గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 556వ ఎపిసోడ్ లో ప్రభావతి, మనోజ్ కు తన విశ్వరూపం చూపిస్తాడు బాలు. సుశీల వెళ్లిపోగానే గిల్టు నగల గురించి నిలదీస్తాడు. కానీ ప్రభావతి బుకాయిస్తూ నిందను తిరిగి మీనాపైనే మోపుతుంది. కానీ శృతి, బాలు ప్లాన్ దెబ్బకు మనోజ్ అడ్డంగా దొరికిపోతాడు.
బాలు, మీనాలకు వంశ గౌరవాన్ని ఇచ్చిన సుశీల

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (నవంబర్ 18) ఎపిసోడ్ బాలు, మీనాలకు సుశీల ఇచ్చే గిఫ్ట్ తో మొదలవుతుంది. ఇది వంశ గౌరవం అంటూ ఓ బంగారు నగను సుశీల వాళ్లకు ఇస్తుంది. తనకు మరుపురాని చిన్ననాటి జ్ఞాపకాలను అందించిన బాలుకే అది చెందాలని ఆమె స్పష్టం చేస్తుంది. అంతేకాదు ప్రతి ఏటా దీనిని పూజించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని తేల్చి చెబుతుంది. దీంతో మిగిలిన వాళ్లు నిరాశ చెందుతారు. ఆ తర్వాత మౌనిక తాను ఇక వెళ్తానని చెప్పి తన అత్తారింటికి వెళ్లిపోతుంది.
ఆరు తరాల వంశ గౌరవాన్ని తమకు ఇవ్వడం చూసి మీనా మురిసిపోతుంది. అటు బాలు కూడా ఆ గౌరవం తమకు దక్కినందుకు సంతోషిస్తాడు. కానీ ఆ గిల్టు నగల గురించి తలుచుకొని ఆవేశపడతాడు. బామ్మ వెళ్లిపోగానే ఇంట్లో వాళ్ల సంగతి తేలుస్తానని ఊగిపోతాడు.
మౌనికను నిలదీసిన సంజూ
అటు ఇంటికి వచ్చిన మౌనికను సంజూ నిలదీస్తాడు. ఎక్కడి వెళ్లావని అడుగుతాడు. గుడికే వెళ్లొచ్చానని చెప్పినా వినడు. మీ ఇంటికి వెళ్లి వచ్చావు కదా.. అమ్మ చెప్పింది అని అబద్ధం చెబుతాడు. అప్పుడే మౌనిక అత్త అక్కడికి వచ్చి తాను అలా చెప్పలేదని, కంగారు పడకని మౌనికకు సైగ చేస్తుంది. దీంతో తాను గుడికే వెళ్లానని, అత్తయ్యే తనను పూజ పూర్తి చేసుకొని రమ్మని చెప్పిందని అంటుంది. దీంతో సంజూ సరే అని వెళ్లిపోతాడు.
బాలుని ఏం జరిగిందని అడిగిన సుశీల
ఆ తర్వాత సుశీల తిరిగి వెళ్లిపోతుంది. ఆమెను కారులో బస్టాండు వరకూ డ్రాప్ చేయడానికి బాలు వెళ్తాడు. అంతా హ్యాపీయే కదా బామ్మ అని బాలు అడుగుతాడు. చిన్ననాటి జ్ఞాపకాలను అందించావు అంతకంటే ఏం కావాలని ఆమె అంటుంది. అయితే మీనా, నువ్వు ఎందుకు అలా ఉన్నారు.. బాధగా కనిపించారు అని అడుగుతుంది. అదేం లేదు.. నీకు చెయిన్ చేయించాలనుకున్నాం.. కానీ కుదరలేదు అని బాలు అంటాడు. ఈ వయసులో బంగారు చెయిన్ నాకెందుకు.. జీవితంలో మరచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చావు అది చాలు అని ఆమె అని వెళ్లిపోతుంది.
