2 కోట్లతో తీస్తే 72 కోట్ల కలెక్షన్స్- సహాయం కోరితే ముఖం చాటేసి ఇప్పుడు పొగుడుతున్నారు- బాలీవుడ్‌పై డైరెక్టర్ కామెంట్స్
Hanuman Ansh Director Vishal Chaturvedi On Bollywood: కేవలం రూ.2 కోట్లతో తీసన హనుమాన్ అంశ్ సినిమా ఏకంగా 72 కోట్లు కొల్లగొట్టింది. థియేటర్లను తగ్గించినా ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా బాలీవుడ్‌పై డైరెక్టర్ విశాల్ చతుర్వేది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Hanuman Ansh Director Vishal Chaturvedi On Bollywood: చిత్రసీమలో ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించే ప్రభంజనం సామాన్యంగా ఉండదు. ఇటీవల కన్నడ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' వంటి భారీ చిత్రాల హవా నడుస్తున్న సమయంలోనూ, సైలెంట్‌గా వచ్చి థియేటర్లలో తుపాను సృష్టిస్తోంది 'హనుమాన్ అంశ్'.

థియేటర్ల కోత నుంచి రూ.72 కోట్ల సునామీ వరకు!
కేవలం రూ.2 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన హనుమాన్ అంశ్ చిత్రం ప్రస్తుతం 4వ వారంలోనూ తగ్గకుండా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు కేవలం రూ.10 లక్షల వసూళ్లతో మొదలైన ఈ సినిమా ప్రయాణం ఆ తర్వాత ఊహించని మలుపు తిరిగింది.
మల్టీప్లెక్స్ దిగ్గజాలైన పీవీఆర్, సినీపోలిస్ వంటి సంస్థలు ఆరంభంలో ఈ చిన్న సినిమాను ప్రదర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. భారీ సినిమాల కోసం 'హనుమాన్ అంశ్' షోలను 250 నుంచి ఏకంగా 25కి తగ్గించేశాయి. అయితే, ప్రేక్షకుల నుంచి వచ్చిన అపూర్వ ఆదరణ (Word of Mouth) ఈ చిత్రం కలెక్షన్స్‌నే మార్చేసింది.
"హిట్ అయ్యాకే ఫోన్లు చేశారు".. బాలీవుడ్ వైఖరిపై డైరెక్టర్ విమర్శలు
మూడో వారం వచ్చేసరికి వసూళ్ల పర్వం మొదలై, ఇప్పటివరకు ఏకంగా రూ.72.88 కోట్ల గ్రాస్ రాబట్టింది హనుమాన్ అంశ్ సినిమా. ఈ సినిమా సాధించిన ఈ ఘన విజయంపై దర్శకుడు విశాల్ చతుర్వేది ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదల కాకముందు బాలీవుడ్ నుంచి తమకు ఎలాంటి మద్దతు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
"సినిమా హిట్ అయి డబ్బులు వస్తున్నాయని తెలిశాక చాలామంది ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతున్నారు. సినిమా తీసేటప్పుడు సహాయం అడిగితే ముఖం చాటేసినవాళ్లే ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు" అని డైరెక్టర్ విశాల్ చతుర్వేది స్పష్టం చేశారు.
వ్యాపారం కోసం వచ్చేవారు కొందరు
హిందీ చిత్ర పరిశ్రమలో ఎక్కువమంది అయోమయంలో ఉన్నారని, ఏ కంటెంట్ ఆడుతుందో ఎవరికీ స్పష్టత ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాపై నిజమైన ప్రేమతో తీసేవారు కొందరైతే, వ్యాపారం కోసం వచ్చేవారు మరికొందరని డైరెక్టర్ విశాల్ చతుర్వేది పేర్కొన్నారు.
ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా (మహారాజ్ జీ) జీవిత విశేషాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తల్లిని కోల్పోయిన ఒక చిన్నారి దేవుడి కోసం వెతికే క్రమంలో నీమ్ కరోలీ బాబాగా మారి మానవాళికి సేవ చేసే విధానాన్ని దర్శకుడు గుండెలకు హత్తుకునేలా తీర్చిదిద్దారు. శోభినాథ్ సత్య తన నటనా విశ్వరూపంతో అలరించారు.
కంగనా, మధుర్ భండార్కర్ ప్రశంసలు
"హనుమాన్ అంశ్ చూస్తున్నంతసేపూ థియేటర్లో కోట్లాది మంది ప్రేక్షకులు మంత్రముగ్ధులై కూర్చున్నారు. దర్శకుడు విశాల్ చాలా నిజాయితీగా ఈ కథను తెరకెక్కించారు" అని ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ ప్రశంసించారు.
అలాగే బాలీవుడ్ హీరోయిన్, ఎంపీ కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని ఒక 'సత్సంగం'గా అభివర్ణించారు. మానసిక ప్రశాంతత కోసం థెరపీలకు వెళ్లే బదులు ఈ సినిమా చూస్తే మంచిదని ఆమె ప్రేక్షకులకు సూచించారు. బాక్సాఫీస్ వద్ద సాధించిన ఈ ఘన విజయంతో చిత్ర యూనిట్ ఇప్పటికే పార్ట్-2 (సీక్వెల్)ను కూడా అధికారికంగా ప్రకటించింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


