసి తనదైన స్టైల్లో చాలా పంచ్ లే వేస్తాడు. ఆ తర్వాత ముగ్గురు కోడళ్లు కలిసి ప్రభావతికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తారు.

బాలుని చితకబాదిన ప్రభావతి

ప్రభావతి లోనికి వచ్చిన తర్వాత కూడా బాలు ఏదో ఒకటి అంటూ ఉంటాడు. సత్యం కోసమే తాను వచ్చానని అనడంతో నేను పిలిచినప్పుడు ఎందుకు రాలేదు మరి అని సత్యం అడుగుతాడు. అప్పుడే రెండో పెళ్లి ప్రస్తావన వస్తుంది. బాలు సైగ చేయడంతో సత్యం కూడా అవును రెండో పెళ్లి చేసుకుంటానని అంటాడు. బాలు రెచ్చగొట్టడంతో ప్రభావతి అతన్ని చితకబాదుతుంది. కిందేసి మరీ కొడుతుంది.

మీనా పుట్టింటి వాళ్లు రావద్దని షరతు

ఆ తర్వాత మీనాకు మరో షరతు పెడుతుంది. ఇక నుంచి మీనా పుట్టింటి వాళ్లు ఈ ఇంటికి రావద్దని, వాళ్ల వల్ల జరిగిన అవమానం చాలు అని ప్రభావతి అంటుంది. బాలు, సత్యం వారిస్తుంటే.. మీనా మాత్రం అత్తయ్య కరెక్ట్ గానే చెప్పారు.. వాళ్లు ఏరోజూ నా ఇంట్లో మంచి నీళ్లు తాగలేదు.. తినలేదు.. ప్రతిసారీ అవమానమే జరుగుతోంది. దాని కంటే వాళ్లు ఈ ఇంటికి రాకపోవడమే మంచిది అని అంటుంది.

మీనా కొత్త బిజినెస్ ప్లాన్

ఆ రాత్రికి బాలు, మీనా మరోసారి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తారు. అదే సమయంలో పెరిగిపోతున్న అప్పుల గురించి మీనా తీస్తుంది. వీటి నుంచి బయటపడాలంటే తన దగ్గర ఓ కొత్త ప్లాన్ ఉందని అంటుంది. పెళ్లిళ్లలో మండపాలకు పూల డెకరేషన్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందని బాలుతో చెబుతుంది. అతడు ఆలోచనలో పడతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More