Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ మరోసారి తెలుగు అర్బన్ ప్రేక్షకుల మనసు దోచుకోగా.. ఓవరాల్ గా కార్తీక దీపం 2 సీరియల్ మరోసారి సత్తా చాటింది. తాజాగా ఈ ఏడాది 13వ వారానికి సంబంధించిన అర్బన్, రూరల్ (U+R) రేటింగ్స్ వెలువడ్డాయి. ఈ వారం కూడా స్టార్ మా (Star Maa) తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా 'వంటలక్క'గా గుర్తింపు పొందిన దీపమ్మ సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది.
తిరుగులేని 'కార్తీక దీపం 2'

చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన 'కార్తీక దీపం 2 - ఇది నవ వసంతం' సీరియల్ ఊహించిన దానికంటే భారీ స్థాయిలో రేటింగ్స్ రాబడుతోంది. 13వ వారంలో ఈ సీరియల్ 12.99 రేటింగ్‌తో తెలుగు రాష్ట్రాల్లోనే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.
డాక్టర్ బాబు, దీపమ్మల మధ్య సాగే ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని ఈ అంకెలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం అర్బన్ రేటింగ్ చూస్తే మాత్రం గుండె నిండా గుడి గంటలు 10.47 రేటింగ్ తో తొలి స్థానంలో నిలిచింది. ఓవరాల్ గా అయితే ఈ సీరియల్ నాలుగో స్థానంలో ఉంది.
టాప్-6లో స్టార్ మా సీరియల్స్
ఈ వారం టాప్-6 స్థానాలను గమనిస్తే అన్నీ స్టార్ మా ఛానల్‌కు చెందినవే కావడం విశేషం. రెండో స్థానంలో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (12.12) నిలవగా.. 'ఇంటింటి రామాయణం' (11.49) మూడో స్థానంలో నిలిచింది.
వీటితో పాటు 'గుండెనిండా గుడిగంటలు' (11.39), 'పొదరిల్లు' (9.92), నువ్వు లేక నేను లేను (8.96) వరుసగా తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ఈ సీరియల్స్ అన్నీ కూడా కుటుంబ బంధాలు, మధ్యతరగతి భావోద్వేగాల చుట్టూ తిరుగుతుండటంతో మహిళా ప్రేక్షకులు వీటికి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.
జీ తెలుగు పోరాటం.. 'జగద్ధాత్రి'దే పైచేయి
మరోవైపు జీ తెలుగు (Zee Telugu) కూడా తన ఉనికిని చాటుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఆ ఛానల్‌లో ‘జగద్ధాత్రి’ సీరియల్ 7.04 రేటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జీ తెలుగులో టాప్ రేటింగ్ సాధించిన సీరియల్స్ చూస్తే.. జగద్ధాత్రి (7.04), చిరంజీవి సౌభాగ్యవతి (6.70), జయం (6.70), మేఘసందేశం (6.31) ఉన్నాయి.
{{/usCountry}}మరోవైపు జీ తెలుగు (Zee Telugu) కూడా తన ఉనికిని చాటుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఆ ఛానల్‌లో ‘జగద్ధాత్రి’ సీరియల్ 7.04 రేటింగ్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జీ తెలుగులో టాప్ రేటింగ్ సాధించిన సీరియల్స్ చూస్తే.. జగద్ధాత్రి (7.04), చిరంజీవి సౌభాగ్యవతి (6.70), జయం (6.70), మేఘసందేశం (6.31) ఉన్నాయి.
{{/usCountry}}మొత్తానికి బుల్లితెర రేటింగ్స్ చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు ఎమోషన్స్, సెంటిమెంట్ పుష్కలంగా ఉంటేనే ఆదరిస్తారని మరోసారి రుజువైంది. జీ తెలుగులో 'జగద్ధాత్రి' వంటి సీరియల్స్ యాక్షన్ మరియు డ్రామాతో ఆకట్టుకుంటుంటే, స్టార్ మా మాత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో రేటింగ్‌లో దూసుకుపోతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: ఈ వారం తెలుగులో నంబర్ వన్ సీరియల్ ఏది?
జవాబు: 13వ వారం రేటింగ్స్ ప్రకారం స్టార్ మాలో ప్రసారమవుతున్న 'కార్తీక దీపం 2' 12.99 రేటింగ్‌తో మొదటి స్థానంలో నిలిచింది. కేవలం అర్బన్ మార్కెట్ చూస్తే గుండె నిండా గుడి గంటలు ఉంది.
ప్రశ్న: జీ తెలుగులో అత్యధిక రేటింగ్ సాధించిన సీరియల్ ఏది?
జవాబు: జీ తెలుగు ఛానల్‌లో 'జగద్ధాత్రి' సీరియల్ 7.04 రేటింగ్‌తో టాప్ పొజిషన్‌లో ఉంది.
ప్రశ్న: టీఆర్పీ రేటింగ్స్ అంటే ఏమిటి?
జవాబు: టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (TRP) అనేది ఒక నిర్దిష్ట సమయంలో ఏ ఛానల్ లేదా ఏ ప్రోగ్రామ్‌ను ఎంతమంది చూస్తున్నారో లెక్కించే కొలమానం.
| ర్యాంక్ | సీరియల్ పేరు | ఛానల్ | రేటింగ్ (U+R) |
|---|---|---|---|
| 1 | కార్తీకదీపం 2 | స్టార్ మా | 12.99 |
| 2 | ఇల్లు ఇల్లాలు పిల్లలు | స్టార్ మా | 12.12 |
| 3 | ఇంటింటి రామాయణం | స్టార్ మా | 11.49 |
| 4 | గుండెనిండా గుడిగంటలు | స్టార్ మా | 11.39 |
| 5 | పొదరిల్లు | స్టార్ మా | 9.92 |
| 6 | నువ్వులేక నేనులేను | స్టార్ మా | 8.56 |
| 7 | జగద్ధాత్రి | జీ తెలుగు | 7.04 |
| 8 | చిరంజీవి సౌభాగ్యవతి | జీ తెలుగు | 6.70 |
| 9 | జయం | జీ తెలుగు | 6.70 |
| 10 | మేఘసందేశం | జీ తెలుగు | 6.31 |