గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 599వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తాను వద్దన్నా తమ్ముడి బర్త్ డే కోసం వెళ్లిన మీనాతో బాలు తాగొచ్చి గొడవ పడతాడు. అది చూసి ప్రభావతి ఎంతో సంతోషిస్తుంది. వాళ్లకు గొడవకు తామే కారణం అంటూ పార్వతి, సుమతి వెళ్లి బాలుకి క్షమాపణ చెబుతారు.
తాగొచ్చి మీనాతో బాలు గొడవ

గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (జనవరి 16) ఎపిసోడ్ మీనాతో బాలు గొడవ పడే సీన్ తో మొదలవుతుంది. బాలు బాగా తాగి వస్తాడు. ఇంటి బయటే మీనాతో గొడవ పడతాడు. తన మాట కాదని గుడికి వెళ్లిన మీనాపై మండిపడతాడు. తన తమ్ముడిపై ప్రేమతోనే తాను వెళ్లానని, వాడు తండ్రి లేని పిల్లాడని మీనా అంటుంది.
అంటే నా మీద ప్రేమ లేదా.. వాడు గొప్పగా చదువుతున్నాడు.. నేను కేవలం డ్రైవర్ అనే ఇలా చేస్తున్నావా అని బాలు మరింత చెలరేగుతాడు. అతన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తుంది. బాలు మాత్రం తినమన్నా తినకుండా అలాగే పడుకుంటాడు.
వాళ్ల గొడవ చూసి సంతోషించిన ప్రభావతి
బాలు, మీనా గొడవ చూసిన ప్రభావతి ఎంతో సంతోషిస్తుంది. మీకు ఇప్పుడు తృప్తిగా ఉందా అని ప్రభావతిని మీనా నిలదీస్తుంది. మీరు ఇలా గొడవ పడుతుంటే తనకు చాలా సంతోషంగా ఉందని ప్రభావతి అంటుంది. కొడుకు తాగి వస్తే సంతోషించే తల్లిని మిమ్మల్నే చూస్తున్నానని మీనా అన్నా కూడా ఆమె పట్టించుకోదు. వాడు మారడని, మళ్లీ రోజూ ఇలాగే గొడవ పడుతూ ఉండండి అంటూ ప్రభావతి వెళ్లిపోతుంది.
బాలుతో ఆడుకున్న మీనా.. నిలదీసిన సత్యం
మరుసటి రోజు ఉదయం బాలుకి మీనా కాఫీ ఇవ్వబోతే అతడు తీసుకోడు. ఇక నుంచి నీ చేత్తో ఏం ఇచ్చినా తీసుకోను అని బాలు అంటాడు. దీంతో అతనితో ఆడుకోవాలని మీనా డిసైడవుతుంది. కారు కీస్ తీసి దాస్తుంది. తర్వాత బాలు వాటి కోసం వెతుకుతుంటే.. సత్యం ఏం జరిగిందని అడుగుతాడు.
{{/usCountry}}మరుసటి రోజు ఉదయం బాలుకి మీనా కాఫీ ఇవ్వబోతే అతడు తీసుకోడు. ఇక నుంచి నీ చేత్తో ఏం ఇచ్చినా తీసుకోను అని బాలు అంటాడు. దీంతో అతనితో ఆడుకోవాలని మీనా డిసైడవుతుంది. కారు కీస్ తీసి దాస్తుంది. తర్వాత బాలు వాటి కోసం వెతుకుతుంటే.. సత్యం ఏం జరిగిందని అడుగుతాడు.
{{/usCountry}}రాత్రి తాగొచ్చావా అని బాలుని నిలదీస్తాడు. మీనాను అదే విషయం అడుగుతాడు. కానీ ఆమె ఏమీ చెప్పదు. ప్రభావతి మాత్రం అసలు విషయం చెప్పడంతో కారు కీస్ కూడా మరచిపోయి వచ్చేంత తాగావా అంటూ బాలుని అడుగుతాడు. ఇక నుంచి తాగి వస్తే బాగుండదని కూడా వార్నింగ్ ఇస్తాడు.
మళ్లీ గొడవ పడిన బాలు, మీనా
తర్వాత మీనా కారు కీస్ తీసుకొచ్చి సత్యం ముందు పెడుతుంది. కిచెన్ లో మరచిపోయాడని అంటుంది. దీంతో సత్యం మరింత కోప్పడతాడు. తర్వాత కిచెన్ లోకి వెళ్లి మీనాతో మరోసారి బాలు గొడవ పడతాడు. ఎందుకు అబద్ధం చెప్పావు.. అసలు నేను కిచెన్ లోకే రాలేదు కదా అని అంటాడు.
ఇద్దరి మధ్యా మరోసారి మాటామాటా పెరుగుతుంది. మీనా కూడా బాలుకి ఎదురు తిరుగుతుంది. అందరూ బాగానే ఉన్నారు.. మధ్యలో తనను ఎందుకు ఇలా వేధిస్తున్నారని అడుగుతుంది. పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల పూర్తిగా పుట్టింటికి దూరమవ్వాలా అని బాలుని నిలదీస్తుంది. అతడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
బాలుకి క్షమాపణ చెప్పిన పార్వతి
ఇటు మీనా మాటలను గుర్తు చేసుకొని బాలు బాధపడుతుంటాడు. అప్పుడే పార్వతి, సుమతి అక్కడికి వస్తారు. మీనాపై కోపంగా ఉన్న విషయం గుర్తించి అల్లుడికి పార్వతి క్షమాపణ చెబుతుంది. తాను అలాంటివేవీ కోరుకోవడం లేదని బాలు అంటాడు. శివ తప్పుడు దారిలో వెళ్తుంటే మీరు వాడికి పుట్టిన రోజులు జరపాల్సిన అవసరం ఉందా అని నిలదీస్తాడు. దీంతో పార్వతి మరోసారి క్షమాపణ చెప్పగా.. తనకు ట్రిప్ వచ్చిందని చెప్పి బాలు వెళ్లిపోతాడు.
ఇటు తన ఫ్రెండ్ రాజేష్ తో మీనా గురించి చెప్పి బాలు బాధపడతాడు. అటు పూలు అల్లుతూ అక్కడి వాళ్లతో మీనా కూడా ఇంట్లో జరిగింది చెప్పి బాధపడుతుంది. ఇద్దరూ వెనక్కి తగ్గాలని వాళ్లు చెబుతారు. దీంతో మీనా కోసం బాలు ఓ సర్‌ప్రైజ్ తీసుకెళ్లగా.. బాలు కోసం మీనా గుమగుమలాడే వంట చేసి పెడుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.