గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: అత్తను చెడామడా తిట్టిన మీనా.. ఇంటిని తాకట్టు పెడతానన్న సత్యం.. పండుగ రోజే కిడ్నాప్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (అక్టోబర్ 20) ఎపిసోడ్ లో మరోసారి సత్యం ఇంట్లో రచ్చ జరుగుతుంది. అత్తను మీనా చెడామడా తిడుతుంది. అటు దీపావళి రోజే రోహిణికి బదులుగా మీనా కిడ్నాప్ అవుతుంది.

Published on: Oct 20, 2025, 08:26:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 535వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో కొత్త గది కోసం రచ్చ జరగడం నుంచి చివర్లో రోహిణి బదులు మీనా కిడ్నాప్ కావడం వరకు ఈ ఎపిసోడ్ ఉత్కంఠగా అనిపించింది. అయితే అత్త ప్రభావతిని మీనా మరోసారి చెడామడా తిట్టడం ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: అత్తను చెడామడా తిట్టిన మీనా.. ఇంటిని తాకట్టు పెడతానన్న సత్యం.. పండుగ రోజే కిడ్నాప్
గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: అత్తను చెడామడా తిట్టిన మీనా.. ఇంటిని తాకట్టు పెడతానన్న సత్యం.. పండుగ రోజే కిడ్నాప్

ఇంట్లో దీపావళి వేడుకల ప్లాన్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (అక్టోబర్ 20) ఎపిసోడ్ ఇంట్లో అందరూ దీపావళి వేడుకల ప్లాన్ చేయడంతో మొదలవుతుంది. శృతి అమ్మ వాళ్లు పండుగ కోసం పిలుస్తున్నారని, కానీ ఇంట్లో ఇద్దరు కోడళ్లతో లక్ష్మీ పూజ చేయించాలని అనుకుంటున్నట్లు ప్రభావతి చెబుతుంది.

మనకు ముగ్గురు కోడళ్లు లక్ష్మీ, పార్వతి, సరస్వతిలా ఉన్నారు.. ముగ్గురితో చేయించాలని సత్యం అంటాడు. మీకు ముగ్గురు కొడుకులే కాదు మౌనిక కూడా ఉంది.. ఆమెను కూడా పిలవండని మీనా అంటుంది. పిలుద్దామంటూ మౌనికకు ప్రభావతి ఫోన్ చేస్తుంది. మీ అల్లుడుగారు బిజినెస్ పని మీద వెళ్తున్నారు.. నన్నూ తీసుకెళ్తున్నారు రావడం కుదరదని అనడంతో సరే అని ప్రభావతి ఫోన్ పెట్టేస్తుంది.

మేడ మీద కొత్త రూమ్ కట్టిస్తున్న సత్యం

ఆ తర్వాత మేడ మీద మరో గది కోసం తనకు తెలిసిన వాళ్లను సత్యం పిలుస్తాడు. వాళ్లు వచ్చి మేడ మీద కొలతలు తీసుకుంటారు. అందరూ పైకి వెళ్లి ఏం చేస్తున్నారని ఆశ్చర్యంగా అడుగుతారు. ఇల్లు అమ్మేస్తున్నారా అని మనోజ్ అంటాడు. కొత్త గది కోసం కొలతలు తీసుకుంటున్నారు అని రవి చెబుతాడు. గది కోసం రోజూ గొడవలు ఎందుకు.. కొత్త గది కట్టిస్తున్నానని సత్యం అంటాడు. అయితే రూ.5 లక్షలు అవుతాయని ఆ వచ్చిన వ్యక్తి చెబుతాడు. అంత డబ్బు అనడంతో అందరూ షాకవుతారు.

ఇంట్లో మళ్లీ రచ్చ.. లోన్ తీస్తానన్న సత్యం

దీంతో కిందికి వచ్చిన తర్వాత మరోసారి రచ్చ జరుగుతుంది. అంత డబ్బు పెట్టి ఇప్పుడు అవసరమా అని ప్రభావతి, మనోజ్ అంటారు. నిన్నేమైనా డబ్బు అడుగుతున్నారా.. ఎందుకలా ఉలిక్కి పడతావ్ అంటూ మనోజ్ ను నిలదీస్తాడు రవి. మీరు నెలనెలా ఇచ్చిన డబ్బులతోనే కడతానని సత్యం అంటాడు.

అలా కట్టాలంటే మూడేళ్లు పడుతుందని రోహిణి అంటుంది. ఇంటిపై లోన్ తీస్తానని సత్యం అనడంతో ప్రభావతి రచ్చ చేస్తుంది. ఇది మా నాన్న ఇచ్చిన ఇల్లు, తాకట్టు ఎందుకు పెడతారు అని అడుగుతుంది. అయినా పనికి రాని వాళ్ల కోసం తన తండ్రి ఇచ్చిన ఇంటిని తాకట్టు పెట్టనివ్వను అని తేల్చి చెబుతుంది.

అత్త ప్రభావతికి క్లాస్ పీకిన మీనా.. చప్పట్లు కొట్టిన రవి, శృతి

వాళ్లకేమి గది అవసరం లేదు.. గుడిసె చాలు.. ఇంతకుముందు గదుల్లో ఉన్నారా ఏంటని ప్రభావతి అంటుంది. దీంతో బాలు తల్లిపై మండిపడతాడు. అటు మీనా అందుకుంటుంది. ఎవరు గుడిసెలో ఉన్నారు.. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చారా.. మీలాగే మా ఇంట్లో ఒక్కో కొడుకుని, కూతురిని వేర్వేరుగా చూసే అలవాటు లేదు.. ఏది ఉన్నా అందరం కలిసే పంచుకుంటాం.. అత్తగా అంటే పడే రోజులు పోయాయి అని మీనా కాస్త గట్టిగానే అత్తను తిడుతుంది. దీంతో రవి, శృతి చప్పట్లు కొడతారు.

ముగ్గురు కోడళ్లకూ సత్యం ఎర్ర చీరలు

అటు ఇంట్లో దీపావళి వేడుకల కోసం సిద్ధమవుతుంటారు. రవి పూలు కడుతుండగా.. మనోజ్ ఊరికే పక్కన నిలబడి బిల్డప్ ఇస్తుంటాడు. మీనా ముగ్గు వేస్తుంటుంది. మీ ఆయనను ఇప్పటికే ముగ్గులోకి దింపావు కానీ.. లోపల పిండి వంటలు ఎవరు చేస్తారని ప్రభావతి వచ్చి దెప్పిపొడుస్తుంది. మరోసారి అత్తకు మీనా క్లాస్ పీకుతుంది. రవి కూడా ఆమెకు సపోర్ట్ ఇస్తాడు. ఆ తర్వాత బాలు భారీ డబ్బాలో టపాసులు తీసుకొస్తాడు.

అటు సత్యం వెళ్లి ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తీసుకొస్తాడు. ముగ్గురు కోడళ్లకూ అతడు ఎర్ర చీరలే తీసుకొస్తాడు. వాటిని చూసి అందరూ మురిసిపోతారు. ముగ్గురు కొడుకులు, కోడళ్లూ కొత్త బట్టలు వేసుకుంటారు. వాళ్లందరినీ చూసి ప్రభావతి మురిసిపోతూ దేవుడికి హారతి ఇచ్చి తీసుకొస్తుంది.

రోహిణి బదులు మీనా కిడ్నాప్

అటు రోహిణికి దినేష్ మరోసారి ఫోన్ చేసి బెదిరిస్తాడు. మనుషులను పెట్టి కొట్టించినా నీకు బుద్ధి రాలేదా అని రోహిణి అంటుంది. నాకు అర్జెంటుగా రూ.లక్ష కావాలని డిమాండ్ చేస్తాడు. అటు విద్య ఇంటికి వెళ్లి రోహిణి దినేష్ గురించి చెబుతుంది. దినేష్ కొందరు రౌడీలకు ఆమెను కిడ్నాప్ చేయమని చెబుతాడు. ఎర్ర చీర కట్టుకుందని అంటాడు. అయితే మీనా కూడా ఎర్ర చీర కట్టుకొని ఆ ఇంటి నుంచి బయటకు రావడంతో ఆమెనే అనుకొని వాళ్లు మీనాను కిడ్నాప్ చేస్తారు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More