Hanuman Ansh: మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ (Y. Ravi Shankar) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం రూ.2 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాలీవుడ్ డివోషనల్ హిట్ 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) విజయం తమలాంటి ప్రొడ్యూసర్లకు ఒక రకమైన చెంపపెట్టు అని ఆయన కుండబద్దలు కొట్టారు.
హోంబలే ఫిల్మ్స్ ప్రెజెంట్స్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఈ వారం తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న 'హనుమాన్ అంశ్' మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో మేకర్స్ ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 'కేజీఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ నిర్మించిన ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది.
ఈ ప్రెస్ మీట్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులపై చాలా ఓపెన్‌గా మాట్లాడారు.
"వందల కోట్లు పెడుతున్నాం.. ఫలితం ఉండట్లేదు!" - రవిశంకర్ ఆవేదన
ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "మేము వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నాం. కానీ బాక్సాఫీస్ దగ్గర రూపాయి వస్తుందో రాదో గ్యారెంటీ ఉండటం లేదు. ఇలాంటి టైమ్‌లో 'హనుమాన్ అంశ్' కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో వచ్చి రూ. 400 కోట్లు వసూలు చేయడం నిజంగా ప్రొడ్యూసర్లు అందరికీ ఒక పెద్ద కనువిప్పు. మాకు చెంప పెట్టులాంటిదే" అని చెప్పారు.
అంతేకాకుండా అసలైన పాన్ ఇండియా సినిమా అంటే ఇదేనని ఆయన అభివర్ణించారు. ఏ భాషలో వీలైతే ఆ భాషలో ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేయాలని, ఎంత ఎక్కువ మందికి చేరితే అంత మంచిదని హోంబలే ఫిల్మ్స్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో బురద జల్లుకోవడాలు, ఏఐతో అసలు ఏది నిజమో, ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ఇలాంటి సినిమాలు చాలా అవసరం అని చెప్పారు. మొన్న ఇరుముడి, ఇప్పుడీ హనుమాన్ అంశ్ సినిమాలకు ఆ దేవుడే అండగా నిలిచి బ్లాక్‌బస్టర్ చేస్తున్నాడేమో అని కూడా అన్నారు.
కంటెంట్ ఈజ్ కింగ్.. భారీ బడ్జెట్‌లు ఇక వర్కవుట్ కావు
{{/usCountry}}అంతేకాకుండా అసలైన పాన్ ఇండియా సినిమా అంటే ఇదేనని ఆయన అభివర్ణించారు. ఏ భాషలో వీలైతే ఆ భాషలో ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేయాలని, ఎంత ఎక్కువ మందికి చేరితే అంత మంచిదని హోంబలే ఫిల్మ్స్ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో బురద జల్లుకోవడాలు, ఏఐతో అసలు ఏది నిజమో, ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితుల్లో ఉన్న ఈ సమయంలో ఇలాంటి సినిమాలు చాలా అవసరం అని చెప్పారు. మొన్న ఇరుముడి, ఇప్పుడీ హనుమాన్ అంశ్ సినిమాలకు ఆ దేవుడే అండగా నిలిచి బ్లాక్‌బస్టర్ చేస్తున్నాడేమో అని కూడా అన్నారు.
కంటెంట్ ఈజ్ కింగ్.. భారీ బడ్జెట్‌లు ఇక వర్కవుట్ కావు
{{/usCountry}}గత కొంతకాలంగా కేవలం భారీ బడ్జెట్‌లు, విజువల్ ఎఫెక్ట్స్ నమ్ముకుని వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న సంగతి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే సరైన ఎమోషన్, పవర్ ఫుల్ కంటెంట్ లేకపోతే ఆడియన్స్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో భక్తి, దైవత్వంతో కూడిన పవర్ ఫుల్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'హనుమాన్ అంశ్' సాధించిన ఈ సంచలన విజయం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రొడ్యూసర్లకు ఒక హెచ్చరికలా మారింది. భారీ బడ్జెట్‌లు పెట్టడం కంటే కంటెంట్‌పై ఫోకస్ పెడితేనే బాక్సాఫీస్ దగ్గర సినిమాలు మ్యాజిక్ క్రియేట్ చేస్తాయని ఈ మూవీ మరోసారి నిరూపించింది.