గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: అత్తను చెడామడా తిట్టిన శృతి.. కోడలికి క్లాస్ పీకిన సుశీల.. వెనక్కి తగ్గని ప్రభావతి
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (డిసెంబర్ 11) ఎపిసోడ్ లో అత్తకు శృతి కాస్త గట్టిగానే గడ్డి పెడుతుంది. అటు అత్త సుశీల కూడా వచ్చి కోడలికి క్లాస్ పీకుతుంది. అయినా ప్రభావతి మాత్రం వెనక్కి తగ్గదు.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 573వ ఎపిసోడ్ ప్రభావతిని ముఖం మీదే చెడామడా తిట్టేస్తుంది శృతి. మీనాకు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తుంది. దీంతో ఆమె గురించి కామాక్షికి చెప్పి బాధపడుతుంది. అటు సుశీల ఎంట్రీ ఇచ్చి ప్రభావతికి క్లాస్ పీకుతుంది. ఇంత జరిగినా ఆమె మాత్రం వెనక్కి తగ్గదు.

అత్తమామలను కలపాలని కోడళ్ల ప్లాన్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (డిసెంబర్ 11) ఎపిసోడ్ ముగ్గురు కోడళ్లు కలిసి మాట్లాడుకునే సీన్ తో మొదలవుతుంది. అత్తయ్య, మామయ్యలను ఎలాగైనా కలపాలని మీనా అంటుంది. తప్పంతా ఆంటీదే అని, మనోజ్ కు సపోర్ట్ చేయడం ఏంటని శృతి అంటుంది. ఇంట్లో అందరూ బాగుండాలని మీనా అంటే..
మరి మనోజ్‌తో బాలు బాగుండాలని ఎందుకు చెప్పవు అని రోహిణి అడుగుతుంది. అలా అయితే రోహిణి నగలను తీసుకెళ్లి బాలును అమ్ముకోమని చెప్పు మీనా.. అప్పుడు రోహిణి వచ్చి బాలుతో బాగుండాలని మనోజ్‌కు చెబుతుంది అని శృతి ఎగతాళి చేస్తుంది. అవన్నీ వద్దు ముందు అత్తయ్య దగ్గరికి వెళ్లి మాట్లాడదామని మీనా అనడంతో ముగ్గురూ కలిసి వెళ్తారు.
ప్రభావతికి క్లాస్ పీకిన శృతి.. మీనాకు క్షమాపణ చెప్పాలంటూ..
ముగ్గురు కోడళ్లూ కలిసి రావడంతో ప్రభావతి వాళ్లను చూసి మొహం అదోలా పెడుతుంది. మామయ్యతో మాట్లాడమని వాళ్లు చెప్పడంతో తాను ప్రయత్నించినా ఆయన పట్టించుకోవడం లేదు కదా అని అంటుంది. ఈ విషయంలోనూ మీనానే నిందిస్తుంది. నీ కాపురం బానే ఉంది.. నీ వల్ల పక్కవాళ్ల కాపురం కూలిపోతోంది అని అంటుంది. అది చూసి శృతి రెచ్చిపోతుంది. ఓ అత్త కోడలితో మాట్లాడే పద్ధతి ఇది కాదు అని తేల్చి చెబుతుంది.
మీనా నగలు తీసి మీనాపైనే నిందేశారు.. తప్పంతా మీరు చేసి మీనాను ఎందుకు అంటారు.. మామయ్యతో మాట్లాడాల్సిన అవసరం లేదు.. మీరు మీనాకు క్షమాపణ చెబితే చాలు ఆయనే వచ్చి మాట్లాడతారని శృతి అంటుంది. ఈ సమస్యకు పరిష్కారం మీరు మీనాకు సారీ చెప్పడం ఒక్కటే అని తేల్చి చెప్పి వెళ్లిపోతుంది.
కొత్త కారు కొనడానికి వెళ్లిన బాలు
అటు బాలు కొత్త కారు కొనడానికి తన ఫ్రెండ్ రాజేష్ తో కలిసి వెళ్తాడు. సెకండ్ హ్యాండ్ షోరూమ్ కు వెళ్లగా అక్కడి ఓనర్ బాలును చూసి నీవల్లే తనకు ఐదు కార్లు అమ్ముడు పోయాయని, నీకు డిస్కౌంట్ ఇస్తానని అంటాడు. రెండు కార్లు కొత్తగా వచ్చాయని చెప్పడంతో బాలు, రాజేష్ వాటిని చూసి రెండూ బాగానే ఉన్నాయనుకుంటారు.
ఏది తీసుకుంటావ్ అని అడిగితే.. మీనానే పిలుస్తాను.. ఆమెనే సెలెక్ట్ చేస్తుందని బాలు అంటాడు. మీనా వచ్చి ఓ కారు సెలెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు కొనొద్దు.. ఇంట్లో ఈ కారు వల్ల మరో గొడవ జరిగే ప్రమాదం ఉంది.. అందరూ బాగున్నప్పుడు కొందాం అని మీనా అంటుంది. బాలు చెప్పినా వినదు. రాజేష్ కూడా అదే చెప్పడంతో బాలు సరే అంటాడు.
కామాక్షికి శృతి గురించి చెప్పి బాధపడిన ప్రభావతి
ఇటు ప్రభావతి కామాక్షి దగ్గరికి వెళ్తుంది. చిన్న కోడలు శృతి గురించి చెప్పి బాధపడుతుంది. ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని చెబుతుంది. ఆమెకు బాగా డబ్బు ఉందని నువ్వే ప్రేమగా చూసుకున్నావు కదా అని కామాక్షి అంటుంది. అలా అయితే రోహిణి వాళ్ల నాన్న దగ్గర కూడా కోట్లు ఉన్నాయి కదా.. ఆమె ఎప్పుడైనా తనతో అలా మాట్లాడిందా అని ప్రభావతి చెబుతుంది. ఇంట్లో గొడవలననీ సద్దమణిగిన తర్వత శృతి సంగతి చెబుతానని, ఆమెను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతానని ప్రభావతి అంటుంది.
ఇటు ఇంట్లో సమస్య పెద్దదవుతుండటంతో సుశీల రంగంలోకి దిగుతుంది. తప్పంతా ప్రభావతే చేసిందని తెలుసుకొని ఆమెకు క్లాస్ పీకుతుంది. నీకు, మీనాకు క్షమాపణ చెబితేనే తనతో మాట్లాడతానని తల్లితో చెబుతాడు సత్యం. దానికి మాత్రం క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ప్రభావతి తేల్చి చెబుతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


