గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుడిలో ప్రభావతిని నిలదీసిన శోభ.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సత్యం

గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (డిసెంబర్ 5) ఎపిసోడ్ లో ప్రభావతి వెనక్కి తగ్గనే తగ్గదు. మీనాకు క్షమాపణ చెప్పకపోగా మళ్లీ నిందిస్తూనే ఉంటుంది. దీంతో సత్యం ఇంటి నుంచి వెళ్లిపోతాడు. అటు గుడిలో ప్రభావతిని శోభ నిలదీస్తుంది.

Dec 5, 2025, 07:59:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 569వ ఎపిసోడ్ లో ప్రభావతి కోసం మీనా బాధపడటం, మనోజ్ బదులు తాను డబ్బు ఇస్తానని రోహిణి మాటివ్వడం, అటు గుడిలో మీ బంగారు గాజులు ఏమయ్యాయని ప్రభావతిని శోభ నిలదీయడంలాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుడిలో ప్రభావతిని నిలదీసిన శోభ.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సత్యం
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: గుడిలో ప్రభావతిని నిలదీసిన శోభ.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సత్యం

మనోజ్‌కు క్లాస్ పీకిన ఇంట్లో వాళ్లు.. తాను డబ్బిస్తానన్న రోహిణి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 5) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్ కు ఇంట్లో వాళ్లు క్లాస్ పీకే సీన్ తో ఎపిసోడ్ మొదలైంది. నీ వల్లే ఇదంతా జరిగిందని బాలు, సత్యం అతనికి క్లాస్ పీకుతారు. ఇక నువ్వు మారవా.. ఆ ఇద్దరినీ పెంచినట్లే నిన్నూ పెంచాను.. వాళ్లపై ఎప్పుడైనా ఇలా దొంగ అనే ముద్ర పడిందా అంటూ సత్యం అతనిపై మండిపడతాడు.

నాన్నకు ఇవ్వాల్సిన రూ.40 లక్షలు, తనకు ఇవ్వాల్సిన రూ.4 లక్షలు ఇవ్వాల్సిందే అని బాలు అతన్ని అడుగుతాడు. తన భర్తను అందరూ తిడుతుండటంతో రోహిణి రంగంలోకి దిగుతుంది. ఆ డబ్బు తాను ఇస్తానని, తనకు కాస్త టైమ్ ఇప్పించాలని మామయ్యను కోరుతుంది. దీంతో బాలు కూడా సరే అంటాడు.

ప్రభావతికి నగలు తిరిగి ఇచ్చేసిన రోహిణి.. మనోజ్‌ను తిట్టిన తల్లి

ఇటు ప్రభావతి నగలు తమకు అవసరం లేదని బాలు, మీనా చెప్పడంతో వాటిని అత్తయ్యకు తిరిగి ఇచ్చేస్తానని రోహిణి తీసుకెళ్తుంది. అటు కామాక్షి.. ప్రభావతికి సర్ది చెబుతూ ఉంటుంది. అయినా ఆమె వెనక్కి తగ్గదు. రోహిణి వచ్చి నగలు ఇవ్వబోతే.. దానికి ముష్టి వేశాననుకుంటాను.. నాకు అవసరం లేదు అని ప్రభావతి అంటుంది.

అయితే అది మనోజ్ తప్పు అని, ఆ డబ్బు తాను ఇస్తానని అంగీకరించానని రోహిణి చెప్పి.. ఆ నగలను తిరిగి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మనోజ్‌ను ప్రభావతి తిడుతుంది. ఏదో చేస్తావని నిన్ను చదివిస్తే.. నన్ను రోడ్డున పడేసేలా ఉన్నావని నానా మాటలు అంటుంది. అతడు క్షమాపణ చెప్పినా వినదు. తనకు మనశ్శాంతి కావాలని, గుడి వెళ్దామని కామాక్షితో అంటుంది ప్రభావతి.

ఏడుస్తూ కూర్చున్న మీనా.. సర్ది చెప్పిన శృతి, బాలు

ఇటు మీనా ఏడుస్తూ కూర్చుంటుంది. తన వల్లే ఇదంతా జరిగిందని, ఇంత జరిగినా అత్తయ్య తననే నిందించడం ఏంటని ఆమె బాధపడుతుంది. శృతి, బాలు ఆమెను ఓదారుస్తారు. తప్పు చేయకపోయినా అత్తయ్య మాటలు అంటే ఏం చేస్తావని శృతిని అడుగుతాడు బాలు. తాను మరో నాలుగు మాటలు ఎక్కువే అంటానని ఆమె అంటుంది.

నువ్వు ఆ మాటలు అనవు కాబట్టే ఆమె నిన్ను తిడుతుందని బాలు అంటాడు. అయినా అత్తయ్య, మామయ్య ఇలా ఎడమొహం పెడమొహంగా ఉండటం బాలేదని మీనా అంటుంది. నాన్న ఇలా బెట్టు చేస్తేనే మా అమ్మ దిగి వస్తుందని, దాని గురించి నువ్వు బాధపడకు అని బాలు సర్ది చెప్పి వెళ్లిపోతాడు.

గుడిలో ప్రభావతిని కలిసిన శోభ

అటు కామాక్షితో కలిసి ప్రభావతి గుడికి వెళ్తుంది. బంగారు గాజులు ఇంట్లోనే ఉంచి ఉత్త చేతులతో వెళ్లడంతో కామాక్షి ఆమెను తిడుతుంది. అంతేకాదు మీనాకు క్షమాపణ చెబితే అన్నయ్య నీతో మాట్లాడుతాడు కదా అని అంటుంది. దీంతో ప్రభావతి ఆమెపై మండిపడుతుంది. దాని లెవెల్ ఏంటి.. నా లెవెల్ ఏంటి.. ప్రాణం ఉండగా ఆ పని చేయనని మరోసారి చెబుతుంది.

అదే సమయంలో శృతి తల్లి శోభ అదే గుడికి వస్తుంది. ప్రభావతిని చూసి ఎందుకలా ఉన్నారు.. ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా.. మనశ్శాంతి కోసం గుడికి వచ్చినట్లుగా కనిపిస్తోంది అని శోభ అంటుంది. ఆమె చేతులు ఖాళీగా ఉండటంతో పైన గది కట్టించడానికి అమ్మేశారా అని నిందిస్తుంది. దీంతో ప్రభావతి షాక్ తింటుంది.

ఇటు ఇంట్లో వెనక్కి తగ్గకపోగా.. మీనాపై మరింత మండిపడుతుంది ప్రభావతి. తన భర్తతో మాట్లాడటం లేదు కదా.. నీ కళ్లు చల్లబడ్డాయా అని నానా మాటలు అంటుంది. అది విని సత్యం ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More