గుండె నిండా గుడ గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో సుమతికి పెళ్లి చూపులు జరగడం, కొత్త అల్లుడు కూడా బాలులాగే అత్తకు ధైర్యం చెప్పడం, ఇటు రోహిణికి దినేష్ బెదిరింపులు, మనోజ్ కు మణికంఠ బంపర్ ఆఫర్ లాంటి సీన్లతో సాగిపోయింది.
సుమతికి పెళ్లి చూపులు

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (మార్చి 13) ఎపిసోడ్ సుమతికి పెళ్లి చూపులకు రెడీ చేసే సీన్ తో మొదలవుతుంది. తనకు పెళ్లి ఇప్పుడే వద్దని సుమతి అంటున్నా మంచి సంబంధం అంటూ మీనా, బాలు ఒప్పిస్తారు. అయితే పెళ్లి కొడుకుతో తాను ప్రత్యేకంగా మాట్లాడాలని బాలు చెవిలో సుమతి చెబుతుంది. పెళ్లి కొడుకు వాళ్లు వచ్చి సుమతిని చూసి తమకు నచ్చిందని చెబుతారు. అప్పుడే బాలు బలవంతంగా అబ్బాయిని, అమ్మాయిని ప్రత్యేకంగా మాట్లాడుకోమని బయటకు పంపిస్తాడు.
ఒక కండిషన్‌పై పెళ్లికి సుమతి ఓకే
అబ్బాయిని తీసుకొని బయటకు వెళ్లిన సుమతి తమ ఇంటి గురించి మొత్తం చెబుతుంది. అటు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి కూడా మీ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తే అందరూ చాలా బాగా చెప్పారని, అందుకే తనకు ఈ సంబంధం ఓకే అని చెబుతాడు. సుమతి మాత్రం తాను ఉద్యోగం కొనసాగిస్తానని, పెళ్లి తర్వాత కూడా తన తల్లికి మద్దతుగా ఉంటానని అంటుంది. ఆ కండిషన్ కు అబ్బాయి ఓకే అనగానే.. సుమతి కూడా పెళ్లికి ఓకే చెబుతుంది.
పార్వతికి ధైర్యం చెప్పిన అల్లుళ్లు
తమకు కట్నకానుకలు ఏమీ అవసరం లేదని వాళ్లు చెప్పడంతో పార్వతి మరింత మురిసిపోతుంది. కొత్త అల్లుడు కూడా అత్తయ్యా అని పిలుస్తూ.. మీరు ఏమీ టెన్షన్ పడకండి.. మీ పెద్దల్లుడిలాగే నేను కూడా మీకు సపోర్ట్ గా ఉంటానని ధైర్యం చెబుతాడు. ఇటు బాలు కూడా పెళ్లి పనులన్నీ తాను చూసుకుంటానని పార్వతికి చెప్పడంతో ఆమె చాాలా సంతోషిస్తుంది.
విద్య దగ్గరికి దినేష్.. ప్రభావతి ముందే రోహిణికి ఫోన్
{{/usCountry}}తమకు కట్నకానుకలు ఏమీ అవసరం లేదని వాళ్లు చెప్పడంతో పార్వతి మరింత మురిసిపోతుంది. కొత్త అల్లుడు కూడా అత్తయ్యా అని పిలుస్తూ.. మీరు ఏమీ టెన్షన్ పడకండి.. మీ పెద్దల్లుడిలాగే నేను కూడా మీకు సపోర్ట్ గా ఉంటానని ధైర్యం చెబుతాడు. ఇటు బాలు కూడా పెళ్లి పనులన్నీ తాను చూసుకుంటానని పార్వతికి చెప్పడంతో ఆమె చాాలా సంతోషిస్తుంది.
విద్య దగ్గరికి దినేష్.. ప్రభావతి ముందే రోహిణికి ఫోన్
{{/usCountry}}మరోవైపు విద్య దగ్గరికి దినేష్ వస్తాడు. రోహిణికి ఫోన్ చేయమంటాడు. లేదంటే తానే ఆమె మొగుడి దగ్గరికి వెళ్లి డబ్బు తీసుకుంటానని బెదిరిస్తాడు. దీంతో రోహిణికి ఫోన్ చేస్తుంది విద్య. అయితే ఆమె లేకపోవడంతో ప్రభావతి ఫోన్ ఎత్తుతుంది. దినేష్ వచ్చాడని విద్య చెబుతుంది. అప్పుడే రోహిణి ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. ప్రభావతి పక్కనే ఉండటంతో ఇబ్బంది పడుతుంది. తనకు నెలలోగా రూ.లక్ష ఇవ్వాల్సిందే అని దినేష్ స్పష్టం చేస్తాడు. సరే అని రోహిణి ఫోన్ పెట్టేస్తుంది.
