...
...
Next Story

Super Hit Cinema: 2 కోట్ల సినిమా-800 శాతం కలెక్షన్లు-ప్రచారం కోసం అన్నదానాలు-షూటింగ్ లో మాంసం, మద్యం బంద్-బాబా కథతో!

Super Hit Cinema: ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం రూ.2 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం.. 800 శాతానికి పైగా కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఓ బాబా కథతో తీసిన ఈ మూవీ షూటింగ్ లో మాంసం, మద్యం పూర్తిగా నిషేధించారు. మరి ఆ సినిమా విశేషాలపై ఓ లుక్కేయండి.

Published on: Aug 29, 2026, 18:41:05 IST
Advertisement

Super Hit Cinema: ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ఒక చిన్న సినిమా, ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. 2026 ఆగస్టు 7న థియేటర్లలోకి వచ్చిన 'హనుమాన్ అంశ' (Hanuman Ansh) చిత్రం బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డులను సృష్టిస్తోంది. మొదటి రెండు వారాల్లో పెద్దగా సౌండ్ చేయని ఈ చిత్రం, మూడో వారం నుంచి ఊహించని రీతిలో పుంజుకుని ఏకంగా 800 శాతానికి పైగా లాభాలను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

రూ.10 లక్షలే

Super Hit Cinema: 2 కోట్ల సినిమా-800 శాతం కలెక్షన్లు-ప్రచారం కోసం అన్నదానాలు-షూటింగ్ లో మాంసం, మద్యం బంద్-బాబా కథతో!
Super Hit Cinema: 2 కోట్ల సినిమా-800 శాతం కలెక్షన్లు-ప్రచారం కోసం అన్నదానాలు-షూటింగ్ లో మాంసం, మద్యం బంద్-బాబా కథతో!

ప్రముఖ ట్రేడ్ విశ్లేషణ సంస్థ సాక్‌నిల్క్ (Sacnilk) గణాంకాల ప్రకారం, ఈ హనుమాన్ అంశ సినిమా తొలిరోజు సాధించిన వసూళ్లు కేవలం రూ.10 లక్షలు మాత్రమే. మొదటి రెండు వారాల్లో బాక్సాఫీస్ వద్ద దారుణమైన ప్రదర్శన కనబరిచిన ఈ చిత్రం, రెండు వారాల్లో కలిపి కేవలం రూ.1.48 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే సాధించింది.

అయితే, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు, వీక్షకులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించడంతో 'వర్డ్ ఆఫ్ మౌత్' (ప్రేక్షకుల నోటి మాట) ద్వారా థియేటర్లకు జనం పోటెత్తడం ప్రారంభించారు.

రూ.18 కోట్లకు

హనుమాన్ అంశ సినిమా విడుదలైన 17వ రోజున ఏకంగా 65 శాతం వృద్ధిని నమోదు చేసి, ఒక్క రోజే రూ.2.20 కోట్లు రాబట్టింది. ఆ వేగం అక్కడితో ఆగలేదు. మూడో వారంలో ఏకంగా రూ.10.40 కోట్లు కొల్లగొట్టింది. 22వ రోజున (శుక్రవారం) ఒక్క రోజే ఏకంగా రూ.6.25 కోట్ల భారీ వసూళ్లను సాధించి విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. గురువారం నాటి రూ.2.10 కోట్లతో పోలిస్తే ఇది 197.6 శాతం ఎక్కువ. ఫలితంగా ఇండియాలో ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ.18.13 కోట్లకు చేరుకున్నాయి.

800 శాతం లాభాలు

ఈ హనుమాన్ అంశ చిత్రానికి విశాల్ చతుర్వేది రచయితగా, దర్శకుడిగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆరాధించే ఆధ్యాత్మిక గురువు 'నీమ్ కరోలీ బాబా' (మహారాజ్-జీ) జీవిత విశేషాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

మరణించిన తన తల్లిని మళ్లీ చూడాలనే తాపత్రయంతో దేవుడిని వెతికే ఒక బాలుడు, ఆ క్రమంలో దైవత్వాన్ని పొంది, ప్రేమ, అన్నదానం, మౌన ఆశీస్సులతో మానవాళికి సేవ చేస్తూ 'హనుమాన్ అంశ' అయిన నీమ్ కరోలీ బాబాగా ఎలా మారారనేదే ఈ చిత్ర ప్రధాన కథాంశం. ఈ సినిమాలో శోభినవ్ సత్య నీమ్ కరోలీ బాబా పాత్రలో ఒదిగిపోయారు.

సెట్‌లో రూల్స్

ఈ సినిమా షూటింగ్ విశేషాలను దర్శకుడు విశాల్ చతుర్వేది 'ఆజ్ తక్' మీడియా ఛానెల్‌తో పంచుకున్నారు. సినిమా నిర్మాణానికి ముందు చిత్ర నిర్మాతలు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రేమానంద్ జీ మహారాజ్‌ను కలిశారని, నీమ్ కరోలీ బాబా పాత్ర పోషించే నటుడు, సెట్‌లోని ప్రతి ఒక్కరూ కఠినమైన ఆధ్యాత్మిక నియమాలను పాటించాలని ఆయన సూచించినట్లు తెలిపారు.

"సినిమా చిత్రీకరణ సమయంలో సెట్‌లో కొన్ని కఠినమైన నిబంధనలను అమలు చేశాం. సెట్‌లో ఎవరూ బూతులు మాట్లాడకూడదు, గొడవలు పడకూడదు. కేవలం శాకాహార భోజనాన్ని మాత్రమే అనుమతించాం. చిత్రబృందంలో ఎవరూ మద్యం సేవించకూడదనే నిబంధన విధించాం.

ప్రతిరోజు ఉదయం షూటింగ్ ప్రారంభించేముందు, సాయంత్రం ముగించేముందు హనుమాన్ చాలీసా పఠించేవాళ్లం. షూటింగ్ సమయంలో ఏదైనా సమస్య ఎదురైన ప్రతిసారి హనుమాన్ చాలీసా పారాయణం చేసేవాళ్లం" అని దర్శకుడు విశాల్ చతుర్వేది వివరించారు.

అన్నదానాలు

సినిమా ప్రచారం కోసం డబ్బులు లేకపోవడంతో అన్నదానాలు నిర్వహించామని డైరెక్టర్ తెలిపారు. "ఈ సినిమా ప్రచారం ప్రారంభించినప్పుడు మా వద్ద డబ్బులు లేవు. నీమ్ కరోలీ బాబా సందేశాన్ని ప్రపంచానికి చాటడం తప్ప వేరే ఏ రకమైన కమర్షియల్ ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే మేము ఎనిమిది చోట్ల అన్నదానాలు నిర్వహించాం. ఆ అన్నదాన కార్యక్రమాలే ఈ సినిమాకు అసలైన పబ్లిసిటీగా మారి, ప్రజల్లోకి తీసుకెళ్లాయి," అని ఆయన చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks