...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణియే దొంగ అని తెలుసుకున్న మీనా.. పోలీసు కేసు అనడంతో వణికిన రోహిణి.. గుణ సాయం

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 9 ఎపిసోడ్ లో ఆ రూ.2 లక్షలు దొంగతనం చేసింది రోహిణియే అని మీనా, శృతి అనుమానిస్తారు. పోలీసుల పేరు చెప్పడంతో రోహిణి భయంతో వణికిపోతుంది. గుణ సాయం కోరుతుంది.

Published on: Apr 9, 2026, 19:31:35 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మీనాపై ప్రభావతి దొంగతనం ముద్ర వేస్తుంది. అయితే ఆమెకు సత్యం, రవి, శృతి సపోర్ట్ చేస్తారు. అంతేకాదు ఆ దొంగతనం రోహిణి చేసి ఉండొచ్చు కదా అని శృతి అంటే.. ఆమెను చూస్తూ పోలీసు కేసు పెడితే అంతా తెలుస్తుందని మీనా అంటుంది.

డబ్బు పోయిందని చెప్పిన కామాక్షి.. పడిపోయిన ప్రభావతి

Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణియే దొంగ అని తెలుసుకున్న మీనా.. పోలీసు కేసు అనడంతో వణికిన రోహిణి.. గుణ సాయం
Gunde Ninda Gudi Gantalu Today Episode: రోహిణియే దొంగ అని తెలుసుకున్న మీనా.. పోలీసు కేసు అనడంతో వణికిన రోహిణి.. గుణ సాయం

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (ఏప్రిల్ 9) ఎపిసోడ్ ప్రభావతి, కామాక్షి చీర కొనే సీన్ తో మొదలవుతుంది. ఏకంగా రూ.45 వేల చీర కొనడానికి ప్రభావతి సిద్ధమవుతుంది. తన రూ.2 లక్షలు తీసుకురావాలని కామాక్షి చెబుతుంది. కిచెన్ లోకి వెళ్లి చూసిన కామాక్షి డబ్బు కనిపించకపోవడంతో షాక్ తింటుంది. అదే విషయం ప్రభావతికి చెబితే ఆమె కళ్లు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత అప్పుడే వచ్చి వెళ్లిన మీనానే ఈ పని చేసి ఉంటుందని కామాక్షితో చెప్పి ఇంటికి వెళ్తుంది.

శృతిని బతిమాలిన రవి.. నిజం చెప్పిన నీతూ

ఇటు నీతూ విషయంలో అపార్థం చేసుకున్న శృతిని రవి బతిమాలుతుంటాడు. కానీ ఆమె వినదు. కాలితో తంతుంది. దీంతో నీతూకి రవి ఫోన్ చేసి అసలు నిజం చెప్పిస్తాడు. శృతి శాంతిస్తుంది. అంతేకాదు తాను కూడా ఏప్రిల్ ఫూల్ చేశానని, నువ్వు నిజమే అనుకున్నావా అని రవిని ఆట పట్టిస్తుంది.

మీనాతో బాలు సరసాలు.. చీర గిఫ్ట్

కిచెన్ లో వంట చేస్తున్న మీనా దగ్గరికి బాలు వెళ్లి సరసమాడతాడు. ఆమె దూరంగా వెళ్తుంది. ఊరి నిండా అప్పులు పెట్టుకొని ఈ సరసాలేంటని అంటుంది. ఆమె కోసం బాలు చీర తీసుకొస్తాడు. అది చూసి మీనా సర్‌ప్రైజ్ అవుతుంది. అప్పుడే ట్రిప్ కోసం కాల్ రావడంతో రేపు వస్తానని బాలు వెళ్లిపోతాడు. దీంతో మీనా బాధపడుతుంది.

ప్రభావతి రచ్చ.. మీనాపై దొంగతనం ముద్ర

కామాక్షి కూడా మీనానే అనుమానిస్తుందని ప్రభావతి అంటుంది. దీంతో శృతి జోక్యం చేసుకుంటుంది. ఎక్కడుంది ఆమె.. మీకు వయసుతోపాటు వెర్రి కూడా పెరుగుతోందా అంటూ అత్తకు క్లాస్ పీకుతుంది. రవి, సత్యం కూడా మీనాకే సపోర్ట్ చేస్తారు. మీనా ఎలాంటిదో తెలిసి కూడా ఇలాంటి నింద వేస్తావా.. అసలు దొంగ ఎవరో బాలు వచ్చాకే తేలుద్దాం.. కోడలిపై చేయి వేస్తే మన ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుందని ప్రభావతికి సత్యం క్లాస్ పీకుతాడు.

రోహిణికి గడ్డి పెట్టిన సత్యం

పక్కనే ఉన్న రోహిణి అత్తకు మెల్లగా సపోర్ట్ చేస్తుంది. దీంతో సత్యం ఆమెకు కూడా గడ్డి పెడతాడు. చదువుకున్నదానికి నీకైనా ఇంగిత జ్ఞానం లేదా.. మీకు మంచి జరిగితే సంతోషించేది బాలు, మీనాయే.. అలాంటిది వాళ్లకు ఎప్పుడు చెడు జరిగినా అంతలా సంతోషిస్తున్నావ్.. ఇలా అయితే కుటుంబం చిన్నాభిన్నమవుతుంది అని రోహిణికి కాస్త గట్టిగానే గడ్డి పెడతాడు సత్యం.

రోహిణిపై శృతి అనుమానం.. పోలీసులంటూ భయపెట్టిన మీనా

మీనాను తీసుకొని శృతి పైకి వెళ్తుంది. బాలు ఫోన్ చేసి మీనాతో మాట్లాడతాడు. ఏం జరిగిందో మీనా చెప్పదు. కానీ ఆమె డల్లుగా ఉండటం విని త్వరగా తిరిగి వచ్చేస్తానని అంటాడు. ఆ తర్వాత రవి, శృతి వెళ్లి మీనాను ఓదారుస్తారు. అది చాటుగా రోహిణి వింటుంది.

అయినా కామాక్షి ఇంటికి రోహిణి కూడా వెళ్తుంది కదా.. ఆమె కూడా దొంగతనం చేసి ఉండొచ్చు కదా అని శృతి అంటుంది. రోహిణి బయట ఉండటం చూసిన మీనాకు కూడా ఆమెపై అనుమానం వస్తుంది. పోలీసు స్టేషన్ కు వెళ్తే అన్నీ బయటపడతాయి.. బాలు వచ్చే వరకు కూడా ఆగను.. ఉదయాన్నే స్టేషన్ కు వెళ్తానని మీనా మరింత బెదిరించేలా మాట్లాడుతుంది.

గుణకు రోహిణి ఫోన్.. డబ్బివ్వమని రిక్వెస్ట్

దీంతో రోహిణి భయంతో వణికిపోతుంది. ఈ పరిస్థితుల్లో తనను కాపాడేది గుణ ఒక్కడే అంటూ అతనికి ఫోన్ చేస్తుంది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని, తాను దొంగతనం చేసిన డబ్బు అని, అది మీనా, బాలుకు తెలిసేలా ఉందని గుణతో చెబుతుంది. ఇప్పుడా డబ్బు ఇస్తే మళ్లీ ఏదోలా చేసి ఇస్తానని అంటుంది. కానీ అప్పటికే ఆ డబ్బును దినేష్ ట్రీట్మెంట్ కోసం ఖర్చు చేశానని గుణ అబద్ధం చెబుతాడు. బాలు, మీనా సంగతి తాను చూసుకుంటానని అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe