గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: నోరు జారి పరువు తీసుకున్న ప్రభావతి.. నగలపై కొనసాగిన సస్పెన్స్.. చిక్కుల్లో మౌనిక
గుండె నిండా గుడి గంటలు మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్ ప్రభావతి మరోసారి నోరు జారి పరువు తీసుకుంటుంది. అటు నగల గురించిన సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రభావతిని శృతి తల్లి శోభ మరింత ఇరికిస్తుంది.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 552వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సుశీల్ 75వ పుట్టిన రోజు సందడి, నగల గురించి ప్రభావతి ఆందోళన, సంజూకి తెలియకుండా పుట్టింటికి వచ్చిన మౌనిక చిక్కుల్లో పడటంలాంటి సీన్లతో సాగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

నగల గురించి అడిగి ప్రభావతిని ఇరికించిన సుశీల..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (నవంబర్ 12) ఎపిసోడ్ బాలు గురంచి మీనాను సుశీల అడిగే సీన్ తో మొదలవుతుంది. ఏదో చాలా ముఖ్యమైన పని ఉంటేనే ఆయన అలా వెళ్తారని ఏదో చెబుతుంది. తర్వాత రెడీ అయి వస్తానని వెళ్తుంది. ఆమెను ప్రభావతి అడ్డుకొని వంట ఎవరు చేస్తారని అడుగుతుంది.
దీంతో సుశీల వెళ్లి నువ్వు ఆడదానివి కావా.. మిగిలిన కోడళ్ల సాయం తీసుకొని నువ్వే వంట చెయ్యు అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాత మీనాను నగలు వేసుకోమని సుశీల అడగడంతో ప్రభావతి, మనోజ్ కంగారు పడతారు. తర్వాత ప్రభావతి కిచెన్ లోకి వెళ్తుంది.
సంజూకి అబద్ధం చెప్పిన సువర్ణ
అటు అత్త సువర్ణకు మౌనిక ఫోన్ చేస్తుంది. సంజూ గురించి అడుగుతుంది. అతడు రాత్రికి రాడని, హాయిగా పుట్టింట్లో ఎంజాయ్ చేయమని అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే సంజూ ఇంటికి రావడంతో సువర్ణ కంగారు పడుతుంది. అతడు మౌనిక ఎక్కడ అని అడుగుతాడు. ఇద్దరం కలిసి గుడికి వెళ్లామని, ఇంతలో పెస్ట్ కంట్రోల్ వాళ్లు ఫోన్ చేస్తే తాను వచ్చానని, మౌనిక మాత్రం కొత్తగా పెళ్లయిన వాళ్లు గుడిలో పూజలు చేస్తుంటే అక్కడే ఉండిపోయిందని అబద్ధం చెబుతుంది. కానీ సంజూ మాత్రం సందేహంగానే ఉంటాడు.
టీవీ తీసుకొచ్చిన కామాక్షి.. ఇంట్లో వాళ్లకు అనుమానం
ఇటు కామాక్షి తన పాత టీవీని ప్రభావతి ఇంటికి మోసుకొస్తుంది. అది చూసిన ఇంట్లో వాళ్లు ఈ టీవీ ఎక్కడిది అని అడుగుతారు. తానే అత్తయ్య బర్త్ డే కోసం తెప్పించానని ప్రభావతి చెబుతుంది. కానీ ఇంట్లో వాళ్లకు అనుమానం వచ్చి ఏవేవో ప్రశ్నలు అడుగుతారు.
మధ్యమధ్యలో కామాక్షి తానే టీవీని మోసుకొచ్చానని చెప్పడంతో వాళ్లలో అనుమానం మరింత ఎక్కువ అవుతుంది. సుశీల కూడా సత్యాన్ని గిల్లి అసలు ఇది కలా నిజమా అని అడుగుతుంది. తమ షాపులో టీవీలు ఉండగా వేరే షాపులో ఎందుకు కొన్నావని మనోజ్ కూడా అడుగుతాడు. దీంతో ప్రభావతి మరింత కంగారు పడుతుంది.
నగలు వేసుకొని వచ్చిన మీనా..
అప్పుడే మీనా రెడీ అయ్యి, నగలు వేసుకొని వస్తుంది. ఆమెను చూసి మహాలక్ష్మిలా ఉన్నావని సుశీల అంటుంది. ఇవి ఆ నగలేనా అని కామాక్షి అందరి ముందూ అడగడంతో ప్రభావతి కంగు తింటుంది. అదే మీరు చేయించిన నగలే కదా అని అడుగుతోంది అని సుశీలతో ప్రభావతి అంటుంది. మీనా కూడా టీవీ గురించి ఆరా తీస్తుంది. దీంతో ఆమె మీనాను తిట్టి అంతటితో ఆ టీవీ టాపిక్ ముగిసేలా చేస్తుంది.
మౌనికకు సంజూ, సువర్ణ ఫోన్
ఇటు నాన్నమ్మతో మాట్లాడుతున్న మౌనికకు సంజూ ఫోన్ చేస్తాడు. అత్తా కోడళ్లు కలిసి ఏదో ప్లాన్ చేశారన్న సందేహం సంజూలో ఉంటుంది. దీంతో మౌనికకు పదేపదే ఫోన్ చేసినా ఆమె భయంతో తీయదు. తర్వాత సువర్ణ కూడా మౌనికకు ఫోన్ చేస్తుంది. బయటకు వెళ్లి మాట్లాడిన మౌనికకు వాడు వచ్చేశాడని చెప్పడంతో ఆమె భయపడుతుంది. తాను వెంటనే వచ్చేస్తానని అంటుంది. కాసేపు ఆగి రమ్మని సువర్ణ చెబుతుంది.
ఇంటికి వచ్చిన పార్వతి, సుమతి.. అవమానించిన ప్రభావతి..
ఇటు సుశీల బర్త్ డే కోసం పార్వతి, సుమతి ఇంటికి వస్తారు. వాళ్లను చూడగానే మిమ్మల్ని ఎవరు పిలిచారంటూ ప్రభావతి అవమానిస్తుంది. దీంతో సుమతి ఆమెకు కాస్త గట్టిగానే బదులివ్వడంతో అందరి ముందూ పరువు పోతుంది. సుశీల కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ సంస్కారం లేని వాళ్లు అలాగే సమాధానం ఇవ్వాలని అంటుంది.
సుమతి పెళ్లి టాపిక్ రావడంతో తాను జాబ్ సంపాదించాకే పెళ్లి చేసుకుంటానని ఆమె చెబుతుంది. దీంతో శృతి ఆమెను అభినందిస్తుంది. సుశీల కూడా ఆమెను మెచ్చుకుంటూ.. ఆడవాళ్లకు ఉద్యోగం తప్పనిసరి అని, లేదంటే తన కోడలు ప్రభావతిలాగా ఎందుకు పనికి రాకుండా పోతారని అనడంతో ఆమె పరువు మరింత పోతుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