రూ.300 కోట్లు అంటూ మురిసిపోయిన ప్రభావతి
ఆ తర్వాత దినేష్ ఎవరని ప్రభావతి నిలదీస్తుంది. అతడు తన తండ్రి దగ్గర పనిచేసే అకౌంటెంట్ అని, విద్య దగ్గరికి వచ్చాడని చెబుతుంది. అప్పుడు రోహిణి తండ్రి గురించి ప్రభావతి ఆరా తీస్తుంది. మరో నెల రోజుల్లో కేసు కొలిక్కి వస్తుందని చెబుతుంది. మరి ఆస్తి సంగతేంటని ప్రభావతి అడుగుతుంది.
అదంతా పూర్తయిన తర్వాత ఆస్తి సంగతి తేలుస్తారని రోహిణి అంటుంది. మీ నాన్న అకౌంట్లో ఓ రూ.3 కోట్లు ఉంటాయా అని ప్రభావతి అడిగితే రూ.300 కోట్లు ఉంటాయని ఆమె చెబుతుంది. దీంతో ప్రభావతి షాక్ తింటుంది. అదే షాక్ లో వెళ్లి సత్యంకు ఆ విషయం చెబితే అతడు లైట్ తీసుకుంటాడు.
భర్త ఎలా ఉండాలో చెప్పిన మీనా
ఇటు ఇంటికి తిరిగి వస్తూ బాలు, మీనా కారులో మాట్లాడుకుంటారు. అప్పుడు పెళ్లికి ముందు తమకు కావాల్సిన వాళ్లు ఎలా ఉండాలని అనుకున్నారో ఒకరికొకరు చెప్పుకుంటారు. తనకు కాబోయే వాడు కనీసం డిగ్రీ చదివి ఉండాలని, ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదని, తనను బాగా చూసుకోవాలని, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలని అనుకున్నట్లు మీనా చెబుతుంది. దీంతో బాలు తనలో ఆ ఒక్క లక్షణం కూడా లేదని బాధపడతాడు. అయతే ఎన్నో అనుకుంటామని, కానీ ఇప్పుడు మీలాంటి భర్త ఉంటే చాలని అనుకుంటున్నట్లు మీనా చెబుతుంది. అటు బాలు అయితే తాను పెళ్లే చేసుకోకూడదని అనుకున్నానని అంటాడు.
గుణ దగ్గరికి వెళ్లిన రోహిణి, విద్య
మరోవైపు రోహిణి, విద్య కలిసి మళ్లీ గుణ దగ్గరికి వెళ్తారు. దినేష్ విషయంలో ఏదో ఒకటి చేయాలని అడుగుతారు. కానీ అతడు మాత్రం బాలు వీడియో కావాలని అడుగుతాడు. ఆ వీడియోను ఎలాగైనా ఇస్తానని, దినేష్ విషయం మాత్రం చూసుకోవాలని రోహిణి చెబుతుంది. అతడు సరే అంటాడు.
మనోజ్‌కు ఆఫర్ ఇచ్చిన మణికంఠ.. వెడ్డింగ్ యానివర్సరీ ప్లాన్
ఇటు మనోజ్ దగ్గరికి పార్క్ ఫ్రెండ్ మణికంఠ వస్తాడు. నీ బిజినెస్ పెద్దగా చేసేలా ఓ ఆఫర్ తీసుకొస్తానని, ఓ వ్యక్తికి ఇంటర్నేషనల్ డీలర్ గా ఉండాలని అంటాడు. దానికి చాలా పెద్ద స్టేటస్ ఉండాలి కదా అని మనోజ్ అంటాడు. అందుకే నీ గురించి చాలా ఎక్కువగా చెప్పానని, నీ తమ్ముళ్ల గురించి కూడా అలాగే చెప్పానని మణికంఠ చెబుతాడు.
అతడు రెండు రోజుల్లో వస్తున్నాడని, గ్రాండ్ పార్టీ ఇచ్చి కోట్ల బిజినెస్ సొంతం చేసుకోమని అంటాడు. దీంతో రోహిణి తమ పెళ్లి యానివర్సరీ ప్లాన్ చేసి, దానికి అతన్ని పిలుద్దామని అంటుంది. మనోజ్ ఇష్టం లేకపోయినా సరే అని అంటాడు. ఇంటికి వచ్చి ఆ గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.