...
...
Next Story

గుండెనిండా గుడిగంటలు: గుణతో రోహిణికి ఉన్న సంబంధం కనిపెట్టేసిన మీనా.. నిగ్గు తేల్చే పనిలో బాలు.. పూర్తిగా ఇరుక్కుపోయి..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రోహిణి నిండా మునిగిపోయే మరో ఘటన జరగబోతోంది. ఆమెకు, గుణకు మధ్య ఉన్న సంబంధాన్ని మీనా తెలుసుకుంటుంది. అదే విషయం బాలుకు చెప్పగా అతడు గుట్టు తేల్చే పనిలో పడతాడు.

Published on: May 12, 2026, 15:58:16 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మే 12 ఎపిసోడ్ ప్రోమో ఆసక్తికరంగా సాగింది. ఇప్పటికే అత్త చేతుల్లో పూర్తిగా ఇరుక్కుపోయిన రోహిణికి.. ఇప్పుడు తన సంసారాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేసే మరో ఘటన జరిగింది. కల్పన విషయమే కాదు.. తాజాగా ఆమెకు గుణతో ఉన్న సంబంధం గురించి కూడా మీనా తెలుసుకుంటుంది.

రోహిణి గురించి చెప్పిన మీనా

గుండెనిండా గుడిగంటలు: గుణతో రోహిణికి ఉన్న సంబంధం కనిపెట్టేసిన మీనా.. నిగ్గు తేల్చే పనిలో బాలు.. పూర్తిగా ఇరుక్కుపోయి..
గుండెనిండా గుడిగంటలు: గుణతో రోహిణికి ఉన్న సంబంధం కనిపెట్టేసిన మీనా.. నిగ్గు తేల్చే పనిలో బాలు.. పూర్తిగా ఇరుక్కుపోయి..

గుండె నిండా గుడి గంటలు సీరియల్లో తాజా ఎపిసోడ్ ప్రోమోలో రోహిణి విషయంలో ఇంట్లో జరిగిన దానిని తన తల్లి పార్వతి, చెల్లి సుమతి, తమ్ముడు శివలకు మీనా చెబుతుంది. కల్పన మొత్తం డబ్బులు ఇచ్చినా.. వాటిని ఇంట్లో ఇవ్వకుండా మనోజ్ తో బిజినెస్ పెట్టించిందని చెబుతుంది. ఆ విషయం తెలిసి అత్తయ్య బాగా కొట్టిందనీ అంటుంది.

గుణ గురించి వెల్లడించిన శివ

ఆ సమయంలో అక్కడే ఉన్న శివ.. రోహిణి గురించి మరో సీక్రెట్ కూడా చెబుతాడు. ఆమె తరచూ గుణ దగ్గరికి రావడం తాను చూశానని అంటాడు. ఎప్పుడూ లక్ష, 2 లక్షలు అప్పుగా తీసుకునేదని చెబుతాడు. అది విని మీనా మరింత షాక్ తింటుంది. అలాంటి వాడి దగ్గర అంతలా అప్పు చేయడం ఏంటి.. రోహిణి చుట్టూ ఏదో జరుగుతోంది అని మీనా అనుకుంటుంది.

గుట్టు లాగే పనిలో బాలు

ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత బాలుకి మీనా చెబుతుంది. అతడు కూడా అది విని షాక్ తింటాడు. ఇది కచ్చితంగా వదిలేయాల్సిన విషయం కాదు.. ఏం జరుగుతుందో తేల్చాల్సిందే అని అంటాడు. దీంతో రోహిణి జీవితం మరిన్ని చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ప్రోమో ముగుస్తుంది.

రోహిణి రోడ్డు పడుతుందా?

అయితే కల్పన డబ్బు విషయంతో ఆమె చేసిన మొదటి ద్రోహం బయటపడింది. ఇది మెల్లగా ఆమె చేసిన మరిన్ని దారుణాల గుట్టు కూడా విప్పేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆమెపై పీకల వరకు కోపంతో ఉన్న ప్రభావతి.. రోహిణి గురించి అసలు నిజం తెలిసిన రోజు ఏం చేస్తుందన్న ఆసక్తి నెలకొంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe