గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అన్నదమ్ములు అంతా భార్యలను ఎత్తుకుని తిరుగుతారు. ఇంటికొచ్చిన ప్రభావతి ఒక్క మీనానే అంటుంది. దాంతో నేను ఒక్కదాన్నే మీకు కనిపిస్తున్నానా అని మీనా అంటుంది. ఏంటే వెటకారమా అని ప్రభావతి అంటే.. నీకు చత్వరమా. సైట్ వచ్చిందా అని అంటుందని బాలు అంటాడు.
పెద్ద మాట అన్నావ్

మేమంతా తిరుగుతూనే ఉన్నాం కదా బాలు, మీనాలనే ఎందుకు అంటున్నారు అని శ్రుతి అంటుంది. చిన్నదానివి అయినా పెద్ద మాట అడిగావని సత్యం అంటాడు. తర్వాత మళ్లీ బెడ్ రూమ్ గురించి గొడవ అవుతుంది. ఒకరికి న్యాయం చేయాలంటే మరొకరికి అన్యాయం జరుగుతుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాల్సిందే అని సత్యం అంటాడు.
ఒక్కొక్కరు ఎంతిస్తారు అంటే మనోజ్, రవికి కుదరదంటారు. అంటే ఇన్నిరోజులు బాలు, మీనా వల్లే ఇల్లు గడుస్తుందా అని సత్యం అంటాడు. ఇన్నిరోజులు ఇంటిలెక్కలు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకుంటాను. వాడు అప్పులు, ఈఎమ్‌ఐలు కట్టాలు. అయినా వాడిని మాత్రమే పీడించి అడుగుతున్నావా. ఇక జరగాల్సింది మాట్లాడుకుందాం. ఇంటికి పెద్దవాడు మనోజ్ ఎంత ఇస్తావు అని సత్యం అడుగుతాడు.
రెండు వేలు అంటాడు మనోజ్. అందరికంటే ఎక్కువ నువ్వే సంపాదిస్తున్నావ్. తమ్ముళ్లు వాళ్ల భార్యల ముందు తక్కువ అవడం నాకు ఇష్టం లేదని ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి 8 వేలు అని వెళ్లతో చూపిస్తుంది. అంతేనా అని ప్రభావతి అంటే బలవంతం లేదని సత్యం అంటాడు. బాలు గారు మీరు చెప్పండి అని ప్రభావతి అంటే.. మీనా పదివేల్లు చూపిస్తుంది. పదివేలు అని బాలు అంటాడు.
రోహిణి ఐదు వేలు
రవి కూడా పదివేలు అని చెబుతాడు. మీనా రెండు వేలు ఇస్తానంటుంది. రెండు లక్షలు అన్నట్లు చెబుతున్నావ్ అని ప్రభావతి అంటే.. అమ్మ కూడా డ్యాన్స్ స్కూల్ పెట్టి లక్షలు సంపాదిస్తానందిగా. 20 వేలు ఇస్తుందని బాలు అంటాడు. నేనే ఈగలు తోలుకుంటున్నాను అని ప్రభావతి అంటుంది. రోహిణి ఐదు వేలు ఇస్తానంటుంది. శ్రుతి నెలకు పది వేలు ఇస్తానంటుంది.
{{/usCountry}}రవి కూడా పదివేలు అని చెబుతాడు. మీనా రెండు వేలు ఇస్తానంటుంది. రెండు లక్షలు అన్నట్లు చెబుతున్నావ్ అని ప్రభావతి అంటే.. అమ్మ కూడా డ్యాన్స్ స్కూల్ పెట్టి లక్షలు సంపాదిస్తానందిగా. 20 వేలు ఇస్తుందని బాలు అంటాడు. నేనే ఈగలు తోలుకుంటున్నాను అని ప్రభావతి అంటుంది. రోహిణి ఐదు వేలు ఇస్తానంటుంది. శ్రుతి నెలకు పది వేలు ఇస్తానంటుంది.
{{/usCountry}}మనోజ్, రోహిణి కలిసి 13 వేలు, బాలు, మీనా కలిపి 12 వేలు, రవి, శ్రుతి కలిపి 20 వేలు ఇంటికి ఇస్తారు. అందరిని డబ్బు ఎందుకు అడిగారో చెబుతారా అని ప్రభావతి అంటే.. చెప్పను. అవసరం వచ్చినప్పుడు చెబుతాను అని సత్యం వెళ్లిపోతాడు. రాత్రి డాబా మీద మనోజ్ లెక్కలు వేస్తాడు. అంత డబ్బు తీసుకుని నాన్న ఏం చేస్తాడురా అని మనోజ్ అంటాడు.
నిన్ను మోసం చేసిన అమ్మాయికి గుడి కట్టిస్తాడట అని బాలు అంటాడు. మనందరికి మూడు బెడ్ రూమ్‌లు కట్టించి అమ్మనాన్న బయటకు వెళ్లిపోతారేమో అని మనోజ్ అంటాడు. దాంతో బాలు కోప్పడతాడు. నాన్నను బయటకు పంపేదే లేదు అంటాడు. తర్వాత మీ అత్త దగ్గర ఏముందిరా పూలగంపలా అని మనోజ్ అంటే బాలు కొడతాడు. రవి ఆపుతాడు.
