గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి హత్యకు మీనా ప్లాన్.. రెచ్చగొట్టిన రోహిణి.. గట్టిగా ఇచ్చుకున్న శృతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జనవరి 28) ఎపిసోడ్ లో మీనా తనను చంపడానికి ప్లాన్ చేస్తోందని ప్రభావతి నానా రభస చేస్తుంది. ఆమెను రోహిణి మరింత రెచ్చగొట్టగా.. శృతి వచ్చి ఇద్దరికీ గట్టిగానే క్లాస్ పీకుతుంది.

Published on: Jan 28, 2026, 07:36:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 607వ ఎపిసోడ్ లో మీనాపై మరింత కక్ష కడతారు ప్రభావతి, రోహిణి. ఆమె తనను చంపడానికి ప్లాన్ చేసిందంటూ కాలు జారి పడిన ప్రభావతి నిందలు వేస్తుంది. అయితే మీనాకు సపోర్ట్ గా శృతి కాస్త గట్టిగానే క్లాస్ పీకడంతో ప్రభావతి ఆమెకు చెక్ పెట్టడానికి తల్లి శోభ దగ్గరికి వెళ్తుంది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి హత్యకు మీనా ప్లాన్.. రెచ్చగొట్టిన రోహిణి.. గట్టిగా ఇచ్చుకున్న శృతి
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి హత్యకు మీనా ప్లాన్.. రెచ్చగొట్టిన రోహిణి.. గట్టిగా ఇచ్చుకున్న శృతి

శృతికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయిన ప్రభావతి

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జనవరి 28) ఎపిసోడ్ ప్రభావతి, మనోజ్ లను భయపడే సీన్ తో మొదలవుతుంది. దెయ్యం అంటూ మీనానే తనను భయపెట్టిందని ఆమెను తిడుతుంది ప్రభావతి. దీంతో శృతి జోక్యం చేసుకొని అది తన పని అని చెబుతుంది.

ఆమెకు కూడా వార్నింగ్ ఇచ్చి ప్రభావతి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అనవసరంగా అత్తయ్యతో పెట్టుకున్నామని మీనా బాధపడుతుంది. ఏం కాదులే అని శృతి ఆమెకు సర్ది చెబుతుంది. మరుసటి రోజు ఉదయం బాలు రాగానే జరిగిన విషయం చెబుతుంది. అతడు కూడా ఆమెకు సర్ది చెబుతాడు. ఒళ్లు నొప్పులుగా ఉన్నాయనడంతో అతనికి కాపడం పెట్టడానికి వేడి నూనె తీసుకురావడానికి మీనా వెళ్తుంది.

రవికి శృతి షర్ట్ గిఫ్ట్.. ఇద్దరి మధ్య గొడవ

ఇటు రవి కోసం శృతి ఓ షర్ట్ గిఫ్ట్ గా తెస్తుంది. కానీ అలాంటిదే తన దగ్గర ఉండటంతో అది పాత షర్ట్ కొత్త కవర్లో పెట్టి ఇస్తావా అని అడుగుతాడు. దీంతో శృతి గొడవ పడుతుంది. ఇద్దరూ తిట్టుకుంటారు. మీ అమ్మ ఇలా అంటే మీ అమ్మ అలా అని అనుకుంటారు. దీంతో శృతి కోపంతో వెళ్లిపోతుంది. అప్పుడే నూనె తీసుకొని వస్తున్న మీనాను గుద్దడంతో నూనె కింద పడిపోతుంది. మీనాకు సారీ చెప్పి శృతి మళ్లీ రూమ్ లోకి వెళ్లిపోతుంది.

కాలు జారి కింద పడిన ప్రభావతి

ఇటు కింద పడిన నూనె చూసుకోకుండా ప్రభావతి బయటకు వెళ్లడానికి వచ్చి కాలు జారి కింద పడుతుంది. ఆమెను పట్టుకోవడానికి వెళ్లి మీనా కూడా పడుతుంది. అప్పుడే అందరూ వస్తారు. ఈ మీనా కావాలనే తనను చంపడానికి ఇలా ప్లాన్ చేసిందని ప్రభావతి అంటే.. రోహిణి, మనోజ్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తారు. మరింత రెచ్చగొడతారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దని ప్రభావతితో అంటుంది మీనా. ప్రభావతిని లేపడానికి వెళ్లి మనోజ్ కూడా కింద పడతాడు.

ప్రభావతి, రోహిణికి క్లాస్ పీకిన శృతి

ఇటు అందరూ వెళ్లిపోయిన తర్వాత మనోజ్, ప్రభావతి, రోహిణి కలిసి మీనా గురించి తప్పుగా మాట్లాడతారు. ఆమె కావాలని ఇలా చేసిందని ప్రభావతి అంటే.. ఈ మధ్య మీనా పూర్తిగా మారిపోయిందని, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తోందని రోహిణి రెచ్చగొడుతుంది. ఇదంతా విన్న శృతి వచ్చి అత్తాకోడళ్లిద్దరినీ చెడామడా తిడుతుంది.

మీనా నూనె పడేసిందే అనుకున్నాం.. మీ కళ్లు ఎక్కడ పెట్టుకున్నారని అత్తను నిలదీయడంతో ఆమె షాక్ తింటుంది. మీనాకు ఎందుకంతలా సపోర్ట్ చేస్తున్నావని రోహిణి అంటుంది. మీకు మీనాను తిట్టడానికి ఏదో ఒక సాకు కావాలి.. అది లేకపోతే మీరే క్రియేట్ చేసుకుంటారు.. ఇక నుంచి మీనా జోలికి వచ్చే ముందు ఆలోచించుకోండని ఇద్దరికీ కాస్త గట్టిగానే ఇచ్చుకొని శృతి వెళ్లిపోతుంది.

అత్త కోసం మీనా నాటు వైద్యం

ఇటు ఇంత జరిగినా అత్త కోసం మీనా తపనపడుతుంది. ఆమె కాలు బెణకడంతో నాటు వైద్యం చేయాలని అనుకుంటుంది. అదే విషయం బాలుకి చెబితే అతడు కూడా తిడతాడు. తేలు నీళ్లలో కొట్టుకుపోతుందని బయటకు తీస్తే.. అది మనల్నే కుడుతుందని, తన తల్లికి నువ్వు సేవలు చేసినా ఆమె నిన్ను తిడుతూనే ఉంటుందని అంటాడు.

అయినా మీనా మాత్రం ప్రభావతి కోసం తన ఫ్రెండ్ చెప్పిన నాటు వైద్యం చేయడానికి రెడీ అవుతుంది. ఇటు ప్రభావతి గదిలోకి వెళ్లి మరీ ఆమెను మరింత రెచ్చగొడుతుంది రోహిణి. శృతి ఆగడాలకు చెక్ పెట్టడానికి ఆమె తల్లిని కలుస్తుంది ప్రభావతి. ఇంట్లో జరిగినవి ఆమెకు చెబుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More