ఇంటికి తాళం వేసి మరీ విశ్వరూపం చూపించిన బాలు
{{/usCountry}}ఆ తర్వాత సుశీల తిరిగి వెళ్లిపోతుంది. ఆమెను కారులో బస్టాండు వరకూ డ్రాప్ చేయడానికి బాలు వెళ్తాడు. అంతా హ్యాపీయే కదా బామ్మ అని బాలు అడుగుతాడు. చిన్ననాటి జ్ఞాపకాలను అందించావు అంతకంటే ఏం కావాలని ఆమె అంటుంది. అయితే మీనా, నువ్వు ఎందుకు అలా ఉన్నారు.. బాధగా కనిపించారు అని అడుగుతుంది. అదేం లేదు.. నీకు చెయిన్ చేయించాలనుకున్నాం.. కానీ కుదరలేదు అని బాలు అంటాడు. ఈ వయసులో బంగారు చెయిన్ నాకెందుకు.. జీవితంలో మరచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చావు అది చాలు అని ఆమె అని వెళ్లిపోతుంది.
ఇంటికి తాళం వేసి మరీ విశ్వరూపం చూపించిన బాలు
{{/usCountry}}ఇక తిరిగి ఇంటికి రావడంతోనే గేటుకు తాళం వేసి మరీ బాలు ఆవేశంగా లోనికి వస్తాడు. పనుందని బయటకు వెళ్లడానికి ప్రయత్నించిన మనోజ్ ను పట్టి లాగుతాడు. గ్యాంగ్ లీడర్ ఏదంటూ అనగానే ప్రభావతి కూడా అక్కడికి వస్తుంది. మనోజ్ వెళ్లి తల్లి వెనుక దాక్కొంటాడు. ఏం జరగిందని సత్యం అడిగితే.. మీనా వెళ్లి గిల్టు నగలు తీసుకొచ్చి పెడుతుంది. అది చూసి మనోజ్, ప్రభావతి కంగారు పడతారు. మీనా ఇచ్చిన నగలు గిల్టుగా ఎలా మారాయని బాలు నిలదీస్తాడు. తమ ముందే మీనా నగలు ఇచ్చింది కదా అని సత్యం, రవి, శృతి కూడా అడుగుతారు.
తెలియదని బుకాయించిన ప్రభావతి
కానీ ప్రభావతి మాత్రం బుకాయిస్తుంది. అవి గిల్టు నగలు ఎలా అయ్యాయో తనకెలా తెలుస్తుందని ఆమె అంటుంది. అసలు మీనా ఇచ్చినప్పుడు అవి గిల్టు నగలు ఎందుకు కాకూడదు.. అంతకుముందు ఆమె చాలాసార్లు వాటితో పుట్టింటికి వెళ్లి వచ్చింది.. అక్కడి నుంచి ఈ గిల్టు నగలు వచ్చి ఉంటాయి అని ప్రభావతి అంటుంది. దీంతో బాలు, మీనా ఆమెపై మండిపడతారు. తమ పుట్టింటి వాళ్లను ఇందులోకి లాగితే బాగుండదని మీనా గట్టి వార్నింగ్ ఇస్తుంది.
ఏం చేసినా ప్రభావతి అసలు నిజం చెప్పకపోవడంతో బాలు, మీనా, రవి, శృతి కలిసి ఎలాగైనా నిజం తెలుసుకోవాలని అనుకుంటారు. దీంతో మనోజ్ ఆ గిల్టు నగలు ఎక్కడ తెచ్చాడో తెలసుకొని ఆ షాపు నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా శృతి మనోజ్ కు ఫోన్ చేస్తుంది. తానే కొన్నానని మీకు ఎలా తెలుసని అడిగితే.. బిల్లు ఉందని, మీకు గిఫ్ట్ వచ్చిందని శృతి చెబుతుంది. దీంతో మనోజ్ దొరికిపోయాడని బాలు అనుకుంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగస్తుంది.