Hanuman Ansh Telugu Release Date: బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిన డివైన్ స్పిరిచువల్ డ్రామా 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) తెలుగు థియేట్రికల్ రిలీజ్‌కు సడెన్‌గా బ్రేకులు పడ్డాయి. ఈ వారం అంటే సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సడెన్‌గా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో గత కొన్ని రోజులుగా వస్తున్న రూమర్స్ నిజమయ్యాయి.

తెలుగు డబ్బింగ్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే ఈ వాయిదాకు ప్రధాన కారణమని మేకర్స్ వెల్లడించారు. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, డబ్బింగ్ పనులు పూర్తిగా పూర్తయిన తర్వాతే సరికొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ 'ప్రత్యంగిర సినిమాస్' సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది.
డబ్బింగ్ పనులు ఆలస్యం.. రేసు నుంచి త్రివిక్రమ్ అవుట్
అయితే హనుమాన్ అంశ్ రిలీజ్ వాయిదా వెనుక ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణికి చెందిన సమర్పణ సంస్థ 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' ఈ చిత్రం తెలుగు వర్షన్‌ను ప్రెజెంట్ చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి 'హనుమాన్ అంశ్'కు సంబంధించిన అన్ని పోస్టులను సైలెంట్‌గా డిలీట్ చేసేయడం హాట్ టాపిక్‌గా మారింది. డబ్బింగ్ ఆలస్యం కావడం తో పాటు ప్రమోషన్ ప్లానింగ్ సరిగ్గా కుదరకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
నీమ్ కరోలీ బాబా జీవిత కథతో తెరకెక్కిన సినిమా
ఉత్తర భారతంలో ఎంతోమంది భక్తుల ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు 'నీమ్ కరోలీ బాబా' (Neem Karoli Baba) జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతుల లాంటి గ్లోబల్ సెలబ్రిటీలు నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని సందర్శించి ఆయన భక్తులుగా మారిన సంగతి తెలిసిందే.
{{/usCountry}}ఉత్తర భారతంలో ఎంతోమంది భక్తుల ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు 'నీమ్ కరోలీ బాబా' (Neem Karoli Baba) జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతుల లాంటి గ్లోబల్ సెలబ్రిటీలు నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని సందర్శించి ఆయన భక్తులుగా మారిన సంగతి తెలిసిందే.
{{/usCountry}}ఆయన మహిమలు, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని దర్శకుడు విశాల్ చతుర్వేది ఎంతో అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాలో శోభినవ్ సత్య, చందన్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో జీవించగా.. నిఖిల్ దూబే, ఉదయ్‌సింహ్ రాజ్‌పుత్, పూర్ణిమ తివారి కీలక పాత్రల్లో మెరిశారు. స్వయంభూ మీడియా నెట్‌వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, రాగిణి ఎస్, నమ్రత జి.ఎస్, విశాల్ చతుర్వేది, అనుప్రియ ఎ. నాగర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్
ప్రస్తుతం సౌత్ ఇండియాలో భక్తిరస చిత్రాలు, డివైన్ కాన్సెప్ట్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ దక్కుతోంది. ‘హనుమాన్’, ‘కాంతార’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన వండర్స్ చూశాక, ఈ సినిమాను కూడా తెలుగులో సరైన డిజిటల్, థియేట్రికల్ ప్రమోషన్స్‌తో తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
తెలుగు డబ్బింగ్ పనులు పక్కాగా పూర్తయిన తర్వాత మేకర్స్ అనౌన్స్ చేసే కొత్త రిలీజ్ డేట్ కోసం టాలీవుడ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.