పూల వ్యాపారంలో లక్షలు
తర్వాత బాలు కిందకు వెళ్లిపోతాడు. మీనా, శ్రుతి మాట్లాడుకుంటారు. రోహిణి వస్తుంది. పూల వ్యాపారంలో లక్షలు వస్తున్నాయా. మావయ్య అడక్కుండానే రెండు వేలు ఇస్తున్నాన్నావ్. మంచి మార్కులు కొట్టేయడానికా అని రోహిణి అంటుంది. నేను కొత్తగా తెచ్చుకోడానికి ఏముందని మీనా అంటుంది. రెండు వేలు ఇచ్చి ఇల్లంతా మీరే నడుపుతున్నట్లు మాట్లాడుతున్నారు. బాలు అంటున్నాడు అని రోహిణి అంటుంది.
ఇన్నిరోజులు అలాగే నడిచిందిగా. నువ్వు అత్తయ్యకు పాకెట్ మనీ కింద ఐదు వేలు, దుబాయ్ నుంచి చీర ఇచ్చావ్ ఇదంతా అత్తయ్య దగ్గరి మంచి మార్కులు కొట్టేయడానికని మేము అన్నామా అని శ్రుతి అంటుంది. దాంతో రోహిణి తడబడుతుంది. అమ్మ అనుకుని ఇచ్చాను అని రోహిణి అంటే.. నాకు ఆంటీలో అమ్మ ఎప్పుడు కనిపించదు. తల్లి అందరిని సమానంగా చూస్తుంది. ఒక్కొక్కరిని ఒక్కోలా కాదని శ్రుతి అంటుంది.
నీకోసమే చెబుతున్నాను. మాకు కష్టం కాదు. కానీ, నీకు ఏం మిగుల్తుంది అని రోహిణి ప్లేట్ తిప్పేస్తుంది. లక్షల్లో సంపాదించే మనోజ్ 8 వేలే ఇస్తానన్నాడేంటీ అని శ్రుతి నిలదీస్తుంది. నా సంగతి పక్కన పెట్టు ఎక్కువ సంపాదించే నువ్వు ఐదు వేలే ఇస్తానన్నావేంటీ అని మీనా అడుగుతుంది. చెప్పడం బాగానే ఉంటుంది. ఇచ్చేటప్పుడే తెలుస్తుంది అని రోహిణి అంటుంది.
జాలిపడే దుస్థితిలో లేం
గుడ్డు పెట్టే కోడికి లేని బాధ ఆమ్లెట్ వేసుకునే వాళ్లకెందుకు అని మా ఆయన అనేవారు అని మీనా అనగానే శ్రుతి తెగ నవ్వుతుంది. ఏమన్నా డైలాగా. టైమింగ్ అదిరిందని శ్రుతి అంటుంది. ఇస్తామని చెప్పాక ఎలాగో ఇస్తాం. లేకుంటే అత్తగారు ఊరుకోరుగా. మా మీద జాలి పడుతున్నావేంటీ. నువ్వు జాలి పడే అంత దుస్థితిలో మేము లేము అని మీనా అంటుంది.
దాంతో శ్రుతి నవ్వుతుంది. వరుసగా శ్రుతి, మీనా ఆడేసుకోవడంతో రోహిణి చిరాకు పడుతూ వెళ్లిపోతుంది. తర్వాత చిరాకుతో బాలు వచ్చి కాఫీ అడుగుతాడు. మనోజ్ అన్న మాటలను కోపంగా చెబుతాడు బాలు. వాడు వేరే బంగ్లాకు వెళ్లిపోతాడంటా అని చిరాకు పడతాడు. రోహిణి కూడా అలాగే మాట్లాడిందని మీనా అంటుంది. మరుసటి రోజు ఉదయం ప్రభావతికి బాలు కాఫీ కావాలా అని అడిగి ఇవ్వడు.
మీనాకు మాత్రం ఇస్తానంటాడు. ఈ కాఫీ తాగినవాళ్ల కడుపు గడబిడ అవుతుంది కాక ప్రభావతి శాపిస్తుంది. శాపిస్తున్నావా శాపవతి అని బాలు అంటాడు. ఇంతలో శ్రుతికి తల్లి శోభన కాల్ చేస్తుంది. దివాళి పండుగకు రవి, శ్రుతిని పిలుస్తుంది శోభన. అదే విషయం శ్రుతి చెబుతుంది. అల్లుడిగా నాకు చెప్పడం కరెక్ట్ అని రవి అంటాడు. మా అత్తగారు నాకే కాల్ చేసి పిలుస్తారు అని బాలు అంటాడు.
మీనా కిడ్నాప్
దాంతో ప్రభావతి వెటకారంగా మాట్లాడుతుంది. దానికి మీనా చురకలు వేస్తుంది. సత్యంకు అదే విషయం చెబితే మెచ్చుకుంటాడు. తర్వాత మీనాను కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేస్తారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.