గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 612వ ఎపిసోడ్ లో ట్విస్టుల మీద ట్విస్టుల ఉన్నాయి. చింటు దత్తత కోసం బాలు, మీనా ప్రయత్నించడం, దానికి అడ్డుకట్ట వేయడానికి రోహిణి ప్రయత్నాలు, ప్రభావతి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు.
సుగుణ దగ్గరికి బాలు, మీనా..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 4) ఎపిసోడ్ సుగుణ దగ్గరికి బాలు, మీనా వెళ్లే సీన్ తో మొదలవుతుంది. ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకొని వాళ్లు ఆందోళన చెందుతారు. ఎందుకు చెప్పలేదని నిలదీస్తారు. చింటు గురించి ఆరా తీస్తే సుగుణ అబద్ధం చెబుతుంది. వాడిని బంధువుల ఇంటికి పంపించానని, ఇక అక్కడే ఉంటాడని అంటుంది. ఆ విషయం తెలిసి బాలు, మీనా బాధపడతారు.
చింటుని దత్తత తీసుకుంటామన్న మీనా..
అదే సమయంలో చింటుని దత్తత తీసుకుంటామని సుగుణతో మీనా చెబుతుంది. అతనికి తండ్రి లేడు.. తల్లి ఉన్నా లేనట్లే.. తాము అతని బాధ్యత తీసుకుంటామని బాలు అంటాడు. సుగుణ చాలా సంతోషిస్తుంది. కానీ ఈ విషయం కల్యాణికి తెలిస్తే గొడవ అవుతుందని భయపడుతుంది.
తన తర్వాత చింటు పరిస్థితి ఏమవుతుందో అని ఆందోళన చెందానని, ఆ దేవుడు మీ రూపంలో పంపించాడని సుగుణ అంటుంది. అయితే ఈ విషయం తన కూతురిని అడిగి చెబుతానని అంటుంది. సరే అని వాళ్లు వెళ్లిపోతారు.
రోహిణికి సుగుణ ఫోన్.. నోటికొచ్చినట్లు మాట్లాడిన కూతురు
ఆ వెంటనే రోహిణికి సుగుణ ఫోన్ చేసి బాలు, మీనా వచ్చిన విషయం చెబుతుంది. చింటుని దత్తత తీసుకుంటామని మరోసారి అడిగారని అంటుంది. అనుకున్నాను.. నువ్వు మాత్రం వాళ్లను తిట్టి పంపించావు కదా అని రోహిణి అడుగుతుంది.
{{/usCountry}}ఆ వెంటనే రోహిణికి సుగుణ ఫోన్ చేసి బాలు, మీనా వచ్చిన విషయం చెబుతుంది. చింటుని దత్తత తీసుకుంటామని మరోసారి అడిగారని అంటుంది. అనుకున్నాను.. నువ్వు మాత్రం వాళ్లను తిట్టి పంపించావు కదా అని రోహిణి అడుగుతుంది.
{{/usCountry}}తానెలా తిడతానని, వాళ్లు చింటు పట్ల నీకన్నా బాధ్యతగా ఉన్నారని, ఆ ఇంటికి వస్తే నీ కళ్ల ముందే చింటు ఉంటాడు కదా అని చెబుతుంది. అది విని రోహిణి మండిపడుతుంది. నీకు ఇప్పుడు నా కొడుకు భారమయ్యాడా.. వదిలించుకుందామని చూస్తున్నావా.. నా ఇంటికి వచ్చి వాడు నన్ను అమ్మ అని పిలిస్తే పరిస్థితి ఏంటి అని రోహిణి నానా మాటలు అంటుంది.
ప్రభావతిని రెచ్చగొట్టాలని చూసిన రోహిణి
ఇక లాభం లేదనుకొని తన అత్త ప్రభావతిని రెచ్చగొట్టడానికి రోహిణి వెళ్తుంది. బాలు, మీనా ఆ చింటుని దత్తత తీసుకోవడానికి వెళ్లారని చెబుతుంది. అలా జరగకుండా చూడాలని, వాళ్లు అతన్ని దత్తత తీసుకోకూడదని రోహిణి అంటుంది.
ప్రభావతి మాత్రం రివర్స్ అవుతుంది. వాళ్లు దత్తత తీసుకుంటే తీసుకోని.. వాళ్లకే ఇక్కడ గతి లేదు.. అతన్ని సాకుగా చూపించి ముగ్గురినీ ఇంట్లో నుంచి గెంటేస్తానని ప్రభావతి అనడంతో రోహిణి షాక్ తింటుంది. అదే జరిగితే చింటు కూడా రోడ్డున పడతాడు.. మరో ప్లాన్ ఆలోచించాలని అనుకుంటుంది.
చింటు కోసం కొత్త స్కూల్.. దత్తత తీసుకోవాలన్న విద్య
చింటుని బాలు, మీనా దత్తత తీసుకోకుండా ఉండాలంటే వాళ్లను ఊరి నుంచి తీసుకురావడమే పరిష్కారమని భావించిన రోహిణి ఓ కొత్త స్కూల్ చూస్తుంది. విద్యతో కలిసి వెళ్తుంది. ఇదంతా ఎందుకే.. చింటుని నువ్వే దత్తత తీసుకోవచ్చు కదా.. అప్పుడు వాడు ఇంట్లోనే నిన్ను అమ్మ అని పిలిచినా ఎవరూ ఏమీ అనరు కదా అని విద్య అంటుంది. కానీ అందుకు మనోజ్ అంగీకరించడని రోహిణి చెబుతుంది.
వాళ్లను ఇక్కడికి తీసుకురావడమే మంచిది.. ఇక్కడ బాలు, మీనా కంటపడకుండా చూసుకుంటానని రోహిణి అంటుంది. మధ్యలో అయినా స్కూల్లో సీటు ఇస్తారా అని స్కూలు వాళ్లను అడిగితే ఇస్తామని వాళ్లు చెబుతారు. దీంతో అందుకు రోహిణి ఏర్పాట్లు చేసి అదే విషయం సుగుణకు ఫోన్ చేసి చెబుతుంది. ఆమె చాలా సంతోషిస్తుంది.
ఇటు హాల్లోనే బాలు, మీనా రొమాన్స్ కు రెడీ అవుతుంటారు. అటు మేడ మీద ప్రభావతికి మనోజ్ మరో షాకిస్తాడు. రోహిణి గతం గురించి ఎవరో తనకు లెటర్ ఇచ్చి వెళ్లారని చెబుతాడు. మరో లెటరా అని ఆమె షాక్ తింటుంది. రోహిణిని పిలిచి ఆ లెటర్ చూపిస్తే ఇది దినేష్ చేసిన పనే కావచ్చని ఆమె ఆందోళన చెందుతుంది.