చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
Gunmaaster G9 Collection: రెండో రోజు పెరిగిన గన్‌మాస్టర్ జీ9 కలెక్షన్స్- ఆ మూవీతో జెనీలియా రొమాంటిక్ యాక్షన్ మూవీ పోటీ!
Gunmaaster G9 Box Office Collection Day 2: బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, తెలుగు హీరోయిన్ జెనీలియా దేశ్‌ముఖ్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గన్‌మాస్టర్ జీ9 బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. నవంబర్ 27న విడుదలైన ఈ చిత్రం తొలి రోజుతో పోలిస్తే శనివారం వసూళ్లలో వృద్ధి కనబరిచింది.
Gunmaaster G9 2 Days Worldwide Collection: బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ, టాలీవుడ్ ప్రేక్షకులకు 'బొమ్మరిల్లు' హాసినిగా ఎప్పటికీ గుర్తుండిపోయే జెనీలియా దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'గన్‌మాస్టర్ జీ9' (Gunmaaster G9) బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పికప్ అవుతోంది.

యే ప్రేమ్ మోల్ లియాతో బాక్సాఫీస్ పోటీ
నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన గన్‌మాస్టర్ జీ9 సినిమా.. ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా తెరకెక్కించిన 'యే ప్రేమ్ మోల్ లియా' చిత్రంతో పోటీ పడుతూ బరిలోకి దిగింది. ఆరంభంలో అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లు రాబట్టలేకపోయినా వీకెండ్ కావడంతో శనివారం (నవంబర్ 28) కలెక్షన్లలో స్వల్ప పెరుగుదల కనిపించింది.
రెండు రోజుల్లో గన్‌మాస్టర్ జీ9 కలెక్షన్స్
ప్రముఖ ట్రేడ్ నివేదికల ప్రకారం 'గన్‌మాస్టర్ జీ9' తొలి రోజు శుక్రవారం (నవంబర్ 27) దేశీయ మార్కెట్లో రూ.3.65 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు శనివారం ప్రేక్షకుల ఆదరణ పెరగడంతో వసూళ్లు రూ.4.35 కోట్లకు చేరాయి. దీంతో రెండు రోజుల్లో ఈ చిత్రం మొత్తం రూ.8 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.
యే ప్రేమ్ మోల్ లియా వసూళ్లు
అయితే ఆదివారం (నవంబర్ 29) సెలవు రోజున ఈ జోరు కొనసాగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇదే రోజు విడుదలైన ఆయుష్మాన్ ఖురానా, శార్వరి వాఘ్ నటించిన 'యే ప్రేమ్ మోల్ లియా' శనివారం ఒక్కరోజే రూ.5.25 కోట్లకు పైగా రాబట్టి, రెండు రోజుల్లో ఇండియాలో రూ.9.25 కోట్లతో ముందంజలో ఉంది.
ఆవారాపన్ 2కి 50 కోట్ల కలెక్షన్స్
గట్టి పోటీతో పాటు మిశ్రమ స్పందన రావడం 'గన్‌మాస్టర్ జీ9' వసూళ్లపై ప్రభావం చూపింది. ఇమ్రాన్ హష్మీ గత చిత్రం 'ఆవారాపన్ 2' సాధించిన రికార్డులతో పోలిస్తే ఈ వసూళ్లు చాలా తక్కువగానే ఉన్నాయి. 'ఆవారాపన్ 2' విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే దేశీయంగా రూ.50 కోట్లకు పైగా కొల్లగొట్టి, ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.213 కోట్ల భారీ విజయాన్ని అందుకుంది.
గన్‌మాస్టర్ జీ9 వరల్డ్ వైడ్ వసూళ్లు
ఆ స్థాయి అంచనాలతో థియేటర్లకు వచ్చిన అభిమానులను 'గన్‌మాస్టర్ జీ9' పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది. ఇకపోతే గన్‌మాస్టర్ జీ9 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో రూ. 10.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే, ఇండియాలో రూ. 9.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయింది. ఇక ఓవర్సీస్లో 80 లక్షలు వసూలు అయ్యాయి.
కథ అందించిన సరిమ్ మోమిన్, జునైద్ వాసి
ఆదిత్య దత్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గన్‌మాస్టర్ జీ9కు సరిమ్ మోమిన్, జునైద్ వాసి కథ అందించారు. సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్టైన్మెంట్, ఎస్ఆర్ఈ స్టూడియోస్ పతాకాలపై దీపక్ ముకుట్, హునార్ ముకుట్, సంగీత అహిర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
18 ఏళ్ల తర్వాత ఆ హిట్ కాంబినేషన్
ఇమ్రాన్, జెనీలియాతో పాటు అపరశక్తి ఖురానా కీలక పాత్ర పోషించారు. 2007లో వచ్చిన 'గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్' తర్వాత దాదాపు 18 ఏళ్లకు ఇమ్రాన్ హష్మీ, దర్శకుడు ఆదిత్య దత్, సంగీత దర్శకుడు హిమేష్ రేషమ్మియా ఈ సినిమా కోసం మళ్లీ చేతులు కలపడం విశేషం.
ఊహించని మలుపులు ఉన్నప్పటికీ
గన్‌మాస్టర్ జీ9 సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలు, నటీనటుల పర్ఫార్మెన్స్, ఊహించని మలుపులపై ప్రశంసలు కురుస్తుండగా.. కథనం నడిచిన తీరు, సాగతీత, మితిమీరిన హింసపై విమర్శకులు పెదవి విరుస్తున్నారు.

E-Paper
